వ్యాసాలు

గుడి కట్టి దేశం గాయాన్ని మాన్పగలమా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్  సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ సమక్షంలో, కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమైన రామ మందిరం శిఖరంపైన జెండాను ఆవిష్కరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ధ్వజారోహణం రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలియజేస్తుంది అని అన్నాడు. “శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయి, ఉపశమనం కలుగుతోంది; వందల సంవత్సరాల క్రితం తీసుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి!” అని కూడా అన్నారు. ఆయన పదేపదే రాముని నామాన్ని ఉచ్చరించాడు; మన అంతరాత్మలో కొలువైన రాముడు, రామరాజ్య భావన నుండి ప్రేరణ పొందిన దేశాన్ని స్థాపించాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమం సమాజంలోని కొన్ని వర్గాలలో ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది;
వ్యాసాలు

కుల నిర్మూలన – నూతన ప్రజాస్వామిక విప్లవం

(కా. డప్పు రమేశ్ మొదటి సంస్మరణ సభ సందర్భంగా చేసిన ప్రసంగ పాఠం) 1967 లో నక్సల్బరీ తిరుగుబాటుతో నూతన ప్రజాస్వామిక విప్లవ పంథా మనదేశంలో స్థిరంగా వేళ్లూనుకుంది. ఇది ‘నూతన మానవుల’ నిర్మాణం అనే భావనను దేశంలో బలంగా ప్రవేశ పెట్టింది. రాజకీయంలో విప్లవ పథాన్ని ఆవిష్కరించడంతో పాటు సాహిత్యం, కళలు, సినిమా వంటి అన్ని రంగాలలో వినూతన కోణంతో ఆలోచించడం నేర్పింది. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు అంటూ చరిత్ర రచనలో పీడిత వర్గాల కోణం నుండి చరిత్రను చూడటం నేర్పించింది. ఆ నూతన దృక్కోణం స్పృశించని రంగమంటూ లేదు.
వ్యాసాలు

అన్ని వర్సిటీలనూ అభివృద్ధి చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 10 వ తేదీన, ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శించారు.అంతకు మూడు నెలల ముందు ఆగస్టు 25 వ తేదీన కూడా ఓయూలో పర్యటించి ఓయూ అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇస్తే అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామని, తాను మళ్లీ డిసెంబర్ 10 నాడు ఓయూ ఆర్ట్స్ కళాశాల వస్తానని, భారీ బహిరంగసభ నిర్వహిస్తానని ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లో వుండకూడదని,ఆ రోజు విద్యార్థులు నిరసన వ్యక్తం
వ్యాసాలు

బెల్లంపల్లి నుంచి దండకారణ్యం వరకు: కామ్రేడ్ ఆనంద్ ఐదు దశాబ్దాల విప్లవ జీవితం

“నిరంకుశుడు మరణిస్తే అతని పాలన అంతమౌతుంది; అమరుడు మరణిస్తే అతని పాలన ప్రారంభమవుతుంది” అనే 19వ శతాబ్దపు డానిష్ తత్వవేత్త సోరెన్ కీర్కెగార్డ్ ఉల్లేఖనం, మేం చదువుకునే రోజుల్లో గోడలపై రాసే మా అభిమాన నినాదాలలో ఒకటి. కామ్రేడ్ ఆనంద్ ఇక లేడు. కానీ అతని ఆలోచన, ఆదర్శం, త్యాగస్ఫూర్తి, అలుపెరగని విప్లవోత్సాహం, నిర్విరామ విప్లవ సాధన తరతరాలకు స్ఫూర్తినిస్తాయి.సీపీఐ (మావోయిస్ట్) పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ ఆనంద్ 2023 మే 31 న దండకారణ్య దట్టమైన అడవిలో గుండెపోటుతో కన్నుమూశాడు. దండకారణ్య ప్రజల మధ్యన పార్టీ సీనియర్ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)
వ్యాసాలు

ఆనంద్ దూలా నూతన మానవుడు

ఇంద్రవెల్లి పాలవెల్లిఅమ్మ ఒడి ఇంకెంత మాత్రం అశ్రు సిక్తం కావొద్దనిఅందిస్తున్న ఆయుధాల్లోఅదిలాబాద్ నా తల్లి – (లాల్ బనో.... ఎన్ కె) అదిలాబాదు జిల్లా, బెల్లంపెల్లి, కన్నాల బస్తీలో నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ పోరాట ప్రేరణతో కార్మిక వర్గ పోరాటం పారంభమైందంటే అందుకు రెండు పిడికిళ్ళు బిగించిన వాళ్ళు గజ్జల గంగారామ్, కటకం సుదర్శనం. కన్నాల బస్తీ అంటే కార్మికవాడ. ఆ వాడలో బెల్లంపెల్లి విప్లవోద్యమ తల్లిగా పిలుచుకునే లక్ష్మమ్మకు పీపుల్స్‌వార్ దండకారణ్య పర్‌స్పెక్టివ్ విప్లవాచరణ ప్రారంభకాలంలోనే అమరుడైన గజ్జల గంగారామ్ కన్నకొడుకు అయితే ఈ 31న అమరుడైన కటకం సుదర్శన్ (69) పెంచుకున్న కొడుకు అనవచ్చు. ఆమె
వ్యాసాలు

