వ్యాసాలు

తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా కేరళ ప్రకటించుకోవడం అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను దాచాడమే

2025 అక్టోబర్ 31 ఆశా కార్యకర్తల తర్వాత, ఆదివాసీ సంఘాలు కూడా కేరళ ప్రభుత్వం నిర్వహించబోయే "తీవ్ర పేదరికం లేని రాష్ట్రం" ప్రకటన కార్యక్రమంలో సినీ నటులను పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశాయి. ఈ ప్రకటనను అవి "తప్పుదారి పట్టించే ఎన్నికల ఎత్తుగడ"గా అభివర్ణించాయి. ఆదివాసీ గోత్ర మహాసభ, ఆదిశక్తి సమ్మర్ స్కూల్‌లు చేసిన ఒక సంయుక్త ప్రకటనలో, నవంబర్ 1 (కేరళ ఆవిర్భావ దినం) రోజున చేయబోయే ఈ ప్రకటన ఆదివాసీలు, దళితులు, మత్స్యకారులతో సహా అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను దాచిపెడుతోందని పేర్కొన్నాయి. అధికారిక కార్యక్రమానికి సినీ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్‌లను ఆహ్వానించడం
వ్యాసాలు

మల్లయోధుల  నిరసన

భారతదేశ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందిన మల్లయోధులు ఏప్రిల్ 5వ తేదీ నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు 2023 జనవరిలో బహిరంగం కావడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత ప్రభుత్వం లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పాక్షిక స్వతంత్ర కమిటీ విచారణ జరుపుతుందని వారికి హామీ ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశం వచ్చేవరకు పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. లైంగిక నేరాల నుండి పిల్లలను
వ్యాసాలు

భూమిని కాపాడుకునే పోరు

(ఈ వ్యాసం ఆజ్ తక్ మే రెండో వారం  సంచికలో అచ్చయింది . ఛత్తీస్ ఘడ్ లో క్షేత్ర పరిశీలన చేసి రాశారు. ఈ ప్రాధాన్యత రీత్యా  వసంత మేఘం పాఠకులకు దీన్ని  హిందీ నుంచి అనువదించి అందిస్తున్నాం. పాపులర్ జర్నలిజం లోని    అటు ఇటుకాని *సత్యాన్వేషణ*, పరస్పర వ్యతిరేక  వైఖరి,   కార్పొరేట్ల, పాలకుల   దృష్టి కోణం ఇందులో ఉన్నప్పటికీ కొన్ని నిజాలు కూడా ఉన్నందువల్ల దీన్ని ప్రచురిస్తున్నాం- వసంతమేఘం టీం ) *ప్రభుత్వ నలువైపుల దాడితో బలహీనపడ్డ మావోయిస్టులు; భద్రతా బలగాలు వైమానిక దాడి చేశాయని ఆరోపణ* తేదీ ఏప్రిల్ 25 న  దర్భా డివిజన్‌లో మావోయిస్టులు ఉన్నట్లు
వ్యాసాలు

ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టు స్వభావం దాని సిద్ధాంత రాజకీయాల లోగుట్టు…

(*విప్ల‌వోద్య‌మంపై విషం క‌క్కుతున్న విద్యార్థి ప‌రిష‌త్ ప్ర‌చారాన్ని ఎండ‌గ‌ట్టండి* అనే పేరుతో రాడిక‌ల్ విద్యార్థి సంఘం 1984లో ప్ర‌చురించిన పుస్త‌కంలోని ఒక వ్యాసం ఇది- వ‌సంత‌మేఘం టీం) తరతరాల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా ముందుకు సాగుతున్న తెలంగాణా రైతాంగ పోరాటాలపై తీవ్రమైన దమనకాండను ప్రయోగించి అణిచి వేద్దామని తెలుగుదేశం ప్రభుత్వం సి.ఆర్.పి బలగాలను దింపగా మరో వంక ఆరెస్సెస్ ,బిజెపి, ఎబివిపిలు ప్రభుత్వానికి పూర్తిగా అండగా నిలిచి విప్లవోద్యమంపై దుమారాన్ని రేపుతూ రైతుకూలీలపై, విద్యార్థి యువజనులపై పాశవికమైన దాడులకు పాల్పడుతున్నాయి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలలో ఈ ఫాసిస్టు మూకల అఘాయిత్యాలకు అంతులేకుండా పోయింది.
వ్యాసాలు

అటవీహక్కుల చట్టాన్ని అపహాస్యం చేసిన హైకోర్టు 

25 అక్టోబర్ 2025ఛత్తీస్‌గఢ్‌లోని ఘట్‌బర్రా గ్రామానికి మంజూరు చేసిన సాముదాయిక అటవీ హక్కుల  పట్టాను రద్దు చేయడాన్ని హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి సవాలు చేస్తూ, దానిని 'ఆందోళనకర'మైనదిగానూ 'తీవ్రంగా నిరాశపరిచేది'గానూ అభివర్ణించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సింగిల్-జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలు భారతదేశంలో ఒక సాముదాయిక అటవీ హక్కుల  పట్టా ను రద్దు చేయటం బహుశా ఇదే మొదటి సందర్భం అని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ అక్టోబర్ 23న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కోర్టు తన అక్టోబర్ 8 నాటి ఉత్తర్వులో, హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి లేవనెత్తిన
వ్యాసాలు

