ఆర్ధికం కాలమ్స్

అమ్మకానికి దేశం – దళారిగా ప్రభుత్వం

మనది ప్రజాస్వామ్య లౌకిక సర్వసత్తాక గణతంత్ర దేశం. గణతంత్ర రాజ్యమంటే యావత్తు దేశం స్వీయ సంపుష్టి పొందడం. స్వావలంబన (ఆత్మనిర్భర్‌) అంటే స్వంత వనరులు, స్వంత పరిజ్ఞానం, స్వంతశ్రమతో ఉత్పత్తి చేసి వినియోగించడంగా ఉంటుంది. దీనికోసం పౌరులకు స్వేచ్చ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. ఇప్పుడు ఈ రెండూ ప్రమాదంలో ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశ వనరులను, దేశ సంపదను, దేశ శ్రమను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేసేవిధంగా ఉంది. గణతంత్ర దేశంలో ప్రజలే విదాన నిర్ణయ కర్తలు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సమాజ సంపుష్టితత్వం కోసం ప్రధాన రంగాలైన
సమకాలీనం

వాళ్లిద్దరి విడుదల గురించీ నినదించలేమా?

చిలకలూరిపేట బస్సు దహనం కేసు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 1993 మార్చి 8న జరిగిన ఆ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో సాతులూరి చలపతిరావు, గంటెల విజయవర్ధనరావులు అరెస్ట్ అయ్యారు. వారిద్దరూ గుంటూరు కోబాల్డ్ పేట కు చెందిన దళిత యువకులు. కేవలం ఆర్ధిక అవసరాల కోసం ఇతరత్రా డబ్బులు దొరకని అప్పు పుట్టని పరిస్థితుల్లో వారు దోపిడీ చేయాలనుకున్నారు. అలాంటి ఆలోచనలకు ఆ ఇద్దరూ నెట్టివేయబడడానికి కారణం ఖచ్చితంగా సమాజమే. ఈ విషయం కన్వీనియంట్ గా మర్చిపోతాంగానీ ... ఇదే అసలు సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది. బస్సు దహనం జరిగిన సందర్భంగా 23
కథావరణం కాలమ్స్

వాస్తవాన్ని వాస్తవం అని చెపుతున్న ఒక ఏనుగుల రాజ్యం కథ “స్వాములొచ్చారు”

ఏనుగుల దాడుల వల్ల పంటల్ని, రైతుల్ని కోల్పోతున్న దేశంలోని అనేక కల్లోలిత ప్రాంతాల్లో రాయలసీమ లోని చిత్తూరు జిల్లా ఒకటి. అటువైపు తమిళనాడు, ఇటువైపు కర్ణాటక మధ్య  చిక్కిపోతున్న దట్టమైన అడవులు.అంతకంతకూ అడవుల మధ్య మెరుగవుతున్న రవాణా సౌకర్యాలు.. చదునవుతున్న కొండలు గుట్టలు, మాయమవుతున్న వృక్షసంపద, అడుగంటిపోతున్న చెరువులు, కుంటలు, అడవులకు ఆనుకుని ఉండే పల్లెల్లో ఆహారం కోసం ఏనుగుల రాక వల్ల , తమ ప్రాణాలు కంటే విలువైన పంటలను కాపాడుకోవటానికి రైతులు చేసే పోరాటం, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ ముఖ్యమంటున్న ప్రభుత్వం, జీవనం కోసం ఏనుగులతో యుద్ధం చేసే పరిస్థితిలో రాయలసీమ రైతాంగం.. ఒక
ఓపెన్ పేజీ కాలమ్స్

అందోళనాజీవుల కాలమిది

హిందుత్వ ఫాసిజమనే విష వృక్షం రోజు రోజుకు తన వేర్లను సమాజ లోతుల్లోకి చొప్పించి తన పునాదిని గట్టిపర్చుకుంటుంది. తన శాఖలను విస్తరించుకుంటూ పాలనా, చట్టం, న్యాయం, మీడియా అన్నింటిని తన నీడ కిందికి తెచ్చుకుంటుంది. మన సమాజంలో చారిత్రకంగా (వందల సంవత్సరాలుగా) అనేక రూపాలలో కొనసాగుతున్న అధిపత్య భావనలు (కుల దురాహంకారం, పితృస్వామ్యం, మత పెత్తనం)  హిందుత్వ విష వృక్షపు వేర్లకు సత్తువనిస్తున్నాయి. ఆ విష వృక్షం ఈ రోజు దోపిడీ కుల, వర్గాల అండదండలతో అధికారం చేజిక్కించుకొని తన ఫాసిస్టు నిజ స్వరూపాన్ని నగ్నంగా ప్రదర్శిస్తుంది. అయితే ఈ రోజు కాకపోతే రేపు ఆ విష
సమకాలీనం కాలమ్స్

సైన్స్ పరిశోధనా సంస్థకు ఫాసిస్టు పేరా!

