దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం,గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడా(న్యూ ఓఖ్లా ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రణాళికా బద్ధ పారిశ్రామిక పట్టణం. జాతీయ రాజధాని ప్రాంతంలో ఒక భాగం. యమునా మరియు హిండన్ నదుల మధ్య మైదాన ప్రాంతంలో 17 ఏప్రిల్ 1976 నాటి యూపి పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి చట్టం కింద ఈ నగరం ఆ ప్రాంతానికి విస్తరణగా సృష్టించబడింది. రాజధాని నగరం న్యూఢిల్లీ కేంద్రానికి ఆగ్నేయంగా దాదాపు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రక్కనే ఘజియాబాద్ అనే మరొక నగరం ఉంది. ఇక్కడ దేశ, విదేశీ బహుళజాతి కంపెనీల, చిన్న,మధ్య తరహా పరిశ్రమల యాజమాన్యం తిష్టవేసి చౌకగా లభించే దేశ ముడి సంపద, కార్మికుల శ్రమను దోచుకుని తెగబలిసారు. వీరికి కార్మికులన్నా, కార్మిక చట్టాలన్నా లెక్క లేదు. కేంద్రం,రాష్ట్రాల్లోని ఆర్ఎస్ఎస్-బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ల అండతో ఈ కంపెనీలు రోజుకు కేవలం 200,300, నెలకు 7000,9000 రూపాయల వేతనంతో, ఎలాంటి ప్రాధమిక సౌకర్యాలు కల్పించకుండా,అనారోగ్యకర,ప్రమాదకర పని ప్రదేశాల్లో కార్మికుల రక్త మాంసాలను జుర్రుకుంటున్నాయి. ఈ దుస్థితికి వ్యతిరేకంగా నోయిడా కార్మికులు నిరంతరం పోరాడుతున్నారు. ఇదే సందర్భంగా పక్క రాష్ట్రం హర్యానా ప్రభుత్వం కార్మికుల వేతనాలను స్వల్ఫంగా పెంచగా పడిన ప్రభావంతో ఏప్రిల్ 13 న దాదాపు నలబై వేల మంది కార్మికులు తమ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యాలకు, ఆర్ఎస్ఎస్-బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. యాజమాన్యాలు, ప్రభుత్వం కార్మికుల పోరాటం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, లాఠీచార్జి,గృహాలపై దాడులకు తెగబడడం, కార్మిక నాయకుల గృహ నిర్భంధం వల్ల కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు వివిధ రూపాలలో ఆందోళనకు దిగారు. రాజ్యం/పోలీసుల హింసాత్మక దాడులను ప్రతిఘటించడంతో వారి వెన్నులో వనుకు పుట్టింది. కార్మికుల అశాంతికి కారణమేమిటో అని భుజాలు తడుముకుంటున్నరు.
దాదాపు 20,000 పారిశ్రామిక యూనిట్లు,18 లక్షల మంది కార్మికులు గల డిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక చట్టాలు అమలుకావడం లేదు. నోయిడా ప్రాంతంలో 12000 పారిశ్రామిక యూనిట్లలో దాదాపు 13 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రైవేటీకరణతో ముడివడిన కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ వల్ల కార్మికుల జీవితాలు వేతన బానిసల పరిస్థితి కంటే హీనంగా దిగజారినవి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నవంబర్, 2025 లో మోడీ ప్రభుత్వం ఎత్తివేసి నూతనంగా నాలుగు కోడ్ లుగా రూపొందించి ఏప్రిల్ 1 నుండి అమల్లోకి తేవడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. గతంలో కనీస వేతనాలను, కనీస వేతనాల చట్టం 1948, ఉత్తర ప్రదేశ్ కనీస వేతనాల రూల్స్ 1952, ప్రకారం నిర్ణయిచే వారు. కానీ ప్రస్తుతం మోదీ తీసుకొచ్చిన కోడ్ ఆన్ వెజెస్ 2019 ప్రకారం నిర్ణయిచనున్నారు. దీని ప్రకారం నిర్ణయించే కనీస వేతనాలు కార్మికుల కనీస అవసరాలు నెరవేరే పరిస్థితి లేదు. పైగా 12 గంటల పని దినం అమలవుతుంది. యూనియన్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