అమ్మాయిలపై పబ్లిక్, డిజిటల్ వేధింపులు

ఈ ప్రపంచంలో అమ్మాయిగా జీవించడం అంటే భయంతో, జాగ్రత్తలతో, అనేక అడ్డంకులతో నడవడం అని చెప్పిన అతిశయోక్తి కాదు. అమ్మాయి ఎంత బలంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా ఆమె బయటికి వెళ్లే ప్రతిసారి, ఫోన్ పట్టుకునే ప్రతిసారి, రోడ్డు మీద నడిచే ప్రతిసారి ఒక చిన్న భయం ఆమె మనసులో ఉండక తప్పదు. ఎందుకంటే పబ్లిక్ ప్రదేశాల్లో జరుగుతున్న వేధింపులు ఏళ్ళుగా ఉన్న, ఇప్పుడు అది కాదు  ఫోన్లలో, సోషల్ మీడియాలో కూడా వేధింపుల రూపం పెరిగిపోయింది. అమ్మాయిలకు రెండు వైపులా ప్రమాదాలు పెరుగుతున్నాయి పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిలపై వేధింపులు చాలా కాలంగా ఉన్నాయి.
వ్యాసాలు

విద్రోహాలు, అబద్ధాలు, వక్రీకరణలు చెలరేగిన యుద్ధ కాలంలో చారిత్రక సత్య ప్రకటన

*భార‌త విప్ల‌వ పంథా - స‌మ‌కాలీన సందర్బం* పుస్త‌కం ముందుమాట.  డిసెంబ‌ర్ 7న హైద‌రాబాదులో జ‌రిగే స‌ద‌స్సులో ఆవిష్క‌ర‌ణ... వ‌సంత‌మేఘం టీం ఈ పుస్తకంలో ఏముందో చెప్పబోవడం లేదు. లోపలికి వెళ్లితే మీకే తెలుస్తుంది. సందర్భం గురించే నాలుగు మాటలు.  మన చుట్టూ అంతులేని శబ్ద కాలుష్యం. రణగొణ ధ్వని. యుద్ధారావం. మన పక్కన ఉన్నారనుకున్న మనుషులే శతృవు పక్కకు వెళ్లిపోతున్నారు. మనతో గొంతు కలుపుతారనుకున్న వాళ్లే ఇతరుల భాషతో మాట్లాడుతున్నారు. నిజానికి ఏ ఒక్కరి కోసమో, ఏ మార్గం కోసమో చర్చించనవసరం లేదు. దేనినైనా చరిత్రలో భాగంగా చూస్తే చాలు. అందరమూ చరిత్ర ముందు విద్యార్థులమే. కాలగతిని తెలుసుకోగల
వ్యాసాలు

పత్రికలతో ఇంటర్వ్యూలను  ప్రారంభించిన తొలి మావోయిస్టు అగ్రనేత 

కొత్తగా ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సుదర్శన్ తన ఏకైక సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. అరవై తొమ్మిదేళ్ల సిపిఐ (మావోయిస్ట్) అగ్రనేత, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ బహుశా అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్‌కి చెందిన కనిపించే ముఖాలలో ఒకరు. అతను అడవుల్లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే సంస్కృతిని ప్రారంభించాడు. కొత్తగా ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, అప్పటి నక్సల్స్ ప్రభావిత మానాల అడవిలో 1996 సెప్టెంబర్‌లో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ  జరిగింది. నేను సెప్టెంబరు 1996లో
వ్యాసాలు

దిగజారుతున్న ఎన్నికల వ్యవస్థ

ఈమధ్య రెండు సందర్భాలలో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల నిర్వహణ పైన  సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.  అందులో ఒకటి బీహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా, భారత ఎన్నికల సంఘం తీరుతెన్నులు,  ఎన్డీఏ కూటమి ప్రభుత్వ  "ఓటు చోరీ"   పైన. రెండవది ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ పైన జరుగుతున్న సైనిక,  భావజాల పరమైన దాడుల నేపథ్యంలో.  వారు సాయిధ పోరాట విరమణ చేసి ఎన్నికలలో పాల్గొనాలని. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు  ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రూపొందించి, ప్రకటించిన తీరు ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రమైన విమర్శలకు గురికాబడింది. చివరకు ఈ వివాదం
వ్యాసాలు

సాహిత్య విమర్శలో కేతు

1980`81 విద్యా సంవత్సరంలో నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. అప్పుడు పాఠశాల క్లాస్మేట్‌, డిగ్రీలో సీనియర్‌ అయిన పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, నేను అప్పుడప్పుడే విద్యార్థి ఉద్యమంలో అడుగుపెడుతున్న సందర్భం. ఆ సమయంలో సాహిత్యానికి, రాజకీయాలకు సంబంధం ఏమిటి అనే చర్చ వచ్చింది. దానికి సమాధానంగా కొకు సాహిత్య ప్రయోజనం అనే వ్యాస సంకలనం మాకు బాగా పనికి వచ్చింది.  దాన్ని చదువుకున్న తర్వాత ప్రాథమికంగా సాహిత్యం రాజకీయాలు కలిసే ఉంటాయని స్పష్టతకు వచ్చాం.  ఆ వ్యాసాల సంకలనకర్త కేతు విశ్వనాథ రెడ్డి గారు. అప్పుడు మొట్టమొదట ఆయన పేరు విన్నాం. ఆ తర్వాత కొకు సాహిత్య