వ్యాసాలు

దండ‌కార‌ణ్యం అప్‌డేట్స్‌

కొవిడ్ మానవాళికి కొత్త అనుభవం. కరోనా అనంతర చరిత్ర అనగల స్థాయిలో మార్పులు జరుగుతున్నాయని చాలా మంది అంటున్నారు. ఇందులో కొంత విశ్లేషణ ఉంది. చాలా వరకు ఊహ ఉంది. తొలి దశ కరోనా బీభత్సం మధ్యనే అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. ట్రంప్ దిగిపోయి, జో బిడెన్ అధికారంలోకి వచ్చాడు. ప్రపంచ రాజకీయార్థిక సమీకరణాలు కొత్త దశలోకి మళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కరోనా వచ్చినా, బిడెన్ వచ్చినా పాలస్తీనా పరిస్థితి ఏమీ మారదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆయన మొన్న ఒక మాట అన్నాడు. ఇజ్రాయిల్‌కు  తన ప్రయోజనాల కోసం పోరాటే హక్కు ఉందని
సమకాలీనం వ్యాసాలు కాలమ్స్

పెరిగింది కొండంత – తగ్గింది గోరంత

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలను మోసం చేసే చర్యలను కొనసాగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా యధేచ్ఛగా పెట్రో ఉత్పత్తుల ధరలను భారీగా పెంచి, ప్రజల సొమ్మును యదేచ్ఛగా దోపిడీ చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో ప్రభుత్వానికి, ఉత్పాదక కంపెనీలకు, మార్కెటింగ్ కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా మార్కెట్ శక్తుల వల్లే జరుగుతోందని మోడీ ప్రభుత్వం చెబుతున్నదంతా శుద్ధ అబద్దం. వివిధ రాష్ట్రాల్లో అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో మోడీ సర్కార్ నవంబర్ 3న పెట్రోల్, డీజిల్ పై నామమాత్రపు తగ్గింపును ప్రకటించి, వ్యాట్ పేరుతో మిగిలిన దంతా రాష్ట్రాల పైకి నెట్టేసింది.
సాహిత్యం వ్యాసాలు

ఈ నిషేధం విరసం మీదేనా?

విప్లవ రచయితల‌ సంఘాన్ని చట్టవ్యతిరేక సంస్థగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2005 ఆగస్టు 17న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలిసారి విరసాన్ని నిషేధించింది. న్యాయ విచారణ కమిటీ ముందు ప్రభుత్వం తన వాదనల్లో ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయింది. మూడు నెల‌ల్లో నిషేధ ఉత్తర్వు వీగిపోయింది. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అవే ఆరోపణలు. అదే పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌. అప్పుడూ ఇప్పుడూ నిరంకుశ అధికారం తప్ప పాల‌కుల‌కు మరేదీ అనుకూలించలేదు. విప్లవ రచయితల కాల్ప‌ని శక్తిని, సిద్ధాంత అవగాహనను చట్టపరిధిలోకి తీసికెళ్లగల‌ తెంపరితనం ఒక్కటే వాళ్ల దగ్గర ఉన్నది. బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒకటికి రెండు సార్లు
వ్యాసాలు

“పార్లమెంటులో ప్రమాదం లేని పొగ “

డిసెంబర్ 13 , 2023 న షుమారు 1.01 గంటలకు ఇద్దరు వ్యక్తులు పార్లమెంటులో ప్రమాదం లేని పొగ వ్యాపింప చేయడం ద్వారా తీవ్ర అలజడి సృష్టించారు. ఈ ఘటన దేశ వ్యాపిత సంచలన వార్తా. ప్రమాదాన్ని ఊహించటం, చిలవలు పలావులుగా వర్ణించటం లో మీడియా సంస్థలు పోటీపడ్డాయి. వారు అలజడి సృష్టించారు కానీ ఎ ఒక్కరికి హాని తలపెట్టలేదు. ఆస్తులు విధ్వంసం చేయలేదు. మన పార్లమెంటు సభ్యులు మాత్రం ఆందోళనకు గురై ఆ వ్యక్తులను చితక బాదారు. పోలీస్ నైజం ప్రదర్శించారు. పార్లమెంట్ లోకి ప్రవేశించిన ఇరువురు, వారికి సహకరించిన మరో నలుగురు తమ భావాలను తెలియజేసే
సమకాలీనం వ్యాసాలు

ఆకలి కడుపులతో అమృతోత్సవం!

బ్రిటీష్‌ వలసవాదుల నుంచి భారత పాలక వర్గాలకు అధికార బదిలీ జరిగి వచ్చే ఏడాది ఆగష్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో అమృతోత్సవం నిర్వహించాలని మోడీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. స్వాతంత్య్రం వచ్చింది దేశ భూభాగానికే కాదు ప్రజలకు సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం అని గమనిస్తే జనాభాలో సగం మంది  పేదరికంతో ఆకలితో అలమటిస్తుంటే, ప్రజలు ఉత్సవాలలో ఎలా పాల్గొంటారు? ఏడున్నర దశాబ్దాలలో ప్రజల మౌలిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, వైద్యం, విద్య ఇప్పటికీ ప్రజలందరికి అందుబాటులోకి రాలేదు. బయట పల్లకీ మోత ఇంట్లో ఈగల మోత
సాహిత్యం వ్యాసాలు