ప్రపంచంలో చాలా దేశాలలో ఆయా రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారి పేర్లను సాధారణంగా వారి మరణానంతరం ఆయా సంస్థలకో లేదా మరో రంగానికో వారి పై గౌరవంతోనో వారికి గుర్తింపు గానో పెట్టడం జరుగుతుంది. భారతదేశంలోను ఆ ఆనవాయితి కొనసాగుతున్నది. పాలక వర్గాలు మారినప్పుడల్లా వారి భావజాల ప్రతినిధుల పేర్లను ఎక్కడో ఒక చోట తగిలించడం అలవాటు చేసుకున్నారు. ప్రజాజీవితంలో ఉండి వారి ప్రయోజనాలకు పాటుబడిన వారిని అలా గుర్తుంచుకోవాలంటే పేచీ ఏమి ఉండదేమో గాని మొత్తంగా వారి జీవితకాల ఆచరణకు పొసగని లేదా విరుద్ధమైన రంగాలకు వారి పేరు పెట్టడం చాలా కాలం క్రితమే మొదలయింది.
కవి నడిచిన దారి కాలమ్స్

ధ్వ‌నిలోంచి క‌వ‌నంలోకి

నాకు శబ్దం అంటే చాలా ఇష్టం. కవిత్వం కంటే మొదట బాణీలను ప్రేమించినవాడిని. ఇప్పటికీ పాటలోని కవితాత్మక వాక్యాల కంటే సంగీతమే మహా ఇష్టం.అవి నేను స్కూల్ డేస్ లో ఉన్న రోజులు. చీకట్లో వుండటాన్ని భలే ఇష్టపడే రోజులు. వీధి దీపాలు సరిగ్గా వెలగని రోడ్లను వెత్తుక్కొని మరీ ఒంటరిగా ఉండటం వల్లే నాలో పాట మొదలయ్యింది. నడవటం బాగా అలవాటు. గంటలు గంటలు నడిచే అలవాటు ఇప్పటికీ అలాగే వుంది. ఒకరకంగా ఈ ఒంటరి నడకే నన్ను బతికిస్తుంది. ఈ నడకే నా ఆరోగ్యాన్ని దెబ్బ తీసే రోజొకటి వుందని నాకూ స్పృహలోకి వచ్చింది. అలా
కథావరణం కాలమ్స్

“సాహిత్య సమాజ సంబంధాల విశ్లేషణ కె.వి కూర్మనాథ్ కథలు”

జీవితాలు ఉద్యమాలే కాదు మరణాలు కూడా మనకు చాలా పాఠాలు చెబుతాయి. జీవితం కన్నా  మరణం చాలా గొప్పది. విప్లవకారుడి, ఉద్యమకారుడి మరణం ఒక చరిత్ర.  అంతులేని గాయాలు అంతు తెలియని సత్యాలు, ఎన్నో అనుభవాలు వైఫల్యాలు పోరాటాలు విజయాలు వ్యధలు దుఃఖాలు ఇవన్నీ కలగలిసిన చరిత్ర ఒక వీరుడి మరణం. ఒకానొక చారిత్రక సందర్భంలో ఇక్కడ నిలబడి వెనుదిరిగి చూసుకుంటే, ఉద్యమం వెనుక కారణాలు, ఉద్యమం బలపడిన సందర్భాలు, ఉద్యమం బలహీన పడిన సందర్భాలు, ఆటుపోట్లు వెన్నుపోట్లు ఆంక్షలు నిర్బంధాలు అణచివేతలు, వ్యక్తులు అదృశ్యం కావడం, మనుషులు శవాలుగా మారటం, శవాలు కూడా కనిపించకుండా పోవడం.. అనేక
కథ..కథయ్యిందా! కాలమ్స్

నాన్నా కతచెప్పవూ…కథ

రాప్తాడు గోపాలకృష్ణ  నాన్నా కతచెప్పవూ , కథ రాప్తాడు గోపాల కృష్ణ ది.అతడుబయలుదేరాడు , కథా సంపుటి లోది.ఈ కథ నిద్ర పోవడానికి రాత్రుళ్లు కథలడిగే పిల్లవాడి కోరిక.బిడ్డడిని నిద్రపుచ్చడానికి ఒక తండ్రి తలకెత్తుకునే బాధ్యత.అంతకుమునుపే నిద్రపుచ్చడానికి యెన్నో కథలు చెప్పాక , నిద్రపుచ్చడంలో విఫలమయ్యాక , ఆఖరుగా యీ కథ చెబుతున్నట్టూ , దీని తర్వాత యిక కథలడక్కుండా నిద్రపోయితీరాలనే ఒప్పందంతో యీ కథను బయటికి తీసాడు, యీకథలోని తండ్రి.ఆమేరకు యిది కథలోని కథ.ఈకథ చెప్పడంలో తండ్రి కి ఒక లక్ష్యం వుంది.అలాగే యీ కథలల్లుతున్న కథకుడికీ లక్ష్యముంది.అది రెండంచుల కత్తిలాంటి లక్ష్యం.ఆ కథలోని కొడుకును నిద్రపుచ్చడమనేది
సమకాలీనం వ్యాసాలు కాలమ్స్

దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను
ఆర్ధికం కాలమ్స్

పెరుగుతున్న అస‌మానతలు పెట్టుబడి దోపిడీకి సంకేతం

ఆదాయం, సంపద పంపిణీలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష్మ, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‌ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతోపాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో