రోజంతాఏకాంతవాసంలో(ఒంటరిగదుల్లో) నిర్బంధించకూడదనే ఏకైక డిమాండ్‌తో చంచల్‌గూడ సెంట్రల్ జైలు, నర్మదా బ్లాక్‌లోని రాజకీయ ఖైదీలు 2024 ఆగస్టు 27 నాడు నిరాహార దీక్ష మొదలుపెట్టారు.

గత కొంతకాలంగా, సీపీఐ (మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ఖైదీలు చంచల్‌గూడ జైలు నిర్బంధంలో వున్నారు. వారు విచారణ ఖైదీలైనప్పటికీజైలు అధికారులువారి హక్కులను నిరంకుశంగా అణిచివేస్తున్నారు. జైలు నియమాలనుఉల్లంఘిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పులను (ఉదాహరణకు సునిల్ బాట్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, 1980)సైతం లెక్కచేయడంలేదు. చదవడానికి పుస్తకాలు, పత్రికలు కావాలని, రాసుకోవడానికి పెన్నులు, నోట్‌ బుక్స్ లాంటి కనీస అవసరాల కోసం ఖైదీలు డిమాండ్ చేస్తున్నారు.

13ఏళ్లవయసులో ఇందిరాగాంధి జైల్లో ఉన్న తన తండ్రి జవహర్‌లాల్  నెహ్రూను జైల్లో ఎలా ఉంటున్నారు అని అడిగినప్పుడు, “రాయడం, చదవడం, ఆలోచించడంలో తాను జైల్లో సమయాన్ని గడుపుతున్నాను” అని సమాధానమిచ్చాడు. బ్రిటిష్ పాలనలో కూడా, వలసవాదులు రాజకీయ ఖైదీలకు చదవడం, వ్రాయడం, ఆలోచించడం వంటి హక్కులను నిరాకరించలేదు. కాని చంచలగూడ జైలు అధికారులు బ్రిటిష్ పాలన కన్నా కూడా దారుణంగా, ప్రాథమిక హక్కులను సైతం అణిచివేస్తున్నారు.

1.            స్వాతంత్ర్యంవచ్చిందనటానికిగుర్తుగాగత   సంవత్సరాలుగా మన దేశ ప్రధానులు ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగిరేస్తున్నప్పటికీ, ఈ విధంగాజరుగుతుంటే దీనిని న్యాయవివక్ష అనకూడదా?

2.            ఆగస్టు 14,1947రాత్రి జవహర్‌లాల్ నెహ్రూచేసిన ప్రఖ్యాత ప్రసంగంలో “ఎన్నో సంవత్సరాల కిందట మనం కాలంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా, ఈ స్వాతంత్య్రంతో పూర్తిగాకాకపోయినా గణనీయంగా, మన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నా”మని ప్రకటించాడు.  వలస పాలన అంతమైందని, దాని నుంచి బయటపడి భారతదేశం కొత్తజీవితాన్ని, స్వేచ్ఛను చూడబోతుంది అని చెప్పిన దానిలో ఈ విచారణ ఖైదీలు ఏమైనామినహాయింపు అయ్యారా?

3.            ఖైదీలకు అచ్చేదిన్ (మంచి రోజులు) ఇంకా యుగాల దూరంలో ఉన్నాయా?

4.            In Re: Inhuman Conditions in 1382 Prisons of 2013 కేసులో సుప్రీం కోర్టుపేర్కొన్నట్టు అందరు మనుషుల్లాగే, ఖైదీల గౌరవాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఈ అమృత్ కాల్(కాలం)లోలేదా?

5.            ‘వికసిత్ భారత్’ ఖైదీలతో మానవీయంగా, న్యాయంగా ప్రవర్తిస్తుందా? లేక బ్రిటిష్ కాలపు కాలాపానీ రోజులను గుర్తు చేస్తుందా?

రాజకీయ ఖైదీలు అసాధ్యమైన కోరికలేమి కోరడం లేదు. మంచి ఆహారం అడుగుతున్నారు. ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స కావాలని కోరుతున్నారు. వాళ్ళ పిటిషన్లను సంబంధిత అధికారులకు త్వరగా పంపించాలని కోరుతున్నారు. వాళ్ళుపంపే పిటిషన్లు/లెటర్ల ధృవీకరణ కాపీలను ఇవ్వాలనికోరుతున్నారు. వాళ్ళుఇలా చాలా సాధారణమైన, చట్టబద్ధమైన, మానవీయమైన డిమాండ్లను ప్రస్తావిస్తున్నారు. చంచల్‌గూడ జైలు అధికారులు వాటిని అంగీకరించకపోగా, ఇప్పుడుఏకంగామరింతదూరం వెళ్లిరాజకీయ ఖైదీలను ఏకాంత గదుల్లో పెట్టి, 24 గంటల పాటు లాకప్‌లోనేఉంచి శిక్షించటం ప్రారంభించారు.

