సంపాదకీయం

అదాని-ఆర్‌ఎస్‌ఎస్‌: భారత ఆర్థిక వ్యవస్థ

మత, ఆర్థిక వ్యవస్థల సంబంధం మీద చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఏ సందేహం లేనిది ఆర్‌ఎస్‌ఎస్‌కే. “గురూజీ” చెప్పినట్లు తమది సాంస్కృతిక సంస్థ కదా..పిందూ మతాన్ని ఉద్ధరించే సంస్థ కదా.. అదాని గొడవ మనకెందుకులే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకోలేదు. ఈ దేశంలోని పేదల గురించి, వాళ్ల కష్ట నష్టాల గురించి ఏనాడూ పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని ఆర్థికంగా 'నష్ట* పోతున్నాడని, ఆయన తరపున వకాల్తా తీసుకున్నది. అదాని గ్రూప్‌ ఆర్థిక సామ్రాజ్యం నేరాల పుట్ట అని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ బైట పెట్టడగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు వచ్చింది.
సంపాదకీయం

కాల్పుల విరమణ ఒప్పందాలు- విప్లవోద్యమ పంథా: మార్క్సిస్టు దృక్పథం

(విరసం ఆవిర్భావ దినం సందర్భంగా జులై 6 న హైదరాబాదులో నిర్వహిస్తున్న సదస్సు సందర్భంగా విడుదల చేసిన కరపత్రం నుంచి ...) సాయుధ పోరాట సంస్థలకు, ప్రభుత్వాలకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు రాజ్యాంగపరిధిలోనే జరుగుతాయి. ఈ కారణం వల్లనే మావోయిస్టు పార్టీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ఒప్పందాలకు రావాలని వివిధ ప్రజాస్వామిక శక్తులు ఆకాంక్షిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేగాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ డిమాండ్‌ ప్రజా ఉద్యమ రూపం తీసుకున్నది. శాంతి చర్చల ఆవశ్యకతను వివరిస్తూ అనేక విశ్లేషణలు వస్తున్నాయి. వీటితోపాటు కాల్పుల విరమణ ఒప్పందాలు`శాంతి చర్చల మీద మార్క్సిస్టు విశ్లేషణ కూడా
సంపాదకీయం

ప్రజా యుద్ధ శాంతి దూతలు

ఒక్కరొక్కరే ఒరిగిపోతూ కన్నీటి చుక్కలవుతున్నారు. కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకోబోతే అవి రక్తాశ్రువులని గుండెలు బరువెక్కుతున్నాయి. కానీ రెండు నెలలకు పైగా శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో యోధుల పట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న స్పందన ఆ యోధులిచ్చిన శాంతి సందేశపు ప్రదర్శనలుగా తెలుగు నేల అన్ని చెరగులలోనే కాదు ఇవాళ దేశమంతా నలు దిశలా విస్తరిస్తున్నది. ఇది మృతదేహాల స్వాధీన ఉద్యమం ఎన్కౌంటర్లు జరిగి ఆ శవాలనుంచే ఆసుపత్రి శవాగారాల నుంచి, రిపోస్టుమార్టం కోసం న్యాయపోరాటం జరిగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి, రిపోస్టుమార్టం జరిగే ఆసుపత్రుల నుంచి, అమరుల గ్రామాల దాకా ప్రదర్శన లైనట్లుగా మారుమూల గ్రామాలలో కూడా అంతిమయాత్రలుగా
సంపాదకీయం

ఆయన మరణానంతర జీవితం

కా. బసవరాజు అమరుడయ్యాక,  అర కన్నులతో ఆయన మృతదేహం ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అదిగాక, ఆయన నవ్వ యవ్వనంలో ఉన్నప్పటి మరో ఫొటోను డెవలప్‌ చేసి  అభిమానులు ప్రచారంలోకి తెచ్చారు. దాన్ని ఒక మిత్రుడు  చూసి  ‘ఇది ఆయనకు సరిపోలినది కాద’ని అన్నారు. ఈ పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఆయన నివాళి సందర్భాల్లో అదే కనిపిస్తున్నది. యాభై ఏళ్ల అజ్ఞాత జీవితం గడిపిన నంబళ్ల కేశవరావుకు ఉద్యమంలో ఉండిన  పేర్లు బైటికి వచ్చాయేగాని, ఇంకో ఫొటో ఏదీ ఎవ్వరి దగ్గరా ఉన్నట్లు లేదు.   ఆయన కుటుంబసభ్యులు కూడా పాతికేళ్ల వయసులోని ఆ ఫొటోకే పూల దండలు వేసి
సంపాదకీయం

