గుండె కొలిమి
గీయ్యాల గాయమ్మ శోకం కడుపుకోతకు తెలుస్తుంది కన్నీళ్లతో భూతల్లి పాదాలు తడుపుతూ మానవత్వం సిగ్గు పడిందంటూ గుండెలు బాదుకుందికులం పేరుతో ఒకడు మతం పేరుతో ఒకడు అధికార ఆకలితో ఇంకొకడుఅందర్నీ ఆగం చేస్తుండ్రే గానీ..ఆసరగా ఒక్కరు లేకపాయేగా తల్లి బొడ్డు పేగు ఘోసగాలకెందుకు దెలవకపాయే...కులం పేరుతో కళ్లద్దాలు పెట్టుకున్న మీకు తాగే నీరు పీల్చే గాలి నిలబడే నేల ఎపుడైనానువ్వు ఏ జాతివాడివని నిన్ను అడిగినాయా ? నీ వర్ణం ఏదని నిన్ను ప్రశ్నిస్తాయా..!అన్యం పుణ్యం తెలవనిగా బిడ్డా...నీ కులానికి అడ్డయిందా నీ వర్ణానికి వాదంగా మారిందాఅది బిడ్డారా... బిడ్డా..అమ్మ తొమ్మిది మాసాలు మోస్తేపుట్టింది కానీకులం పురిటి నొప్పులను