అందుబాటులోని సమాచారం ప్రకారం దేశపు అసంఘటిత రంగంలోని 58.2 శాతం కార్మికులకు ఎలాంటి రాత పూర్వక ఒప్పందాలు లేవు. 51.7 శాతం కార్మికులకు ఏలాంటి సోషల్ సెక్యూరిటీ వర్తించదు.47.3 శాతం కార్మికులు వేతనంతో కూడిన సెలవులకు అర్హులు కారు.ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్, బీహార్ లో 67.8 శాతం కార్మికులకు ఎలాంటి రాత పూర్వక ఒప్పందాలు వర్తించవు. 62.4 శాతం కార్మికులు వేతనంతో కూడిన సెలవులకు అర్హులు కారు. 59.2 శాతం కార్మికులకు ఏ విధమైన సామాజిక భద్రతా అవకాశాలు లేవు. ఇదే విధమైన పరిస్థితి బీహార్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోనూ ఉంది. 2014-15 లో 35 శాతంగా ఉన్న కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ 2023-24 నాటికి 42 శాతంగా పెరిగింది. ఈ పరిస్థితి తెలియజేస్తున్నదేమంటే దేశ పారిశ్రామిక రంగంలో కాంట్రాక్టర్ల మీద ఆధారపడి కార్మికులను రిక్రూట్మెంట్ చేసుకునే మధ్యంతర దళారీ వ్యవస్థ పెరిగింది. ఈ విధానం కార్మికులకు అన్ని రకాల చట్టబద్ధ హక్కుల నిరాకరణకు దారితీస్తూ, కార్మికులను నిలువునా దోపిడీ చేయడానికి యాజమాన్యం చేతిలో అదనపు సాధనంగా ఉపయోగపడుతుంది. ఢిల్లీ పరిశ్రమల్లో పనిచేసే అనిపుణ కార్మికుల కనీస నెల వేతనం ఏప్రిల్ 2025 లో 9568 రూ/ల నుండి ఏప్రిల్ 2025 లో 18456 రూ/లకు, ఉత్తర ప్రదేశ్ లో అనిపుణ కార్మికుని కనీస వేతనం 7017 రూ/ల నుండి ఈ ఏఫ్రిల్ లో 11313 రూ/ల వరకు పెంచారు. ఏఫ్రిల్ 9 వ తేదీన హర్యానా ప్రభుత్వం వేతన సవరణ చేసిన వెంటనే నోయిడాలోని కార్మికులు వేతనాల పెంపుదల కోసం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మధ్యంతరంగా నోయిడా, ఘజియాబాద్ లలోని అనిపుణ కార్మికుల వేతనాన్ని నామ మాత్రంగా 11,313 నుండి 13,690 రూ/లకి పెంచింది.ఇక్కడ కార్మికులకు ఏలాంటి చట్టబద్దమైన హక్కులు వర్తించకపోవడమే గాక అమలు చేయించుకునే వాతావరణం కూడా లేకపోవడం వల్ల వారి జీవితాలు మరింత దుర్భరంగా మారిపోయాయి. కార్మికులు గౌరవ ప్రదమైన జీవితాన్ని, మెరుగైన వేతనాలు డిమాండ్ చేసి ఆందోళనకు దిగినందుకు వారిపై బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దమనకాండకు హింసాత్మక చర్యలకు పాల్పడుతుంది. ఎలాంటి యూనియన్లు లేని పురుష,మహిళా కార్మికులతో సహా ఇప్పటికే దాదాపు 350 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. వారి నాయకులను గృహ నిర్భంధం చేసింది.
నోయిడా కార్మికుల పోరాటాన్ని పరిశీలిస్తే ఇది అకస్మాత్తుగా బ్రద్దలైందేమీ కాదని స్పష్టమవుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి రగులుతూ,ఎంతో అణచివేతను,హింసను భరిస్తూ ఈ పోరాటం బ్రద్ధలైంది. ఏప్రిల్ 2 న మానేసర్ మోడల్ టౌన్ షిప్ హర్యానాలోని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ పరిశ్రమలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు వేతన పెంపుదలను డిమాండ్ చేస్తూ మెరుపు సమ్మెకు దిగారు. ఏప్రిల్ 8 న 12 ఫ్యాక్టరీ లకు చెందిన 3000 మంది గార్మెంట్ కార్మికులు వేతనాల పునస్సమీకరణ, నిత్యావసర వస్తువుల ధరల కంట్రోల్ డిమాండ్ చేస్తూ మానేసర్ లోని హర్యానా రాష్ట్ర పారిశ్రామిక ఇన్ ప్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ కాంప్లెక్స్ వద్ద గుమిగూడి ఆందోళన ప్రారంభించారు. ఈ పోరాటాన్ని అనుసరిస్తూ నోయిడా,పరిదాబాద్ మరియు పానిపట్ లలోని వేలాది కాంట్రాక్టు కార్మికులు ఏఫ్రిల్ 13 న పనులను బహిష్కరించి ఆందోళనకు దిగారు.