వ్యాసాలు

కొత్త కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ రాజకీయ ఖైదీలనందరినీ విడుదల చేయాలి

ఈ జూన్ 6 కు భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో జైలుకు పోయిన మొదటి ఐదుగురిలో నలుగురి జైలు జీవితం ఆరో సంవత్సరం పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. ఈ  ఐదుగురిలో మొదటివాడుగా రోనా విల్సన్‌ను పేర్కొనవచ్చు. ఎందుకంటే అంతకన్నా ముందు 2018 ఏప్రిల్  27న ఢిల్లీలో మునీర్కాలో వున్న ఆయన అద్దె గదిపై పూనే విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్ ఎసిపి శివాజీ పవార్ నాయకత్వంలో పోలీసులు రెయిడ్ చేసి ఆయన కంప్యూటర్‌ను , పెన్ డ్రైవ్‌లను, యితర ఎలక్ట్రానిక్ పరికరాలను, పుస్తకాలను ఎత్తుకపోయారు. మిగతా ఐదుగురిలో సుధీర్ ధావ్లే (రిపబ్లికన్ ప్యాంథర్స్ వ్యవస్థాపకుడు) ఉంటున్న
వ్యాసాలు

విప్లవ సాంస్కృతికోద్యమం – గద్దర్

జననాట్యమండలి నిర్దిష్ట విప్లవోద్యమ నిర్మాణ సాంస్కృతిక సంస్థ.  నక్సల్బరీ పంథాను రచించిన చారు మజుందర్ నాయకత్వాన్ని స్వీకరించిన సిపిఐ (ఎంఎల్) పార్టీ ఆట-మాట-పాట అది. ఆ విప్లవ పంథాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనుభవంతో శ్రీకాకుళం సెట్‌బ్యాక్ తర్వాత ఆచరణలో పెట్టాలనుకున్నపుడు కొండపల్లి సీతారామయ్య నాయకత్వం అవిభక్త కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక సంస్థగా డాక్టర్ రాజారావు నాయకత్వంలో ఏర్పడిన ప్రజానాట్యమండలి అనుభవాల వెలుగులో జననాట్యమండలిని రూపొందించింది. అయితే దీనికి ఇతర ప్రజాసంఘాల వంటి కార్యనిర్వాహక, కార్యవర్గ నిర్మాణం లేదు. 1986లో హైదరాబాదులో రాంనగర్‌లో అప్పటి పీపుల్స్ వారి కార్యదర్శి శ్యాం (నల్లా ఆదిరెడ్డి) అరెస్టయినపుడు పెట్టిన రాంనగర్
వ్యాసాలు

బోనులో మోడీ సర్కార్‌

పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, పార్లమెంటుకు, చివరికి సుప్రీంకోర్టుకు సైతం చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'న్యూయార్క్‌ టైమ్స్‌' ''ది బ్యాటిల్‌ ఫర్‌ ద వరల్డ్‌ మోస్టు పవర్‌ఫుల్‌ సైబర్‌ వెపన్‌'' అనే టైటిల్‌తో బాంబు పేల్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు జనవరి 28న సునామీలా మోడీ ఫ్రభుత్వంపై పడింది. మోడీ సర్కార్‌ నిజ స్వరూపం బయటపడి కన్నంలో దొంగలా పట్టుబడినట్టైంది. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, హక్కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్‌ను మోడీ సర్కార్‌ కొనుగోలు 2017లో చేసింది. పెగాసస్‌ కోసం ఎన్‌ఎస్‌వోతో
వ్యాసాలు

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ సభ(లు) జ్ఞాపకాలు కొన్ని

సిపిఐ (మావోయిస్టు) ఏర్పడి 2024 సెప్టెంబర్‌ 21 నాటికి 20 సంవత్సరాలు. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 20 వరకు నెల రోజుల పాటు ఈ రెండు దశాబ్దాల వార్షికోత్సవాలు జరుపుకోవాలని పీడిత, పోరాట ప్రజలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్టీ శ్రేణులు, నాయకత్వం, విప్లవాభిమానులు దేశవ్యాప్తంగా ఈ 20 ఏళ్ల సభలు అమరుల స్మృతిలో నిర్వహించుకుంటారని కూడా ప్రకటించింది. ఈ 20 ఏళ్లలో 5250 మంది  పార్టీ సభ్యులు, 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది పోలిట్‌ బ్యూరో సభ్యులు అమరులయ్యారని, పార్టీ నిర్మాతలైన అమరులు కామ్రేడ్స్‌ చారుమజుందార్‌, కన్హయ్య చటర్జీతో పాటు
వ్యాసాలు

హేతువును కూల్చివేయడం

*తమ నేరాలను తప్పించుకోవడం, అస్పష్టత, విక్షేపం, పక్కదారి పట్టించడం(Deflection), తిరస్కరణ లాంటి  వివిధ వ్యూహాలను దత్తత తీసుకోవడాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం* మనుషులకు   హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంవల్ల  యితరులతో  విభిన్నంగా వుంటారు. అయితే, మానవులంతా  హేతుబద్ధoగా వుండటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కానీ, మానవులందరూ ప్రయోజనకరమైన పరిణామాలతో తర్కిస్తారని  అనడం అతిశయోక్తి . హేతువుకు  అనేక విధులు ఉంటాయి. (Reasons have many functions.)  ఒక సాధారణ అవగాహనకు రావడానికి,   ఏకాభిప్రాయ నిర్ణయానికి చేరుకోడానికి  హేతువు సహాయపడుతుంది.  ఈ క్రమానికి  ఏది  సంబంధించిందో , ఏది కానిదో గుర్తించడంలో   హేతువు సహాయపడుతుంది.  మన లోతైన
సమకాలీనం వ్యాసాలు కాలమ్స్

