ఇంటర్వ్యూ సంభాషణ

సీమ ఆకాంక్ష‌ల‌ప‌ట్ల నిర్ల‌క్ష్యం

రాయలసీమ సమాజం ఆశలను, ఆకాంక్షలను సభ్య సమాజం ముందుంచడానికి రాయలసీమ సాగునీటి సాధన సమతి, రాయలసీమ ప్రజా సంఘాలు అనేక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల సారాంశాలను విస్తృతంగా సమాజం ముందుంచడంలో, వారికీ అవగాహన కల్గించడంలో, చైతన్యం కల్గించడంలో  పత్రికా రంగం  ప్రధాన పాత్ర వహించాల్సివుంది. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన, వెనుబడిన ప్రాంతాల సమస్యలతో పాటు వాటికీ నిర్దిష్ట పరిష్కార మార్గాలను  రాజకీయ వ్యవస్థకు ముందుంచడంలో కుడా  పత్రికా రంగం  బాధ్యతాయుత పాత్ర  వహించాల్సివుంది.  ఆ దిశగా “వసంతమేఘం’ సంపాదకులు, నిర్వహకులు క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికీ ముందుగా అభినందనలు.  అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోస్తా
ఇంటర్వ్యూ సంభాషణ

రాజకీయ చదరంగంలో ప్రజలే పావులు

అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని  కోస్తా ఆధిపత్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ప్రతి పక్షాలు  మద్దతు ఇస్తున్నాయి. దీనిని ఎట్లా చూడాలి? జవాబు: మేం ఆ డిమాండ్ ను అప్రజాస్వామికమైనదిగా పరిగణిస్తున్నాం. అయితే, గత ప్రభుత్వ ఆ నిర్ణయపు తప్పొప్పులకు అన్నీ రాజకీయ పార్టీలూ బాధ్యులే. అధికారంలోకి వచ్చాక వైఎస్ ఆర్ పి పార్టీ ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది.  అందువల్ల  ఆపార్టీ  గతంలో తాము అమరావతి రాజధాని ప్రతిపాదనకు మద్ధతునివ్వడం తప్పని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సంబంధిత ప్రజలను చర్చలకు పిలిచి సముచిత నష్టపరిహారం ఇవ్వాలి. రాజకీయ చదరంగంలో ప్రజలని, వారే పార్టీ వారైనా పావులను 
ఇంటర్వ్యూ

ప్రమాదకరమైనా సరే అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిందే

(దశాబ్ద కాలం తరువాత ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు నిర్దోషిగా విడుదలైన్ హేమ్ మిశ్రా తన జైలు శిక్ష, విచారణ, అనుభవాల గురించి ‘అవుట్ లుక్’కు చెందిన విక్రమ్ రాజ్ తో మాట్లాడారు) హేమ్ మిశ్రా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు 2013 లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మొదటిసారి అరెస్టు చేసారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు కొరియర్గా పనిచేశాడని, దేశంపై యుద్ధం చేస్తున్నాడని అభియోగాలు మోపారు. 2017మార్చి 7నాడు గడ్చిరోలి సెషన్స్ కోర్టు హేమ్, మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2024మార్చి 5నాడు బాంబే హైకోర్టు-నాగ్పూర్ బెంచ్ ఈ కేసులో హేమ్, మరో
ఇంటర్వ్యూ

ప్రజా ప్రయోజనం కోసం శాంతి కోరుకుంటున్నాం

(శాంతి చర్చల కోసం లేఖ రాసిన మావోయిస్టు నాయకుడు రూపేశ్‌ బస్తర్ టాకీస్ యు ట్యూబ్ ఛానెల్ వికాస్ తివారీతో చేసిన సంభాషణ ఇది . దేశమంతా  శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్న తరుణంలో శాంతి గురించి , ప్రజా ప్రయోజనాల గురించి , విప్లవం గురించి తెలుసుకోడానికి మావోయిస్టు ఉత్తర - పశ్చిమ కమిటీ నాయకుడి అభిప్రాయాలు ఉపయోగపడతాయని పాఠకులకు అందిస్తున్నాం - వసంత మేఘం టీం ) వికాస్ తివారీ: ఛత్తీస్‌ఘడ్‌లో నాలుగు దశాబ్దాల నుంచి మావోయిజం ఉన్నది. నాలుగు దశాబ్దాల నుంచి  మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యలో
ఇంటర్వ్యూ

మత రహిత , కుల రహిత అస్తిత్వం  కోసం.. 