వీరికి మద్ధతుగా గృహ కార్మికులు కూడా పనులను బహిష్కరించి ఆందోళనకు దిగారు.కార్మికుల డిమాండ్ల పై బిజెపి ప్రభుత్వం లేబర్ కమిషన్ ద్వారా పారిశ్రామిక అధిపతులతో చర్చల నాటకమాడుతూనే కార్మికుల పై లాఠీచార్జి ప్రయోగించి అనేక మంది కార్మికులను గాయపర్చింది. అనంతరం 20 శాతం వేతనాలు పెంచినా కార్మికుల డిమాండుకనుగుణంగా లేకపోవడంతో పట్టుదలతో కార్మికులు పోరాడుతున్నారు. వీటిని అనేక కంపెనీలు అమలు జరపడానికి ఒప్పుకోకపోవడం కార్మికులను మరింత రెచ్చగొట్టింది. ఆందోళన చేస్తున్న కార్మికులు ప్రభుత్వం పెంచిన నామ మాత్రపు వేతనాలను తిరస్కరిస్తూ పెరుగుతున్న ధరల కనుగుణంగా 20,000 నుండి 26,000 వరకు కనీస వేతనాలను పెంచాలని,మధ్య దళారులైన కాంట్రాక్టర్ల పాత్ర లేకుండా కంపెనీలే కార్మికులను డైరెక్టర్ గా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
‘మొత్తం మీద కార్మికులు వేతనాల పెంపుదల, 12 గంటల పని దినం రద్దు,పని ప్రదేశాల్లో వర్కింగ్ కండీషన్స్ మెరుగుదల, అదనపు పనికి వేతనం, హౌస్ రెంట్ అలవెన్స్, ఇపిఎఫ్, బోనస్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, మద్య దళారుల పాత్ర నిర్మూలన, వారాంతపు సెలవు దినంతో పాటు యూనియన్ కలిగి ఉండే హక్కు, కార్మికుల హక్కుల గురించి ప్రశ్నిస్తే పరిశ్రమల యాజమాన్యం, మేనేజర్ లు కార్మికుల పట్ల అగౌరవంగా వ్యవహరించడాన్ని కంట్రోల్ చేసే అంతర్గత కంప్లైంట్ల కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు’.న్యాయమైన తమ డిమాండ్ల పరిష్కారం పై యాజమాన్యం,ప్రభుత్వాలు దృష్టి పెట్టకుండా తమ పై హింసను ప్రయోగించడాన్ని ప్రతిఘటించారు. గత పన్నెండు సంవత్సరాల నుండి వేతనాలు పెంచకపోవడమే గాక అమెరికా సామ్రాజ్యవాదుల, జియోనిస్టు ఇజ్రాయెల్ లు కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధం నేపధ్యంలో పెరిగిన వంట గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు,ఇంటి అద్దెలు కార్మికుల ఆగ్రహానికి తక్షణ కారణం కాగా పొరుగున ఉన్న హార్యానా ప్రభుత్వం ఏప్రిల్ 8 న స్కిల్డ్,సెమీ స్కిల్డ్, మరియు ఇతర విభాగాల కార్మికుల కు ప్రకటించిన 35 శాతం నూతన వేతనాలు కూడా ఒక కారణం. హర్యానా ప్రభుత్వం నిపుణ కార్మికులకు 11,274.60 రూపాయల నుండి 15,220 రూపాయలకు అర్ధ నిపుణ కార్మికుల వేతనాన్ని 12,430.18 నుండి 16,780.74 వరకు పెంచింది.ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాల్సిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 2014 లో చివరి సారిగా వేతన సవరణ చేసి గత 12 సంవత్సరాలుగా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. సమీపంలోని డిల్లీలో కార్మికుల కనీస వేతనం 18000 రూపాయలు కాగా నోయిడాలో సమానమైన ఇదే పనికి 11000 రూపాయలు మాత్రమే. పరిశ్రమల యాజమాన్యాలకు తొత్తుగా పనిచేస్తున్న బిజెపి ప్రభుత్వం కార్మికుల పోరాటానికి పాకిస్థాన్ కారణమని,నక్సల్స్ కారణమని నిందా ప్రచారానికి దిగడం, కార్మికుల పై పోలీసు హింసను ప్రయోగించడం వారి పోరాటాన్ని మరింత ఉధృతం అయ్యేలా చేసాయి. వరుసగా ఆటోమోటివ్ సెక్టార్ లో ప్రారంభమైన కార్మికుల పోరాటం గార్మెంట్, టెక్స్ టైల్,ఎగుమతి రంగాలకు కూడా విస్తరించింది.