రామానుజుడు-ఆయ‌న స‌మ‌త‌

క్రీశ 1017-1137 మ‌ధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయ‌న  తాత్వికంగా, ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌స్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వ‌చ్చేనాటికి ఉన్న  చారిత్ర‌క , తాత్విక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న *స‌మ‌తా వాదాన్ని* కీర్తించడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం  ఏమీ ఉండ‌దు.  రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంక‌రుడి అద్వైతం బ‌లంగా ఉండింది.  *బ్ర‌హ్మ స‌త్యం- జ‌గం మిధ్య* అనేది ఆయ‌న ప్ర‌ధాన సిద్ధాంతం. దీన్నుంచే త‌త్వ‌మ‌సి అనే భావ‌న‌ను తీసుకొచ్చాడు.  ప‌ర‌బ్ర‌హ్మ‌వు నీవే. ఈశ్వ‌రుడు, మాన‌వుడు(ఆత్మ‌) వేరే కాదు. రెండూ ఒక‌టే అనేది అద్వైతం.  జ‌గం మిధ్య అన‌డంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీక‌రించ‌లేదు. 
వ్యాసాలు

ప్రజల ఊసులేని కొత్త చట్టాలు

20 జులై 2023 నుండి వర్తమాన లోకసభ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాలలో అటవీ సంరక్షణ చట్టం, 1980కి గత సంవత్సరం 2022 జూన్‌ 28 నాడు ఆర్దినెన్స్‌ రూపంలో రూపొందించిన అటవీ నియమాలకు చట్ట రూపం ఇవ్వడానికి ఆ బిల్లును మొదట లోకసభలో ప్రవేశపెట్టారు. ఆ  తరువాత  ఆగస్టు 2నాడు రాజ్యసభలో ఆమోదం పొందడంతో చట్టం ఉనికిలోకి వచ్చింది. చట్టం పూర్వాపరాలు: మన దేశంలో బ్రిటిష్‌ వారి హయాంలో రూపొందిన అటవీ సంరక్షణ చట్టం 1927ను ఆధారం చేసుకొని అధికార మార్పిడి తరువాత అటవీ సంరక్షణ చట్టం, 1980 ఉనికిలోకి వచ్చింది. ఆ చట్టం అడవులను రెండు
వ్యాసాలు

ఎట్టకేలకు కప్పన్‌కు బెయిల్‌

40 ఏళ్ల యువ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు సెప్టెంబర్‌ 9న సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో పౌరుల హక్కును గుర్తించినట్లైంది. కేరళ పాత్రికేయుడు సిద్ధిఖీ కప్పన్‌కు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. సెప్టెంబర్‌ 9న ఇచ్చిన తీర్పు పలు కారణాల రీత్యా విశేషమైనది. అక్రమ కేసులు బనాయించి తమకు గిట్టనివారినీ, ప్రశ్నించినవారినీ, తప్పిదాలను ఎత్తిచూపేవారినీ సుదీర్ఘకాలం జైల్లో మగ్గేట్టు చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయిన కాలంలో సుప్రీం నిర్ణయం వాక్‌ స్వాతంత్య్రాన్ని ఎత్తిపట్టింది. అంతకంటే ప్రధానంగా,
దండకారణ్య సమయం వ్యాసాలు

లైంగిక హింస, అరెస్టులు:  ఆదివాసీ మహిళల పోరాట పటిమ

ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న అణచివేతలో పెద్ద భాగం బూటకపు ఎన్‌కౌంటర్లు. ముప్పులో ఉన్న తమ భూమి, జీవనోపాధిలపై  భద్రతా బలగాలు చేసే లక్షిత దాడులతో పాటు లైంగిక వేధింపులకు గురికావడం వల్ల మహిళలు ఈ ఘర్షణలో మరింతగా రక్షణ లేనివారిగా మారారు. సునీతా పొట్టెంని మొదటిసారి న్యూఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లోని మసకవెలుతురు వున్న ఒక ఖాళీ గదిలో కలుసుకున్నాం; 2023 అక్టోబర్. ఆదివాసీ హక్కుల కార్యకర్త అయిన ఆమెపైన  అప్పటికి "మావోయిస్ట్" అనే ముద్ర పడలేదు. సరిగ్గా మూడు నెలల క్రితం 2024 జూన్‌లో ఆమెను అరెస్టు చేశారు. మేము ఆమెను కలిసినప్పుడు – స్వేచ్ఛా, ధిక్కరణలు ధ్వనించే
వ్యాసాలు

బడ్జెట్‌ 2025-26 కష్టజీవుల కడుపు కొట్టి కార్పొరేట్లకు

దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి తద్వారా డిమాండ్‌ పెరగడం మార్కెట్‌ ను ఉద్దీపన చేసెందుకై, తద్వారా కొత్త పరిశ్రమలకు అవకాశం, కొత్త ఉపాధి కల్పించడం లక్ష్యం - ఇదీ క్లుప్తంగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి శ్రీమతి సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పిన మాటలు. దానికి ఆమె ఎంచుకున్న మార్గం ఉన్నత మధ్యతరగతి వేతన జీవులకు పన్ను రాయితీ. ఉన్నత మధ్యతరగతిని దేశాభివృద్ధికి చోదకశక్తి గా ఆమె పొగడ్తల వర్షం కురిపించారు.   దేశాధ్యక్షులు శ్రీమతి ముర్మూ గారు  అదే పాటను పాడడం గమనార్హం.  మొత్తం కార్మిక శక్తిలో ఒక వంతుకూడా