ఫాసిస్టు రుతువులో కవి హత్య
*అత్యంత దుర్భరమైన జైలు జీవితానుభవాల తాకిడిని ఒడిసిపట్టుకొని, తన జీవన దృక్పథపు తెరచాపతో దృఢంగా నిలబడేందుకు చేస్తున్న సాహస ప్రక్రియే ఈ కవిత్వం. వాస్తవికమైన ఉద్వేగాల, విశ్వాసాల, ఆగ్రహావేశాల, కన్నీటి దుఃఖాల కాల్పనిక ప్రపంచమంతా చుట్టి వచ్చి తిరిగి జైలు గది నేల మీది నుంచి కవిత్వాన్ని సమున్నతంగా ఎత్తిపట్టే ప్రక్రియ ఇది. కాల్పనిక రూపం ధరించే మానవ విశ్వాసానికి ఎంత శక్తి వస్తుందో ఈ కవిత్వంలో చూడవచ్చు. కవిత్వమంటే సరిగ్గా ఇదే. అలవిగాని ఒంటరితనాన్ని అనంత మానవ సంబంధాల్లోకి, అతి సున్నితమైన, ఆర్ద్రమైన అనుభూతుల్లోకి, మానవులకు మాత్రమే సాధ్యమయ్యే అనుభవాల్లోకి, అంతకుమించి భవిష్యదాశలోకి మళ్లించడంకంటే కవిత్వానికి అర్థం










