సాహిత్యం వ్యాసాలు

మనిషితనంపై విశ్వాసంతో

(ఇటీవల విడుదలైన బాల సుధాకర్ మౌళి కథా సంపుటికి రాసిన ముందుమాట) కవిగా ప్రసిద్ధుడైన బాల సుధాకర్  మౌళి యిప్పుడు కథకుడిగా మన ముందుకు వస్తున్నాడు. కవిత్వం కథ ఈ రెండింటికి పోటీ పెట్టి యెక్కువ తక్కువల్ని  అంచనా వేయడం తప్పే గాని రెండు సృజనాత్మక వ్యాసంగాల్నీ ఒకే  రచయిత నిర్వహిస్తున్నప్పుడు ఆ వ్యక్తికున్న కవిత్వ అభివ్యక్తి కథనం నైపుణ్యం వొకదాన్ని మరొకటి యెలా ప్రభావితం చేసుకుంటాయి అన్న అధ్యయనం ఆసక్తి గొలుపుతుంది, విమర్శలో కొత్త ఆలోచనలకు సంవిధానానికి దారులు వేస్తుంది.  కథలో కవిత్వ చ్ఛాయలు కథకు వన్నె తెస్తాయి. అలాగే కవిత్వంలో వినిపించే అనుభూతి కథను తాకితే
వ్యాసాలు

అదానీ బొగ్గు గనుల విస్తరణ- అధికారుల ప్రయత్నం  

అదానీ నిర్వహించే బొగ్గు గనుల కోసం మరో అటవీ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు, అదానీ ఉద్యోగులు కలిసి హస్‌దేవ్ అడవుల గ్రామాలపై మరోసారి దాడి చేశారు. స్థానిక అధికారులు స్థానిక ప్రజల నుండి మైనింగ్ కోసం అధికారిక సమ్మతిని పొందటానికి ప్రయత్నించినప్పుడు గందరగోళం గందరగోళ స్థితి ఏర్పడింది. అధికారులు పదే పదే కేకలు వేయడంతో పథకం బెడిసికొట్టింది. మరోవైపు, సమీపంలోని ప్రతిపాదిత బొగ్గు గనిపై పని తాత్కాలికంగా నిలిపివేశారు; ఈ ప్రాంతంలోని ఆదివాసీ నివాసితుల ఫిర్యాదును రాష్ట్ర కమిషన్ వింటుంది. సంబంధిత బొగ్గు ప్రాజెక్టులు: అదానీ యాజమాన్యంలోని పార్సా ఈస్ట్ కెంటే బసాన్ బొగ్గు గని
వ్యాసాలు

2010 రోజుల ఏకాంత వాసం

 జమ్ము, కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని జైళ్లలోఐదు సంవత్సరాలకు పైగా  2010 రోజులు..  జైలులో వున్న కశ్మీర్ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్ గాథ  2024 ఫిబ్రవరి29 న,  ఇంటికి తిరిగి వచ్చారు . అప్పుడు   ఆసిఫ్ సుల్తాన్ ఆరేళ్ల కుమార్తె అరీబా తన తండ్రిని మొదటిసారిగా స్వేచ్ఛాయుత వ్యక్తిగా చూసింది. అంతకుముందు, శ్రీనగర్ సెంట్రల్ జైలు జాలీ గోడ వెనుక చేతికి సంకెళ్లతో కటకటాల వెనుక వున్నప్పుడు చూసింది. ఆ తరువాత  ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా జైలుకు, ఆపై జమ్మూలోని కోట్ భల్వాల్ జైలుకు తరలించారు. "అరీబాకి తన తండ్రిని మొదటిసారి చూసినట్లు అనిపించింది" అని ఆసిఫ్ 67 ఏళ్ల
వ్యాసాలు

