‘ఇప్పుడు కావల్సిన మనిషి’ జహీర్ భాయి
జహీర్ భాయి (జహీర్ అలీ ఖాన్) విషాదకర ఆకస్మిక మరణంతో దేశం ఒక ఉత్తమమైన, ప్రజాస్వామికవాదిని కోల్పోయింది. ముస్లిం మైనారిటీలకు దేశంలో ప్రజాస్వామ్య ఆవరణ (స్పేస్) పూర్తిగా మృగ్యమవుతున్న కాలంలో, ఆత్మ రక్షణ కోసం వాళ్లు కూడా మతవిశ్వాసాన్నే కవచంగానూ, ఆయుధంగానూ ఎంచుకోవాల్సిన స్థితి ఏర్పడిన కాలంలో హైదరాబాదులోని పాత నగరంలో ఒక ప్రజాస్వామిక ద్వీపంలా జహీర్ అలీ ఖాన్ ఒక కొవ్వొత్తి వెలిగించుకొని లౌకిక ప్రజాస్వామ్య భావజాలం గల మనుషుల్లోకి, నిర్మాణాల్లోకి తన ప్రయాణం మొదలుపెట్టాడు. చార్మినార్ నుంచి, సాలార్‌జంగ్ మ్యూజియం నుంచి ఇమ్లీబన్ బస్‌స్టాండ్‌కు వచ్చే తోవలో అబీద్ అలీ ఖాన్ మెమోరియల్ కంటి వైద్యశాలను



