వ్యాసాలు

ప్రభుత్వ విద్య వెనుకబాటును గుర్తించిన తెలంగాణ విద్యా కమీషన్

తెలంగాణ సర్కారు ఏడాదిన్నర క్రితం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అకునూరి మురళి, ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వరరావు మరియు ఇద్దరు సభ్యుల ఆద్వర్యంలో తెలంగాణ విద్యా కమీషన్ ను ఏర్పాటు చేసింది.   ఈ కమిషన్ తన అధ్యయనంలో రాష్ట్రంలో విద్యా వెనుకబాటును‌ స్పష్టంగా గుర్తిస్తూ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అదే సమయంలో ప్రస్తుతం విద్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి విద్యారంగం వెనుకబాటు నుండి బాగు చేయడానికి పలు సిఫార్సులు చేసింది. కేంద్రంలో ఎన్డిఏ సర్కారు రూపొందించిన నూతన విద్యా విధానం-2020లోని అశాస్త్రీయ విధానాలు తిరస్కరించాలని, ఉచిత
వ్యాసాలు

భారతదేశాన్ని హిందూ వ్యవస్థే పాలిస్తోంది

2026 మే 18 తరచుగా జరుగుతున్నట్లే, చారిత్రాత్మక కమల్ మౌలా మసీదు ఒక హిందూ దేవతకు అంకితం చేసిన దేవాలయమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది’. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌లో ఉన్న కమల్ మౌలా మసీదు 78 ఏళ్ల మహమ్మద్ రఫీక్‌కు మరో ఇల్లు. రఫీక్ 50 ఏళ్లుగా ఆ మసీదులో ముస్లింలను ప్రార్థనకు పిలిచే ముఅజ్జిన్‌గా ఉన్నారు. అతనికి ముందు 1947లో భారతదేశానికి బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం రాకముందే అతని తాత హాఫిజ్ నజీరుద్దీన్ ప్రార్థనలను నిర్వహించేవారు. కానీ పురావస్తు ప్రాముఖ్యత కలిగిన, సంరక్షిత స్మారక చిహ్నమైన భోజ్‌శాల సముదాయంలోని మసీదులోకి ఇప్పుడు ధార్‌లోని
వ్యాసాలు

భారత జెన్ – జెడ్ యువత ప్రయాణం ఎటువైపు…?

 మే 15వ తేదీన సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ దేశ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారతీయ యువతలో అసంతృప్తి ప్రకంపనలు సోషల్ మీడియాలో పుట్టించాయి. అతని వ్యాఖ్యలు  ఈ దేశం యువతను సోమరిపోతులు గాను, బద్దకస్తులుగాను చెబుతూ, వారిని బొద్దింకలతో పోల్చారు. దీనికి  స్పందనగా మే- 16న "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో సోషల్ మీడియాలో ఈ దేశ యువత మరియు విదేశాల్లో ఉన్న భారతీయ యువకులు పెద్ద ఎత్తున నిరసన తెలియ జేశారు. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ, పాలక ఎన్. డి.
సంభాషణ

చలం – రచన ప్రపంచంలో ఓ ‘చుక్కమ్మ’

ఎక్కడో ఛత్తీస్‌ఘడ్ అడవిలో ఒక చెట్టుకింద కూర్చున్న నాకు చలం పరిచయమయ్యాడు. అక్కడ సిగ్నల్ ఉండదని ముందే యూట్యూబ్  కొన్ని వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాను.   వాటిల్లో  చలం రచనలు అని ఇరవై రెండో ఇరవై మూడో ఎపిసోడ్లు కూడా ఉన్నాయి.   అప్లోడ్ చేసిన వాళ్ళు సరిగా గుర్తులేరు కౌముది అనుకుంటా. అవన్నీ వింటూ వింటూ చలం పరిచయం అయ్యాడు. మొదట అందులో నేనూ విన్నది కూడా  ప్రేమలేఖలు అనే వీడియో.  అప్పుడు నాకు విరహం కూడా ఎక్కువే ఉండేది.  కుటుంబాల మీద కాదు!  అక్కడి నుంచి నాకు చలం అలవాటు అయ్యాడు.  నేను సాహిత్య ప్రపంచంలోకి రావడానికి ఒక
రిపోర్ట్

బాక్సైట్ తవ్వకాల కోసం వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం మ్యాప్ మార్పు

2026 మే 27 ఒడిశా ప్రభుత్వం కొన్నేళ్లుగా తన బాక్సైట్ నిల్వలపై కన్నేసింది. దానికి ఒక ముఖ్యమైన అడ్డంకి ఎదురైంది. అదే, అత్యంత విలువైన ఆ బాక్సైట్ నిల్వల పైన ఉన్న అడవులు. రక్షిత ప్రాంతాలను తవ్వకాలకు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వన్యప్రాణి సంరక్షణ మండలి ఎలా కలిసి పనిచేశాయో మా పరిశోధన వెల్లడిస్తుంది. [సంపాదకీయ గమనిక: బాక్సైట్‌పైన ఒడిశా ప్రభుత్వానికి ఉన్న ప్రేమను, ఆ బాక్సైట్ నిల్వలపైన నివసిస్తున్న ఆదివాసీ సముదాయాలపైన ఉన్న ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. కార్లపట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉన్న బాక్సైట్ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి, ఆ క్రమంలో
ఆర్ధికం