ఏప్రిల్ పోరాటాల కంటే ముందే ఫిబ్రవరిలోనే పానిపట్ లోని ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు చెందిన వేలాది కాంట్రాక్టు కార్మికులు 12 గంటల పనిదినం రద్దు, వేతనాలు పెంపు, రక్షణ చర్యలు మొదలగునవి డిమాండ్ చేస్తూ ఆందోళన చేయగా సిఐఎస్ ఎఫ్ ను ప్రయోగించి అణచి వేశారు.ఉత్తర భారత దేశంలో ఇలాంటి కార్మికుల ఆందోళనలు కనీసం ఐదు,ఆరు ప్రాంతాల్లో జరిగాయి. మొదటిది,ఫిబ్రవరి 2,2026 లో బీహార్ లోని బారౌని ప్రాంతంలోని ఇండస్ట్రీయల్ టౌన్ షిప్ లో కనీస వేతనాలు, ఎనిమిది గంటల పని దినం, పిఎఫ్, ఇన్సూరెన్స్ సాధన కోసం ఆందోళనలు జరిగాయి. రెండవది,గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోని డైమండ్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ లో ఆందోళన. మూడవది, హర్యానాలోని మానేసర్ లోని ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రానిక్ సెక్టార్ లోనిది. నాలుగవది,పానిపట్ లోని టెక్స్ టైల్స్ మరియు రీ సైక్లింగ్ యూనిట్ లో ఫిబ్రవరి 23 న జరిగింది. ఇందులో 30000 మంది కార్మికులు పాల్గొనగా పోలీసులు లాఠీ చార్జీ జరపడంతో కార్మికులు ప్రతిఘటించారు. ఫిబ్రవరి27న హజారియా,సూరత్ సైట్ లలో పని చేస్తున్న లార్సన్ &టూబ్రో కి చెందిన 5000 మంది కాంట్రాక్టు కార్మికులు కూడా ఆందోళన చేశారు. ఐదవది, నోయిడాలోని పుట్ వేర్ మరియు టెక్స్ టైల్స్ తయారీ రంగంలో జరిగాయి. ఈ అన్ని ప్రాంతాల్లోని లక్షలాది కార్మికుల డిమాండ్లు వేతనాల పెంపుదల,మంచి పని పరిస్థితులు, అదనపు పనకి అదనపు చెల్లింపు, క్లియరెన్స్ ఆఫ్ పెండింగ్ డ్యూలు, రెగ్యులర్ కార్మికులకు వలే సమాన పని పరిస్థితులు మొదలగు సర్వ సాధారణ డిమాండ్లు ఉన్నాయి.దేశంలోని చెన్నై శామ్సంగ్ కార్మికుల పోరాటం, పశ్చిమ బెంగాల్ లోని టీ ఎస్టేట్ కార్మికుల పోరాటం, కేరళ, తమిళనాడులలో ఆశా, అంగన్ వాడీ, మునిసిపల్ కార్మికుల పోరాటాలు, తెలంగాణ బొగ్గు గని కార్మికుల పోరాటం,హైదరాబాద్లో షాహీ గార్మెంట్ ఎక్స్ ఫోర్ట్ కార్మికుల పోరాటం ఇలాంటి పోరాటాలు ఎన్నో జరిగాయి.
ఈ పోరాటాలన్నింటిలోని సర్వసాధారణ డిమాండ్లతో పాటు ఉఫాధి యొక్క స్వభావం ప్రత్యేకంగా గమనించదగ్గది. పెట్టుబడిదార్లకు కార్మికులకు మధ్య కాంట్రాక్టర్ లేదా కాంట్రాక్టు వ్యవస్థ అనే మధ్య దళారీ వ్యవస్థను పటిష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం హిందూ/బ్రాహ్మణ మత ధర్మం ప్రకారం ఉద్యోగ, ఉపాధులను కల్పించే బాధ్యత నుండి తప్పుకొన్నాయి. కార్మికులు ఫలితం ఆశించకుండా పెట్టుబడిదార్లకు సేవలు చేస్తూ బతుకాలన్నమాట. దేశ సహజ సంపదలను పెట్టుబడిదార్లకు/కార్పోరేట్ కంపెనీలకు కారు చౌకగా కట్టబెట్టినట్లే,కార్మికుల జీవితాలను కూడా అప్పజెప్పాయి. కార్పోరేట్ల ఆజ్ఞలకు అనుగుణంగా శ్రమ చేయడం తప్పితే శ్రమకు తగ్గ కాదు కదా అసలు ఫలితమే ఆశించకూడదు.కార్మికులు శ్రమలు చేయడం వారి పూర్వ జన్మ దుష్కృతం.పెట్టుబడిదారులు కార్మికుల శ్రమ శక్తి లేదా అదనపు శ్రమను దోచుకుని విలాసవంతమైన జీవితాలను గడపడం వారి పూర్వ జన్మ సుకృతం. ఇది మన సనాతన ధర్మం. ఇది మన సాంప్రదాయం, సంస్కృతి,ఆచారం. ఈ విధమైన దోపిడీ వర్గాల చెత్త భావజాలాన్ని బోధిస్తూ కార్మికుల చైతన్యాన్ని, సంఘటిత శక్తిని దెబ్బ తీస్తున్నారు. అయినప్పటికీ కడుపు మండిన కార్మికులు కూటి కోసం కూలీ పెంపుదల కోసమే గాకుండా వేతన బానిసత్వం నుండి విముక్తి పొందే దిశగా మిలిటెంట్ పోరాటాలు చేస్తారనేది తాజా సత్యం.కార్మికులు మరింత ఉన్నత చైతన్యాన్ని ప్రదర్శించాలని, బుద్ధిజీవులు అందుకు సహకరిస్తారని ఆశిద్ధాం.