జైలు మాన్యువల్ చెప్పేదేంటి?:

తెలంగాణ జైలు నియమావళి, అధ్యాయం XIX, “259 (ఎ)” ప్రకారం అందరు ఖైదీలను పగటి సమయంలో లాక్‌అప్ బయట ఉంచాలి. జైలు నియమాలప్రకారంగాకూడాఇలాంటి శిక్షలను ఖైదీలకు ఇవ్వడానికిలేదు. మరి ఇలా ఒంటరి గదుల్లో పెట్టడం అనేది చట్టబద్ధమైనదేనా? ఇదికచ్చితంగాచట్టబద్ధమైనది కాదు.చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండాఎవరినికూడాఖైదీలతో సహా శిక్షించకూడదు.

ఖైదీలకు తమ నిరసన తెలపడానికి చాలా తక్కువ మార్గాలే ఉంటాయి.రాజకీయ ఖైదీలు అనేకసార్లు అధికారులను 24 గంటల పాటు లాకప్‌లో వుంచద్దు అనికోరారు. వినకపోవడంతో చివరికి వారు నిరాహార దీక్ష చేపట్టారు.

ఎవరీ రాజకీయ ఖైదీలు?

అమితాబ్ బాగ్చీ:

సి‌పి‌ఐ (మావోయిస్టు)పార్టీకి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇతని వయస్సు 72 సంవత్సరాలు. పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా, శివదాస్ భదురి స్ట్రీట్, శ్యాంపుకూర్‌కు చెందిన వాడు. ఇతని తండ్రి రంజిత్ కుమార్ బగ్చి.తను విద్యార్థిగా ఉన్న రోజుల్లో నక్సల్బరి వసంత మేఘ గర్జనతో ప్రేరణ పొందాడు. జాదవపూర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న సమయంలో, వివిధ రాజకీయ పోరాటాలలో భాగం అయ్యాడు. సామాజిక కారణాల కోసం జరిగిన ఆందోళనలలో పాల్గొన్నాడు.

రాంచిలోని హటియా పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలులోవెళ్తున్నప్పుడుపశ్చిమ  బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు తౌహీద్ ముల్లాతో పాటు అమితాబ్బాగ్చిని ఝార్ఖండ్ పోలీసులు 2009 ఆగస్టు 19నాడు అరెస్టు చేసారు. ఆ తర్వాత, ప్రత్యేక న్యాయస్థానం 2010 ఆగస్టు 23నాడు బాగ్చి కి జీవిత ఖైదు శిక్షను విధించింది.(వికిపీడియా: అమితాబ్ బాగ్చి)

ఒక కేసులోతనపై విధించిన శిక్షను రాంచి హైకోర్టు 2019లో నిలిపివేసి,  బెయిల్ మంజూరు చేసింది.ఇంకోకేసులోNIAR.C. 01/2011/NIA/GAWఎనిమిది సంవత్సరాల శిక్షను కూడా అనుభవించాడు.

మరొకకేసుకరీంనగర్‌జిల్లాలో మేజిస్ట్రేట్ అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ, పోలీసులు బాగ్చినికోర్టులో హాజరు పరచడంలో విఫలమయ్యారు.చివరకు, వివిధ జైళ్లలో కాలం వెళ్లదీస్తున్న ఇతన్ని2024 జూలై 12 నాడు PRC 69 of 2019 కేసులో కరీంనగర్ కోర్టులో హాజరు పరచారు.

కరీంనగర్ కేసులో 2010  అక్టోబర్  19 నాడు అతనికి II అదనపు మేజిస్ట్రేట్ డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తరువాత, IV అదనపు సెషన్స్ జడ్జి 2024 జనవరి 29 నాడు బెయిల్ మంజూరు చేసారు.

