కవిత్వం

దేని గురించి మాట్లాడగలను

ఈ రోజు దేని గురించి మాట్లాడగలను మరణాల గురించి తప్ప పాలస్తీనాలో పసికందుల మరణాల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను దండకారణ్యం గురించి తప్ప ఆకాశం నుండి నేలతల్లి ఒడిలోని ఆదివాసీ పసిపాపలపై జరుగుతున్న బాంబు దాడుల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను బుల్డోజర్ దాడుల గురించి తప్ప మసీదుల కింద తవ్వుతూ కొత్తగా లేని ఆనవాళ్ళేవో దొరికాయని కూల్చి వేసే కుట్రల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కోరితే కాల్పులు జరుపుతున్న వాడి నైజాన్ని గురించి తప్ప
కవిత్వం

 క‌వితా ప‌రాగం

1. ఆశ‌ ఎవరో ఒకరు  నీ తలపై గురిపెడుతూనే వుంటారు ప్రతి క్షణం  నీ చుట్టూ నిఘా పెడుతూనే వుంటారు నీ ఆలోచనలు  సీతాకోకచిలుకలుగా మారి  ఎగరక ముందే  నీ రెప్పలపై ఇనుప తెర వేస్తారు నీ గొంతుపై ఉక్కుపాదం మోపుతారు నీ కాళ్ళకు సంకెళ్లు చుట్టుకుంటాయి ఎవరూ నీ వెంట రాని కాలంలో నువ్వే ఒక‌ ఆకాశం కావాలి నువ్వే ఒక సంద్రం కావాలి నువ్వే ఒక సమూహం కావాలి 2. ఆకాశం వర్షించే వరకూ అతడు లేచి వస్తాడు  ఆమె తోడుగా  రక్తం చిందించిన‌ వారెప్పుడూ తిరిగి వస్తారు అదో భరోసా నీకూ నాకూ అతడు
కవిత్వం

సరోజ్‌దత్తా కవితలు

1969 ఏప్రిల్‌ 22న లెనిన్‌ శతజయంతి రోజు ఏర్పడిన సిపిఐఎంఎల్‌ కు సరోజ్‌దత్తా సాంస్కృతిక సేనాని. ఈ మార్చి 11న ఆయన 110వ జయంతి. సిద్ధార్థ శంకర్‌రే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను 1971 ఆగస్టు 4`5 తెల్లవారకుండానే కిడ్నాప్‌ చేసి కలకత్తా, షహీద్‌మినార్‌ మైదానంలో ఒక మూలన కాల్చి చంపిది. లెనిన్‌ శత వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన బ్రాహ్మణీయ ఫాసిస్టు వ్యతిరేక కవితలు మూడు వసంతమేఘం పాఠకుల కోసం... 1. యవ్వనం నేను చండాలుడ్ని జీవితానికి అస్పృశ్యుడ్ని ఈ శ్మశానవాటిక నుంచి జీవితాలు తమ ముగింపు చూసే చోటి నుంచి నేను చితిమంటల బూడిద నుంచి బొగ్గులు
కవిత్వం

ఉంటాం, అంతే

బతికున్న చావులు లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు మానసిక మరణాలకు ప్రభుత్వం ఎన్నటికీ దోషి కాదు రాజ్యం తన పని తాను చేసుకపోతోంది అడ్డుతగలకండి దరాఘాతానికి వంటిల్లు మూర్చిల్లింది సర్కారును ఎవరూ నిందిచకండి వారు భక్తిరసంలో మునిగి ఉన్నారు పూజా ద్రవ్యాల రేట్లు తగ్గించండి పస్తులుండైనా భజనలు చేస్తాం రెండు పూట్ల భోజనాలను రద్దు చేసుకుంటాం ఒకపూట తిని ఓటు కోసం బతికుంటాం మీరు శూలాలు విల్లంబులు గదలు మేము ఆయుధాలను మోసే బంటులం ఏ అబద్దాలనైనా దృశ్యకావ్యాలుగా మలిస్తే మేము శవాలుగా చప్పట్లు కొడతాం మా పిల్లలకు ప్రేమ స్నేహం దయ పదాలను పలకపై దిద్దించడం
కవిత్వం

