నిజానికి ఒక వేటు ఎప్పుడూ ముందు సిఎల్సి మీద విరసం మీద పడుతూ ఉంటుంది. తర్వాత మిగతా సమూహాలన్నీ వస్తూ ఉంటాయి. ఇది రేవంత్ రెడ్డి ఇచ్చినటు వంటి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటు వంటి ఏడో హామి. వర్ధిల్లుతోంది అని చెప్పి నేను నిన్నగాక మొన్న పెట్టాను. చాలా చిన్న చిన్న విషయాలు దృష్టిలోకి కూడా రావు. ఇప్పుడు ఇది విరసం సభ కాబట్టి మనందరి దృష్టిలోకి వచ్చింది.
ఒక 18 ఏళ్ళ అమ్మాయి తన తల్లితో గొడవపడి గొడవ అంటే వాళ్ళ అమ్మ పెళ్లి చేస్తానంది,ఈ అమ్మాయి పెళ్లి చేసుకోను అన్నది. అది పోలీసుల వరకు వెళ్ళింది. ఆ అమ్మాయిని పోలీసులు స్టేషన్ లో కూర్చోబెట్టి నువ్వు ఇన్స్టాగ్రాం వాడతావా అంటూ చెంపలు పగలగొట్టారు. నీకేమి ఒళ్ళు కొవ్వెక్కిందా లేక పోతే బాయ్‌ఫ్రెండ్స్ కావాలా అనీ. ఇక్కడే మన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంట్ అది పోలీస్ స్టేషన్ వరకు రాదగిన సమస్య కాదు సరే వచ్చింది. ఆ అమ్మాయి మేజర్. వాళ్ళు మీ అమ్మ మాట నువ్వు ఎందుకు వినవు అని అడగటంలో ఓకే. ఇన్స్టాగ్రాం ఎందుకు వాడుతున్నావు అని చెప్పి కొట్టడం ఏంది?
లగచర్లలో మేము ఫాక్ట్ ఫైండింగ్ కి వెళ్ళాము. అక్కడ ఏం జరిగింది అని తెలుసుకోవడానికి, మహిళా కార్యకర్తలం వెళ్ళాము వెళ్ళింది ఓ పది మందిమి. ప్రొఫెసర్స్ ఉన్నారు జర్నలిస్టులు ఉన్నాము యాక్టివిస్టులు ఉన్నారు. మా కళ్ళెదుట సిఐ బట్టలు చింపండి అని చెప్పాడు. మాకు అర్థం అవుతున్నది. అతను ఇస్తున్నటు వంటి డైరెక్షన్. మాతోనేమో మేడం మేడం. మేడం మీరు ఆగండి అంటూనే ఉన్నాడు. వాళ్ళకి ఏందమ్మా మీకు బాగా బలిసిందా అని ఇట్లాంటి మాటలు మాట్లాడు తున్నాడు. ఏం చేయాలో తెలియదా? లాగండి గుంజండి అని, అంటే ఏం లాగాలి మనిషిని లాగాలా బట్టలు లాగాలా!! వాళ్ళకర్థమైంది. ఆ సిగ్నల్ ఏంటో చింపారు, లిట్రల్‌గా సంధ్య బట్టలు చింపారు. బహుశా అక్కడ అడ్డుపడకుంటే ఇంకా మావి కూడా చింపేవాళ్ళు కానీ ముందు వరుసలో తను ఉంది కాబట్టి, తన బట్టలు కావాలని చింపారు. తోపులాటలో చిరిగింది అని అనుకోవడానికి లేదు. అది పోలీసు వ్యవస్థ కావాలని చేసింది.అందాల పోటీల్లో నిరసన తెలియ జేస్తున్నందుకు కాలు మెలి తిప్పారు. ఇవి యాక్సిడెంటల్ గా జరుగుతున్నవి కాదు. కావాలని లిట్రల్ గా ఏ నరం నొక్కితే ఏ లిగమెంట్ తెగుతుంది అని తెలిసి నొక్కారు. పట్టించుకోలేదు ఎవ్వరూ. రాజకీయ పార్టీలు కూడా పట్టించు కోలేదు. ఆరోజు తప్పు ఇటువైపు కూడా ఉంది. ఇందాక తను చెప్పారు కదా! మనం కూడా కొన్ని చూసి చూడనట్టు వెళ్తూ ఉంటాము. మనకు ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా అవతల ఆఖరికి మనల్ని విమర్శించే, మనల్ని ట్రోలింగ్ చేసేటువంటి బిజెపీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు. ఆ మహిళల మీద కూడా అసభ్యంగా మాట్లాడటానికి వీలు లేదనే చెప్తాం. మేమైతే అదే చెప్తాం.