అన్నికేసులు అయిపోయాయిఅని, బాగ్చి విడుదల అయ్యే అవకాశం ఉందని పోలీసులు కరీంనగర్‌ కేసులో బెయిల్ రద్దు చేయించడానికి విశ్వప్రయత్నాలు చేశారు.  చివరికి, ఎలాంటి కొత్త విషయాలు లేకుండానే,  ఏ పరిస్థితులు మారకుండానే, ఇచ్చిన బెయిలు దుర్వినియోగం అవకపోయినప్పటికీ, బెయిల్ మంజూరు చేసిన 4 వ అదనపు జిల్లా న్యాయస్థానమే తిరిగి 2024 జూలై  19నాడు బెయిల్‌ను రద్దు చేసింది. 13 ఏళ్లకు పైగా కరీంనగర్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న అతన్ని అలాగే జైలుకుపరిమితంచేసింది. 

ఈ కేసులో మరో దుర్మార్గం ఏమిటంటే, బాగ్చీకి జమానత్ ఇచ్చిన హుస్సేన్‌ను 2024 జూలై 9 నాడు జమ్మికుంటలోని అతని ఇంట్లోనే అరెస్టు చేసారు. రాజ్యం చేతుల్లో బాగ్చీ నిత్యం వేధింపులకు గురవుతున్నాడు.

గంగాధర రావు

రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక బృందంసీనియర్ మావోయిస్టులుగాఆరోపిస్తూ గంగాధరరావు, ఆయన భార్య భవాని లను మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో అరెస్ట్ చేశారు. గంగాధరరావు ఆంధ్రప్రదేశ్ లోని బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నరేంద్రపురం గ్రామానికి చెందినవారు. ఆయన భార్య భవాని మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందినవారు. (ఆన్ లైన్ సమాచారం: వృద్ధ మావోయిస్టు దంపతులు అరెస్టు; అబద్ధపు ఆధార్ కార్డు, పాన్ కార్డులు స్వాధీనం. ది హిందూ, 2023 డిసెంబర్ 03)

గంగాధరరావు, భవానిలను అరెస్ట్ చేసి నంబర్ 240/2023 గా నేరాన్ని నమోదు చేసారు. చెన్నూర్ మేజిస్ట్రేట్ కోర్టులో 03.12.2023 నాడు హాజరుపరచారు. ఈకేసులో, చెన్నూర్ మేజిస్ట్రేట్ కోర్టు క్రిమినల్.ఎం.పీ. నంబర్ 96/2024 ద్వారా 2024 మే 10 నాడు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయూర్తి ఆ బెయిల్‌ను నిలిపివేసింది. అరెస్టు జరిగి 8 నెలలు గడుస్తున్నా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు ఇవ్వకుండా పిటిషన్‌ను వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉంది.

గంగాధరరావును మహారాష్ట్ర పోలీసులు ఏటపాక పోలీస్ స్టేషన్ కేసులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత, ఆయనకు తెలంగాణలో మరో కేసు ఉన్నందున  చెంచల్ గూడ సెంట్రల్ జైలుకి తీసుకువచ్చి ఇక్కడే ఉంచారు.

పాదం రాజ్ కుమార్

కొత్తగూడెం జిల్లా పోలీసులు రూ.20 లక్షల రివార్డ్ ఉన్న సీపీఐ (మావోయిస్ట్) రాష్ట్ర కమిటీ సభ్యుడు అని ఆరోపిస్తున్న తోట సీతారామయ్య అలియాస్ కృష్ణన్నను అరెస్ట్ చేశారు. ఆయన అశ్వాపురం మండలం మంచిర్యాల గ్రామానికి చెందినవారు. ఆయనతో పాటు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నరెళ్ల గ్రామానికి చెందిన దళ సభ్యుడు పాదం రాజ్ కుమార్ అలియాస్ అమరేందర్‌ను చెర్ల బస్టాండ్ దగ్గర అరెస్ట్ చేశారు. (ఆన్‌లైన్ సమాచారం:తలమీదఇరవై లక్షల రూపాయలవిలువకలిగిన మావోయిస్టు అరెస్టు: తెలంగాణ టుడే, 20-07-2023) తోట సీతారామయ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడే తనకు బెయిల్ మంజూరు అయ్యింది. అరెస్టు అయ్యే నాటికి కూడా ఆయనకు మానసిక స్థిరత్వం లేదు.