-అరెస్టు చేసిన నోయిడా కార్మికులందరినీ విడుదల చేయాలి.
-అక్రమ కేసులను ఎత్తివేయాలి.
-కార్మికుల న్యాయమైన డిమాండ్లన్నింటిని అమలు చేయాలి.
-కనీస వేతనం 30,000 లకు పెంచాలి.
-కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేయాలి.
-నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
తేదీ.22 ఏఫ్రిల్ 2026.
దాదాపు 20,000 పారిశ్రామిక యూనిట్లు,18 లక్షల మంది కార్మికులు గల డిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక చట్టాలు అమలుకావడం లేదు.నోయిడా ప్రాంతంలో 12000 పారిశ్రామిక యూనిట్లలో దాదాపు 13 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు.ప్రైవేటీకరణతో ముడివడిన కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ వల్ల కార్మికుల జీవితాలు వేతన బానిసల పరిస్థితి కంటే హీనంగా దిగజారినవి.గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నవంబర్, 2025 లో మోడీ ప్రభుత్వం ఎత్తివేసి నూతనంగా నాలుగు కోడ్ లుగా రూపొందించి ఏప్రిల్ 1 నుండి అమల్లోకి తేవడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది.గతంలో కనీస వేతనాలను,కనీస వేతనాల చట్టం 1948, ఉత్తర ప్రదేశ్ కనీస వేతనాల రూల్స్ 1952, ప్రకారం నిర్ణయిచే వారు.కానీ ప్రస్తుతం మోదీ తీసుకొచ్చిన కోడ్ ఆన్ వెజెస్ 2019, ప్రకారం నిర్ణయిచనున్నారు.దీని ప్రకారం నిర్ణయించే కనీస వేతనాలు కార్మికుల కనీస అవసరాలు నెరవేరే పరిస్థితి లేదు.పైగా 12 గంటల పని దినం అమలవుతుంది.యూనియన్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
అందుబాటులోని సమాచారం ప్రకారం దేశపు అసంఘటిత రంగంలోని 58.2 శాతం కార్మికులకు ఏలాంటి రాత పూర్వక ఒప్పందాలు లేవు.51.7 శాతం కార్మికులకు ఏలాంటి సోషల్ సెక్యూరిటీ వర్తించదు.47.3 శాతం కార్మికులు వేతనంతో కూడిన సెలవులకు అర్హులు కారు.ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్, బీహార్ లో 67.8 శాతం కార్మికులకు ఏలాంటి రాత పూర్వక ఒప్పందాలు వర్తించవు.62.4 శాతం కార్మికులు వేతనంతో కూడిన సెలవులకు అర్హులు కారు.59.2 శాతం కార్మికులకు ఏ విధమైన సామాజిక భద్రతా అవకాశాలు లేవు.ఇదే విధమైన పరిస్థితి బీహార్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోనూ ఉంది. 2014-15 లో 35 శాతంగా ఉన్న కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ 2023-24 నాటికి 42 శాతంగా పెరిగింది.ఈ పరిస్థితి తెలియజేస్తున్నదేమంటే దేశ పారిశ్రామిక రంగంలో కాంట్రాక్టర్ల మీద ఆధారపడి కార్మికులను రిక్రూట్మెంట్ చేసుకునే మధ్యంతర దళారీ వ్యవస్థ పెరిగింది.ఈ విధానం కార్మికులకు అన్ని రకాల చట్టబద్ధ హక్కుల నిరాకరణకు దారితీస్తూ, కార్మికులను నిలువునా దోపిడీ చేయడానికి యాజమాన్యం చేతిలో అదనపు సాధనంగా ఉపయోగపడుతుంది.ఢిల్లీ పరిశ్రమల్లో పనిచేసే అనిపుణ కార్మికుల కనీస నెల వేతనం ఏప్రిల్ 2025 లో 9568 రూ/ల నుండి ఏప్రిల్ 2025 లో 18456 రూ/లకు,ఉత్తర ప్రదేశ్ లో అనిపుణ కార్మికుని కనీస వేతనం 7017 రూ/ల నుండి ఈ ఏఫ్రిల్ లో 11313 రూ/ల వరకు పెంచారు.