సాహిత్యం వ్యాసాలు

రాజ్యం సృజ‌నాత్మ‌క‌త‌కు వ్య‌తిరేకి

సవ్యసాచిదేవ్     కవి, రచయిత, విమర్శకుడు ఇప్పుడు నేను చెప్పేది కొత్త కాదు.సృజనాత్మకత‌ అంటే కొత్తది, ప్రగతిశీలకమైనది. దానికి  రాజ్యం వ్య‌తిరేకి. రాజ్యం ఎల్ల‌ప్ప‌డు సృజ‌నాత్మ‌క‌త‌ను  వ్యతిరేకిస్తది. అది పోలీసు , అధికార యంత్రాంగం ద్వారా నిషేధం తెస్తుంది. చరిత్రను వెనక్కి తిప్పే ప్రయత్నం జరుగుతుంది. ఉపన్యాసాలు, పుస్తకాలు, సామాజిక మాధ్య‌మాలను బాగా వాడుకొని పాత కాలమే బావుంటదని చెప్తారు. నాజీల లాగ ప్రజాస్వామ్య గొంతుల్ని వినరు. తమకు మద్దతుగా ప్రజలని కూడగడుతారు. అంతిమంగా తామే ప్రజాస్వామ్య వాదులమని చెప్పుకుంటారు.హిందువులు కానీ వారిపై దాడి చేస్తారు. వ్యక్తిగత విషయాలపై బురద చల్లుతారు. కాంగ్రెస్ కాలం లో తమను బాహాటంగా
వ్యాసాలు

ఈకాలపు స్త్రీవాద కవిత  ‘బొట్టు’

ఇండియాలో స్త్రీలు అనగానే కట్టు బొట్టు అంటూ మొదలుపెడతారు. అందం మాటున అణచివేత ఉంది. సాంస్కృతిక కట్టడి ఉంది. స్వేచ్ఛగా కదలడానికి వీలు లేని ఆహార్యం స్త్రీలకు నిర్దేశితమైంది. తరాలు మారినా, ఎన్ని కొత్త ఆలోచనలు చేసినా ఇష్టంగానో అయిష్టంగానో ఈ గుదిబండను స్త్రీలు మోస్తూనే ఉన్నారు. ‘తగలెయ్యాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన స్త్రీవాదులతో సహా. ఎందుకంటే అది వదిలించుకోవడం అంత సులభం కాదు. అది వ్యక్తిగత అభిరుచికి సంబంధించినది మాత్రమే కాదు. అది సమాజంలో నీ ఉనికిని, గుర్తింపును, గౌరవాన్ని నిర్దేశించేది. ఒక కుటుంబానికి సంబంధించిన, సమూహానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాల భారాన్ని మోయవలసింది స్త్రీలే.
వ్యాసాలు

ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్‌

ఛత్తీస్‌గఢ్‌లో భారత రాజ్యం చేపట్టిన జాతి విధ్వంసక సైనిక ప్రాజెక్టు ఆపరేషన్ కగార్‌లో ఫిబ్రవరి 9నాడు 31 మంది మావోయిస్టులను హత్యచేసింది. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల చట్టాతీత హత్యలను ఖండిస్తూ, సుప్రీంకోర్టు, "రిపబ్లిక్ తన సొంత పిల్లలను తానే చంపుకోవడానికి మేం అనుమతించలేం" అని అన్నది. తన 76వ వార్షికోత్సవ సంవత్సరంలో (2025), ‘మావోయిస్టులపై యుద్ధం’ పేరుతో  మావోయిస్టులని చెబుతూ భారత గణతంత్ర రాజ్యం ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 81 మంది పౌరులను చంపింది. ఫిబ్రవరి 1న, బీజాపూర్‌లో ఎనిమిది మంది ఆదివాసీ గ్రామస్తులను మావోయిస్టులుగా ముద్రవేసి చంపారు. రెండు రోజుల క్రితమే
వ్యాసాలు

తల్లి పేరుతో ఒక మొక్క ‘తండ్రి’ పేరుతో మొత్తం అడవి!

మోడీ ప్రభుత్వం ఒకవైపు 'జై శ్రీరాం' అంటూ చెవులు చిల్లులు పడే హోరుతో బిజెపి ప్రాయోజిత 'ఒక చెట్టు-తల్లి పేరుతో' ప్రచారాన్ని నిర్వహిస్తూనే మరోవైపు హస్‌దేవ్‌ అడవిని అదానీకి బదిలీ చేసేందుకు సిద్ధమవడం మన కాలపు వైచిత్రం. కేతే విస్తరణ పేరుతో మూడో బొగ్గు బ్లాకును అదానీకి అప్పగించేందుకు ఆగస్టు 2న అన్ని నియమ నిబంధనలను తుంగలో తుక్కి పర్యావరణ విచారణ జరుపుతున్నారు. ఈ గని కోసం 8 లక్షలకు పైగా చెట్లను నరికివేస్తారేమోనని అంచనా. రాష్ట్రం మొత్తంగావున్న బిజెపి కార్యకర్తలు కూడా ఇన్ని మొక్కలు నాటలేరు. ఏడు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.
వ్యాసాలు

