ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్న థర్మల్ విద్యుత్త్ కేంద్రం
జగదీష్ హంస్దాకు తను పెరిగిన గ్రామం గురించి అస్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. "అప్పట్లో అక్కడ మేము ఆదివాసీలం, మా పొలాలు, అడవులు, వన్యప్రాణులు తప్ప ఇంకేమీ ఉండేవి కావు," అని ఇప్పుడు డెబ్బై ఏళ్ల చివరలో ఉన్న హంస్దా చెప్పారు. అప్పటి బీహార్లో ఉన్న ఆ ఝింజిర్గుట్టు గ్రామం, ఇప్పుడు జార్ఖండ్ పరిధిలోకి వస్తుంది. "మాతో పాటు కొంతమంది మూలవాసీ సముదాయాల వారు కూడా నివసించేవారు," అని హంస్దా జోడించారు, ఆ ప్రాంతానికి చెందిన తక్కువ కులాలకు చెందిన సముదాయాలను ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నారు. 1950ల చివరలో బీహార్ ప్రభుత్వం చంద్రపుర థర్మల్ పవర్ స్టేషన్ను