ఈ ముగ్గురు ఖైదీలు, ఇటీవల ఖమ్మం జైలు నుండి తరలించబడిన మరో ఇద్దరు రాజకీయ ఖైదీలతో కలిసి నిరాహారదీక్ష చేపట్టారు. ఈ నిరసనకు చెంచలగూడ జైలులోని అందరు రాజకీయ ఖైదీలు, మిగితా ఖైదీలు తమ నైతిక మద్దతును తెలిపారు.

చంచల్‌గూడ జైలులో ఉన్నఇతర రాజకీయఖైదీలు

మూల దేవేందర్‌ రెడ్డి

సీపీఐ (మావోయిస్ట్) పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు అని ఆరోపణ ఉన్న మూల దేవేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 63 ఏళ్ల దేవేందర్ రెడ్డి మంచిర్యాల జిల్లాలోని బబ్బరు చెలుక గ్రామానికి చెందినవారు. ఆయన తన కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్తున్నప్పుడు సుబేదారి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.21 వేలు, విప్లవ సాహిత్యం, పెన్ డ్రైవ్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. (ఆన్‌లైన్ సమాచారం: మావోయిస్టు అగ్రనేత దేవేందర్ రెడ్డి హనుమకొండలో అరెస్టు; తెలంగాణ టుడే, 21-04-2023)

ఈ కేసులోఇతన్ని రిమాండ్ చేసిఖమ్మంజైలుకుతరలించారు. తర్వాతఅనారోగ్యకారణాలతోచెంచలగూడ జైలు ఆస్పత్రిలోపెట్టారు. ఆ తర్వాతఇతనిని వేరేకేసులోNIA వాళ్ళు జగదల్‌పూర్ కోర్టులోహాజరుపరిచి, జగదల్‌పూర్ జైల్లోపెట్టారు.

2021సంవత్సరంలో బీజాపూర్‌,ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది భద్రతా సిబ్బందిని హతమార్చిన దాడి కేసులో బుధవారం నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) మరో ఆరుగురు సీపీఐ (మావోయిస్ట్) సభ్యులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ ఆరుగురిలో దేవేందర్ రెడ్డి పేరు కూడా ఉంది. (ఆన్‌లైన్సమాచారం: 2021 ఛత్తీస్‌ఘడ్ దాడి కేసులో మరో ఆరుగురు మావోయిస్టుల పైన ఎన్‌ఐ‌ఎ చార్జిషీటు ఫైలు చేసింది: ది న్యూస్ మినిట్, 22-11-2023)

తర్వాత,వేరే కేసులోఇతనిని జగదల్‌పూర్ సెంట్రల్ జైలు నుండి తెలంగాణ జైలుకు తరలించారు. అప్పటి నుండి, జగదల్‌పూర్NIA కోర్టులో NIA కేసు 05/2022 లో తిరిగి ఇప్పటి వరకు హాజరుపరచలేదు. 

తెలంగాణలోఉన్న కేసుల వరకు ఆయనకు బెయిల్‌లు వచ్చాయి. అయితే, ఆయన జైలు నుండి స్వయంగా కోర్టుకుబెయిల్ పిటిషన్ పంపుకునేందుకు అనుమతించలేదు.  తనున్యాయవాదినినియమించుకోవాలనుకుంటున్నానుఅని లెటర్ పంపించడానికి కూడా అనుమతించడంలేదు.

క్రైమ్ నంబర్ 225/2023, సుబేదారి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్.ఎం.పీ. నంబర్ 1339/2023ద్వారా, హన్మకొండలోని I అదనపు మేజిస్ట్రేట్ కోర్టు, ఆయనకు మాగ్నిఫైయర్, టెలిస్కోప్ వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది ఇంకా వైద్య పరీక్ష చేయించాలిఅనేఆదేశం కూడా ఉంది. అయినప్పటికీ చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మేజిస్ట్రేట్ ఆదేశాలను పాటించలేదు. ఆదేశాలను పాటించకపోతే, కోర్టు ధిక్కరణ క్రింద చర్య తీసుకోమని కోరుతామని  చంచల్‌గూడ సూపరింటెండెంట్‌కు లీగల్ నోటీసు పంపిన తర్వాత, తనకు మాగ్నిఫైయర్‌ను మాత్రమే అందజేశారు.కానీ, బెయిల్ పిటిషన్‌ను పంపుకోవడానికి అనుమతి ఇవ్వలేదు, వైద్య పరీక్షకు సంబంధించిన ఆదేశాలను పాటించలేదు. పైగా, దేవేందర్ రెడ్డిని ఎటూ కదలనీయడం లేదు.

