సంభాషణ

వియ్యుక్క వెలుగులో మరికొంత ముందుకు

వియ్యుక్క సంకలనాలను ఆదరిస్తున్న పాఠకులకు విప్లవాభినందనలు తెలియజేస్తూ మరికొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను. ముందుగా సంకలనాలలో దొర్లిన కొన్ని పొరపాట్లను, కొత్తగా అందిన సమాచారం  వల్ల గుర్తించిన వాటిని పాఠకుల దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు పరిశోధక విద్యార్థులు, ఒక విద్యార్థిని తమ థీసిస్ విషయవస్తువుకు ప్రధాన వనరుగా వియ్యుక్క సంకలనాలను స్వీకరించామని మరింత సమాచారం కోసం సంపాదకురాలిని సంప్రదించారు. నేటి తరం యువతను వియ్యుక్క సంకలనాలు ఆకర్షించటం, వారి బాధ్యతగా వారు విప్లవ సాహిత్యంలో మరింత సూక్ష్మ పరిశోధనలు చేపట్టటం చాలా సంతోషించవలిసిన విషయం. వారికి, వారిని ప్రోత్సహిస్తున్న ఆచార్యులకు విప్లవాభివందనాలు.  ఇటువంటి పరిశోధనలను
సంభాషణ

అసలు ‘హక్కులు’ అనడమే నేరం. ముస్లిం హక్కులు అనడం ఇంకెంత నేరం!

ఆదివారం ఉదయాన్నే ఒక మీడియా మిత్రుడి ఫోను. మీ ఇంటికి ఎన్. ఐ. ఏ. వాళ్ళు వచ్చినారా అక్కా అని. పొద్దున్నే ఏదో పనిమీద బైటికొచ్చి ఉన్నా. ఇంటికి పోతే అప్పటికే కొంత మంది మీడియా వాళ్ళు ఇంటికొచ్చి ఇదే విషయం అమ్మను అడిగి వెళ్లారని తెలిసింది. తర్వాత నిదానంగా తెలిసిందేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, సభ్యుల ఇళ్ళలో సోదాలు జరిగాయని, ఒకర్ని అరెస్టు చేశారని. ఆ సంఘం ముస్లింలది కావడమే ఇందుకు కారణం. కొంచెం ఆలోచిస్తే.. ఇప్పుడు ఇక్కడ, తెలుగు సమాజంలో హిందూ ముస్లిం విభజన వేగంగా జరగాల్సిన అవసరం
ఇంటర్వ్యూ

ప్రజా ప్రయోజనం కోసం శాంతి కోరుకుంటున్నాం

(శాంతి చర్చల కోసం లేఖ రాసిన మావోయిస్టు నాయకుడు రూపేశ్‌ బస్తర్ టాకీస్ యు ట్యూబ్ ఛానెల్ వికాస్ తివారీతో చేసిన సంభాషణ ఇది . దేశమంతా  శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్న తరుణంలో శాంతి గురించి , ప్రజా ప్రయోజనాల గురించి , విప్లవం గురించి తెలుసుకోడానికి మావోయిస్టు ఉత్తర - పశ్చిమ కమిటీ నాయకుడి అభిప్రాయాలు ఉపయోగపడతాయని పాఠకులకు అందిస్తున్నాం - వసంత మేఘం టీం ) వికాస్ తివారీ: ఛత్తీస్‌ఘడ్‌లో నాలుగు దశాబ్దాల నుంచి మావోయిజం ఉన్నది. నాలుగు దశాబ్దాల నుంచి  మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యలో
సంభాషణ

