ఇంటర్వ్యూ

పదముగ్గురు నక్సలైట్ల ఎన్‌కౌంటర్ బూటకమేనా?

(నిజ నిర్థారణకు వెళ్ళి వచ్చాక బస్తర్ జంక్షన్ అనే యూ ట్యూబ్ ఛానెల్ తో సంభాషణ. హిందీ  వీడియోకి తెలుగు అనువాదం) బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని, ఘటనా స్థలం నుంచి ఎల్‌ఎమ్‌జి వంటి ఆటోమేటిక్ ఆయుధాలు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయి నివేదిక కూడా చేశాం.. మీరు మా గత నివేదికలు చూడవచ్చు. ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సందేహాలు తలెత్తుతున్నాయి, పోలీసుల వ్యవహార శైలి, వారి వాదనలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి, పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి, ఈ ప్రశ్నలు
సాహిత్యం సంభాషణ

‘భగ్నమైన స్వేచ్ఛ’: ఒక భగ్న భావజాలం

('Fractured Freedom': One Fractured Ideology ) (కోబ‌డ్‌గాంధీ జైలు ర‌చ‌న ఫ్రాక్చ‌ర్డ్ ఫ్రీడం. దీనిపై  మ‌నీష్ ఆజాద్  *ది కోర‌స్‌*లో స‌మీక్ష రాశారు. కోబ‌డ్ గాంధీ దానికి స్పందించారు. ఆయ‌న అభిప్రాయాల‌పై తిరిగి మ‌నీష్ ఆజాద్ రాశారు. ఈ మూడు ర‌చ‌న‌ల‌ను తెలుగు పాఠ‌కుల కోసం వ‌రుస‌గా ఇస్తున్నాం... వ‌సంత‌మేఘం టీం) కోబాడ్ గాంధీ జైలు డైరీ చదువుతున్నంతసేపూ,  ఆయన జీవన సహచరి అనురాధ గాంధీ ఈ పుస్తకాన్ని చదివి వుంటే కనక ఆమె  స్పందన ఎలా ఉండేది అనే భావన వెంటాడింది. ‘బీహార్-జార్ఖండ్‌లోని నక్సలైట్ ఉద్యమం ఈ రోజు మాఫియా ఉద్యమంగా మారిపోయింది, [ఆమె 12
సంభాషణ

Mother’s anguish

That was January 2024 New Year. The world was full of happiness. Some people drunk at 12 midnight, may have drunk again in the morning before the dizziness subsided and drowned in happiness. We adivasis do not know such things. We have since 2005, tears of hardship, Greenhunt since 2017, Samadhaan since 2022 and then Surajkund attack. We don't know what the new year means. All we know is how
సంభాషణ

తల్లి ఆవేదన

అది జనవరి 2024 కొత్త సంవత్సరం. ప్రపంచం సంతోషంలో మునిగి ఉంది.  కొంతమంది రాత్రి 12 (ఉదయం అనుకోవచ్చు) తాగిన మైకం గూడ దిగక ముందే పొద్దున మళ్ళీ తాగి సంతోషంతో మునిగి పోయి వుండొచ్చు. మాకు ఆదివాసులకు అలాంటివి తెలియవు. మాకు 2005 నుండి, కష్టాలు కన్నీళ్ళ, తర్వాత గ్రీన్‌హంట్‌ 2017 నుండి సమాధాన్‌ 2022 నుంచి సూరజ్‌కుండ్‌ దాడి  జరుగుతూనే వుంది. అందుకే కొత్త సంవత్సరం అంటే మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఈరోజు మంచిగా ఎలా గడుస్తుందనే. అదే మాకు  మంచి రోజు. ఎందుకంటే భారతదేశంలో కాశ్మీర్‌ తర్వాత ఎక్కువ కేంద్ర బలగాలు ఉన్నది
సంభాషణ