మడకం కోసి @ రజిత

చర్ల మండలంలోని కుర్నపల్లి-బోడనెల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ నాయకుడు దామోదర్ భార్య మడకం కోసి అలియాస్ రజితను మరియు 19 సంవత్సరాల దళ సభ్యురాలు మడవి ధనిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఇద్దరిలో రజిత -తెలంగాణ, భద్రాచలం డివిజన్, దుమ్ముగూడెం మండలం, ముల్కానపల్లి గ్రామం; మడవి ధని – ఛత్తీస్‌గఢ్‌, సుక్మా జిల్లా, కుంట గ్రామంకు చెందిన మావోయిస్ట్  కార్యకర్తలుగా పేర్కొన్నారు. (ఆన్‌లైన్ సమాచారం: ఇద్దరు మహిళా మావోయిస్టుల అరెస్టు; ది హిందూ, 08-09-2022)

మడవి ధని బెయిల్‌పై విడుదల అయ్యింది. ఆమెకు 19 ఏళ్ల వయసు లేదు. తను ఒక మైనర్. జువెనైల్ సౌకర్యం లేకుండా చేయడం కోసం, జైలులో నిర్భందించడానికి పోలీసులు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. రజితను పోలీసులు తీవ్రంగా హింసించారు. మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు, తన ముఖంపై ఉన్న గాయాలు స్పష్టంగా చూడవచ్చు అని రజిత చెప్పింది.

రజితను తెలంగాణలోని భద్రాచలం కోర్టు, హన్మకొండ కోర్టు, నాంపల్లి NIA కోర్టు, ఆంధ్రప్రదేశ్ లోని రామపచోడవరం కోర్టు, ఛత్తీస్‌గఢ్ లోని జగ్దల్‌పూర్ NIA కోర్టులలో హాజరుపరిచారు.

గొట్టబుజ్జి @ కమల సీపీఐ (మావోయిస్ట్) పామేడుప్రాంతపునిర్వహణ దళ కమాండర్‌గా ఆరోపిస్తున్న గొట్ట బుజ్జి అలియాస్ కమలనుజూన్ 9న పోలీసులు తాలిపేరు ఆనకట్ట వద్ద అరెస్ట్ చేశారు.

29 ఏళ్ల కమల, భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోనిచర్పల్లి గ్రామం, చత్తీస్‌గఢ్‌కుచెందిన మావోయిస్ట్‌గా పేర్కొన్నారు. (ఆన్ లైన్ సమాచారం: కొత్తగూడెంలో మావోయిస్టు పామేడు ఎల్ ఓ ఎస్ కమాండర్ అరెస్టు; తెలంగాణ టుడే, 09-06-2023) భద్రాచలం, నాంపల్లి NIA కోర్టులలో ఆమెపై కేసులు ఉన్నాయి. పగటిపూట జైల్లో నిర్బంధిచకూడదనే వారిసరైన, న్యాయమైన డిమాండ్‌కు మద్దతు తెలుపుదాం.

ఈనేపథ్యంలోఇతర డిమాండ్లప్రాధాన్యతనువిన్నవస్తూ, వీటిని పరిష్కరించాలని రాజకీయ ఖైదీలు కోరుతున్నారు. జైలులో మానవీయమైన, న్యాయమైన జీవన పరిస్థితులను కల్పించడానికి, ఈ ఖైదీల కింది డిమాండ్లకు  పౌర సమాజం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనికోరుతున్నారు.

డిమాండ్లు:

1.            పెన్, పేపర్, నోట్‌బుక్‌లను అందుబాటులో ఉంచాలి: ఖైదీలకు పెన్, పేపర్, నోట్‌బుక్ వంటి మాములు సదుపాయాలను కలిగించడం అనేది ప్రాథమిక హక్కుగా పరిగణించాలి. ఈ వస్తువులు ఖైదీలు కొనుక్కోవడానికి అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం వీటిని జైలు కాంటీన్లలో అమ్మటం లేదు. గత రెండు సంవత్సరాలుగా కొనుక్కోవడానికి జైలు కాంటీన్లలో వివిధ రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచినప్పటి నుంచి, ఖైదీలకు అందించే ఆహారపు నాణ్యత తగ్గిపోయింది. దాంతో కాంటీన్ నుండి ఖైదీలు ఆహారం కొనుక్కునే పరిస్థితిని కల్పించి డబ్బు సంపాదిస్తున్నారు.

