నివాళి

ప్రపంచ పీడిత ప్రజల ప్రియ మిత్రుడు,విప్లవ రచయిత గూగీకి జోహార్లు

గూగీ వా థియాంగో తన 87 ఏళ్ల ధిక్కార జీవితాన్ని ప్రపంచ పీడిత ప్రజల బలమైన సాంస్కృతిక ప్రతిఘటనగా నిలిపి మే 28, 2025 న భౌతికంగా నిష్క్రమించాడు. తూర్పు ఆఫ్రికా కెన్యా దేశంలోని ఒక చిన్న తెగలో జన్మించిన గూగీ తన ప్రజల గురించి, వారి బాధల గురించి, అణచివేతల గురించి రాస్తే అది తమ గురించే రాసినట్లు తెలుగు పాఠకులు భావించారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా కెన్యా ప్రజల ‘మౌ మౌ’ గెరిల్లా పోరాటం తెలంగాణ సాయుధ పోరాటాన్ని తలపింపజేస్తుంది. అందులో పాల్గొన్న విప్లవ వీరుడి కుటుంబం గూగీ ది. ఆ కారణంగా ఆయన
నివాళి

కామ్రేడ్‌ కె. ముత్యం గారికి విప్లవ జోహార్లు

పోరాటాల సాహిత్య చరిత్ర పరిశోధకుడు, విలువైన రచనలు తెలుగు సమాజానికి అందించిన ప్రజాపక్ష రచయిత కె. ముత్యం గారికి జోహార్లు. అట్టడుగు ప్రజలు నిర్మించే చరిత్ర, సాహిత్య చరిత్ర మౌఖిక రూపాల్లోనే ఎక్కువగా నిక్షిప్తమై ఉంటుంది. ప్రజల నాల్కల మీద ఆడుతుంటుంది. అటువంటి గాథలను, మౌఖిక కళా రూపాలను అన్వేషిస్తూ పోతే మహోన్నత పోరాటం కొత్త అర్ధాలతో కళ్ల ముందు నిలుస్తుంది. ఆ పోరాటాలు చేసిన మట్టి మనుషుల సాహసం దృశ్యం కడుతుంది. పై నుంచి కాకుండా కింది నుంచి చరిత్రను లఖితబద్ధం చేసే శాస్త్రీయ విధానమిది. ముత్యం గారు పరిశోధక విద్యార్థిగా శ్రీకాకుళ ఉద్యమం, సాహిత్యం గురించి
నివాళి

Salutes to the fallen martyr. Glorious salutes tothe valiant warriorPrayag Manjhi!

Today morning, news emerged that security forces had killed Central Committee member of the Maoist Party and Adivasi warrior Prayag Manjhi, along with eight other activists, in a staged encounter near Lugu Hills, close to Lalpania in Bokaro district, Jharkhand. This is the first time I have heard the name of Prayag Manjhi, an Adivasi son who rose to the level of a Central Committee member. Among those killed alongside
నివాళి

అరుదైన విప్లవోద్యమ నాయకుడు కా. కోపా ఊసెండి

కామ్రేడ్‌ కోపా కాండె ఊసెండి ఆరు పదులు దాటిన మడిమతిప్పని విప్లవకారుడు. ఆయన విప్లవ ప్రస్థానం మూడు పదుల వసంతాలు. ఆయనకు ఇద్దరు భార్యలు. 9 మంది సంతానం. అయిదుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు. పుష్కలమైన బంధు వర్గం. ఆయన స్వగ్రామం ఏటపల్లి తాలూకాలోని పర్సల్‌ గొంది. ఆయన తండ్రి పేరు  కాండే, తల్లి పేరు  బుంగిరి. అది ఆదివాసీ గూడాలలో ఓ మోస్తర్‌ పెద్ద ఊరు కిందే లెక్క. ఊళ్లో 200 కడప వుంటుంది. ఆ ఊరు జిల్లాలోనే గనుల తవ్వకానికి ఆరంగేట్రం చేసిన సుర్దాగఢ్‌ పర్వత సానువుల వద్ద వుంటుంది. మార్చ్‌ 14తో కా. కోపా
నివాళి