1.నో కేస్ట్ నో రెలిజియన్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది.. ?    మీ ప్రశ్న చిన్నదే ..  అయితే  ఈ ప్రయత్నం వెనక ఒక  పెద్ద ప్రయాణం ఉంది..  ఈ ఆలోచన వెనక   నా/ మా   జీవిత సంఘర్షణ  ఉంది.  అందువల్ల  కొద్దిగా  ఆ నేపథ్యం  చెప్పాలి.. వీలయినంత సంక్షిప్తంగా చెప్పడానికి  ప్రయత్నిస్తాను.   నా చిన్నతనం అంటే హై స్కూల్ / 10వ తరగతి వరకు  నేను ఒరిస్సా   రాష్ట్రంలోని  సుందరగడ్  జిల్లా బండముండ అనే ఊరిలో  చదువుకున్నాను.  మా నాన్న దువ్వూరి వీర వెంకట సత్య సూర్య దుర్గా ప్రసాద్ రామారావు , అమ్మ 
ఇంటర్వ్యూ

పదముగ్గురు నక్సలైట్ల ఎన్‌కౌంటర్ బూటకమేనా?

(నిజ నిర్థారణకు వెళ్ళి వచ్చాక బస్తర్ జంక్షన్ అనే యూ ట్యూబ్ ఛానెల్ తో సంభాషణ. హిందీ  వీడియోకి తెలుగు అనువాదం) బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని, ఘటనా స్థలం నుంచి ఎల్‌ఎమ్‌జి వంటి ఆటోమేటిక్ ఆయుధాలు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయి నివేదిక కూడా చేశాం.. మీరు మా గత నివేదికలు చూడవచ్చు. ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సందేహాలు తలెత్తుతున్నాయి, పోలీసుల వ్యవహార శైలి, వారి వాదనలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి, పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి, ఈ ప్రశ్నలు
ఇంటర్వ్యూ

ఉపా లేకుంటే ఈ రాజ్యం మ‌నుగ‌డ క‌ష్ట‌మే

దేశ‌మంతా ఉపా విస్త‌రిస్తోంది. ఎవ‌రి మీదైనా చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం కింద కేసు పెట్ట‌వ‌చ్చు. ఎవ‌రి మీదికైనా ఎన్ఐఏ అనే ద‌ర్యాప్తు సంస్థ వెళ్ల‌వ‌చ్చు. ఇదంతా కాక‌తాళీయంగా జ‌రుగుతున్న‌ది కాద‌ని, దీని వెనుక భార‌త రాజ‌కీయార్థిక వ్య‌వ‌స్థ‌లోని సంక్షోభాలు, ప్ర‌జా పోరాటాల ఒత్తిళ్లు  ఉన్నాయ‌ని, యుఏపీలే లాంటి పాసిస్టు చ‌ట్టాలు లేకుంటే భార‌త రాజ్యం మ‌నుగ‌డ సాధ్యం కాని ప‌రిస్థ‌తి ఏర్ప‌డింద‌ని పౌర‌హ‌క్కుల నాయ‌కుడు చిలుకా చంద్ర‌శేఖ‌ర్ అంటున్నారు.  1) యుఏపీఏ చట్టం తీసుకుని రావటం వెనుక ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం ఏమిటి ?   ప్రభుత్వాలు తమ రాజకీయ సుస్థిర‌త  కోసం చట్టాలను చేస్తూ ఉంటాయి. ఈ
ఇంటర్వ్యూ