అయితే, జైళ్లలో ఉన్న కాంటీన్లలో ఎన్నో రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని చెపుతున్నారు. గత సంవత్సరం కాలంలో ఒక్క పేజీ పేపర్, నోట్ బుక్, పెన్ కూడా అందుబాటులో ఉంచలేదు. ఖైదీలకు అవసరమైన ఈ మౌలిక వస్తువులను అందించనప్పటికీ, అనేక పథకాలను అమలు చేస్తున్నట్టు చెపుతూ జైళ్లు అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారు.

2.            ఉత్తరాలు/దరఖాస్తులకు నెంబర్ ఇవ్వాలి: ఖైదీలు రాసిన ఉత్తరాలు/దరఖాస్తులకు వెంటనే నెంబర్ ఇవ్వాలి; దృవీకరణ కాపీనీ కూడా ఖైదికి అందించాలి. ఇది వారి చట్టపరమైన హక్కులను కాపాడుతుంది. జైలు శాఖ ఖైదీలు రాసిన పిటిషన్‌ల ను కోర్టులకు పంపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి, ఈ పద్ధతి ద్వారా జవాబుదారీతనం వహించగలదు అనే భరోసా ఇవ్వడంలో సహాయపడుతుంది.

3.            ఉత్తరాలను మెయిల్ చేయాలి: ఖైదీలు  రాసిన ఉత్తరాలను కోర్టుకు పంపించడానికి ముందు ఇమెయిల్ చేయాలని మనవి; ఆ ఇమెయిల్ రసీదును ఖైదికి ఇవ్వాలి. తద్వారా, జవాబుదారీతనం వహించగలదు అనే భరోసా ఇవ్వగలదు.

4.            ఉత్తరాలు/దరఖాస్తులు న్యాయవాదుల ద్వారా పంపించడం: కేవలం జైలు అధికారుల ద్వారా మాత్రమే కాకుండా ఖైదీలు లీగల్ ములాఖాత్‌లలో ఉత్తరాలు/దరఖాస్తులు న్యాయవాదుల ద్వారా కూడా పంపించే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాం.

5.            జైలు మాన్యువల్ కాపీ: ప్రతి కొత్త ఖైదికి ప్లేటు, గ్లాసు, చద్దరు  ఇచ్చినట్టే, జైలు మాన్యువల్ కాపీనికూడా అందించాలి. దీని ద్వారా ఖైదీలు వారి హక్కులు, నియమాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.

6.            ఏకాంతవాసం (ఒంటరి సెల్): తెలంగాణ జైలు శాఖ ఏకాంతవాసం అనేది లేదు అని పేర్కొంటున్నప్పటికీ, భారత క్రిమినల్ కోడ్ సెక్షన్ 73 ప్రకారం ఈ పద్ధతి ఉంది. విచారణ ఖైదీలపై ఈ పద్ధతి ఉపయోగించడమనేది తీవ్రమైన ఉల్లంఘన. సుప్రీం కోర్టు ఏకంతవాసం నిషేధిస్తూ అనేక తీర్పులను ఇచ్చింది. కానీ, తెలంగాణ జైలు శాఖ “ఒక సెల్‌లో ఒక ఖైదీని ఉంచడం” అనే పేరుతో ఈ అమానుషమైన పద్ధతిని కొనసాగిస్తోంది.

7.            జిల్లా న్యాయ సేవల అధికార (DLSA) పర్యవేక్షణ: జిల్లా న్యాయ సేవల అధికార (DLSA) న్యాయమూర్తులు కేవలం నామమాత్రపు తనిఖీ చేయకుండా, విచారణ ఖైదీల పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం, ఈ న్యాయమూర్తులు కేవలం విచారణ ఖైదీల ఉన్న సాధారణ బ్లాకులను సందర్శిస్తారు. ఒంటరి సెల్‌లలో ఉన్న ఖైదీలను వారు పర్యవేక్షించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇంకా వాటిని సందర్శించడం లేదు.

8.            సీసీటీవీ మానిటరింగ్: జైలులోని సీసీటీవీ కెమెరాలు ప్రతి కదలికలను గుర్తిస్తాయి. వీటి ద్వారా న్యాయమూర్తులు విచారణ ఖైదీలను వారి బరాక్‌ల బయట ఎంత సమయం అనుమతించబడుతున్నారో, వారి చేత ఏ పనులు చేయిస్తున్నారో చూడవచ్చు.