ప్రజాన్యాయవాది, మానవహక్కుల నాయకుడు గొర్రెపాటి మాధవరావుకు నివాళి

నిజామాబాద్‌ జిల్లాలోనేగాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా న్యాయవాదిగా, మానవహక్కుల నాయకుడిగా, విప్లవాభిమానిగా గుర్తింపు ఉన్న గొర్రెపాటి మాధవరావు డిసెంబర్‌ 28న మృతి చెందారు. నేరమే అధికారమైపోయిన ఫాసిస్టు సందర్భంలో నిరపరాధులు, బలహీనులు, న్యాయం కోసం నిలబడినవాళ్లు ‘నేరస్తులుగా’ వేధింపులకు గురవుతున్న కాలంలో హక్కుల కార్యకర్తగా, న్యాయవాదిగా మాధవరావు అర్ధాంతరంగా వెళ్లిపోవడం చాలా పెద్ద నష్టం. ఆయన విప్లవ విద్యార్థి ఉద్యమాల చైతన్యంతో సామాజిక, రాజకీయ జీవితంలో ప్రవేశించారు. అందుకే విప్లవ విద్యార్థి ఉద్యమంలో సదా నిలిచి ఉండే జంపాల చంద్రశేఖర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ను స్థాపించారు. దాని ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాడు విప్లవోద్యమం అందించిన ప్రజాస్వామిక
నివాళి

చెదరని వర్గానుబంధం

కామ్రేడ్ అనితక్క అమరత్వ వార్త వినగానే ఒక్కసారిగా తన మాటలు, గురుతులు, ఆత్మీయత గురుతొచ్చింది. ఎప్పుడూ తన ముఖం పై చెరగని చిరునవ్వు, ప్రతి పనిలో సమష్టి భావన, ప్రతి కామ్రేడ్ తో పెనవేసుకొనిపోయే తత్వం కా.అనితక్క సొంతం. ప్రజలత్, సోదర కామ్రేడ్స్ తో ప్రేమ పంచుకోవడం తనకు ప్రజలు నేర్పిన విద్య. నేను దళంలోకి వచ్చిన మరుసటి రోజునే తెలంగాణ చరిత్ర పై క్లాసు మొదలైంది. క్లాసులో ‘‘నీవు కూడా కూర్చుంటున్నావు కదూ!’’ అంటూ కా.హరిభూషణ్ నన్ను అడిగాడు. ఆ క్లాసుకు ఆయనే టీచర్.  సభ్యుల నుండి డీవీసీ వరకూ అందులో పాల్గొన్నారు. ఆ క్లాసులో కా.
నివాళి

మానవాళి *ఆనంద*మే ఆయన శ్వాస

కా. ఆనంద్‌ (దూల దాద, కటకం సుదర్శన్‌) మే 31న అమరుడయినట్టుగా జూన్‌ 4న సాయంత్రం ఆకాశవాణి వార్తలు మోసుకొచ్చాయి. ఆ వార్త ఒక పిడుగుపాటు లాగే అయింది. అది అబద్దమైతే బాగుండనే ఆరాటంతో పదే పదే రేడియో విన్నాను. విప్లవోద్యమ  అధికార ప్రతినిధి కా. అభయ్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా ఆకాశవాణి ఆ వార్త చెప్పిందనేది కొద్ది క్షణాలలోనే స్పష్టంగా తేలిపోయింది. అతనితో నాకు వున్న ఆత్మీయానుబంధం, స్నేహ బంధం, వర్గానుబంధం, తన జ్ఞాపకాలు ఒక్కసారిగా మనసంతా ముసురుకుపోయాయి. విప్లవ పయనంలో ఎప్పటికైనా తప్పక కలుస్తాడు అనే దృఢ విశ్వాసంతో వున్న నాకు ఆయన
నివాళి

