కవిత్వం

 మౌమిత ఆలం కవిత్వం

1.స్నేహితుడా..నేను నీ శత్రువుని నేను నా హృదయాన్ని తెరిచిన ప్రతిసారీ సజీవంగా ఉండే నీ మాటలను స్పృశించడంలో విఫలమవుతున్నాను. మీ భూమి నుండి నేను సంవత్సరాలుగా పావుకున్న పేగుల,రక్త,ద్రోహం దుర్వాసనను ఈ మాటలు నాకు మిగిల్చాయి. నీ పదజాలంలో నే చొప్పించిన నల్లటి పదాలు పట్టపగలే నా సాంత్వనలో నన్ను వెంబడించాయి. నేను లైటు ఆపేస్తే అవి చీకటిలో మరింత ఉజ్వలంగా వెలుగుతాయి. సమాధానాల కోసం నిశ్శబ్దంగా నువ్వు వేసే ప్రశ్నలు నా జీవం లేని గుండెను వెంటాడుతున్నాయి. నేను నా నుండి కళ్ళు తిప్పుకుంటాను, ఒక హంతకుడు నేరం చేసిన నెపాన్ని ఇతరుల మీదకు తోస్తాడు. గొంతు
సాహిత్యం కవిత్వం

కాసిన్ని అక్షరాలివ్వండి

ఒక కఠోర వాస్తవం రాయాలి చెయ్యందించరూ గొప్ప కవిత రాయలి అక్షరాలు అరువివ్వరూ ఎక్కడో పొంగిన రోహింగ్యాల రోదనలు కాదు అక్కడెక్కడో తాలిబన్ల ఉన్మాదం కాదు భారతీయ తాలిబన్లు చేసే అత్యాచారానంతర పాశవిక హత్యలు,  రక్షక భటుల రక్షణలో అర్ధరాత్రి శవదహనాలు, రైతుల మీదుగా నడిపే రథాల విన్యాసాలు, అదేమని అడిగే గొంతుల్లోకి ఉపాలు, కోరెగాం కోరలు,  అబ్బసొమ్మేదో అమ్ముకున్నట్లు ప్రజల ఆస్తుల, హక్కుల అమ్మకాలు,  అన్నిటినీ నిలేసి అడగాలని వుంది  ఆవేదనకు పదాలు చాలకున్నాయి.. అక్షరాల సేద్యం చేసేవరకూ ఎవరన్నా కొన్ని తాలక్షరాలో, పొల్లక్షరాలో ఇచ్చి ఆదుకోరూ
కవిత్వం

మహమూద్ కవితలు మూడు

1 నది స్వప్నం కొద్ది రోజుల్నించిఏరు కలలోకి వస్తోందికళ్ళలో తడిని ఒదలిపోతూ ఉందితీరైన వరుస లాగాస్వప్నాల మీద స్వప్నాలువాటి మీద నదీ పాదముద్రలుఏరు మన్నులో కలిసిపోయిన అనేకానేకజ్ఞాపకాలునేను నవ్వుతున్నప్పుడునా లోంచిజలపాతంలా జారుతుంది నదిమౌనంగా ఉన్నప్పుడుమైదానం పై పారుతున్నట్టునిలకడ పడుతుందినది నన్ను గుర్తు పెట్టుకుందినేను నదిని దేహం చేసుకొన్నానుఅందుకే నేను తన ఉనికినినది నా జీవితంనదిదిఓ సమకాలీన వాస్తవ ప్రవాహంఎండిపోని జ్ఞాపకాల స్రవంతిపుట్టుకతో యవ్వనం నది మాత్రమేపొందుతుందిమరణించినట్టనిపించేపునర్జన్మ దానిదినదిని చంపేస్తామనిఆయుధాలతోబయలుదేరుతారు కొందరుఅలాంటివారు ఎందరుకొట్టుకు పోయారో ప్రవాహంలో...నది నా కలలోకి వస్తూనే ఉందిఒక్కోసారి ఉగ్ర రూపంతో..ఒక్కోసారి ప్రశాంత వదనంతో..****2 పిల్లకాలువ! ఎండలో మాగిన ఎడారి నాలుకగుప్పిట పట్టుకు దొరకనిహృదయ స్పందన ఇసుకజలధారకు
కవిత్వం