ఏఫ్రిల్ 9 వ తేదీన హర్యానా ప్రభుత్వం వేతన సవరణ చేసిన వెంటనే నోయిడాలోని కార్మికులు వేతనాల పెంపుదల కోసం ఆందోళన చేపట్టారు.ఈ ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మధ్యంతరంగా నోయిడా, ఘజియాబాద్ లలోని అనిపుణ కార్మికుల వేతనాన్ని నామ మాత్రంగా 11,313 నుండి 13,690 రూ/లకి పెంచింది.ఇక్కడ కార్మికులకు ఏలాంటి చట్టబద్దమైన హక్కులు వర్తించకపోవడమే గాక అమలు చేయించుకునే వాతావరణం కూడా లేకపోవడం వల్ల వారి జీవితాలు మరింత దుర్భరంగా మారిపోయాయి.కార్మికులు గౌరవ ప్రదమైన జీవితాన్ని, మెరుగైన వేతనాలు డిమాండ్ చేసి ఆందోళనకు దిగినందుకు వారిపై బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దమనకాండకు హింసాత్మక చర్యలకు పాల్పడుతుంది.ఏలాంటి యూనియన్లు లేని పురుష,మహిళా కార్మికులతో సహా ఇప్పటికే దాదాపు 350 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. వారి నాయకులను గృహ నిర్భంధం చేసింది.
నోయిడా కార్మికుల పోరాటాన్ని పరిశీలిస్తే ఇది అకస్మాత్తుగా బ్రద్దలైందేమీ కాదని స్పష్టమవుతుంది.ఎన్నో సంవత్సరాల నుండి రగులుతూ,ఎంతో అణచివేతను,హింసను భరిస్తూ ఈ పోరాటం బ్రద్ధలైంది.ఏప్రిల్ 2 న మానేసర్ మోడల్ టౌన్ షిప్ హర్యానాలోని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ పరిశ్రమలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు వేతన పెంపుదలను డిమాండ్ చేస్తూ మెరుపు సమ్మెకు దిగారు. ఏప్రిల్ 8 న 12 ఫ్యాక్టరీ లకు చెందిన 3000 మంది గార్మెంట్ కార్మికులు వేతనాల పునస్సమీకరణ, నిత్యావసర వస్తువుల ధరల కంట్రోల్ డిమాండ్ చేస్తూ మానేసర్ లోని హర్యానా రాష్ట్ర పారిశ్రామిక ఇన్ ప్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ కాంప్లెక్స్ వద్ద గుమిగూడి ఆందోళన ప్రారంభించారు. ఈ పోరాటాన్ని అనుసరిస్తూ నోయిడా,పరిదాబాద్ మరియు పానిపట్ లలోని వేలాది కాంట్రాక్టు కార్మికులు ఏఫ్రిల్ 13 న పనులను బహిష్కరించి ఆందోళనకు దిగారు.వీరికి మద్ధతుగా గృహ కార్మికులు కూడా పనులను బహిష్కరించి ఆందోళనకు దిగారు.కార్మికుల డిమాండ్ల పై బిజెపి ప్రభుత్వం లేబర్ కమిషన్ ద్వారా పారిశ్రామిక అధిపతులతో చర్చల నాటకమాడుతూనే కార్మికుల పై లాఠీచార్జి ప్రయోగించి అనేక మంది కార్మికులను గాయపర్చింది.అనంతరం 20 శాతం వేతనాలు పెంచినా కార్మికుల డిమాండుకనుగుణంగా లేకపోవడంతో పట్టుదలతో కార్మికులు పోరాడుతున్నారు.వీటిని అనేక కంపెనీలు అమలు జరపడానికి ఒప్పుకోకపోవడం కార్మికులను మరింత రెచ్చగొట్టింది.ఆందోళన చేస్తున్న కార్మికులు ప్రభుత్వం పెంచిన నామ మాత్రపు వేతనాలను తిరస్కరిస్తూ పెరుగుతున్న ధరల కనుగుణంగా 20,000 నుండి 26,000 వరకు కనీస వేతనాలను పెంచాలని,మధ్య దళారులైన కాంట్రాక్టర్ల పాత్ర లేకుండా కంపెనీలే కార్మికులను డైరెక్టర్ గా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
