కథలు గల్పిక

దేశాంతరం!

కరోనా కాదుగాని బడీ లేక బయట ఆడుకోవడానికీ లేక పొద్దస్తమానమూ ఇంట్లో టీవీ చూస్తూ కాలం గడిపేస్తుంటే పరీక్షా కాలం కాస్తా వచ్చేసింది! “భారతదేశానికి సరిహద్దులు తెలపండి?” ప్రశ్నపత్రంలోని ప్రశ్న! “భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, ఉత్తరాన హిమాలయా పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి” జవాబు రాసిన విద్యార్థికి జీరో మార్కులు వేశారు మాస్టారు! చదివి రాసిన విద్యార్థి డంగైపోయాడు! “టిక్రి, సింఘు, గాజీబోర్డర్” అని జవాబు రాసిన మిగతా విద్యార్థులను మాస్టారు మెచ్చుకొని ఎన్నికి అన్ని మార్కులూ వేసేశారు! టీవీలూ పేపర్లూ చూసి రాసిన విద్యార్థులు పొంగిపోయారు! “దేశ సరిహద్దులు మారిపోతాయా?” ఆశ్చర్యపోతూ
ఎరుకల కథలు

ప్రయత్నం

దుర్గమ్మ గుడి ముందు  -  ఇందిరమ్మ ఎస్.టి. కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు.మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది. ఆ పంచాయతీలో ఉపాధిహామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్ రమణ వేపచెట్టు నీడలో చాపపరిచి కూర్చుని ఉన్నాడు. రెండు పాతచాపలు  ఒకదాని పక్కన ఒకటి పరచబడి ఉన్నాయి. ఆ రెండు చాపల చుట్టూ నాలుగు ఇనుప కుర్చీలు, రెండు ప్లాస్టిక్ కుర్చీలు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి. చాపపైన తెల్లకాగితాలు, గ్రామసభ రిజిష్టరు, హాజరు పట్టిక, ఇంక్ ప్యాడ్, ప్లాస్టిక్ సంచిలో కొన్ని అర్జీలు రమణ ముందుపేర్చబడ్డాయి.
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఈ మోహన్రావున్నాడు చూడండీ..!

అవును... మీరందరూ వినాలి. నేనెలా చనిపోయానో నేను మీకందరికీ చెప్పి తీరాలి. నా కథ మీకు వింతగా కనిపించవచ్చు పోనీ ఒఠ్ఠి చోద్యంగానూ అనిపించవచ్చు. నాలాంటి స్త్రీల కథలు ఎవరు రాస్తారో తెలీదు కానీ ఒకవేళ రాస్తే మాటుకు రాసిన వాళ్ళని కూడా మీరు తెగడతారు. ఒఠ్ఠి బలుపు... బూతూ రాస్తుందీవిడ అని ఆమెను పాపం మనస్తాపానికి గురి కూడా చేయవచ్చును మీరంతటి వాళ్లే సుమా! ఇంతకీ నేనెలా పోయానో మీకు చెప్పాలి. ఈవిడేదో మళ్ళా ఒక పురుషుడ్నో... అంటే భర్తని విలన్‌గా నిలబెడ్తుందని మీరనవచ్చు కానీ నా కథలో ఇది నిజమే. అవును మరి నిండు నూరేళ్లు