ఒక్కో ఇటుక పేర్చుకుంటూ
కట్టిన నాలుగు గోడలు
కూలిపోయే తరుణం ఆసన్నం
నలుదిక్కులా బీటలు వారుతున్నాయి
ప్రతి ఇటుకలో
మతం కులం విషం నింపి
కాంక్రీట్ కన్నా పటిష్టం గా కట్టిన గోడలు
విషం విరిగి పడి పోతున్నాయి
నిచ్చెన మెట్ల పాచికలు పారట్లేదు
నరనరాన ఎక్కిన అహంకారం మాటున
అత్యాచారాలెన్నో అలవోకగా
ప్రార్థనా మందిరాల సాక్షిగా
బహిరంగంగా నిస్సిగ్గుగా
ఇక సాగవనే హెచ్చరిక నగర వీధుల్లో
ప్రతిధ్వనిస్తుంది
బారికేడ్లను వేదికలుగా చేసుకుని
తిరగబడుతున్న గొంతులు
గద్దెల కూసాలను కదిలిస్తున్నాయి
మరో స్వరాజ్య సమరం!
శక్తులన్నీ ఏకం! ప్రజాస్వామ్యం మనుగడ కి జీవం!!




