కవిత్వం

మీతో నేనున్నాను అరుంధతీరాయ్, షౌకత్ భాయ్

ఎంత సరిపోయిందిపార్లమెంటు ఉన్న రాజధాని ఢిల్లీలోనే భూమి చలన సూత్రాన్ని కనుగొన్న కోపర్నికస్ మార్గం ఉందిజగన్నాటకమో, గ్రీక్ ట్రాజెడీ యోషేక్స్పియర్ చెప్పినట్లు శబ్దము, ఆగ్రహం తప్ప ఏమీలేని ప్రపంచ నాటక రంగమోఆధునిక అబ్సర్డ్ డ్రామాయోఅన్నీ కలిసిన రాజకీయ నాటక రంగమోఉన్న ఆ వీధిలోనేఒక లిటిల్ థియేటర్ ఆడిటోరియం ఉన్నదిఆ రోజక్కడ‘ఆజాదీ ఓన్లీ వే’ బ్యానర్ వెలిసిందిదేశంలోనే కాదుదేశం నుంచీ ఆజాదీ కోరేఆ హక్కు ప్రజలకే ఉంటుందిఆరోజు, ఏ రోజైనాఆజాదీ ప్రకటనలో నేనున్నానుదండకారణ్యంలో ఆమె కామ్రేడ్స్ తో నడచిన రోజుగ్రీన్ హంట్ కమిటీ అగెయినిస్టు వార్ ఆన్ పీపుల్ తో యాన్మిర్డాల్ సాయిబాబాతో పాటు ప్రతిఘటించిన రోజు మనసారా నేనక్కడున్నానుది
కవిత్వం

ఈ మౌన సందర్భానికి

దీపాన్నైతే ఆర్పేశారు గానీ ఈ ఉదయ కాంతిలో మెరుస్తున్ననీ మృత్యుంజయ మందహాసాన్నిలొంగ తీసేవారెవరు?అండాసెల్ చీకట్లో చావును నిరాకరించిన నీ మొండి గుండె చప్పుడునీ పదాలకూ వాక్యాలకూ మధ్యన మరింత దృఢంగా మేల్కొన్నదితరగతిలో "అరణ్యకాండ"బోధిస్తున్న వేళ గొంతులో ప్రవేశిస్తావునా రక్తనాళాల వ్యాకోచంలోనాగరికతా విధ్వంసాల ఆర్తనాదంగా..ఆదివాసి గూడాల ప్రవాహ దుఃఖంలాధ్వనించి,అక్కరలేని శాంతిని భగ్నం చేస్తావుతల్లికీ బిడ్డకూ మధ్యన ఫైబర్ గాజు కిటికీలా....భార్యనూ భర్తనూ మరింత మరింతగా భేదించే ములాఖత్ మౌనంలా...సహస్ర రూపాల అధికార క్రౌర్యoనీ బిగిపిడికిట్లో శిరస్సురాలి ఓడింది...ఔను...రక్తం ఒలుకుతున్న కాలం గుండాసమాజం నడుస్తోంది...మన ప్రియమైన దేశాన్ని గత్తరలా పట్టుకున్న ఈ మౌన సందర్భానికి నువ్వవసరం.
దండకారణ్య సమయం

ఊర్మిళ @ నీతి-ఆధునిక మహిళ

ఆధునిక మహిళ రేపటి చరిత్ర రచిస్తుంది అని గురజాడ ప్యారిస్ కమ్యూన్కు బోల్షివిక్ విప్లవానికి మధ్యకాలంలో, బోల్షివిక్ విప్లవానికి సన్నిహిత కాలంలో చెప్పాడు. రష్యా, చైనా విప్లవాల కన్నా భారతదేశంలో విప్లవ విజయం ప్రపంచ పీడిత వర్గాల విముక్తికి దోహదం చేస్తుందనే ప్రామిస్ - వాగ్దానం నక్సల్బరీ చేసింది. మార్క్స్ ఆశించిన పెట్టుబడి పరాయికరణ నుంచి మానవసారం పొందే విముక్తి, లెనిన్ ఆశించిన సాంస్కృతిక విప్లవం, చైనాలో మావో తనపై తాను చేసే పోరాటంగా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ సారం నుంచి చారుమజుందార్ రచించిన స్వప్నం. చారుమజుందార్ చైనా శ్రామిక వర్గ మహత్తర సాంస్కృతిక విప్లవాన్ని బోల్షివిక్
కరపత్రాలు

