కథనం

విప్లవానికి వెలుగునిచ్చే అమ్మ ప్రేమ…

‌‌నవ మాసాలు మోసి   జన్మనిచ్చిన పిల్లలపై  ఏ అమ్మకు ప్రేమ ఉండదు!? స్వచ్ఛమైన అమ్మ ప్రేమని దేనితో వెలకట్టగలం? అమ్మ తన రక్తమాంసాలతో పుట్టిన పసికందును కంటికి రెప్పలా కాపాడుతుంది. చందమామను చూపిస్తూ ఆప్యాయత, అనురాగాలనే గోరుముద్దలుగా తినిపిస్తుంది. తొస్సుబోయే పసినాటి చిలిపి పలుకులకు మాటవుతుంది. బుడి, బుడి తప్పటడుగులకు నడకవుతుంది. ఈసమెత్తు కల్లాకపటం తెలియని మమకారాన్నందిస్తుంది. ఎవ్వరికీ తలొంచని తెగువ, ధైర్యాన్నిస్తుంది. ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకొని బతుకు బండి లాగుతుంది. పిల్లలు పెరిగి ప్రయోజకులైనప్పుడు ప్రపంచాన్నే జయించానని సంబరపడిపోతుంది. వారు సమాజమే హర్షించదగ్గ పిల్లలుగా పరివర్తన చెందినప్పుడు 'నింగి-నేలా నాదే ' అన్న పరిపూర్ణ విశ్వాసంతో
సమకాలీనం

“తోలు కొరడాతో కొట్టారు” విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల చిత్రహింస

ఏ చట్టపరమైన విధానాన్ని అనుసరించకుండా, పౌర దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు తమను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని అరెస్టు చేసిన విద్యార్థులు, కార్యకర్తలు ‘ది వైర్‌’కు చెప్పారు. తమ సహచరులు ఆరుగురిని, నజారియా పత్రికలో పనిచేస్తున్న ఒకరిని అవసరమైన ప్రక్రియను అమలుచేయకుండా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నిర్బంధించి దౌర్జన్యం చేసిందని ఢిల్లీకి చెందిన భగత్ సింగ్ ఛాత్రా ఏక్తా మంచ్ (బిఎస్‌సిఇఎమ్)  విద్యార్థి సంఘం, ఫోరమ్ అగైన్స్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఎఫ్ఎసిఎఎం-కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక) సభ్యులు ఆరోపించారు. ఒక ఐఎఎస్ ఆఫీసర్ కూతురు ఎక్కడ ఉన్నదనే విషయం తెలుసుకోవడానికి “ఇంటరాగేషన్” చేసే పేరుతో జులై
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థికం

ఫిబ్రవరి 24వ తేదీ న్యూఢిల్లీలో జరిగిన జి-20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్‍ బ్యాకుంకు గవర్నర్ల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ఇది! ‘‘భారత ఆర్థిక వ్యవస్థ అద్బుతంగా పురోగమిస్తోంది.భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ, విశ్వాసంగానూ ఉన్నారు. దీని నుండి ప్రపంచ దేశాలు స్ఫూర్తిని పొందాలి. ఈ సమావేశంలో పాల్గొంటున్న వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల దృక్పథాన్ని అందించగలరని మేం ఆశిస్తున్నాం. ప్రపంచ వృద్ధిలో స్థిరత్వాన్ని, నమ్మకాన్ని సాధించాలంటే అదొక్కటే మార్గం’’. ప్రధాని ఆ మాటలు చెప్పి పది రోజులు గడవకవ•ందే వాల్‍స్ట్రీట్‍ జర్నల్‍ తాజాగా దానికి పూర్తి భిన్నమైన
మీరీ పుస్తకం చదివారా ?

 కవిత్వజీవధార ‘తెర’ కవిత్వం

మనిషి చైతన్యం నిరంతరం ఆర్థిక రాజకీయ-సాంస్కృతిక వాస్తవాల నుంచే వస్తుంది-పెరుగుతుంది. పైనఉండే నిర్మాణంలోని భాగం కాబట్టి పైకీ, ముందుకు కిందికి చూసి రావలసిన మార్పుల గురించి హెచ్చరిస్తుంది-అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ విషయంలో కవి అనేవాడు పాట, పద్యం వచన కవిత ఏది రాసినా ఏ ప్రయోగం చేసినా స్వతహాగా ఉండే మనిషి ఆవేశాన్ని-ఆలోచనలను-కలలను వ్యక్తం చేయవలసిందే.                                                                                                                                                                                  _నిఖిలేశ్వర్‌ ‘ఈ దేశపు న్యాయ గుమ్మటం దానికదే కూలిపోయింది ఎవరూ కూల్చలేదు పాపం ఈజాతి లౌకికత్వం దానికదే పేలిపోయింది ఎవరూ మందుగుండు పెట్టలేదు పాపం’ బాబ్రీమసీదు విధ్వంసాన్ని పై కవితావాక్యాల్లో చెప్పిన కవి తెలకపల్లి రవి. మస్తిష్కపొరల్ని దాటుకొని
ఆర్ధికం

ఎటూ తేలని చర్చలు.. ఆగని యుద్ధం

రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధంలో యుక్రెయిన్‌ సర్వనాశనం కాగా, రష్యా పశ్చిమ దేశాల నుండి ఒంటరి అయింది. యుక్రెయిన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్‌ పైబర్‌ డ్రోన్‌ దాడులు వంటివి జరుగుతున్నాయి. రష్యా పలుసార్లు యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించింది.  రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మొదటి నుంచి అండదండగా నిలుస్తున్న ఐరోపా దేశాలు రష్యా దూకుడుపై ఆగ్రహంతో ఉన్నాయి. యుక్రెయిన్‌ రష్యా మధ్య శాంతి
సమకాలీనం