9.            జైలు సీసీటీవీ కెమెరాలకు లింక్: జైళ్ళలో విచారణ ఖైదీలు ఉండే బ్లాక్‌లలోనీ సీసీటీవీ కెమెరాల లింక్ జైలు శాఖ, న్యాయవ్యవస్థ నియంత్రణకు అందుబాటులో ఉంచాలి.

దీని ద్వారా, ఖైదీలు వాళ్ళ గదుల బయట ఉండటానికి ఎన్ని గంటలు అనుమతి ఇస్తున్నారో కచ్చితమైన నిర్ధారణకువచ్చే అవకాశం ఉంది.

10.          టోల్-ఫ్రీ ఫోన్ నంబర్: విచారణ ఖైదీలు ఉన్న ప్రతి బ్లాక్‌లో ఒక టోల్-ఫ్రీ ఫోన్ నంబర్ ఏర్పాటు చేయబడాలి. దాని ద్వారా DLSA ను సంప్రదించడానికి, ఫిర్యాదులు చేయడానికి అవకాశం కల్పించాలి.

11. లీగల్ సమావేశ గదులను ఏర్పాటు చేయడం: అన్ని జైళ్లలో, న్యాయవాదులు, విచారణ ఖైదీలు కలిసి కూర్చుని, న్యాయవాదులు నోట్స్ తయారుచేసుకోవడానికి  వీలుగా గదులు ఉండాలి. విచారణ ఖైదీలకు తమ న్యాయవాదులతో వ్యక్తిగతంగా కలుసుకునే హక్కు ఉంది. జైలు అధికారులు వారి సంభాషణలను వినకూడనంత దూరంలో ఉండాలి. ప్రస్తుతం, న్యాయ సమావేశాల మధ్య జరిగే సంభాషణలను ఫోన్ ద్వారా వింటున్నారు, ఇది ఖైదీల స్వేచ్ఛను కాలరాస్తుంది. ఇంకా న్యాయవాదుల వృత్తి ధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. న్యాయవాదులు-వారి క్లయింట్ల మధ్య జరిగే సంభాషణలు గోప్యంగా ఉండాలని చట్టం చెప్పింది. జైలు శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు; ప్రస్తుతం కొనసాగుతున్న ఫోన్ కాల్స్ పర్యవేక్షణ విధానాన్ని తక్షణమే ఆపివేయాలి. దానికి బదులుగా న్యాయసహాయక సమావేశ గదులు ఏర్పాటు చేయాలి.

చంచల్‌గూడ జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలు చేస్తున్న న్యాయబద్ధమైన, మానవీయమైన డిమాండ్‌ల కు మద్దతుగానిలబడాలని పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అంతే కాకుండా పై చట్టబద్ధమైన, న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై, ఖైదీలకు సంఘీభావం తెలపాలి .

•             రాజకీయఖైదీలన్యాయమైన, మానవీయ డిమాండ్లకు మద్దతు తెలుపుదాం!

•             ఖైదీలను పగలంతా లాకప్‌ బయట ఉంచాలి!

•             జైలులోజరుగుతున్న అధికార దుర్వినియోగాన్నిఖండిద్దాం !

•             జైలుఅధికారుల ప్రతీకార ధోరణిని ఖండిద్దాం!

28ఆగస్టు 2024

Source:

1.            https://en.m.wikipedia.org/wiki/Amitabh_Bagchi

2.            https://www.thehindu.com/news/cities/Hyderabad/elderly-maoist-couple-arrested-fake-aadhaar-pan-cards-seized/article67598337.ece

3.            https://telanganatoday.com/kothagudem-maoist-with-rs-20-lakh-reward-on-head-arrested

4.            https://telanganatoday.com/top-maoist-leader-devender-reddy-arrested-in-hanamkonda

5.            https://www.google.com/amp/s/www.thenewsminute.com/amp/story/news/nia-files-charge-sheet-against-6-more-cpi-maoist-cadres-in-2021-chhattisgarh-attack-case

6.            https://www.google.com/amp/s/www.thehindu.com/news/cities/Hyderabad/two-maoist-women-cadre-held/article65867364.ece/amp/

7.            https://telanganatoday.com/maoist-pamedu-los-commander-arrested-in-kothagudem

Leave a Reply