కొత్త పుస్తకం

ఒక సమాజ పతనాన్ని అద్దంలో చూపిన కథలు

మనలో చాలా మందిమి మన చుట్టూ కమ్ముకుని ఉన్న విషాదాన్ని తప్పించుకు తిరిగే ప్రయత్నం చేస్తుంటాం. ఆలోచనల్ని ఒక మేరకు మొద్దుబార్చి, నిద్రపుచ్చి, రేపటి కలలేవో కంటాం. అంతఃశ్చేతన పీడకలలా కలవరపెడుతుంది. ఉలిక్కిపడేలా చేస్తుంది. అయినా సంక్షోభం మనదాకా రాలేదని అనుకుంటాం. మన ఎదుట నడుస్తున్న ఒక అసంబద్ధ నాటకాన్ని చూసి నవ్వుతుంటాం. కానీ అందులో మనమూ  పాత్రధారులమే అన్న విషయాన్ని గుర్తించలేకపోతాం. నిజానికి అదే పెద్ద విషాదం. దానిని గుర్తించినప్పుడు మనమిక నవ్వలేం. బహుషా ఏడవలేక నవ్వుతామేమో. ఒక నిస్సహాయ స్థితిలో, భరించలేని మానసిక ఒత్తిడిలో, బాధను, భయాన్ని, ఆందోళనను తట్టుకోడానికి మన మీద మనమే జోకులేసుకుని
కవిత్వం

మౌమితా ఆలం డిల్లీ కవితలు!

1. *సామ్రాజ్యాలు పతనం చెందాల్సిందే*! మౌమితా ఆలం.....రెడ్ ఫోర్ట్ లో ఔరంగజేబు తన తండ్రిని బంధించిన జైలుని చురుకైన గైడ్ ఒకడు వివరిస్తున్నాడు! సరిగ్గా జాలీ ల వెనక పరిపక్వమైన సూర్యాస్తమయం లోకి మునిగి పోతున్న తాజ్ మహల్ అందంతో సహా!నేను అతనికి 300 రూపాయలు ఇచ్చి నమస్కారం పెట్టేసాను! ~~అతను వెంటనే *జైశ్రీరామ్* అన్నాడు. ఇక నేను నా పేరుని పైకి చెప్పలేక పోయాను. అది విన్నదో ఏమో మరి ? దివాన్ -ఏ -ఖాష్ లోపల రాజు విరిగిన కిరీటం మీద అప్పుడే ఒక పావురం మలవిసర్జన వదిలి రివ్వున ఎగిరిపోయింది! ఆ క్షణంలో నాకు
వ్యాసాలు

భారత జెన్ – జెడ్ యువత ప్రయాణం ఎటువైపు…?

 మే 15వ తేదీన సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ దేశ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారతీయ యువతలో అసంతృప్తి ప్రకంపనలు సోషల్ మీడియాలో పుట్టించాయి. అతని వ్యాఖ్యలు  ఈ దేశం యువతను సోమరిపోతులు గాను, బద్దకస్తులుగాను చెబుతూ, వారిని బొద్దింకలతో పోల్చారు. దీనికి  స్పందనగా మే- 16న "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో సోషల్ మీడియాలో ఈ దేశ యువత మరియు విదేశాల్లో ఉన్న భారతీయ యువకులు పెద్ద ఎత్తున నిరసన తెలియ జేశారు. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ, పాలక ఎన్. డి.
ఆర్ధికం

భారత్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం

పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి! ఇది యాధృచ్ఛికం కాదు. విధానపర మైన నిర్లక్ష్యం దౌర్బ‌ల్యం. అంత‌కు మించి ఆర్థిక నిర్వహణలో వైఫల్యం. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధ‌రలు తగ్గినా, ఆ లాభం వినియోగదారుడికి చేరట్లేదు. పెరిగితే మాత్రం వెంటనే ప్ర‌జ‌ల‌పై భారం మోపబ డుతున్న‌ది. ఇది మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానం. దాంతో రోజు రోజుకు తీవ్రతరం అవుతు న్న సంక్షోభ కారుమేఘాలు దేశ గగనతలంపై కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగం విజృంభించి, వేత నాల ప్రతిష్టంభన ఏర్ప‌డింది. ఈ జంట సంక్షోభాలు ఉండగా అదనంగా యుద్ధం వల్ల ధరల పెరుగు దల  హడలగొడుతున్నాయి.  కొంత
వ్యాసాలు

సమాధానమివ్వని భోజ్‌శాల తీర్పు

2026 మే 24 మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక తీర్పులో 700 సంవత్సరాల నాటి మసీదును హిందూ దేవత సరస్వతి ఆలయంగా ప్రకటించింది. కోర్టు ఆదేశాల మేరకు పురాతత్వ సర్వే సంస్థ (ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా- ఎఎస్‌ఐ) నిర్వహించిన గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జిపిఆర్) సర్వేలో—ధార్‌లోని మొదటి జామా మసీదు (సమూహ ప్రార్థనా మందిరం) అయిన 14వ శతాబ్దపు హైపోస్టైల్ (స్తంభాల) మసీదు, కమల్ మౌలా మసీదును—ఇదివరకు అక్కడ ఉన్న ఒక ఆలయంపైన నిర్మించారని పేర్కొంది. భోజ్‌శాల (11వ శతాబ్దపు పరమార రాజు భోజుని మందిరం) అనే ఆధునిక తప్పుడు పేరుతో ప్రాచుర్యం పొందిన ఈ
వ్యాసాలు