ఛత్తీస్‌గఢ్‌లోశాంతి చర్చలు

ఏ రాజకీయ పార్టీ (కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి) అధికారంలో ఉన్నా వర్గ పోరాటానికి సంబంధించి సామ్రాజ్యవాద ` భూస్వామ్య (అర్ధ వలస ` అర్ధ భూస్వామ్య) దళారీ రాజ్యానికి విప్లవోద్యమం పట్ల ఒక దీర్ఘకాలికమైన వ్యూహం, ఆయా సందర్భాలకు ఎత్తుగడలు ఉంటాయి. 2004లో కేంద్రంలోను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండి మావోయిస్ట్టు పార్టీ ప్రతిపాదించిన ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి చర్చలకు పిలిచింది కానీ పీపుల్స్‌వార్‌తో చేసిన చర్చల ప్రతిపాదనను అది ఎం.సి.సి. వంటి మరో సాయుధ విప్లవ పార్టీతో మావోయిస్టు పార్టీగా ఏర్పడి చర్చలకు వచ్చిందనే ఎరుక కలగగానే రెండవ విడత చర్చల వాగ్దానాన్ని
వ్యాసాలు

విప‌త్తు అంచులో మాన‌వాళి

పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా సమస్యగా మారింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి.  ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ , నీటి ఆవిరి  సమతుల్యంగా ఉండాలి.  ఈ సమతుల్యత జల  వలయం సాధారణ వర్షపాతం, జంతువుల  మొక్కల జీవిత చక్రాలకు సహాయపతాయి.   పర్యావరణ సమతుల్యం వన్యప్రాణి మరియు వ్యవసాయానికి  మానవుని అభివృద్ధికి సహాయపడుతుంది.  కాలుష్య కారకాలను  వాతావరణంలో ప్రవేశపెట్టడాన్ని కాలుష్యం  అంటారు. పర్యావరణ కాలుష్యం ప్రధానంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, నేల కాలుష్యం.  వ్యవసాయ గృహ నిర్మాణం అటవీ నిర్మూలనకు దారితీ స్తున్నాయి.
వ్యాసాలు

Windows to the Revolution

‘Viyyukka’, a word in Gondi language meaning morning star, is an anthology of stories written in Telugu by Maoist women revolutionaries over the past four decades. Some of these women were martyred in the cause of the revolution, while some are still continuing in it. Some were part of the movement for some years and were then either arrested or had come out of it due to various reasons. This
వ్యాసాలు

మరణించిన  ‘మావోయిస్ట్’ మాట్లాడుతున్నాడు: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా చర్యల తర్వాత పరిణామాలు

బస్తర్ పరిణామాలపై అక్కడి నుండి వచ్చిన ప్రత్యేక సిరీస్‌లో ఇది మొదటి భాగం. బీజాపూర్‌లో మావోయిస్టుల సమావేశంపై తెల్లవారుజామున జరిగిన ఆకస్మిక దాడి ప్రభావం  గ్రామాల మీద  ఎలా ఉన్నదో  ఈ కథనం వివరిస్తుంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ అడవుల లోతట్టు ప్రాంతంలోని  స్థానిక ఆదివాసీ సముదాయాల  నుండి చేరిన మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్ర స్థాయి యుద్ధంలో వున్నారు.  ఈ సంవత్సరం ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను హతమార్చామని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ సంఖ్య 2009 సంవత్సరం మినహా గతంలో వచ్చిన వార్షిక
సాహిత్యం వ్యాసాలు

విప్ల‌వ మాన‌వుడు

విప్లవకారులు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధపడడం వల్ల బయట సమాజానికి అజ్ఞాతంలో ఉండి పనిచేసే విప్లవకారులు ఎలా ఉంటారు అనే విషయం అర్థం అయింది. విప్లవకారుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన కామ్రేడ్‌ ఆర్కే బయట ఉన్న ఆ కొద్ది రోజుల్లోనూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపపజేశాడని చెప్పవచ్చు. మీడియా ప్రతినిధులు ఆయనను అనేక విషయాల మీద ఇంటర్వ్యూలు చేశారు. ఆయన ప్రతి క్షణం తాను ప్రజల తరుఫున మాట్లాడడానికి వచ్చాననే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడారని అనిపించింది. ఇంగ్లీషు పత్రికల విలేఖరులు అడిగిన ప్రశ్నలను అనువాదం చేయించుకొని మళ్ళీ తెలుగులోనే జవాబులు చెప్పేవారు. దానివల్ల సామాన్య ప్రజలు కూడా ఆయన
ఓపన్ పేజ్

అవతలి వాళ్ల అంచనాలూ తెలుసుకోవాలి

ఫాసిజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఎట్లా పని చేస్తున్నది? దేనికి ఫాసిజం ఇంతగా బలపడిరది? ఈ సమస్య ఇప్పటికిప్పుడే వచ్చిందా? దాన్ని ఏ ఒక్క కోణంలోనో ఎదుర్కొని ఓడించగలమా ? అనే ప్రశ్నలకు ప్రగతిశీల, లౌకిక శక్తుల మధ్య ఏకాభిప్రాయ సమాధానాలు లేవు. ఎప్పటికైనా వస్తాయా?  నిజానికి ఇది అవగాహన సమస్యనా? లేక ఆచరణ సమస్యనా? ఆలోచించాలి. ఫాసిస్టు వ్యతిరేక ఆచరణకు సిద్ధం కావడంలో ఉన్న తేడాలు కూడా దీనికి కారణం కావచ్చు. వీటన్నిటికీ తోడు ఫాసిజం  గురించి ప్రజలకు  ఎట్లా చెప్పాలి? వాళ్లను ఎట్లా ఫాసిస్టు ప్రభావం నుంచి బైటికి తీసుకరావాలి? ప్రజాస్వామిక ఉద్యమంలో భాగం