ప్రతి విపత్తూ పెట్టుబడికి వరమే

ఫోర్బ్స్ 2021 నివేదికను మనం విశ్వసిస్తే,(బిలియనీర్ల సంఖ్య,  వారి సంపదను లెక్కించడం లో    ఫోర్బ్స్ సంస్థ  అత్యంత విశ్వనీయతను మనం ప్రశ్నించగలమా?) గత సంవత్సర కాలంలో ఇండియాలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 140 కి పెరిగింది. ఆదేకాలంలో,  వారి ఉమ్మడి సంపద ఇంచుమించు రెండింతలు. అంటే,596 బిలియన్ డాలర్లకు చేరింది. 140 మంది వ్యక్తుల లేక  దేశజనాభాలో 0.000014 శాతం మంది మొత్తం సంపద, మనదేశ స్థూల ఉత్పత్తి(2.62 ట్రిలియన్ డాలర్ల)లో, 22.7 శాతం గా వుండటం గమనార్హం. (స్థూల అనే పదానికి అర్థమూ ,పరమార్థమూ చేకూర్చేది వారేగా!) దేశ ప్రధాన దినపత్రికలన్నీ ఫోర్బ్స్  నివేదికను
వ్యాసాలు

మాడ్ టూ మ‌న్యం  

పాట‌ల వెల్లువ ర‌మేష్‌ వీరుల మరణం వారి జ్ఞాపకాలతో మనసును బరువెక్కిస్తోంది. ఆ బరువు కారే కన్నీళ్లతో కాస్త‌ తేలికవుతోంది. అ బరువు అక్షరాలలోకి తర్జుమా అవుతే చరిత్రలో వారి త్యాగాలు సదా నిలిచిపోతాయి. ఆ బరువు స్టూప నిర్మాణంలో నిక్షిప్తమైతే, అనునిత్యం మన కళ్ల ముందు వారి జ్ఞాపకాలు నిలుస్తూ తమ ఆదర్శాలతో మనకు మార్గద‌ర్శ‌కం చేస్తుంటాయి. అలా ఆ బరువు వారి ఆశయాల సాధనతో  ప్రజల హృదయాలను తేలికపరుస్తుంది. వారి ఆశయాల సాధన కృషిలో మరింత పట్టుదలగా నిమగ్నమవుతామంటూ ప్రతిన బూనుతూ మా సోదర కళాకారుడు కామ్రేడ్‌ డప్పు రమేశ్‌కు  వినమ్రంగా విప్లవ నివాళులర్పిస్తున్నాం. 1998లో
సాహిత్యం వ్యాసాలు

ఈ నిషేధానికి అర్థం ఏమిటి ?

చరిత్రలో జరిగిన ప్రజా పోరాటాలే పౌర ప్రజాస్వామిక హక్కులకు జన్మనిచ్చాయి. రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నీ ఆ ప్రజా పోరాటాల ఫలితంగానే చట్ట రూపమెత్తాయి. ఇతర హక్కులతో పాటు, రాజ్యాంగంలో సొంత ఆస్తిని కలిగి ఉండే హక్కును కూడా పొందుపరచడమే మన దేశ పాలకుల వర్గ ప్రయోజనాల ప్రతిఫలనం అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇదట్లా వుండగా మన దేశాన్ని స్వాతంత్రోద్య‌మ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాల‌ని అధికార‌మార్పిడి అనంత‌రం మ‌న పాల‌కులు ప్ర‌క‌టించారు. ఆ ప‌ని చేయ‌డానికి వాళ్ల‌కు ఎటువంటి అడ్డు లేదు. కానీ దానికి పూనుకోలేదు.  సర్వసత్తాక, సార్వభౌమాధికార, స్వతంత్ర దేశం అనే మాట‌లు రాజ్యాంగంలో
కొత్త పుస్తకం వ్యాసాలు

కులం – విప్లవోద్యమం

(త్వరలో విడుదల కానున్న *కులం - విప్లవోద్యమం* పుస్తకానికి రచయిత  రవి నర్ల రాసిన  ముందుమాట ) కారంచేడు మారణకాండ తరువాత విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్లం. మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్ల అమలు కంటే ముందే మురళీధర్‌ రావు కమిషన్‌ నివేదిక ఆధారంగా ఎన్‌టి రామారావు ప్రభుత్వం ఓబిసి లకు రిజర్వేషన్లను పెంచినప్పుడు విప్లవ విద్యార్థి సంఘాలకు చెందిన వారిని మినహాయిస్తే మిగతా అగ్రకులాల విద్యార్థులందరూ రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళన మొదలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల పక్షంలో బలంగా నిలబడిన రాడికల్‌ విద్యార్థి ఉద్యమంలో తొలి అడుగులు నేర్చుకున్న వాళ్లం.  అందువల్ల దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలను, కులంతో
వ్యాసాలు

అబూజ్‌మాడ్‌ ‘ఆరతి’

అక్టోబర్‌ 4,2024. రాత్రి పడుకోబోయే ముందు వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే ఓ జర్నలిస్టు మిత్రుడి నుండి మెసెజ్‌ దర్శనమిచ్చింది “అబుజ్‌మాడ్‌ ఎన్‌కౌంటర్‌ గురించి ఏమైనా వివరాలున్నాయా..?” అంటూ. అతనో మీడియా సంస్థలో పనిచేస్తున్నా విషయం కన్ఫర్మ్‌ కోసం అప్పుడప్పుడు అడుగుతూ వుంటాడు. విప్లవ రాజకీయాల పట్ల సానుభూతిగా ఉంటూ, ఆ రాజకీయాలను దగ్గరి నుండి గమనిస్తుంటాను అనే కారణంతో కొంత మంది జర్నలిస్టు మిత్రులు ఏదైనా సమాచారం కోసం అప్పుడప్పుడు అడుగుతూ వుంటారు. అతని మెసెజ్‌ చూసే వరకూ అబూజ్‌మాడ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది అనే విషయమే తెలియపోవడంతో వాట్సాప్‌ గ్రూపుల్లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అని ఒక్కొక్కటిగా వెతుకుతూపోయాను.