యుద్ధం మధ్య మనం…,

... కానీ మనకు ఆ సంగతి తెలియదు. యుద్ధం జరుగుతూనే ఉన్నది. సరిగ్గా ఫాసిస్టు కాలంలో జరుగుతున్న యుద్ధం ఇది. జర్మనీలో  గ్యాస్‌ ఛాంబర్స్‌ గురించి విన్నాం. ఇటలీలో బ్లాక్‌ షర్ట్స్‌ గురించి విన్నాం. జనంలోంచే ఉన్మాద మూకను కూడగట్టి సమాజం మీదికి ఎగదోసిన చరిత్ర చూశాం.  ఇక్కడ  జనం మీదికి సైన్యాన్ని ఉసిగొల్పి, వైమానిక దాడులు చేస్తున్న ఫాసిస్టు యుద్ధం మధ్యలో మనం జీవిస్తున్నాం. జనవరి 11న తెల్లవారుజామున దండకారణ్యంలోని దక్షిణ బస్తర్‌ పామేడ్‌`కిష్టారం ప్రాంతంలో  భారత ప్రభుత్వం హెలికాప్టర్‌తో బాంబు దాడులు చేసింది. దేశాల మధ్య  సరిహద్దు యుద్ధాల్లో వాడే ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ చాపర్‌ను
వ్యాసాలు

ఆపరేషన్ కగార్‌ను ఆపాలి; వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి

2025 ఏప్రిల్ 9 భారత రాజ్యమూ, తమ పార్టీ మధ్య శాంతి చర్చలు జరగాలని కోరుతూ సిపిఐ (మావోయిస్ట్) పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసిందని 2025 ఏప్రిల్ 3 నాడు ది హిందూ వార్తా పత్రిక ప్రచురించింది. మావోయిస్టులు ముందుగా చొరవ తీసుకుని శాంతి చర్చలకు పిలుపునిచ్చినందుకు విప్లవకారులుగా, ప్రజానుకూల, ప్రజాస్వామిక దృక్పథం కలిగిన వ్యక్తులుగా మనం అభినందించాలి. శాంతి చర్చలకు పిలుపునిచ్చింది ఆపరేషన్ కగార్ కింద “దహనం చేసిన భూమి విధానాన్ని” అనుసరించాలని ఎంచుకున్న భారత రాజ్యం కాదు, "యుద్ధం చేసే" పార్టీ అనే విషయాన్ని ఇది మన దృష్టికి తీసుకువస్తుంది. (1.
వ్యాసాలు సంభాషణ

అణ‌చివేత మ‌ధ్య‌నే నూత‌న పోరాట ప్ర‌పంచం

2021 సెప్టెంబర్‌లో కేంద్రహోం మంత్రి తన సహచర మంత్రులతో పాటు 10 విప్ల‌వోద్య‌మ ప్ర‌భావిత‌ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రభుత్వ, పోలీసు, అర్ధ సైనిక అధికారులతో ఢిల్లీలో జంబో సమావేశం జరిపాడు. అందులో యేడాదిలోగా దేశంలో విప్ల‌వోద్య‌మాన్ని తుదముట్టిస్తామని  ప్రకటన చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్ర‌క‌ట‌న చేసి స‌రిగ్గా ఏడాది. ఈ సంవ‌త్స‌ర‌మంతా  అణ‌చివేత‌ మ‌ధ్య‌నే విప్ల‌వోద్య‌మం పురోగ‌మించింది. ఈ రెంటినీ ఈ సంద‌ర్భంలో ప‌రిశీలించ‌డ‌మే ఈ వ్యాసం ఉద్దేశం.  విప్లవోద్యమాన్ని అణచివేత చర్యలతో తుదముట్టించడం సాధ్యం కాదు. అది ఈ ఏడాదిలో  మరోమారు రుజువైంది. అయితే గత సంవత్సర కాలంలో భారత
వ్యాసాలు

రాజును చంపడం ఎందుకు తప్పు?

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ పసిపాపను అత్యంత దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపిన రాజు రైలు పట్టాలపై శవమయ్యాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడా, అతన్ని చంపేసి పట్టాలపై పడేశారా అన్న విషయంపై అనుమానాలున్నాయి కాని జనం న్యాయం జరిగిందని ఊపిరి పీల్చుకున్నారు. నిలువెల్లా గగుర్పాటు కలిగించిన సైదాబాద్ సంఘటనకు చలించని మనసు లేదు. ఎంత మంది తమ పిల్లలని పొదువుకొని గుండెలు గుబగుబలాడగా దుఃఖితులై ఉంటారో అందరూ ఆ పని చేసినవాడ్ని ఏం చేసినా పాపం లేదని అనుకొని ఉంటారు. అందరూ శపించినట్లుగానే రాజు దిక్కులేని చావు చచ్చిపోయాడు. న్యాయం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా న్యాయం
ఓపన్ పేజ్

‘ఇతరుల’ గురించి మాట్లాడలేమా?

