కొత్త పుస్తకం

రేణుక నుంచి మిడ్కో దాకా

(ఐదు భాగాల  మిడ్కో సమగ్ర సాహిత్యంలో *మెట్ల మీద *, ప్రవాహం * కథా సంపుటాలకు సంపాదకురాలు రాసిన ముందుమాట. జూలై 18 ,శుక్రవారం హైదరాబాదులో జరిగే  అమరుల బంధు మిత్రుల సంఘం సభలో  ఆవిష్కరణ ) తెలుగు సాహిత్యానికీ, ముఖ్యంగా విప్లవోద్యమ సాహిత్యానికీ ఒక గొప్ప చేర్పు కామ్రేడ్‌ గుముడవెల్లి రేణుక (మిడ్కో) సాహిత్యం. రేణుక కథల వల్లే మిడ్కో అంటే మిణుగురు అని అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ కథలు తెలుగు సాహిత్యానికే పరిమితం కావు. పలు భారతీయ భాషల ద్వారా దేశమంతటా ప్రయాణం మొదలుపెట్టాయి. దేశ సరిహద్దులను దాటి విశ్వవ్యాప్త పాఠకులను సంపాదించుకుంటున్నాయి. ఆ
కొత్త పుస్తకం

హిందూమతం అబద్ధమని ఒప్పించే రచన

సి.యస్‌.అర్‌.ప్రసాద్‌ అనువాదం చేసిన  దివ్యా ద్వివేది, షాజ్‌ మోహన్‌, జె.రెఘు కలిసి రాసిన హిందూయిజం ఒక అబద్ధం అనే రచన వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకోడానికి సైద్ధాంతికంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ ముగ్గురు వ్యాస రచయితలు హిందూ మతాన్ని, కుల వ్యవస్థను కలిపి చూశారు. అందుకే హిందూ మెజార్టీ వాదం అగ్రకులాల సృష్టి అనే ఉప శీర్షిక దీనికి ఉంది.             హిందూయిజాన్ని అర్థం చేసుకోడానికి అనేక చారిత్రక వాస్తవాలను వ్యాసకర్తలు ముందుకు తీసుకొచ్చారు.  హిందూత్వ సంస్కృతిక జాతీయవాద భావజాలాన్ని చారిత్రక  భౌతిక వాద దృక్పథంతో,  మార్క్సియన్‌ కోణంలో ఈ రచయితలు చూశారు. దీనికి  భారతీయ హిందూత్వ ఆధిపత్య
కొత్త పుస్తకం

రాయలసీమ ‘సాధన’ నవల

రాయలసీమకు జరిగిన విద్రోహానికి నవలా రూపం సాధన. తెలుగు నవలా ప్రస్థానంలో సాధన నవల ఒక మలుపు. ఈ నవలా రచయిత  అనంతపురం జిల్లాలోని శాంతి నారాయణ.  ఇది వరకు చారిత్రక నవలలు, మనో  వైజ్ఞానిక నవలలు, సాంఘిక రాజకీయ ఉద్యమ అస్తిత్వ నవలలు శాంతి నారాయణ రాశారు. సాధన నవల అస్తిత్వవాద నవల. రాయలసీమకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి పట్టిన నవల. అందుకేనేమో ఈ నవలకు గాయపడిన నేల అనే ట్యాగ్‌ ఉంచారు.             కోస్తా ప్రాంతం వారి వివక్ష వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీళ్లు, ఉద్యోగాలు తదితర అనేక విషయాలలో రాయలసీమకు
కొత్త పుస్తకం

విప్లవ చారిత్రక నవల

‘‘తమ తిరుగుబాటు ఒక జార్‌ని దించేసి మరో జార్‌ని, లేదా మరో పాలకుడ్ని సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదు. ఒక మహాలక్ష్యం కోసం ఉద్దేశించినది’’సెర్గీమాట The secret of beauty is the secret of life. The beauty of life is the beauty of struggle. (Y. Borev : Aesthetics, p.44& 46)(జీవిత రహస్యమే సౌందర్య రహస్యం. సంఘర్షణ సౌందర్యమే జీవిత సౌందర్యం) జీవితం, సంఘర్షణ, సౌందర్యం - ఇవి ఒక విడదీయరాని త్రయం. రచయిత నాగభూషణ్‌  రచించిన బృహన్నవల ‘‘డిసెంబరిస్టు ఖైదీ’’ ఒక చారిత్రక నవల. ఒక ఉద్యమ చరిత్రను ప్రతిబింబించిన
కొత్త పుస్తకం