‘మొత్తం మీద కార్మికులు వేతనాల పెంపుదల, 12 గంటల పని దినం రద్దు,పని ప్రదేశాల్లో వర్కింగ్ కండీషన్స్ మెరుగుదల, అదనపు పనికి వేతనం, హౌస్ రెంట్ అలవెన్స్,ఇపిఎఫ్, బోనస్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్,మద్య దళారుల పాత్ర నిర్మూలన,వారాంతపు సెలవు దినంతో పాటు యూనియన్ కలిగి ఉండే హక్కు, కార్మికుల హక్కుల గురించి ప్రశ్నిస్తే పరిశ్రమల యాజమాన్యం, మేనేజర్ లు కార్మికుల పట్ల అగౌరవంగా వ్యవహరించడాన్ని కంట్రోల్ చేసే అంతర్గత కంప్లైంట్ల కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు’.న్యాయమైన తమ డిమాండ్ల పరిష్కారం పై యాజమాన్యం,ప్రభుత్వాలు దృష్టి పెట్టకుండా తమ పై హింసను ప్రయోగించడాన్ని ప్రతిఘటించారు.గత పన్నెండు సంవత్సరాల నుండి వేతనాలు పెంచకపోవడమే గాక అమెరికా సామ్రాజ్యవాదుల,జియోనిస్టు ఇజ్రాయెల్ లు కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధం నేపధ్యంలో పెరిగిన వంట గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు,ఇంటి అద్దెలు కార్మికుల ఆగ్రహానికి తక్షణ కారణం కాగా పొరుగున ఉన్న హార్యానా ప్రభుత్వం ఏప్రిల్ 8 న స్కిల్డ్,సెమీ స్కిల్డ్, మరియు ఇతర విభాగాల కార్మికుల కు ప్రకటించిన 35 శాతం నూతన వేతనాలు కూడా ఒక కారణం.హర్యానా ప్రభుత్వం నిపుణ కార్మికులకు 11,274.60 రూపాయల నుండి 15,220 రూపాయలకు అర్ధ నిపుణ కార్మికుల వేతనాన్ని 12,430.18 నుండి 16,780.74 వరకు పెంచింది.ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాల్సిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 2014 లో చివరి సారిగా వేతన సవరణ చేసి గత 12 సంవత్సరాలుగా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది.సమీపంలోని డిల్లీలో కార్మికుల కనీస వేతనం 18000 రూపాయలు కాగా నోయిడాలో సమానమైన ఇదే పనికి 11000 రూపాయలు మాత్రమే.పరిశ్రమల యాజమాన్యాలకు తొత్తుగా పనిచేస్తున్న బిజెపి ప్రభుత్వం కార్మికుల పోరాటానికి పాకిస్థాన్ కారణమని,నక్సల్స్ కారణమని నిందా ప్రచారానికి దిగడం, కార్మికుల పై పోలీసు హింసను ప్రయోగించడం వారి పోరాటాన్ని మరింత ఉధృతం అయ్యేలా చేసాయి.వరుసగా ఆటోమోటివ్ సెక్టార్ లో ప్రారంభమైన కార్మికుల పోరాటం గార్మెంట్, టెక్స్ టైల్,ఎగుమతి రంగాలకు కూడా విస్తరించింది.
ఏప్రిల్ పోరాటాల కంటే ముందే ఫిబ్రవరిలోనే పానిపట్ లోని ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు చెందిన వేలాది కాంట్రాక్టు కార్మికులు 12 గంటల పనిదినం రద్దు, వేతనాలు పెంపు, రక్షణ చర్యలు మొదలగునవి డిమాండ్ చేస్తూ ఆందోళన చేయగా సిఐఎస్ ఎఫ్ ను ప్రయోగించి అణచి వేశారు.ఉత్తర భారత దేశంలో ఇలాంటి కార్మికుల ఆందోళనలు కనీసం ఐదు,ఆరు ప్రాంతాల్లో జరిగాయి. మొదటిది,ఫిబ్రవరి 2,2026 లో బీహార్ లోని బారౌని ప్రాంతంలోని ఇండస్ట్రీయల్ టౌన్ షిప్ లో కనీస వేతనాలు, ఎనిమిది గంటల పని దినం, పిఎఫ్, ఇన్సూరెన్స్ సాధన కోసం ఆందోళనలు జరిగాయి. రెండవది,గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోని డైమండ్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ లో ఆందోళన.మూడవది, హర్యానాలోని మానేసర్ లోని ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రానిక్ సెక్టార్ లోనిది.