పదేళ్ల పచ్చి గాయం

ఎలాగైతేనేం ఉబికి వచ్చే కన్నీటికి ఇసుక గూడంత విరామం దొరికింది ఆ మధ్యానం అన్నం కుండ దించుతుండగా చెవులకు లీలగా తాకిన వార్త పళ్ళెంలో మొదటి ముద్ద అతని కోసమే కలుపుతున్నట్టు స్కూలు నుంచి వచ్చిన పిల్లాడి లంచ్ బాక్స్ అంట్ల గిన్నెలో గబగబా సర్దుతున్నట్టు అంతా తత్తరపాటు అప్పటికి విన్న ఆమెకది పగటి కలే కావచ్చు ముఖ పరిచయమే లేని నాకు మాత్రం ఎండిన నాలుకపై తెప్పరిల్లే చిన్న వాన చినుకు అతగాడికి కాగితాలకందని శిక్ష వెయ్యాలని తీర్పరి చెరకుగడ పిప్పిగా పాఠాన్ని నములుతూ పోతుంటాడు శూన్యం కుమ్మరించిన నేలపై ఒకరి కళ్లను మరొకరు ఫొటోగ్రాఫ్ చేస్తూ
సాహిత్యం కవిత్వం

వాళ్ళు ముగ్గురు

వాళ్ళు ముగ్గురే అనుకునివాళ్ళని లేకుండా చేస్తేఇంకేమీ మిగలదనివిషం పెట్టిచిత్రహింసలకు గురిచేసికొయ్యూరు అడవుల్లోహతమార్చిసంబరాలు చేసుకున్నావు కానీ ఆ చిత్రహింసలకొలిమిలోంచిఫీనిక్స్ పక్షిలావేలాదిమంది సాయుధప్రజా విముక్తి సైన్యంపుట్టుకొచ్చింది నువ్వో కాగితప్పులవనిరుజువయిందిస్పార్టకస్ నుండిదండకారణ్య ఆదివాసీ వరకునెత్తుటి పుటలలోంచిమరల మరలవిముక్తి నినాదంవినబడుతూనే వుంది అమరత్వం పొత్తికడపులోంచిఉద్యమ నెల వంకలుఉదయిస్తూనే వుంటారు శ్యాం మహేష్ మురళీఅమర్ రహే అమర్ రహే
సాహిత్యం కవిత్వం

మానవత్వం చంపబడుతోంది

మానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి సోంతలాభం కోంతమానిపోరుగువారికి తోడ్పడవోయ్గీసుకున్న దేశభక్తి గీతదాటిఅడుగు ముందుకేసిసోంతలాభం అసలే వద్దుప్రజలకోరకే తన ప్రాణమంటుమానవత్వం శిఖరమెక్కినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి అన్నం రాశులు ఒకచోటఆకలి మంటలు ఒకచోటవ్యత్యాసాల ఎత్తుపల్లాలు ఆర్పడానికినాలుగడుగులు ముందుకేసిఅన్నం రాశులు ఆకలి సంచులు నింపినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి నెత్తురు మండే శక్తులు నిండేసైనికులారా రారండిపిడికిట్లో నినాదం పిడుగులు పట్టుకొనిమరో నాలుగడుగులు ముందుకే నడిచికోయ్యూరు నండి కోయ్యూరు దాకజనం అలజడి నాడిస్టెతస్కోప్ చేతులతో పట్టినమరో ప్రపంచపు నూతన మానవుడుమానవత్వం నాటుకుంటూ వస్తున్నమనిషిని చంపేశారు రండి చంపబడ్డ మానవత్వాన్ని పిడికిళ్ళ నిండా మనిషింత తెచ్చుకుందాం
కవిత్వం

