గల్పిక

పరీక్షా పే రచ్చ

పరీక్షా పే రచ్చ ప్రోగ్రామ్ లో వెనక వరసలో కూర్చొన్న వేదాన్తకి చాలా అసహనంగా వుంది తాను అసలే ఫిజిక్స్ లో కొంచెం వీక్  రివైజ్ చేసుకోవాల్సినదెంతో వుంది దాదాపు మూడు గంటలకి పైగా దేశ్ కా నేతా ని కలవడానికి టైం వేస్ట్ అవుతూన్నందుకు  చిరాగ్గా వుంది సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ హాల్ ఏమంత హాయిగా లేదు బయట సెక్యూరిటీ వాళ్ళు ఫిజిక్స్ పుస్తకం లోపలికి తెచ్చుకోనీయనందుకు కోపంగా కూడా వుంది తన పేరులో సనాతనమ్ ధ్వనించడం వల్ల తండ్రి విశ్వగురు భక్తుడు కావడం వల్ల యీ ప్రోగ్రామ్ కి తనను సెలెక్ట్ చేశారు   చివరికి ఖరీదైన
కవిత్వం

యుద్ధం

నేను నిన్ను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కాని యుద్ధం నా పాదాలు నీ చెంత కు రాకుండా అడ్డుపడుతున్నాయి. కాళ్ళు కదుపకుండానే ఇంకా నేను నీ దగ్గరకు చేరడానికి ప్రయత్నిస్తున్నాను యుద్ధం నీ దగ్గరికి రావడానికన్నా ముందే.
కవిత్వం

అత్యాచార దేశపు దశలు

దశ -1••మొదట్లో తాత, తాత ముత్తాత పుట్టబోయే బిడ్డ ఆడదని గుర్తించి చంపేశాడు!తరువాత అది వంశ పారంపర్య ఆచారంగా స్థిర పడి పోయింది!కిచ కిచ లాడే పక్షి ఎవరికి కావాలి చెప్పండి?దాని కోసం పాపంఅమ్మ ఒక్కతే ఏడ్చింది!పుట్టింది ఆడపిల్ల మరి!వాళ్ళు వదిలించుకోవాలని ఆదేశించారు!~బాత్రూమ్ నేలకి ఆ ప్రవాహం ఏంటో బాగా తెలుసు.మరణంలో కూడా అది ఎర్రగానే ఉంది!ఆ రోజు నాన్న ఒక అదనపు బకెట్ నీళ్లు తెచ్చాడు!భారం తుడిచిపెట్టటానికి ఆ అదనపు బకెట్ నీళ్లు సరి పోయాయి!~దశ -2దూద్ పీతీ ••ఎక్కడ నుంచి వస్తోంది ఆ పీక నొక్కేయబడిన శిశువు గొంతులోంచి ఆ రోదన?వెంటనే నిశ్శబ్దం అయిపోయింది!చచ్చిపోయిన కూతురుతో,
సమకాలీనం

కాక్రోచ్‌ల ర‌ణ‌న్నినాదం

తానాషాహీ నహీ చలేగీ, నహీ చలేగీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి హమ్ నహీ డరేంగీ, నహీ డరేంగీ అనే యువతరం  రణ నినాదాలతో జంతర్ మంతర్ దద్దరిల్లింది. సంజయ్ దూబే అనే అడ్వకేట్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తనను సీనియర్ అడ్వకేట్ గా గుర్తింపు ఇవ్వాలని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. ఆ కేసు విచారణ సందర్భంగా 15 మే 2026 న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ దేశ‌ పాలకులను సమర్ధిస్తూ, యువతను అవమానించే విధంగా వ్యాఖ్యానిస్తూ, "సమాజంలో ఇప్పటికే పరాన్న భుక్కులు ఉన్నారు. అటువంటి వారితో మీరు చేతులు కలప దల్చుకున్నారా?
సమకాలీనం

కరువుకు నిలయంగా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా   

ఉమ్మడి అనంతపురం జిల్లా ఎప్పటినుంచో కరువు ప్రాంతంగా పేరుగాంచింది. తక్కువ వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుదల, సాగు, తాగునీటి కొరత కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న జిల్లాలలో రాజస్థాన్ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా రెండవ స్థానంలో ఉంది. ముఖ్యంగా గార్లదిన్నె, పెద్దవడుగూరు, పామిడి, నార్పల, శిగనమల, యాడికి, బుక్కరాయసముద్రం మండలాల్లో చీని, నిమ్మ, అరటి లాంటి పండ్ల తోట పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ పంటలను హెచ్.ఎల్.సి ((హై లెవల్ కాలువ) ఆయకట్టు ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం కర్ణాటక ఎగువ ప్రాంతాలలో
వ్యాసాలు

వివాదస్పదమవుతున్న న్యాయస్థానాల తీర్పులు…?