బందీ అయిన గణతంత్ర రాజ్యంలో ఒక ఖైదీ భార్య

భర్తను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఆ గృహిణి జీవిత కథనం తన ముగ్గురు పిల్లలను నిద్ర లేపడం, వారిని, అందులోనూ ప్రత్యేకించి ఏడేళ్ల పిల్లవాడిని ఆన్‌లైన్ తరగతులకు కూర్చోబెట్టడం,  వారు తమతమ స్థలాల్లోనే కూర్చునేట్లుగా చూడడం, క్లాసు జరుగుతున్నప్పుడు వీడియో గేమ్‌లు ఆడకుండా, నిద్రమత్తులోకి జారిపోకుండా లేదా కొట్లాడుకోకుండా చూసుకోవడం లాంటి పనులతో ఉదయం పూట కొంచెం హడావిడిగా ఉంటుంది: గత 17 నెలలుగా ఇదంతా ఒంటరిగా చేస్తూండడంతో ఆ హడావిడి మరింత ఎక్కువవుతుంది. ఆమెకు పెళ్లై 14 వ సంవత్సరాలయింది. 2007 లో వివాహ ప్రతిపాదన వచ్చినప్పుడు, కనీసం ఒక్కసారైనా విడిగా కలిసి మాట్లాడుకోవాలనుకున్నారు,
సంభాషణ

హస్ దేవ్ బచావో  సభా వేదికకు నిప్పు

సర్గుజా. ‘జల్, జంగల్, జమీన్’ను కాపాడేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా డివిజన్‌లో కొనసాగుతున్న సుదీర్ఘ ఉద్యమాన్ని అణచివేయడానికి అక్కడి నిరసన ప్రదేశానికి నిప్పు పెట్టారు. నిరసన స్థలంలో నిర్మించిన గుడిసెలాంటి టెంట్‌ను దగ్ధం చేశారు. 750 రోజుల పాటుగా  కొనసాగుతున్న ఉద్యమం: సర్గుజా డివిజన్‌లోని ఉదయపూర్ బ్లాక్‌లోని హరిహర్‌పూర్ గ్రామంలో 750 రోజులుగా "హస్దేవ్ బచావో సమితి" ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. "హస్దేవ్ బచావో సమితి" బ్యానర్ క్రింద, ఛత్తీస్‌గఢ్ ఊపిరితిత్తుగా పిలువబడే హస్దేవ్ అరణ్యాన్ని రక్షించడానికి ఉద్యమం జరుగుతోంది. ఇందులో స్థానిక గిరిజన ప్రజలే కాకుండా పర్యావరణానికి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొంటున్నారు. ఆదివారం, ప్రజలు నిద్రిస్తున్న సమయంలో, హరిహర్‌పూర్‌లోని
సంభాషణ

అపురూప మాన‌వి సుమ‌తి మీకు తెలుసా?

సుమ‌తి గురించి అంద‌రికీ తెలియాలి. అంత అద్భుత మ‌హిళ ఆమె. మొద‌ట ఆమె చాలా మామూలు మ‌నిషి. కానీ లోకాన్ని తెలుసుకున్న‌ది. త‌న‌నుతాను తెలుసుకున్న‌ది. పితృస్వామ్యాన్ని అర్థం చేసుకున్న‌ది. మాతృత్వ భావ‌న‌ను స‌హితం అధిగ‌మించి నూత‌న మాన‌వి అయిన‌ది.  వ్య‌వ‌స్థ సంకెళ్ల‌ను తెంచుకున్న‌ది.  ఎంత ప‌రిణామం జ‌రిగి ఉండాలి!  భౌతిక‌, భావ‌జాల ప్ర‌పంచంలో ప్ర‌జ‌లు సాగిస్తున్న మ‌హాద్భ‌త పోరాటాల ప్ర‌మేయం లేకుండా ఆమె కామ్రేడ్ సుమ‌తిగా ప‌రివ‌ర్త‌న చెందాదా?  మాన‌వ‌జీవితాన్ని విలువ‌ల‌, విశ్వాసాల ప‌రివ‌ర్త‌నా క్ర‌మంలో చూసే సాహిత్య‌కారుల‌కు త‌ప్ప‌క సుమ‌తి తెలిసి ఉండాలి. అందుకే నాకు తెలిసిన కామ్రేడ్ సుమ‌తి గురించి నాలుగు మాట‌లు మీతో.  సుమతి 
ఇంటర్వ్యూ