దేని గురించి మాట్లాడగలను

ఈ రోజు దేని గురించి మాట్లాడగలను మరణాల గురించి తప్ప పాలస్తీనాలో పసికందుల మరణాల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను దండకారణ్యం గురించి తప్ప ఆకాశం నుండి నేలతల్లి ఒడిలోని ఆదివాసీ పసిపాపలపై జరుగుతున్న బాంబు దాడుల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను బుల్డోజర్ దాడుల గురించి తప్ప మసీదుల కింద తవ్వుతూ కొత్తగా లేని ఆనవాళ్ళేవో దొరికాయని కూల్చి వేసే కుట్రల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కోరితే కాల్పులు జరుపుతున్న వాడి నైజాన్ని గురించి తప్ప
కవిత్వం

 క‌వితా ప‌రాగం

1. ఆశ‌ ఎవరో ఒకరు  నీ తలపై గురిపెడుతూనే వుంటారు ప్రతి క్షణం  నీ చుట్టూ నిఘా పెడుతూనే వుంటారు నీ ఆలోచనలు  సీతాకోకచిలుకలుగా మారి  ఎగరక ముందే  నీ రెప్పలపై ఇనుప తెర వేస్తారు నీ గొంతుపై ఉక్కుపాదం మోపుతారు నీ కాళ్ళకు సంకెళ్లు చుట్టుకుంటాయి ఎవరూ నీ వెంట రాని కాలంలో నువ్వే ఒక‌ ఆకాశం కావాలి నువ్వే ఒక సంద్రం కావాలి నువ్వే ఒక సమూహం కావాలి 2. ఆకాశం వర్షించే వరకూ అతడు లేచి వస్తాడు  ఆమె తోడుగా  రక్తం చిందించిన‌ వారెప్పుడూ తిరిగి వస్తారు అదో భరోసా నీకూ నాకూ అతడు
కవిత్వం

సరోజ్‌దత్తా కవితలు

1969 ఏప్రిల్‌ 22న లెనిన్‌ శతజయంతి రోజు ఏర్పడిన సిపిఐఎంఎల్‌ కు సరోజ్‌దత్తా సాంస్కృతిక సేనాని. ఈ మార్చి 11న ఆయన 110వ జయంతి. సిద్ధార్థ శంకర్‌రే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను 1971 ఆగస్టు 4`5 తెల్లవారకుండానే కిడ్నాప్‌ చేసి కలకత్తా, షహీద్‌మినార్‌ మైదానంలో ఒక మూలన కాల్చి చంపిది. లెనిన్‌ శత వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన బ్రాహ్మణీయ ఫాసిస్టు వ్యతిరేక కవితలు మూడు వసంతమేఘం పాఠకుల కోసం... 1. యవ్వనం నేను చండాలుడ్ని జీవితానికి అస్పృశ్యుడ్ని ఈ శ్మశానవాటిక నుంచి జీవితాలు తమ ముగింపు చూసే చోటి నుంచి నేను చితిమంటల బూడిద నుంచి బొగ్గులు
కవిత్వం

ఉంటాం, అంతే

బతికున్న చావులు లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు మానసిక మరణాలకు ప్రభుత్వం ఎన్నటికీ దోషి కాదు రాజ్యం తన పని తాను చేసుకపోతోంది అడ్డుతగలకండి దరాఘాతానికి వంటిల్లు మూర్చిల్లింది సర్కారును ఎవరూ నిందిచకండి వారు భక్తిరసంలో మునిగి ఉన్నారు పూజా ద్రవ్యాల రేట్లు తగ్గించండి పస్తులుండైనా భజనలు చేస్తాం రెండు పూట్ల భోజనాలను రద్దు చేసుకుంటాం ఒకపూట తిని ఓటు కోసం బతికుంటాం మీరు శూలాలు విల్లంబులు గదలు మేము ఆయుధాలను మోసే బంటులం ఏ అబద్దాలనైనా దృశ్యకావ్యాలుగా మలిస్తే మేము శవాలుగా చప్పట్లు కొడతాం మా పిల్లలకు ప్రేమ స్నేహం దయ పదాలను పలకపై దిద్దించడం