జహీర్‌ అలీఖాన్‌కు విరసం నివాళి

ఈ ఖాళీ ఇప్పట్లో భర్తీ అయ్యేదేనా? ఒక మత సమూహం మీద ఉగ్రవాదులని ముద్రవేసి, హీనపరిచి అభద్రతకు గురి చేస్తున్న రోజుల్లో అక్కడి నుంచే వచ్చిన లౌకిక ప్రజాస్వామికవాది జహీర్‌ అలీఖాన్‌ అకాల మరణం తీరని లోటు. కాలం అన్ని ఖాళీలను భర్తీ చేస్తుందనే భరోసా పెట్టుకోగలం కాని, జహీర్‌ అలీఖాన్‌లాంటి పాత్రికేయుడు, బుద్ధిజీవి, లౌకికవాది ఇప్పుడప్పుడే వస్తారని అనుకోగలమా? గతం కంటే ఎక్కువ వత్తిడితో జీవిస్తున్న ముస్లింలకు అండగా నిలవగలవాళ్లు రాగలరా? హిందూ ముస్లిం భాయీ భాయీ అనే జీవన సందేశాన్ని ఆచరణలో బతికించగల జహీర్‌ అలీఖాన్‌ వంటి వ్యక్తులు అన్ని వైపుల నుంచి అత్యవసరమైన కాలం
నివాళి

బ్రాహ్మణీయ వ్యతిరేక సాంస్కృతిక, మేధో ఉద్యమంలో డా. విజయ భారతి

బి. విజయ భారతి సెప్టెంబర్‌ 28 ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు ప్రజల ఆధునిక సాహిత్య సాంస్కృతిక, మేధో ఉద్యమంలో ఆమె స్థానం చిరస్మరణీయమైనది. బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలానికి, సంస్కృతికి వ్యతిరేకంగా వందల, వేల ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని విజయభారతి తన రచనలతో చాలా విశాలం చేశారు. ముందుకు తీసికెళ్లారు. దీన్ని ఆమె ప్రధానంగా రెండు మార్గాల్లో కొనసాగించారు. ఒకటి: కుల వ్యవస్థ, సనాతన ధర్మం, పితృస్వామ్యం.. సామాజికంగా వ్యవస్థీకృతం కావడానికి, భావజాలపరంగా, సాంస్కృతికంగా నిరంతరం పునరుత్పత్తి కావడానికి సాధనంగా పని చేస్తున్న పురాణాలను ఆధునిక, బ్రాహ్మణీయ వ్యతిరేక దృక్పథంతో విమర్శనాత్మకంగా చూసి విశ్లేషించడం. రెండు: కుల వ్యవస్థకు
నివాళి

విరసం తొలితరం సభ్యుడుతన్నీరు కోటయ్య (జ్యోతి)కు నివాళి

విరసం తొలి దశలో సభ్యుడిగా ఉండి, అనంతరం నెల్లూరులో న్యాయవాదిగా పని చేసిన కోటయ్య ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన కవి, వ్యాస రచయిత. జ్యోతి పేరుతో రచనలు చేశారు. విప్లవ కవిత్వ చరిత్రలో నిషేధానికి గురై గుర్తుండిపోయే ‘లే’ కవితా సంపుటిలో ఆ శీర్షికతో కోటయ్య రాసిన కవిత ఉంది.   ఆయన  మొదట్లో తిరుపతి  ఎస్వీ యూనివర్సిటీలో టైపిస్టుగా పని చేస్తుండే వారు. ఎమర్జన్సీలో అరెస్టు కావడంతో ఉద్యోగం పోయింది.  ఆ తర్వాత తెలుగు ఎం.ఎ. చదివారు. తర్వాత ‘లా’ చేసి లాయర్‌ గా స్థిరపడ్డారు. విరసం సభ్యుడిగా కొనసాగకపోయినా చివరి దాకా విప్లవోద్యమ సానుభూతిపరుడుగా