భారత్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం

పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి! ఇది యాధృచ్ఛికం కాదు. విధానపర మైన నిర్లక్ష్యం దౌర్బ‌ల్యం. అంత‌కు మించి ఆర్థిక నిర్వహణలో వైఫల్యం. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధ‌రలు తగ్గినా, ఆ లాభం వినియోగదారుడికి చేరట్లేదు. పెరిగితే మాత్రం వెంటనే ప్ర‌జ‌ల‌పై భారం మోపబ డుతున్న‌ది. ఇది మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానం. దాంతో రోజు రోజుకు తీవ్రతరం అవుతు న్న సంక్షోభ కారుమేఘాలు దేశ గగనతలంపై కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగం విజృంభించి, వేత నాల ప్రతిష్టంభన ఏర్ప‌డింది. ఈ జంట సంక్షోభాలు ఉండగా అదనంగా యుద్ధం వల్ల ధరల పెరుగు దల  హడలగొడుతున్నాయి.  కొంత
వ్యాసాలు

నేను శ్వాసిస్తుంది పుస్తకంతోనే – డా.తండ హరీష్ గౌడ్

డా.తండ హరీష్ గౌడ్ మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు ప్రాంతానికి చెందిన కవి. నీటీదీపం, ఇన్బాక్స్, గాలిలేని చోట, వంకతాడు నాలుగు కవితా సంపుటాలు,'పిట్టగూడు' దీర్ఘ కవిత వెలువరించారు. 1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి? నా చిన్నప్పటి పాఠ్యపుస్తకాల్లో ఉన్న తెలుగు పాఠ్యాంశాలే మొదటగా నన్ను ప్రభావితం చేశాయి.'పిలుపు' అనే పాఠం ద్వారా తిలక్  పరిచయం అయ్యారు. శైశవగీతితో శ్రీశ్రీ పరిచయమయ్యారు. 'తామసి' పాఠంతో దాశరథి కృష్ణమాచార్యులు పరిచయమయ్యారు.ఆ తర్వాత కాలంలో వాళ్ళ పుస్తకాలను వెతుక్కొని చదివాను. పాఠశాలలో చదువుకునే రోజుల్లో పాటలు పాడేవాన్ని. అక్కడ పింగిళి శ్రీనివాస్ గారు ప్రోత్సాహమిచ్చారు. దేశభక్తి
వ్యాసాలు

సమాధానమివ్వని భోజ్‌శాల తీర్పు

2026 మే 24 మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక తీర్పులో 700 సంవత్సరాల నాటి మసీదును హిందూ దేవత సరస్వతి ఆలయంగా ప్రకటించింది. కోర్టు ఆదేశాల మేరకు పురాతత్వ సర్వే సంస్థ (ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా- ఎఎస్‌ఐ) నిర్వహించిన గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జిపిఆర్) సర్వేలో—ధార్‌లోని మొదటి జామా మసీదు (సమూహ ప్రార్థనా మందిరం) అయిన 14వ శతాబ్దపు హైపోస్టైల్ (స్తంభాల) మసీదు, కమల్ మౌలా మసీదును—ఇదివరకు అక్కడ ఉన్న ఒక ఆలయంపైన నిర్మించారని పేర్కొంది. భోజ్‌శాల (11వ శతాబ్దపు పరమార రాజు భోజుని మందిరం) అనే ఆధునిక తప్పుడు పేరుతో ప్రాచుర్యం పొందిన ఈ
కవిత్వం

‘నక్సల్బరీ’ నిరంతర వసంతం…

చరిత్ర పుటల నిండా.. వర్గపోరాట గాయాలే!తిరుగుబాటు పిడికిలి బిగించనిదే.. ఏదీ సిద్ధించదు.కష్టాల కడలిలో కన్నీటి పయనం మానవ జీవనం,క్షణికమైన సుఖాల వెనుక.. శాశ్వతమైనది ఏదీ లేదు.అడవి మూగబోయింది.. చెట్లు మౌనం దాల్చాయి,కానీ.. జ్ఞాపకాల కొలిమిలో సెగలు ఇంకా రగులుతున్నాయి!జీవితం పరిమితమే కావచ్చు.. కానీ ఆశయం అనంతం.యుద్ధం అంటే ముగింపు కాదు.. అది కేవలం విరామం మాత్రమే!వసంతానికి మరణం లేదు.. అది మళ్ళీ పురుడు పోసుకుంటుంది,నక్సల్బరీ గుండె చప్పుడుకు.. అసలు అంతమే లేదు!
పత్రికా ప్రకటనలు

ఎబివిపి మూకదాడితోనే విద్యార్థి మరణం

ఎబివిపి హింస,వర్శిటీ యాజమాన్యం మౌనం ఒక విద్యార్థి ప్రాణాన్ని  తీసింది. మే 17 రాత్రి, ఎబివిపి అనుబంధ విద్యార్థులు మరియు స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎఫ్-హాస్టల్ ముందు గుంపుగా చేరారు. ఒక విద్యార్థి ల్యాప్‌టాప్‌లు దొంగిలించాడనే ఆరోపణలపై వెంటనే చర్య తీసుకోవాలనేదే ఈ గుంపు సమీకరణానికి చెప్పిన కారణం.అయితే, ఆ గుంపు త్వరలోనే అత్యంత మూక దాడి స్వభావంతో మారి,ఆ విద్యార్థిని తమ అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడికి పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన ఒక దళిత అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ASO) పై కూడా దాడి చేసి, అందరి ముందూ దూషణలు చేస్తూ