ఆంగన్‌వాడీల జీవితాన్నిపరిచయం చేసిన పోరాటం

(గత ఏడాది చివరలో దేశమంతా మొదలైన అంగన్ వాడీల, ఆశా వర్కర్ల పోరాటం ఆ తర్వాత కూడా కొనసాగింది. ఈ వ్యాసం అప్పట్లో రాశారు. వసంత మేఘానికి ఆలస్యం గా చేరింది. విషయం ప్రాధాన్యత ఇప్పటికి ఉన్నందు వల్ల ప్రచురిస్తున్నాం - వసంత మేఘం టీం ) మన దేశంలో చాలీ చాలని జీతాలతో వెట్టి చాకిరి చేసే ప్రభుత్వ ఉద్యోగులు కోట్ల సంఖ్యలో వుంటారు. వారంతా దిగువ శ్రేణిలోకే  వస్తారు. అలాంటి ఉద్యోగులలో అంగన్‌వాడీలు, వారి వద్ద సహాయకులుగా చిన్నారులకు వంటచేసి పెట్లే వారు, ఆశా (ఏ.ఎస్‌.హెచ్‌.ఏ - సాధికారిక సామాజిక అరోగ్య కార్యకర్త) వర్మర్లు కూడ
వ్యాసాలు

 ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు  తీర్పుః   బొగ్గు పారిశ్రామికుల విజయం

హస్‌దేవ్ అరణ్య అటవీ ప్రాంతంలోని ఘట్‌బర్రా గ్రామ ప్రజలకు ఉన్న అటవీ హక్కులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2025 అక్టోబర్ 8న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా ఒక న్యాయ అవహేళన. ఇది కేవలం ఒక తీర్పు కాదు; ఆదివాసులను మాట్లాడనీయకుండా చేసి, బొగ్గు మాఫియాలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం. ఈ తీర్పు అటవీ హక్కుల చట్టం-2006 కింద ఇచ్చిన హక్కులను రద్దు చేయడమే కాకుండా, తరతరాలుగా ఈ అటవీ ప్రాంతాలను సంరక్షిస్తున్న ఆదివాసుల జీవనాధారాన్ని, గౌరవాన్ని కూడా ఆటపట్టిస్తోంది. అంతేకాదు, దీనివల్ల “అభివృద్ధి” అనే పేరుతో అడ్డూ అదుపూ లేకుండా  పరిశ్రమల విస్తరణకు అనుమతినిస్తోంది. భారతదేశ
వ్యాసాలు

పోలవరంలో మునిగిపోతున్న ఆదివాసులు

తెలంగాణ తొలి, మలివిడత ఉద్యమకారుల ఆధ్వర్యంలో 'భూ హక్కుల పరిరక్షణ ఉద్యమకారుల సమాఖ్య' ఏర్పడింది. హక్కుల కార్యకర్తలు, కవులు, రచయితలు, న్యాయవాదులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఈ సమాఖ్యలో భాగస్వాములుగా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాలను ప్రశ్నించడం ఈ ఐక్య సంఘటన కమిటి ప్రధాన లక్ష్యం. తెలంగాణ ఏర్పడ్డాక ఏడు మండలాలను అక్రమంగా ఆంధ్రాలో కలిపి తీరని అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంతో తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లో లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం ముంపుకు గురవుతుంది. లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. కూనవరం, బూర్ఘంపాడు, వరా రామచంద్రాపురం
వ్యాసాలు

ఎడతెరపి లేని వానల్లో నిరవధిక ఉద్యమం

నీరు-అడవి-భూమికోసం ఆదివాసీల పోరాటం చాలా కాలంగా జరుగుతోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో వారు అలాంటి పోరాటమే ఒకటి చేస్తున్నారు. కొత్త భద్రతా బలగాల క్యాంపు ఏర్పాటు, గ్రామంలో రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరవధిక సమ్మెకు కూర్చున్నారు. 115 రోజులకు పైగా సాగుతున్న ఈ ఉద్యమంలో 33 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు. 'మడోనార్ జన్ ఆందోళన్' బ్యానర్‌పై జరుగుతున్న ఈ ఉద్యమంలో వందలాది మంది పాల్గొంటున్నారు. ఇందులో పురుషులు-మహిళలు, పిల్లలు-వృద్ధులు అందరూ ఉన్నారు. తమ సంస్కృతిని, అడవిని కాపాడుకోవడం ఒక్కటే వారి లక్ష్యం. నారాయణపూర్‌లో ఖనిజ సంపద పుష్కలంగా ఉండటంతో, ప్రజలు వ్యతిరేకించినప్పటికీ రావ్‌ఘాట్, ఛోటేడోంగర్‌లో గనుల
వ్యాసాలు

స్మృతి చిహ్నాలతో మన ప్రయాణం – రాజ్యం నిర్భంధం.

ఏప్రిల్ 14,2023న రాష్ట్ర4 రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఉన్న డా||బి. అర్ అంబేడ్కర్ విగ్రహ అవిష్కరణ జరగడం ఒక మంచి పరిణామమే. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశం వలన తెలంగాణ పౌర సమాజం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించిన రాష్ట్రంలో అంబేడ్కర్ నీ సమరించుకోవడం అనేది ఇక్కడి ప్రజల బాధ్యతగా భావించవచ్చు. అది వారి గుండెల్లో చెరగని ముద్రగా, ఇంటి పెద్దలను తలచినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ నేలకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం మెండు. ఎవరు ఏది సహాయం చేసిన వారి