వాళ్ళు మనల్ని అన్నారని మనం తిరిగి అదే భాషలోకి వెళ్ళాల్సిన అవసరంలేదు. కానీ ట్రోలింగ్ విచ్చలవిడి తనంలోకి వెళ్ళింది. రాజకీయ పార్టీలంటేనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఈరోజు చెప్పినటువంటి ప్రమాణం రేపు ఉండదు కానీ ఒక రాజకీయ నాయకురాలిని అంత రఫ్ గా ఎందుకు బిహేవ్ చేశారనేది నాకు ఇప్పటికి అర్థం కాలే.
నాకేమి కల్వకుంట్ల కవిత మీద పెద్ద ప్రేమ లేదు అంటే ఆమె ఒక రాజకీయ నాయకురాలు. బూర్జువా రాజకీయ పార్టీ అని అనుకుంటాం కానీ అవసరమైన చోట వాళ్ళు మాట్లాడాల్సిన చోట మాట్లాడేటట్టే చేస్తాం. ఇదంతా కేసిఆర్ ప్రభుత్వంలో జరిగిన లెక్క వేరే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల మీద ఇప్పుడు జరుగుతున్నాయి చెప్తున్నాను. ఈ అన్నింటికీ సంబంధం ఉంది. కచ్చితంగా సంబంధం ఉంది. ఎవరు ఎందుకు మాట్లాడకూడదు అనేదానికి లెక్కలు ఉన్నాయి. పూర్తిగా ఒకళ్ళని ఒక దెబ్బతో కొడతారు. మహిళలు మాట్లాడుతుంటే అంగాన్ని తీసుకొచ్చి బహిరంగంగా పెడతారు. ఎంత స్థాయికైనా ఎంత వల్గర్ స్థాయికైనా తీసుకెళ్ళ గలిగినటువంటి ట్రోలింగ్ నడుస్తోంది. నేను ఆరోజు బాల్ రెడ్డి గారి మలుపు పుస్తకం ఆవిష్కరణ లోనే చెప్పాను ఇట్లా జరుగుతోంది. మాట్లాడదాము అని. చెప్పినా అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే సమాజానికి అర్థం కాలేదు. మనం ఏ పౌర సమాజం అని అనుకుంటున్నామో ఆ పౌర సమాజానికి దాని ఇంటెన్సిటీ అర్థం కాలేదని నాకు బాధ. ఎందుకు అర్థం కాలేదు అనేటటువంటిది లోపమా కాదా? అనేది కాదు. మనం ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నాం. జరుగుతున్న వాటికి, అంటే హింస అత్యున్నత స్థాయిలో కనిపిస్తేనే హింస కాదు, హింస అనేది చాలా రకరకాలుగా ఒక్కొక్కళ్లని ఒక్కొక్క విధంగా గొంతు పిసుకుతున్నటు వంటి సందర్భంలో …
అది ఎక్కడదాకా వెళ్తోంది అనేటటు వంటి దాంట్లో ఇది ఓ అల్టిమేటం. కేసిఆర్ గవర్నమెంట్ ధర్నా చౌకును మూసేసిందనే కదా నెల రోజుల పాటు సిపిఐ ఆఫీస్ లో కూర్చుని మనము ధర్నాలు చేసి, దాన్ని మళ్లీ తెరవ గలిగాము. చాలా కష్టపడాల్సి వచ్చింది…దాని ప్రాధాన్యం దృష్ట్యా. ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఉండేటటు వంటి పాలసీ ఏంటో మనకు ఇప్పటివరకు అర్థం కాలే. మనం ఏమనుకుంటున్నాము అది సిపిఎం వాళ్ళది. కానీ సిపిఎం వాళ్ళు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ గా నడుపుతున్నటు వంటి కేంద్రం అది. దానికి ఉండేటటువంటి పరిమితులు ఏంటి అనేటువంటిది మనకు అర్థమైతే, మనము అక్కడ పెట్టుకోవాలా వద్దా అనేది మనకు అర్థమవుతుంది. అసలు వాళ్ళు ఆ సెంటర్ ని దేని కింద రిజిస్టర్ చేశారు పార్టీ కింద కాదు గుర్తు పెట్టుకోండి! అది మనం గుర్తుపెట్టు కుంటే వాళ్ళ పరిమితుల్ని ఎట్లా చూడాలో విమర్శించాలో తెలుస్తుంది. కచ్చితంగా నువ్వు ఒక పార్టీగా ఉండి ఒక సెంటర్ ని నడుపుతూ ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటి అనేది క్వశ్చన్ చేయడం చాలా అవసరం.