మనుషుల స్పందనలు బహు విచిత్రం.  ఎప్పుడు దేన్ని పట్టించుకుంటారో.  ఏ విషయంలో  మౌనంగా ఉంటారో. దేన్ని తప్పించుకొని జాగ్రత్తగా తిరుగుతారో. చెప్పడం అంత సులభం కాదు. ఆరోపించీ లాభం లేదు. దీన్నంతా ఇష్టా ఇష్టాలుగా తేల్చవచ్చా? ఉద్దేశాలకు, రాజకీయాలకు మాత్రమే ఆపాదించవచ్చా? చైతన్యం గీటురాయి మీద పరీక్షించవచ్చా? సాంస్కృతిక స్థాయిగా కూడా చూడవచ్చా? ఇట్లా ఎన్ని చెప్పుకున్నా ఎంతో కొంత  మిగిలే ఉంటుంది. దీనికి చాలా కారణాలే ఉంటాయి. సమాజం యావత్తూ స్పందించడం సరే. అక్కడ చాలా సంక్లిష్టతలు పని చేస్తుంటాయి. స్పందనకూ మౌనానికీ  జటిలమైన కారణాలు ఉంటాయి. కానీ సమాజ కంఠస్వరంగా వినిపించే వాళ్ల మాటలనూ, మౌనాన్నీ
వ్యాసాలు

రాజకీయాలు – సామాజిక మాధ్యమం

రాజకీయ, సాంస్కృతిక వ్యక్తీకరణలో  చొరబడిన ‘సామాజిక మాధ్యమం’ అనేక మానవీయ విషయాలలో గందరగోళం సృష్టిస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియా ప్రజల ఆలోచనాధారలోకి ప్రవేశించింది. ప్రధాన స్రవంతి మీడియాకు ప్రత్యామ్నాయంగా మనిషి చేతికి సామాజిక మాధ్యమం అంది వచ్చింది. సృజనాత్మక అభినివేశం గల మానవుల సాంస్కృతిక, రాజకీయ వికాసపు వ్యక్తీకరణకు సోషల్‌ మీడియా ఆలంబనగా నిలిచింది. పదేళ్ల కాలంలో సోషల్‌ మీడియా భారత సమాజంపై తనదైన ముద్ర వేయగలిగింది. మన ఇంటి పక్క అమ్మాయి, లేదా అబ్బాయి తమకున్న సృజనాత్మతతో లక్షలాది వీవర్స్‌ను సంపాదించకోగలుగుతున్నారు. కొందరికి ఆర్ధిక వనరయింది కూడా.  సోషల్‌ మీడియాకు సమాజమే ప్రతిబింబం. దిన పత్రికలను,
వ్యాసాలు

మానవ హక్కులపై నిలదీసిన యుఎన్‌హెచ్‌ఆర్‌సి

దేశములో మానవ హక్కుల పరిస్థితి దారుణంగా తయారైందని, తీవ్రవాద నిరోధక చట్టాల పేరుతో పౌర సమాజంపై ఆంక్షలు విధిస్తున్నారని, ఐరాస మానవ హక్కుల కమీషన్‌ ఆధ్వర్యంలో జెనీవాలో నవంబర్‌ 10న జరిగిన వార్షిక సమావేశంలో భారత్‌ను పలుదేశాలు నిలదీయడం జరిగింది. సభ్య దేశాలైన 193 దేశాలలో పౌర, మానవ హక్కుల పరిస్థితిపై ఐరాస మానవ హక్కుల మండలి ఐదు సంవత్సరాల కొకసారి సమీక్ష జరుపుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు సమావేశాలకు పిలుపు నిస్తుంది. మానవ హక్కుల మండలిలో 43 దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలలోని మానవ హక్కుల పరిస్థితి నివేదికలపై సమీక్ష చేస్తారు. సభ్య దేశాల నుంచి మానవ