వికసిత భారత్‌ @ 2047 – కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర

విరసం ఆవిర్భావ దినం సందర్భంగా సదస్సు జూలై 4 2024, గురువారం ఉ. 10 గంటల నుండి సా . 6 గంటల వరకుసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క పోలింగ్‌తో కూలిపోదని రుజువైంది. అయినా హిందుత్వ ఫాసిస్టు దురహంకారానికి ఎన్నికల్లో కూడా ప్రజలు కళ్లెం వేశారు. అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు, ప్రలోభాలతో సాగిన ఎన్నికల ప్రచారంలో సహితం ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు. ఫాసిస్టు నరేంద్ర మోదీ కళ్లలో భయం బట్టబయలైంది. రాముడు కాపాడలేడని కూడా తేలిపోయింది. ‘మందబుద్ధి’ని రెచ్చగొట్టి ఎల్లకాలం చెలామణి కాలేరని స్పష్టమైంది. ప్రజల వివేకం, సత్యాసత్యాల ఎరుక ఎంత
కథనం

ఈ పసిపాపల కథ వింటారా?

‘మీ డబ్బులు నాకక్కర్లేదు. మీ ఓదార్పూ అక్కర్లేదు. నాక్కావాల్సింది నా పిల్ల. తలకి తల కావాలి’ కోపం, దుఃఖంతో అన్నది మాసే సోడి. ఆమె రెండు చేతి వేళ్ళకు గాయాలయ్యాయి. ‘ఈళ్ళను కూడా పట్టుకుపొండి. మాకు మీ సామాన్లు అక్కర్లా. నా పిల్లను చంపి సామాన్లు పడేసి పోయారు. నాకు నా పిల్ల కావాలి. పిల్లను చంపిన పోలీసులు, డి.ఆర్‌.జి. గుండాలను ఎంటనే శిక్షించాలి’ ఖరాఖండిగా అన్నాడు బామన్‌ సోడి. మాసే, బామన్‌ మంగ్లి తల్లిదండ్రులు. ‘మేం చంపలేదు’ పోలీసులు. ‘ఆరోజు దీదీని తరిమింది నువ్వేగా! నీకు తల్లి లేదా? చెల్లె లేదా? నీకు పిల్లల్లేరా? ఈ నొప్పి
Press notes పత్రికా ప్రకటనలు

చ‌ల‌ప‌తి, విజ‌య‌వ‌ర్ధ‌న‌రావుల విడుదలకై పోరాడుదాం

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ, ప్ర‌జాసంఘాల‌కూ జీవిత ఖైదీల విడుద‌ల సాధ‌న స‌మితి త‌ర‌పున ఆహ్వానం. మిత్రులారా.. చిల‌క‌లూరి పేట బ‌స్సు ద‌హ‌నం కేసు మ‌న‌లో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. 1993 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఆ దుర్ఘ‌ట‌న కు బాధ్యులైన చ‌ల‌ప‌తిరావు విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు సంఘ‌ట‌న జ‌రిగిన రెండు మూడు రోజుల‌కే అరెస్ట్ అయ్యారు. వారు ఆ నేరం బ‌స్సులో ఉన్న వారిని చంపాల‌నే ఉద్దేశ్యంతో చేయ‌లేదు. కేవ‌లం బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను బెదిరించి దోపిడీ చేసే ఉద్దేశ్యంతో మాత్ర‌మే చేశారు. అయితే అనుకోని విధంగా బ‌స్సు ద‌హ‌నం జ‌రిగిపోయింది. చ‌ల‌ప‌తి విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు అరెస్ట్ అయిపోయారు.