ఉపా లేకుంటే ఈ రాజ్యం మ‌నుగ‌డ క‌ష్ట‌మే

దేశ‌మంతా ఉపా విస్త‌రిస్తోంది. ఎవ‌రి మీదైనా చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం కింద కేసు పెట్ట‌వ‌చ్చు. ఎవ‌రి మీదికైనా ఎన్ఐఏ అనే ద‌ర్యాప్తు సంస్థ వెళ్ల‌వ‌చ్చు. ఇదంతా కాక‌తాళీయంగా జ‌రుగుతున్న‌ది కాద‌ని, దీని వెనుక భార‌త రాజ‌కీయార్థిక వ్య‌వ‌స్థ‌లోని సంక్షోభాలు, ప్ర‌జా పోరాటాల ఒత్తిళ్లు  ఉన్నాయ‌ని, యుఏపీలే లాంటి పాసిస్టు చ‌ట్టాలు లేకుంటే భార‌త రాజ్యం మ‌నుగ‌డ సాధ్యం కాని ప‌రిస్థ‌తి ఏర్ప‌డింద‌ని పౌర‌హ‌క్కుల నాయ‌కుడు చిలుకా చంద్ర‌శేఖ‌ర్ అంటున్నారు.  1) యుఏపీఏ చట్టం తీసుకుని రావటం వెనుక ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం ఏమిటి ?   ప్రభుత్వాలు తమ రాజకీయ సుస్థిర‌త  కోసం చట్టాలను చేస్తూ ఉంటాయి. ఈ
సంభాషణ

తెలుగు రచయితలారా.. బుద్ధిజీవులారా

ఆపరేషన్‌ కగార్‌ మనందరిపై సాగుతున్న కార్పొరేట్‌ ఫాసిస్టు యుద్ధం- దండకారణ్య మూలవాసీ రచయితలు, కళాకారులు ఐక్య ఉద్యమాలతో ఓడిద్దాం.. పోరాట కళా సాహిత్యాలను సృజిద్దాం హిందుత్వ కార్పొరేట్‌ ఇండియాకు వ్యతిరేకంగా భారత ప్రజల పక్షాన నిలబడదాం దండకారణ్యానికి తెలుగు రచయితలకు, మేధావులకు దగ్గరి సంబంధం ఉంది. తెలుగు ప్రాంతాల నుంచి విప్లవకారులు వచ్చాకనే సువిశాల బస్తర్‌లోని, గడ్చిరోలీలోని ఆదివాసీ కళలు బైటి ప్రాంతాలకు పరిచయం అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న యుద్ధం మమ్మల్ని సమూలంగా నిర్మూలించడంతోపాటు మా కళలను ధ్వంసం చేయడానికి కూడా నడుస్తున్నది.  కగార్‌ పేరుతో సాగుతున్న ఈ యుద్ధం మా ఒక్కరి మీదే జరుగుతున్నదని మేం
సంభాషణ

ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబాకు న్యాయం జరగాలి

2022 డిసెంబర్ 5 ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బాంబే హైకోర్టు యిచ్చిన విడుదల ఉత్తర్వులను సస్పెండ్ చేయడాన్ని పునఃపరిశీలించాలని, హైకోర్టును ఉత్తర్వును  పునరుద్ధరించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ 18 మానవ హక్కుల సంస్థలతో కలిసి స్కాలర్స్ ఎట్ రిస్క్ ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబ క్షేమాన్ని గురించి  తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ఈమెయిలు ద్వారా గౌరవనీయులైన ధనంజయ వై. చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తి 2022 డిసెంబర్ 5 విషయం: ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబాకు న్యాయం చేయడం గురించి (డైరీ నం. 33164/2022) ప్రియమైన జస్టిస్ చంద్రచూడ్ గారికి, అహింసాయుతమైన భావవ్యక్తీకరణచేసినందుకు ప్రతీకారంగా జైలు జీవితం గడుపుతున్న ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా క్షేమం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తపరిచేందుకు, ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బాంబే హైకోర్టు విడుదల ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, హైకోర్టు