ఈ మధ్యకాలంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆయా వర్గ ప్రజలలో ఆందోళనలు రేకెత్తించాయి. ఈ తీర్పులు  సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాల తీర్పులు కేవలం సాంకేతిక అంశాలపై కాకుండా అవి సహజ న్యాయానికి అనుగుణంగానూ, హేతుబద్దంగానూ ఉండాలన్న అభిప్రాయం ఆయా వర్గ ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.  ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దళితులు మతం మారితే వారి యొక్క ఎస్సీ,  ఎస్టీ రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతారని చెప్పడం జరిగింది. ఈ తీర్పు వలన తక్షణం
సమకాలీనం

కడపటి యుద్ధం – స్వామి సనాతనం

దేని మీదైనా సరే, వ్యాసాలు రాశాక, ప్రసంగాలు చేశాక కూడా సాహిత్యంగా త‌ప్ప మ‌రోలా చెప్ప‌లేనిది మిగిలి ఉన్నప్పుడు రచయితలు కాల్పనిక ప్రక్రియల్లోకి వెళతారు. మానవ అనుభవాన్ని వర్ణించడానికీ, పంచుకోడానికీ సాహిత్య రచన తప్పనిసరవుతుంది. ఆ అనుభవం ఇవ్వాల్టిదైనా కావచ్చు. చరిత్రలోని సుదూర గతానిదైనా కావచ్చు. కానీ, సుప్రసిద్ధ రాయలసీమ రచయిత బండి నారాయణ స్వామి ఇటీవల 600 పేజీల ‘కడపటి యుద్ధం’ నవల రాశాక కూడా తన ఇతివృత్తం గురించి, అందులో తన ప్రతిపాదన గురించి ఆయన మళ్లీ వ్యాసాలు రాయవలసి వస్తున్నది. ఈ పని నవల ‘వెనుక మాట’తోనే ఆయన ఆరంభించారు. నవల ద్వారా తాను
సంభాషణ

చలం – రచన ప్రపంచంలో ఓ ‘చుక్కమ్మ’

ఎక్కడో ఛత్తీస్‌ఘడ్ అడవిలో ఒక చెట్టుకింద కూర్చున్న నాకు చలం పరిచయమయ్యాడు. అక్కడ సిగ్నల్ ఉండదని ముందే యూట్యూబ్  కొన్ని వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాను.   వాటిల్లో  చలం రచనలు అని ఇరవై రెండో ఇరవై మూడో ఎపిసోడ్లు కూడా ఉన్నాయి.   అప్లోడ్ చేసిన వాళ్ళు సరిగా గుర్తులేరు కౌముది అనుకుంటా. అవన్నీ వింటూ వింటూ చలం పరిచయం అయ్యాడు. మొదట అందులో నేనూ విన్నది కూడా  ప్రేమలేఖలు అనే వీడియో.  అప్పుడు నాకు విరహం కూడా ఎక్కువే ఉండేది.  కుటుంబాల మీద కాదు!  అక్కడి నుంచి నాకు చలం అలవాటు అయ్యాడు.  నేను సాహిత్య ప్రపంచంలోకి రావడానికి ఒక
రిపోర్ట్

బాక్సైట్ తవ్వకాల కోసం వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం మ్యాప్ మార్పు

2026 మే 27 ఒడిశా ప్రభుత్వం కొన్నేళ్లుగా తన బాక్సైట్ నిల్వలపై కన్నేసింది. దానికి ఒక ముఖ్యమైన అడ్డంకి ఎదురైంది. అదే, అత్యంత విలువైన ఆ బాక్సైట్ నిల్వల పైన ఉన్న అడవులు. రక్షిత ప్రాంతాలను తవ్వకాలకు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వన్యప్రాణి సంరక్షణ మండలి ఎలా కలిసి పనిచేశాయో మా పరిశోధన వెల్లడిస్తుంది. [సంపాదకీయ గమనిక: బాక్సైట్‌పైన ఒడిశా ప్రభుత్వానికి ఉన్న ప్రేమను, ఆ బాక్సైట్ నిల్వలపైన నివసిస్తున్న ఆదివాసీ సముదాయాలపైన ఉన్న ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. కార్లపట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉన్న బాక్సైట్ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి, ఆ క్రమంలో