బస్తర్ తరాల చరిత్ర అంతా
ప్రజా పోరుకు మారు పేరు
ఒకరి కింద బానిసలుగా
మేము వుండమ్
ఈ అడవి మాదే అంటూ
విస్తృత, వినూత్న
పోరు-సమరాలు నడిపింది
ఆ వారసత్వము నుండే
నేడు
వర్గ పోరాటపు చైతన్యముతో
ఆ కాశంలో సగం – సమరంలో సగం అంటూ
దండకారణయ్య ఉద్యమంలో
సమసమాజ నిర్మాణా కర్తవ్యంతో
అడుగేసిన నూపో బుస్కీ
సాధారణ ఆదివాసి యువతి
అ ఆ లతో పాటూ-యుద్ద నీతిని నేర్చి
కమాండర్ గా నాయకత్వంలోకి
ఎదిగివచ్చిన విప్లవ వీరాంగణ
సల్వజుడుమ్,`సమాధాన్’ సామూహిక
సమరాల్లో సహసంగా పోరాడిన ధీశాలి
ఫాసిష్టు ఆపరేషన్ `కగార్`బాంబుదాడుల్లో
కన్ను కోల్పోయినా ధృఢ సంకల్పంతో
రణరంగంలో నిల్చింది .
బస్తర్ పోరుకు ప్రతీకగా మరోసారి
ప్రజాయుద్దంలో శత్రువు తూటాలకు
జవాబు ఇస్తూ ఆఖరి వరకు పోరాడుతూ
బోలిష్విక్ స్పీరిట్ – వర్గ పోరాటా స్పూర్తితో
విముక్తి మార్గపు వియ్యుక్కగా
నిల్చిన వీరనారి కామ్రేడ్ బుస్కీ …..
(కామ్రేడ్ నుపా బుస్కీ సుకుమా జిల్లా గాదెరాజ్ పోలిస్ స్టేషన్ పరిదిలోని గుప్పిడిగ్రామ పరిదిలోని పెర్మ (పారా) గూడెంలో 2025 డిసెంబర్ 8 నాడు వేలాది శత్రూవు బలగాలు చుట్టు ముట్టి జరిపిన దాడిలో చివరివరకు పోరాడుతూ అమరురాలు అయ్యుంది. దీనికి ముందుగా 2025 మార్చిలో ‘కగార్’ బాంబు దాడిలో ఒక కన్నును కోల్పోయు, 6 నెలల రెస్టుతో కనుచూపూ సమస్య వున్నా యుద్దరంగములోకి వెళ్ళిన కొన్నాళ్ళకే తన దళానికి నాయకత్వం వహిస్తూ శత్రూవుతో పోరాడుతూ అమరురాలై వీరనారి, ప్రియమైన కామ్రేడ్ బుస్కీ పోరాట స్పూర్తికి కన్నీటి జోహర్లూ అర్పిస్తూ…….)