భారతదేశాన్ని హిందూ వ్యవస్థే పాలిస్తోంది

2026 మే 18 తరచుగా జరుగుతున్నట్లే, చారిత్రాత్మక కమల్ మౌలా మసీదు ఒక హిందూ దేవతకు అంకితం చేసిన దేవాలయమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది’. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌లో ఉన్న కమల్ మౌలా మసీదు 78 ఏళ్ల మహమ్మద్ రఫీక్‌కు మరో ఇల్లు. రఫీక్ 50 ఏళ్లుగా ఆ మసీదులో ముస్లింలను ప్రార్థనకు పిలిచే ముఅజ్జిన్‌గా ఉన్నారు. అతనికి ముందు 1947లో భారతదేశానికి బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం రాకముందే అతని తాత హాఫిజ్ నజీరుద్దీన్ ప్రార్థనలను నిర్వహించేవారు. కానీ పురావస్తు ప్రాముఖ్యత కలిగిన, సంరక్షిత స్మారక చిహ్నమైన భోజ్‌శాల సముదాయంలోని మసీదులోకి ఇప్పుడు ధార్‌లోని
వ్యాసాలు

ప్రభుత్వ విద్య వెనుకబాటును గుర్తించిన తెలంగాణ విద్యా కమీషన్

తెలంగాణ సర్కారు ఏడాదిన్నర క్రితం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అకునూరి మురళి, ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వరరావు మరియు ఇద్దరు సభ్యుల ఆద్వర్యంలో తెలంగాణ విద్యా కమీషన్ ను ఏర్పాటు చేసింది.   ఈ కమిషన్ తన అధ్యయనంలో రాష్ట్రంలో విద్యా వెనుకబాటును‌ స్పష్టంగా గుర్తిస్తూ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అదే సమయంలో ప్రస్తుతం విద్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి విద్యారంగం వెనుకబాటు నుండి బాగు చేయడానికి పలు సిఫార్సులు చేసింది. కేంద్రంలో ఎన్డిఏ సర్కారు రూపొందించిన నూతన విద్యా విధానం-2020లోని అశాస్త్రీయ విధానాలు తిరస్కరించాలని, ఉచిత
వ్యాసాలు

నక్సల్బరీ: రాజ్యాధికార భావన

(నక్సల్బరీ  వార్షికోత్సవం సంద‌ర్భంగా మే 24న పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక హైద‌రాబాదులో నిర్వహించిన  మ‌ర‌ణ‌మే లేదంది నక్సల్బరీ స‌ద‌స్సు ప్రసంగ ప‌త్రం - వసంత‌మేఘం టీం) నక్సల్బరీ అనేది ఒక ఊరు పేరు మాత్రమే కాదు. అది కేవలం రైతుల తిరుగుబాటు కూడా కాదు. తీవ్రతలో గాని, దీర్ఘకాలికతలో గాని అది మహత్తర తెలంగాణ రైతాంగ తిరుగుబాటుతో కూడా పోల్చదగినది కాదు. కానీ అది ప్రైరీ అగ్ని లాంటి ఆర్పలేని అగ్నిని సృష్టించింది. అయితే నక్సల్బరీ పోరాటాన్ని భారత రాజ్య యంత్రాంగం అనతి కాలంలోనే అణచివేసింది. మహత్తర శ్రీకాకుళ పోరాటం కూడా ఓడిపోయింది. బీహార్ లోని అగ్రకుల
సంపాదకీయం

అభివృద్ధి వెలుగులో పర్యావరణ సంక్షోభం

‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అని గురుజాడ అన్నారు. దేశమంటే మనిషి కాదు మట్టి అన్నది నేటి ప్రభుత్వాల మాట. మట్టి అంటే మట్టిలో దాగి ఉన్న ఖనిజ సంపద అని. ఖనిజ వనరులతో అభివృద్ది చెంది అగ్రదేశం అవుతాం అని చెబుతారు. అభివృద్దిలో మనిషి ఉండడా అనే సందేహం పెట్టుకోకండి. అభివృద్దిలో లెక్కలు, లాభాల అంచనాలు మాత్రమే ఉంటాయి. లాభాల వేటలో మనుషులు, చెట్లు, జంతువులు, నీరు, గాలి అనే జీవావరణం పోగా  లాభాలు మిగులుతున్నాయి. ఈ లాభాల వేటలో ఏమి కోల్పోతున్నామో నాగరిక మానవుడు తెలుసుకోలేని స్థితిలోకి నెట్టబడ్డాడు.                   ఈ లాభాల వేటలో