ఈ మరణాలు ప్రజాస్వామ్య సంక్షోభానికి సూచికలు

కొద్దికాలంపాటు నేను మౌన జీవితంలోకి వెళ్లిపోయాను. కానీ రాజ్య ప్రాయోజిత హింస పెరుగుదల, భారతదేశం అంతటా పునరావృతమయ్యే సంఘర్షణ మరింత లోతైన ప్రతిస్పందనకు బలవంతం చేసింది. మధ్య భారతదేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన హత్యలు విడి ఘటనలు కావు. ప్రజాస్వామ్య ఆరోగ్యం, అట్టడుగు వర్గాలతో వ్యవహారానికి సంబంధించిన విస్తృతమైన, కొనసాగుతున్న సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవ రావు @ బసవరాజ్ సహా మావోయిస్టులుగా గుర్తించిన పలువురు వ్యక్తుల మరణానికి దారితీసిన ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన భద్రతా కార్యకలాపాలు మరోసారి ఆదివాసుల ప్రాంతాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణపట్ల దృష్టిని ఆకర్షించాయి. విభేదాలు, తిరుగుబాటులను
సమకాలీనం

శాంతి చర్చలు-రాజ్యాంగబద్ధత: తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత

(విర‌సం ఆవిర్భావ దినం సంద‌ర్భంగా జూలై 6న హైద‌రాబాదులో నిర్వ‌హించిన స‌ద‌స్సులో *తెలంగాణ‌లో కాల్పుల విర‌మ‌ణ ఆవ‌శ్య‌క‌త‌* అనే అంశంపై జ‌రిగిన సెష‌న్ కోసం రాసిన పేప‌ర్‌) మావోయిస్టు పార్టీ మార్చి 28న కాల్పుల విరమణ ప్రతిపాదనతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ సూచన చేసింది. ప్రజా ప్రయోజనం కోసం తాను కాల్పుల విరమణకు సిద్ధమనితెలంగాణ ప్రభుత్వం ముందు కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మారణకాండను ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో సహా
ఆర్ధికం

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధోన్మాదం

మనుషుల శవాల గుట్టలపై, ఎముకల కుప్పలపై, రక్త ప్రవాహాలపై రాజ్యపాలనని సుస్థిర పరచుకునే దుష్ట లక్ష్యంతో దోపిడీ పాలకవర్గాలు కృత్రిమ యుద్ధాలు సృష్టస్తాయని, రెండు దేశాలు లేదా రెండు కూటముల మధ్య జరిగే యుద్ధాలు సారాంశంలో తమ సొంత  దేశ పేద వర్గాలపై సాగే యుద్ధాలు అని లెనిన్‌ చాలా స్పష్టంగా చెబుతాడు. సామ్రాజ్యవాద రక్త పిపాసి, పెట్టుబడి లాభాపేక్ష లేకుండా మానవాళి చరిత్రలో జరిగే యుద్ధాలు దాదాపు అరుదు. ఈ యుద్ధ జ్వాలల్లో సామాన్యులే సమిధలవుతారు. తాజా పశ్చిమ ఆసియా పరిణామాలు కూడా దీనికి మినహాయింపు కాదు. పన్నెండు రోజులపాటు జరిగిన యుద్ధం అటు ఇరాన్‌లోను, ఇటు
సమకాలీనం

బీహార్ జైళ్ల నిజస్వరూపం

బీహార్ జైళ్ళను ఎవరైనా ఊహించుకుంటే మేరీ టేలర్ చిత్రించిన చెరగని చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు హజారీబాగ్ ఇంకా బీహార్‌లో భాగం. దాదాపు అర్ధ శతాబ్దం తరువాత బి. అనురాధ ఐదేళ్ళు రాజకీయ ఖైదీగా గడిపి అదే హజారీబాగ్ జైలులో ఖైదీల కష్టాలను తన జైలు  కథల్లో చెప్పారు. కాలంతో పాటు అంతా మారుతుంది కానీ బీహార్, జార్ఖండ్ జైళ్లు ఈ మార్పు నియమానికి మినహాయింపులా? విజయ్ కుమార్ ఆర్య ఒక మావోయిస్టు రాజకీయ ఖైదీ. ప్రస్తుతం పాట్నాలోని బేవుర్ జైలులో ఉన్నాడు.. కేంద్రమావోయిస్ట్ పార్టీ  కేంద్ర  కమిటి సభ్యుడనే ఆరోపణ మీద ఎన్‌ఐఏ కేసులో అరెస్టయ్యిన అయ్యాడు.
ఆర్ధికం

ప్రజా వ్యతిరేక బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌  దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధిక ధరలు, పేదరికం వంటి పేద ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్‌ శక్తులను ఊతమిచ్చే విధంగా ఉంది. బడ్జెట్‌ అంటే ప్రభుత్వ ఆదాయ-వ్యయాల చిట్టా మాత్రమే కాదు. దానికి ఒక తాత్విక చింతన ఉండాలి. ఆదాయం ఎవరి నుంచి వస్తుంది, వ్యయం ఎవరి కోసం చేస్తున్నారనేది బడ్జెట్‌లో కీలకాంశం. ప్రధానంగా దేశ ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ఏలా అభివృద్ధి చేయాలనే కనీస ఆలోచన ఉండాలి. కాని మన పాలకులకు ప్రజలు కనిపించడం