హస్‌దేవ్ అటవీ విధ్వంస ‘మూల్యాన్ని’ ఎప్పటికీ చెల్లించలేం

అడవిని కాపాడాలంటూ ఉద్యమిస్తున్న 'హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి' వ్యవస్థాపక సభ్యుడు, 'ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్' కన్వీనర్ అలోక్ శుక్లాకు ఈ ఏడాది 'గోల్డ్‌ మ్యాన్ అవార్డు' లభించింది. గోల్డెన్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయిలో పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేసే కార్యకర్తలకు ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డును గ్రీన్ నోబెల్ అని కూడా అంటారు. ఈ సంవత్సరం, గోల్డ్‌ మ్యాన్ ఎన్విరాన్‌మెంట్ అవార్డును భారతదేశానికి చెందిన అలోక్ శుక్లాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుగురు కార్యకర్తలు - దక్షిణాఫ్రికాకు చెందిన నాన్‌లే మబుతుమా, సినెగుగు జుకులు, స్పెయిన్‌కు చెందిన తెరెసా
సంభాషణ

జీవితమే విప్లవమైన యోధుడు

రాయలసీమ నుంచి ఒడిసా దాకా.. కామ్రేడ్‌ చలపతి 1989 నుండి తన జీవితాన్నంతా విప్లవంలో గడిపాడు.   ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని మత్యం కొత్తపల్లిలో పుట్టాడు. చిత్తూరులో చదువుకొని, మదనపల్లిలో సెరికల్చర్‌ ఉద్యోగంలో చేరాడు. 1988లో పార్వతీపురానికి ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాడు. అక్కడ విప్లవ రాజకీయాలు పరిచయం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి విప్లవోద్యమంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లిపోయాడు. మొదట ఆ ప్రాంతంలో  కేంద్ర ఆర్గనైజర్‌గా పని చేసాడు. 1990లో చలపతి ఉద్దానం దళ కమాండర్‌ అయ్యాడు. జీడివీక్కల వరిశ్రమలలో కూలిరేట్ల  పోరాటాల నుండి భూముల ఆక్రమణ పోరాటాలకు నాయకత్వం వహించాడు.   అన్ని రకాల
సాహిత్యం సంభాషణ

కల‌నేత‌ బతుకులు

అమ్మా నాన్న‌ల త‌ల‌పోత‌ వాటు పడితేనే గానీ డొక్కాడని కుటుంబం మాది. ప్రభుత్వ ప్రచారాల్లో సర్కారు ప్రాంతంలోని ఓ జిల్లా మాది. సముద్రానికి రెండు గంటల దూరంలో ఉంటుంది.  జనాభా ఐదు వేలకు మించే (2001).పచ్చని పొలాలు గట్ల మీద వంపులు తిరిగిన తాటి కొబ్బరి చెట్లు క్షణం తీరిక లేకుండా టక టక సౌండ్‌ చేసే మగ్గాలు, వసారాల్లో ఉండే ఆసుల్సు రాట్నాలతో ఊరు ఆహ్వానం పలుకుతుంది.గ్రామంలో పెద్ద సంఖ్యలో దేవాంగ, కాపు కులాలు ఉన్నాయి. దేవాంగుల వృత్తి చేనేత. కొద్దిమంది కలంకారీ-అద్దకం పనులు చేస్తారు. కాపులు ఎక్కువ వ్యవసాయం, ఒకటి రెండు కుటుంబాలు తప్ప. గ్రామం మీద
ఇంటర్వ్యూ

మత రహిత , కుల రహిత అస్తిత్వం  కోసం.. 

1.నో కేస్ట్ నో రెలిజియన్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది.. ?    మీ ప్రశ్న చిన్నదే ..  అయితే  ఈ ప్రయత్నం వెనక ఒక  పెద్ద ప్రయాణం ఉంది..  ఈ ఆలోచన వెనక   నా/ మా   జీవిత సంఘర్షణ  ఉంది.  అందువల్ల  కొద్దిగా  ఆ నేపథ్యం  చెప్పాలి.. వీలయినంత సంక్షిప్తంగా చెప్పడానికి  ప్రయత్నిస్తాను.   నా చిన్నతనం అంటే హై స్కూల్ / 10వ తరగతి వరకు  నేను ఒరిస్సా   రాష్ట్రంలోని  సుందరగడ్  జిల్లా బండముండ అనే ఊరిలో  చదువుకున్నాను.  మా నాన్న దువ్వూరి వీర వెంకట సత్య సూర్య దుర్గా ప్రసాద్ రామారావు , అమ్మ 
సాహిత్యం సంభాషణ

కోబాడ్ గాంధీ సమాధానంపై మ‌నీషా అజాద్‌

కోబాద్ గాంధీ తన జైలు డైరీకి నా ప్రతిస్పందనను చదివి స్పందించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కొన్ని ఉద్యమ ప్రాథమిక సమస్యలపైన ఇది మంచి చర్చకు దారితీస్తుందనే ఆయన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించడానికి ప్రయత్నిస్తాను. జార్ఖండ్ ఉద్యమం సమస్యపై నేను తనని తప్పుగా ఉదహరించానని కోబాడ్ గాంధీ అంటున్నారు. వాస్తవానికి, నేను ఈ అంశంపై అసలు ఉదహరించదమనేదే జరగనప్పుడు, తప్పుగా ఉదహరించాననే ప్రశ్న ఎక్కడనుంచి వస్తుంది? ఆ డైరీ మీద  నాకు ఏర్పడిన అభిప్రాయాలను చెప్పాను అంతే.   కానీ ఇప్పుడు అతను రాసిన ఇతర విషయాలకు సమాధానం చెప్పే
సంభాషణ

ఆయుధాల బలంపై అధికారాన్ని నిలుపుకోలేరు

ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ మిత్రుడు హిమాంశు కుమార్ ఫేస్ బుక్ పేజీ నుండి....... మన దేశంలో రానున్న కొద్ది సంవత్సరాలలో కోట్లాది ప్రజల భూములను తన్ని తన్ని వారి నుండి స్వాధీనం చేసుకుంటారు! పోలీసులతో పేదలను తన్నించి మేం వారి భూములు గుంజుకుంటాం. పేదల భూములు స్వాధీనం చేసుకొని మేం మా కోసం హైవే, షాపింగ్ మాల్, విమానాశ్రాయాలు, రిజర్వాయర్లు, కార్ఖానాలు నిర్మిస్తాం, అభివృద్ధి సాధిస్తాం. మేం బలసంపన్నులం, అందుకే మేమేదైనా చేయగలం? గ్రామీణులు బలహీనులు, వాళ్ల మాట వినే వాడెవడు? వాళ్లు బలసంపన్నులనేది నిజమనుకుందామా? దీని కోసం తలబద్దలు కొట్టుకోవలసిన పనేం లేదు? వాద- సంవాదాల అవసరం
సాహిత్యం సంభాషణ

మనీష్ ఆజాద్ విమర్శకు కోబాడ్ గాంధీ స్పందన

 ఏప్రిల్ 19, 2021 ('ది కోరస్' లో కోబాడ్ గాంధీ పుస్తకం "ఫ్రాక్చర్డ్ ఫ్రీడం" పై విమర్శ రాసిన మనీష్ఆజాద్‌కు సమాధానాలు) పెట్టుబడిదారీ విధానం ప్రజల జీవితాలను, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగడం మంచిది. చర్చల ద్వారా మాత్రమే మనకు మరింత స్పష్టత వస్తుంది. కానీ దీనిని ప్రదర్శించే విధానం భారతీయ వామపక్షానికి విలక్షణమైనది, వీరిలో చాలామంది తమ స్వంత ఆచరణని (దాని ప్రాసంగికతను) విశ్లేషించుకోరు, కాని అసలు విషయం లేకుండా వ్యంగ్యంగా రాయడంలో ప్రవీణులు. మనీష్ ఆజాద్ ప్రశ్నలు మాత్రమే లేవనెత్తి, ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదు, అతనికి