కొత్త పాఠం

50 ఏళ్ల విరసం మహాసభల్లో కలిసిన ఒక ట్రాన్స్‌ సామాజిక కార్యకర్తతో ఒక రాత్రంతా జరిపిన సంభాషణ, అంతకు ముందే జరిగిన హైదరాబాద్‌ ప్రైడ్‌ మార్చ్‌, అడపాదడపా బిట్టూతో పంచుకున్న విషయాలు కొత్త లోకంలోకి తలుపులు తెరిచాయి. అమ్మాయి ఇలా ఉండాలి, అబ్బాయి ఇలా ఉండాలని నిర్దేశించే సామాజిక నీతి పట్ల చికాకు, జెండర్‌ స్టీరియోటైప్‌కు భిన్నంగా ఉండే వ్యక్తుల పట్ల ఆసక్తి నా రాజకీయ అవగాహనతో సంబంధం లేకుండా మొదటి నుండీ ఉండేవి. మార్క్సిజం పరిచయమయ్యాక మానవ సంబంధాలను అర్థం చేసుకునే తీరు తెలిసింది. ఒక ఆలోచనా దృక్పథం ఉన్నంత మాత్రాన అన్నీ సులువుగా అర్థం కావు.
కొత్త పుస్తకం

జీవితానుభవాన్ని ఎర్రజెండాలా ఎగరేసిన కవిత్వం

రాజకీయ కవితలు రాయడం చాలా కష్టం. అందులోనూ కమ్యూనిజం లేదా ఇప్పుడు పాలకులు పదేపదే  ఉఛ్ఛరిస్తున్న అర్బన్ నక్సల్ అవగాహనతో కవిత్వం రాయడం ఇంకా కష్టం. ఇలాంటి కవిత్వం లో రెండు అంశాలు ప్రధానంగా కనబడతాయి. నేరుగా ప్రజాపోరాటాలతో, జనజీవితంతో సంబంధం ఉండడమూ, వాటి రూప సారాలను మార్క్సిజం ఆధారంగా అర్థం చేసుకునే చారిత్రక అవగాహన కలిగి ఉండడమూ. నేను చూసిన, పరిచయమున్న ఇలాంటి పెద్దలలో అరుణ్ సార్ ఒకరు.            తాను నమ్మిన విప్లవ పంధా నుంచి, ఈ సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఇసుమంత కూడా పక్కకు ఒరగని నేపధ్యం నుంచి ఎలాంటి కవిత్వం ఆశించగలమో అలాంటి
కొత్త పుస్తకం సమీక్షలు

రంగులన్నీ  సమానమే  యింద్రధనుస్సులో

లింగభేదం యింద్రధనుస్సు లో రంగుల మధ్య భేదం లాంటిది. నేను వొక రంగును కరెక్టు గా గుర్తు పట్టానా లేదా అన్నది అసలు సమస్యే కాదు. అన్ని రంగులకీ సమానమైన విలువ యివ్వడం - ప్రతి రంగుకీ సమాన హోదాలో గుర్తించబడే అవకాశం వుండటం అదీ ముఖ్యమైన విషయం. జన్యుపరంగా, లింగ అభివ్యక్తిపరంగా, లైంగిక గుర్తింపుపరంగా  యే విధమైన లక్షణాలు వున్నప్పటికీ సమానంగా గుర్తించబడే హక్కు ప్రతి వ్యక్తికి వుండాలి. విరసం ప్రచురించిన బిట్టూ కె. ఆర్. రచించిన పి.వరలక్ష్మి గారు అనువదించిన “రెయిన్ బో లైంగిక వైవిధ్యాలు”  పుస్తకాన్ని చూసినప్పుడు “ట్రాన్స్ జెండర్ అనేది కేవలం వొక
కొత్త పుస్తకం సాహిత్యం వ్యాసాలు