యూఏపీఏను రద్దు చేయాలి  – ఇందిరా జైసింగ్

( ప్రొ.జి.ఎన్.సాయిబాబా, అతని తోటి నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై ట్వీట్ చేసిన వారిలో మొదటివారు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్. 1984 భోపాల్ గ్యాస్ బాధితుల నుండి, విప్లవ కవి వరవరరావు (భీమా కోరేగావ్ కేసులో నిందితులు, 2021లో బెయిల్ వచ్చింది) మొదటి మహిళా అదనపు సొలిసిటర్ వరకు, ప్రాథమిక హక్కులను కోల్పోయిన వారి కోసం అనేక న్యాయ పోరాటాలు విజయవంతంగా చేయడంలో ఆమె గుర్తింపు పొందింది.   1986 మేరీ రాయ్ కేసు, 1999 గీతా హరిహరన్ కేసు వంటి మహిళల వివక్షకు వ్యతిరేకంగానూ, జనరల్ కేసులను కూడా చేసారు. ఆనంద్ గ్రోవర్‌తో పాటు, ఆమె ఆన్‌లైన్
ఇంటర్వ్యూ సంభాషణ

 అవును. ఈరోజు యుధ్ధ పరిస్థితి వుంది” – హిమాంశు కుమార్

'ఆసియన్ స్పీక్స్' , 'అరోరా ఆన్‌లైన్' కోసం రెజాజ్ ఎం షీబా సిదీక్ 2022 ఆగస్టు 26న గాంధేయవాది, మానవ హక్కుల కార్యకర్త హిమాంశు కుమార్‌ను ఎర్నాకులంలో ఇంటర్వ్యూ చేశారు. యుఏ(పి)ఏకి వ్యతిరేకంగా జరిగిన మానవహక్కుల సదస్సులో ప్రసంగించేందుకు హిమాంశు కుమార్ కేరళకు వచ్చారు.  సుమారు ఒక గంటసేపు జరిగిన సంభాషణలో హిమాంశు భగత్ సింగ్ మాటలను ప్రతిధ్వనించారు, “భారతదేశ శ్రామిక ప్రజానీకాన్ని, సహజ వనరులను కొన్ని పరాన్నజీవులు దోపిడీ చేస్తున్నంత కాలం యుద్ధస్థితి ఉనికిలో ఉంది, ఉంటుంది. వారు పూర్తిగా బ్రిటిష్ పెట్టుబడిదారులు లేదా మిశ్రణ బ్రిటీష్-ఇండియన్ లేదా పూర్తిగా భారతీయులు కావచ్చు”.  గోంపాడ్ ఊచకోతపై స్వతంత్ర దర్యాప్తును కోరినందుకు
ఇంటర్వ్యూ నా క‌థ‌తో నేను

నిల‌దీసే క‌థ‌లు అవ‌స‌రం

1. కథలోకి ఎలా వచ్చారు? జ. మాది ఏ నీటి అదరుపూ లేని మారుమూలన ఉండే మెట్ట ప్రాంతం. నిత్యం కరువుతో పోరాడుతూనే. కథలతో కాలక్షేపం చేస్తూ ఎప్పటికప్పుడు జీవితేచ్ఛను రగిలించుకోవడం మా ప్రాంత లక్షణం. అందుకే నాకు చిన్నప్పటి నుంచి కథలంటే ఇష్టం, మా అమ్మ ఈశ్వరమ్మ అద్భుతమైన కథలు చెబుతుంది. నా చిన్నప్పుడు రోజూ రాత్రిపూట మా అమ్మ కథతోనే నిద్రపోయేవాడిని. నాన్న రెడ్డెప్పాచారి కూడా కథలు చెప్పేవాడు. మా మేనమామలు రాజగోపాలాచారి, బ్రహ్మయ్యాచారి, మా పెద్దమ్మ లక్ష్మీదేవి మంచి కథకులు. మా ఊళ్లో కాదరిల్లి తాత, బడేసాబ్ వారంలో మూడునాలుగు రోజులైనా మా ఇంటికి