మాట్లాడే మనిషి

సందింట్లో సాయంకాల వేల అలసిన ఆలికి నాలుగు ముచ్చట్లు చెప్పే పెనిమిటి తిరిగి వచ్చే రోజు కోసం ఎగసేపి బిడ్డ కోసం దారిపట్టే తల్లి ఆవు కోసం ఊపిరి బిగబట్టి గాలినిఎగదని గూడు చేరే పక్షుల కోసంనిలువనీడనిస్తూ చిగురించెఆ చెట్ల కోసం స్పందించి స్వరాన్ని వినిపించేసాయి ఆఖరి శ్వాస విడిచిన వేళదిక్కులు దినబోయి దిశ తిరిగె కొండ గాలిఅలిగిన అమలాపురానికి మిగిలిన వసంతంనేల విడువని పాదాలు మట్టి వదలని చేతుల మార్పు కోసం వైకల్యం ఆదమరిచిప్రశ్నించే ప్రతి చోట బలమైన మస్తిష్కం బంధించిన చెరసాల యమున గంగను కలసి ఎదపై గోదారి కృష్ణమ్మ వెనుతిరిగిమూసికి ముచ్చట్లుమంజీరా మా కోసంరేపటి
కవిత్వం

నాలుగు పిట్టలు (కళ్ళూ- కన్నీళ్ళు)

సముద్రాన్ని కళ్ళల్లో నింపుకుందామనుకున్నసాధ్యమైతే కాలేదురెప్పలు మధ్య కన్నీరు ఉబికేదాకాదుఃఖం కంటే గొప్ప సాగరమేముందో తెలియలేదు***కన్నీళ్ళ తో కాస్త జాగ్రత్తఉండండిగాయపరచడానికి ముందుమీ కళ్ళ గురించి కూడా ఆలోచించండి***ఒక్కోసారి కన్నీళ్ళతో పాటుచూపు ప్రవహిస్తుందిదృశ్యాలను అనేకంతనలో కరిగించుకొని****కన్నీళ్ళ కళ్ళనుఅవమాన పరచకండిదుఃఖం ఆగాక ఉప్పొంగేఉద్వేగం పేరు ఆగ్రహం***కళ్ళున్న చోటంతాకన్నీళ్ళుండక పోవచ్చుకొందరి హృదయాలుఎండమావులు***తడి ఉన్నదంతాకన్నీళ్ళు కాదుమోసకారులుకోకొల్లలు****కన్నీళ్ళ శక్తి కి అంచనా లేదుకేరటాల్లా, వానలా, వరదలాఅవి బండలలైనాకరిగించగలవు కదిలించగలవు***లోపలచెలరేగేతుపానులనుఅదుపు చేసేలంగరులు కన్నీళ్ళు***కన్నీళ్ళుచాలా వాస్తవమైనవిఅవే మనో మంటలనుచల్లార్చగలిగేవి***కన్నీళ్ళు రానివాళ్ళలోపలహృదయం ఎండిపోయిఉంటుంది***నువ్వో సముద్రాన్నిలోపల మోస్తున్నావనిచెప్పే ఆధారాలుకన్నీళ్ళు****కళ్ళను నమ్మని వారైనా సరేకన్నీళ్ళను నమ్ముతారునీలో మనిషి ఉన్నాడనిఅప్పుడు గుర్తిస్తారు***గట్టి రొమ్మున్న వారు కూడారొప్ప కుండా ఉండలేరుఏడ్పు రాని వారెవరూఈ లోకంలో ఇప్పటికీ పుట్టలేదు***ఒక
కవిత్వం

మహమూద్ కవితలు

1 వేడుకోలు చీకటి పాత్ర లో నిండుగా ఉన్నది వెన్నెల మధువు మత్తుని ఆహ్వానించడానికి సిధ్ధంగా ఉంది ప్రేమ నిండిన హృదయం ఏక్కడో దూరం నుంచి ఓ తల్లి గాత్రం బిడ్డకి పాలు పడతూ ఆదమరచడానికి భూమికింత చల్లగాలిని జోలపాటగా అందిస్తోంది ఏ బతుకు యుధ్ధంతో ఘర్షణ పడుతున్నారో మనుషుల జాడ లేదు మధువు తాగేటప్పుడు తోడు కోరుతుంది కదా మనసు ఒంటరితనం ఒక ఉన్మత్త దుఃఖం దుఃఖం ఓ ఒంటరి యుధ్ధం దేహానికీ, హృదయానికీ గాయం కానివాడెవడూ మధువుని కోరుకోడు తోడునీ కోరుకోడు తెగిన బంధాలని జతచేయడానికి గాయాలు మానడానికి అనువైన కాలం ఇది జహాపనా! కొందరు
సాహిత్యం కవిత్వం

