ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం: పరిణామాలు
సామ్రాజ్యవాద యుగంలో దేశాల మధ్య యుద్ధాలు సరిహద్ధుల మధ్య జరిగే సైనిక ఘర్షణలు కేవలం ఆధిపత్యం కోసమే కాదు. ప్రతి యుద్ధం వెనుక ఒక ఆర్థిక ప్రయోజనం, మార్కెట్ ఆధిపత్యం, వనరుల దోపిడీ దాగి ఉంటుంది. ప్రపంచ దేశాల మార్కెట్లపై, సహజ వనరులపై ఆధిపత్యం సాధించడానికి సామ్రా జ్యవాద దేశం పరాయి దేశంపై ఆక్రమణ యుద్ధం చేస్తుంది. అందువల్లనే లెనిన్ ‘సామ్రాజ్యవాదం అంటే నే యుద్ధం’ అన్నాడు. యుద్ధం అనేది అకస్మాత్తుగా జరిగేది కాదు. పెట్టుబడిదారీ విధానం విస్తరణలో అది ఒక భాగం. మార్కెట్లు స్తంభించిపోయినప్పుడు ‘పెట్టుబడి’ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటుంది. ఆ సంద ర్భంలో కార్పొరేట్ సంస్థలు,