విప్లవ సాహిత్య విమర్శకు విలువైన చేర్పు

నాగేశ్వరాచారి మూడు దశాబ్దాలకు పైనే పరిచయం, స్నేహం. గద్వాల నుంచి మొదలుపెట్టి కర్నూలు, హైదరాబాద్, అనంతపురం దాకా రాష్ట్రంలో ఎన్నెన్నోచోట్ల సాహిత్య సమావేశాల్లో కలుస్తూనే ఉన్నాం. అడపాదడపా తన రచనలు అరుణతార లోనో, మరొక పత్రికలోనో చూస్తూనే ఉన్నాను. కాని తనలో ఇంత నిశితమైన ఆలోచనాపరుడైన సాహిత్య విమర్శకుడు ఉన్నాడని ఈ పుస్తకంలోని దాదాపు ముప్పై వ్యాసాలు ఒక్కచోట చదివినప్పుడే తెలిసింది. విద్యార్థి ఉద్యమం ద్వారా సామాజిక ఆలోచనాచరణలోకి ప్రవేశించడం, విశ్వవిద్యాలయ విద్యలో తెలుగు భాషా సాహిత్యాలలో సుశిక్షితుడు కావడం, అధ్యాపక వృత్తిలో నిరంతర అధ్యయనానికీ, జ్ఞాన వితరణకూ అవకాశం రావడం, అనంతపురం వంటి సంక్షుభిత వాతావరణంలో విప్లవ
కొత్త పుస్తకం సాహిత్యం వ్యాసాలు

భూమి రంగు కవి

కాలం పొదిగిన కవిత్వమిది. ఈ కాలంతో సంఘర్షించిన కవిత్వమిది. కాల స్వభావపు ఆనుపానులను పట్టుకున్న కవిత్వమిది. ఈ దు:ఖిత కవి సమయాల్లోని వర్మ అంతరంగ సంచలనాలివి. ఆయన సృజన లోకపు చిత్తరువులివి.  మానవాళి అనుభవిస్తున్న రాపిడినంతా ఆయన తనలోకి వొంపుకొని రాశారు. తన ఊహాన్వేషణల వెంట మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ మన అనుభవాలనూ కవిత్వం చేశారు. మానవుడిగా, కవిగా ఆయనలోని అలజడినంతా మనకు పంచిపెట్టడానికి తన కాల్పనికతనంతా వెచ్చించారు.    వెరసి కవిగా వర్మ తన పరిణతినంతా పోతపోసిన సంపుటి ఇది. ఎవరీ భూమి రంగు మనుషులు? ఎక్కడి వాళ్లు? వాళ్ల కోసం వర్మ ఎందుకింత దు:ఖితుడవుతున్నారు? ఎలాంటి
కొత్త పుస్తకం సాహిత్యం

విప్లవాన్వేషణలో…..

ఇది విప్లవకారుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. 1925 ఆగస్టు 9న అంటే ఇప్పటికి తొంభై ఏడేళ్ల క్రితం కాకోరీ రైలునాపి ఖజానా కొల్లగొట్టిన విప్లవాకారుల బృంద నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. కాకోరీ కుట్ర కేసుగా ప్రసిద్ధమైన నేరారోపణలో శిక్షలు పడిన విప్లవకారుల కథ. వీరిలో రాంప్రసాద్ ‘బిస్మిల్’, అష్ఫఖుల్లా ఖాన్ ‘వారాసీ’, రాజేంద్రనాథ్ లాహిరి స్వయంగా ఖజానా కొల్లగొట్టిన ఘటనలో పాల్గొన్నవారు. వీరిలో రాజేంద్రనాథ్ లాహిరిని అప్పటి సంయుక్త రాష్ట్రాల (ఇప్పటి ఉత్తరప్రదేశ్) గోండా జైలులో నిర్ణీతమైన తేదీకి రెండు రోజుల ముందే 1927 డిసెంబర్ 17న ఉరి తీశారు. ఎందుకంటే అతన్ని నిర్ణీత తేదీకి ముందే