కడపటి యుద్ధం – స్వామి సనాతనం
దేని మీదైనా సరే, వ్యాసాలు రాశాక, ప్రసంగాలు చేశాక కూడా సాహిత్యంగా తప్ప మరోలా చెప్పలేనిది మిగిలి ఉన్నప్పుడు రచయితలు కాల్పనిక ప్రక్రియల్లోకి వెళతారు. మానవ అనుభవాన్ని వర్ణించడానికీ, పంచుకోడానికీ సాహిత్య రచన తప్పనిసరవుతుంది. ఆ అనుభవం ఇవ్వాల్టిదైనా కావచ్చు. చరిత్రలోని సుదూర గతానిదైనా కావచ్చు. కానీ, సుప్రసిద్ధ రాయలసీమ రచయిత బండి నారాయణ స్వామి ఇటీవల 600 పేజీల ‘కడపటి యుద్ధం’ నవల రాశాక కూడా తన ఇతివృత్తం గురించి, అందులో తన ప్రతిపాదన గురించి ఆయన మళ్లీ వ్యాసాలు రాయవలసి వస్తున్నది. ఈ పని నవల ‘వెనుక మాట’తోనే ఆయన ఆరంభించారు. నవల ద్వారా తాను