నాలుగవది, పానిపట్ లోని టెక్స్ టైల్స్ మరియు రీ సైక్లింగ్ యూనిట్ లో ఫిబ్రవరి 23 న జరిగింది.ఇందులో 30000 మంది కార్మికులు పాల్గొనగా పోలీసులు లాఠీ చార్జీ జరపడంతో కార్మికులు ప్రతిఘటించారు. ఫిబ్రవరి27న హజారియా,సూరత్ సైట్ లలో పని చేస్తున్న లార్సన్ &టూబ్రో కి చెందిన 5000 మంది కాంట్రాక్టు కార్మికులు కూడా ఆందోళన చేశారు.ఐదవది, నోయిడాలోని పుట్ వేర్ మరియు టెక్స్ టైల్స్ తయారీ రంగంలో జరిగాయి.ఈ అన్ని ప్రాంతాల్లోని లక్షలాది కార్మికుల డిమాండ్లు వేతనాల పెంపుదల,మంచి పని పరిస్థితులు, అదనపు పనకి అదనపు చెల్లింపు, క్లియరెన్స్ ఆఫ్ పెండింగ్ డ్యూలు, రెగ్యులర్ కార్మికులకు వలే సమాన పని పరిస్థితులు మొదలగు సర్వ సాధారణ డిమాండ్లు ఉన్నాయి.దేశంలోని చెన్నై శామ్సంగ్ కార్మికుల పోరాటం, పశ్చిమ బెంగాల్ లోని టీ ఎస్టేట్ కార్మికుల పోరాటం,కేరళ, తమిళనాడులలో ఆశా,అంగన్ వాడీ, మునిసిపల్ కార్మికుల పోరాటాలు, తెలంగాణ బొగ్గు గని కార్మికుల పోరాటం,హైదరాబాద్లో షాహీ గార్మెంట్ ఎక్స్ ఫోర్ట్ కార్మికుల పోరాటం ఇలాంటి పోరాటాలు ఎన్నో జరిగాయి.
ఈ పోరాటాలన్నింటిలోని సర్వసాధారణ డిమాండ్లతో పాటు ఉఫాధి యొక్క స్వభావం ప్రత్యేకంగా గమనించదగ్గది.పెట్టుబడిదార్లకు కార్మికులకు మధ్య కాంట్రాక్టర్ లేదా కాంట్రాక్టు వ్యవస్థ అనే మధ్య దళారీ వ్యవస్థను పటిష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం హిందూ/బ్రాహ్మణ మత ధర్మం ప్రకారం ఉద్యోగ, ఉపాధులను కల్పించే బాధ్యత నుండి తప్పుకొన్నాయి.కార్మికులు ఫలితం ఆశించకుండా పెట్టుబడిదార్లకు సేవలు చేస్తూ బతుకాలన్నమాట.దేశ సహజ సంపదలను పెట్టుబడిదార్లకు/కార్పోరేట్ కంపెనీలకు కారు చౌకగా కట్టబెట్టినట్లే,కార్మికుల జీవితాలను కూడా అప్పజెప్పాయి.కార్పోరేట్ల ఆజ్ఞలకు అనుగుణంగా శ్రమ చేయడం తప్పితే శ్రమకు తగ్గ కాదు కదా అసలు ఫలితమే ఆశించకూడదు.కార్మికులు శ్రమలు చేయడం వారి పూర్వ జన్మ దుష్కృతం.పెట్టుబడిదారులు కార్మికుల శ్రమ శక్తి లేదా అదనపు శ్రమను దోచుకుని విలాసవంతమైన జీవితాలను గడపడం వారి పూర్వ జన్మ సుకృతం.ఇది మన సనాతన ధర్మం.ఇది మన సాంప్రదాయం, సంస్కృతి,ఆచారం. ఈ విధమైన దోపిడీ వర్గాల చెత్త భావజాలాన్ని బోధిస్తూ కార్మికుల చైతన్యాన్ని, సంఘటిత శక్తిని దెబ్బ తీస్తున్నారు. అయినప్పటికీ కడుపు మండిన కార్మికులు కూటి కోసం కూలీ పెంపుదల కోసమే గాకుండా వేతన బానిసత్వం నుండి విముక్తి పొందే దిశగా మిలిటెంట్ పోరాటాలు చేస్తారనేది తాజా సత్యం.కార్మికులు మరింత ఉన్నత చైతన్యాన్ని ప్రదర్శించాలని, బుద్ధిజీవులు అందుకు సహకరిస్తారని ఆశిద్ధాం.
-అరెస్టు చేసిన నోయిడా కార్మికులందరినీ విడుదల చేయాలి.
-అక్రమ కేసులను ఎత్తివేయాలి.
-కార్మికుల న్యాయమైన డిమాండ్లన్నింటిని అమలు చేయాలి.
-కనీస వేతనం 30,000 లకు పెంచాలి.
-కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేయాలి.
-నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
తేదీ. 22 ఏఫ్రిల్ 2026.