మనం ప్రత్యామ్నాయం వెతుక్కోక పోవడం కూడా మన లోపం. మన ప్లేసెస్ ని మన పోరాట మార్గాలని కూడా ప్రత్యామ్నాయం వైపు తీసుకెళ్ళలేక పోవడం. అది ఆలోచిద్దామని నేననుకుంటున్నాను. చాలా సీరియస్ గా. ఎందుకు అని అంటే ఒక మీటింగ్ పెట్టుకోలేక పోవడం. ఈరోజు ఒక విరసం పెట్టుకోలేక పోతుందని అంటే రేపు నాలాంటి వాళ్ళము రైతు, రైతు ఆత్మహత్యల మీద పని చేసేవాళ్ళమో లేకపోతే స్త్రీల హక్కుల కోసమో పని చేసేటువంటి వాళ్ళమూ మావి చాలా చిన్న ఆచరణలు. చిన్న అంశాల మీద పని చేస్తాం. వాటి మీద కూడా పెట్టుకునే అవకాశం ఉండదు.
నిన్న ఒక మాట ఒక మా ట్రాన్స్‌జెండర్ సిస్టర్ చెప్పింది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో జరగబోతున్న దాంట్లో ఏం చేస్తారు? ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళందరినీ ఏం చేస్తారు, ఎవరు ఏం కోల్పోతారు?అతి సామాన్యులే కోల్పోతారు. నీకు ఎస్ఐఆర్ లో ఇప్పుడు జరుగుతున్నటు వంటి దాంట్లో నీ ఓటు హక్కు పోతే నీకు వచ్చేటువంటి ఆ 2000 పెన్షన్ రాదు. ఎవరికి రాదు? 2000 పెన్షన్ అర్హమైనటు వంటి పేద ప్రజలకి ఆ అవకాశం ఉండదు. వాళ్లకు అన్నీకట్అవుతాయి. అనేది ఇంక్లూడింగ్ రిటైర్డ్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కి కూడా అన్ని రకాలు కట్ అవుతాయి. అది అర్థం కావడం లేదు మనకు. తను ఏమన్నదంటే ఏం చేస్తారు ఇప్పుడు నేను ఒక ట్రాన్స్‌జెండర్ ని. నా పేరు ఒకటి ఉన్నది నా పేరెంట్స్ ఉన్నారు. కానీ మాకు అసలు రిజిస్టర్ లేదు. మేము ఇప్పుడు ఏమవుతాం! గ్యాస్ ఛాంబర్స్ లో వేసి చంపేస్తారా? అని అడిగింది. గ్యాస్ చాంబర్ ఒక ప్రతీక కానీ ఇప్పుడు గ్యాస్ చాంబర్ లేకుండానే చంపేసేటువంటిది ఇది. మనకి ఒక సూది మొనతో గుచ్చారు అంతే నా ఉద్దేశంలో మీటింగ్ పెట్టుకోక పోవటం అనేటు వంటిది ఒక సూది మొనతో గుచ్చటం. నెప్పి తగులుతుందా లేదా అనేది ఇంతకంటే పెద్ద ప్రమాదాలు రాబోతున్నాయన్నట్టు.
ఇప్పుడు విప్లవం అనే పేరు ఎందుకు ఉంది అన్నారు. పాపం విప్లవశ్రీ ఏమవుతుందో తన పేరే అది కదా! కదా మరి, అంటే అసలు విప్లవం అనేటువంటి పేరే ఉండకూడదు. అనేంత స్థాయికి వెళితే గనుక మనం ఏం చేస్తాం. మనం ఎట్లా దాన్ని ఆలోచించ గలుగుతాము. నాకు కూడా తెలియదు. నేను అందరితో పాటే ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఏమైనా సరే ! రేవంత్ రెడ్డి గారికి ఇది చాలా స్పష్టంగా చెప్పాల్సి నటువంటి అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటి పోలీసు వ్యవహారంతో రాష్ట్రాన్ని ఒక పోలీసు రాష్ట్రంగా మార్చాలని చేస్తే గనుక, భవిష్యత్తు మన భవిష్యత్తు ఏమవుతుంది? అనేదాని పక్కన ఆయన భవిష్యత్తు ఉండదా? అనేది కూడా తెలియాలి కదా… ఆయనకి, థాంక్యూ!
5/7/2026 విరసం ప్రెస్ మీట్లో
కె.సజయ గారి ప్రసంగం…