దీపాల వెలుతురు నీడలో

తాము కాలిపోతూవెలుతురిస్తాయి దీపాలు సమస్త చీకటి విషాలను మ్రింగికాంతినిస్తాయి మిణుగుర్లు మన గాయాల్ని వాళ్ళ దేహాల్లో నింపుకొనిమందు కనుగొంటారు శస్త్రచికిత్సా కారులు వెలివేతలను తలరాతలుగా వ్రాయించుకొనిమైలపేరుతో మూలపడిమూతులకు కుండలు కట్టించుకునేబడుగుబతుకుల్లో ఆత్మగౌరవాన్ని తట్టి లేపుతారుజ్ఞానవంతులు కార్మీక కర్షక జనావళిఊపిరికి ప్రాణం ఉందనిరుజువుచేసిసంఘటితస్పర్శ ఎంత శక్తివంతమైందో తెలియజేసినడవడానికో పోరుబాటని సిధ్ధం చేస్తారునాయకులు వాళ్ళపాదాల్రాసిన కఠిన కాల చరిత్ర పుటలపైతలలెత్తుకొని నిలబడబానికి ప్రయత్నిస్తాయిగడ్డిపోచలు గడ్డిపోచల నుదుర్లను ముద్దాడుతుందివసంతం వసంతాన్ని కౌగిలించుకుంటుంది మేఘగర్జన గూడెం పిల్లోడి చేతిలో విల్లంబులా సాయంత్రంక్షితిజం పై ఒరుగుతుంది రేపటికొక కొత్త సూర్యుణ్ణి కంటానని వాగ్ధానం చేస్తూ...
సాహిత్యం కవిత్వం

బంగారు బుడతలు

కలలు కనే కళ్ళు ఆచ్చాదన లేని వళ్ళు లోకం తెలియని పరవళ్ళు అల్లరి పిల్లలు కాదు వాళ్ళు నవనాగరికులు వాళ్ళు సమిష్టి ఆశల సౌధం వాళ్ళు కాలం రైలు పట్టాలెక్కి జీవితాన్ని బాలెన్స్ చేస్తు విశ్వయాత్ర చేస్తారు వాళ్ళు నింగి, నేలంతా వ్యాపించి మూసిన కిటికీలు తెరిచి మేఘాలతో వూసులు చెబుతారు వాళ్ళు పాలపుంత లాంటి సుదూర కాంతి కిరణాలు వాళ్ళు తేనె జల్లుల పరవశం వాళ్ళు ప్రకృతి ఒడిలో పారవశ్యపు కాంతులు వాళ్ళు పాలకుల నైజానికి సాక్షులు వాళ్ళు ఎవరి సానుభూతి అర్థించని వాళ్ళు ఆత్మగౌరవానికే అందం వాళ్ళు బంగారు బుడతలు స్వేచ్ఛా విహంగాలు ఊహలకు రెక్కలు
కవిత్వం

అర్బన్ నక్సల్

మాటాడుతున్న వారు ప్రశ్నిస్తున్న వారు రాస్తున్న వారు పాడుతున్న వారు అందరూ కూడాఅర్బన్ నక్సలే నిజానికి నువ్వు అంటున్నది బెదిరించి నోళ్లు మూయించడానికే ప్రజల వైపు ఎవరూ మిగిలి ఉండకూడదన్నదే ఈ మాట వెనక సూత్రం కానీ ఇది ఇప్పుడు ఒక అవార్డులా తయారయింది ఇలా నువ్వు ఎవరి గురించైనా చెప్పావంటే వాళ్ళు నిన్నంతగా భయపెట్టారని ప్రజలు గుర్తిస్తున్నారు స్వేచ్ఛను ఇంతలాహరించిన ప్రతిసారీ అది చీకట్లను తెంచుకుని మరలా రివ్వున పైకి లేస్తుందిగొంతులపై మోపిన ఉక్కు పాదాన్ని పెకలించే నాగలిగా రూపాంతరం చెందుతుంది సరిహద్దులలోనిసైన్యాన్ని ప్రజలపై మోహరిస్తున్న ఈ కాలంలో రైతులు నీ సరిహద్దులను చుట్టుముట్టి వున్నారు ఓట్ల