కార్పొరేట్ స్వామ్యంలో ప్రజలపై యుద్ధం

పాణి రాజకీయ అధికారం అనే మాటకు కాల క్రమంలో చాలా అర్థాలు మారాయి. ఎవరి అధికారం, ఎలాంటి అధికారం అనే మాటలకు ప్రజాస్వామ్యంలో నిశ్చయ అర్థాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాలు వాటిని రూఢపిరిచాయి. భారత రాజ్య రూపాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం నిర్వచించింది. దీని ప్రకారం భారత భూభాగంపై సర్వంసహాధికారం ఈ దేశ ప్రజలది. ఆ ప్రజలు ఎన్ని సాంఘిక, సాంస్కృతిక వివక్షలతోనైనా బతుకుతూ ఉండవచ్చు. ఎన్ని రూపాల దోపిడీకైనా గురి కావచ్చు. కానీ వాళ్లకు రాజకీయాధికారం ఉన్నదని రాజ్యాంగం నమోదు చేసింది. ప్రజల తరపున దాన్ని అమలు చేసే ఏజెంటే ప్రభుత్వం. రాజనీతి శాస్త్రంలోని ఈ మౌలిక
సంపాదకీయం

ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు?

సైనిక క్యాంపులు ఎత్తేయాలని దండకారణ్యంలో ఆదివాసులు చేస్తున్న  పోరాటానికి ఎనిమిది నెలలు నిండాయి. ఇప్పటికీ వాళ్ల సమస్య పరిష్కారం కాలేదు. మామూలుగా ఇలాంటి పోరాటాలు నడుస్తున్నప్పుడు  లోకం కోసమైనా ప్రభుత్వం ఉద్యమకారులతో సంపద్రింపులు జరుపుతుంది.   కానీ  ఈ పోరాటం విషయంలో అలాంటివేమీ లేదు.    2021 మే 17వ తేదీ  చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మొదలైన ఈ పోరాటం మొదటి రెండు మూడు రోజుల్లోనే నెత్తుటి మడుగులో తడిసింది. ఐదుగురు ఆదివాసులను భారత ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. అయినా ఆదివాసులు వెనకడుగు వేయలేదు. క్రమంగా ఈ ఉద్యమం జార్ఖండ్‌ ప్రాంతానికి కూడా   విస్తరించింది.    ఈ ఎనిమిది నెలలుగా
సంపాదకీయం

ఏసేబు ఒక్కడే కాదు.. వేలు , లక్షలు 

జీవించి ఉండగానే మరణానంతర వైభవానికి కూడా అన్నీ సిద్ధం చేసుకొనే వాళ్లున్న చోట మరణించి జీవించడం మొదలు పెట్టేవాళ్లు దిగ్భ్రాంతికరంగా తయారవుతారు. అలాంటి వాళ్లను  అంగీకరించడానికి మనసు సిద్ధం కాదు. అసలు వాళ్లున్నట్లు కూడా తెలియదనే రక్షణ వలయంలో సేదతీరుతాం. ఒకవేళ తెలిసి ఉంటే వాళ్లను మినహాయింపు అనుకుంటాం. తీసి పక్కన పెట్టేస్తాం. మన నిరాశలకు, నిట్టూర్పులకు, చరిత్రపట్ల పిల్ల చేష్టలకు తగిన దారికి ఇలాంటి వాళ్లు అడ్డం లేకుండా చూసుకుంటాం. సుఖమయ వాదనల విశాల రంగస్థలానికి  ఈ ఏర్పాట్లు అవసరం మరి. వాదననలను ప్రతిసారీ సత్యాన్వేషణ కోసమే చేస్తామనే గ్యారెంటీ ఏమీ లేదు. ఆసత్యానికి ఆవలి అంచున 
సంపాదకీయం

బీహార్ విప్ల‌వ సాహిత్యోద్యమ శిఖ‌రం

కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ బీహార్‌ రాష్ట్రానికి చెందిన విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమ ప్రధాన నాయకులలో ఒకరు. ఆయన తన 89వయేట, డిసెంబర్‌ 23న తీవ్ర అనారోగ్యంతో మరణించారు. 1983 లో విరసం చొరవతో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఏఐఎల్‌ఆర్‌సి) ఏర్పడిరది. అదే సంవత్సరం అక్టోబర్‌ 14, 15 తేదీలలో ఏఐఎల్‌ఆర్‌సి ప్రథమ జాతీయ మహాసభలు ఢిల్లీలో జరిగాయి. ఈ మహాసభల్లో బీహార్‌ రాష్ట్రం నుండి పాల్గొన్న ప్రతినిధులలో కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ ఒకరు. ఆ రాష్ట్రం నుండి రెండు విప్లవ సాహిత్య సాంస్కృతిక సంస్థలు ఏఐఎల్‌ఆర్‌సిలో భాగస్వామ్యం అయ్యాయి. వాటిల్లో ఒకటి, క్రాంతికారీ బుద్ధిజీవి సంఘం
సంపాదకీయం

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఫాసిజాన్ని నిలువరిస్తుందా?

రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ సారి ముస్లిం లపై ఈ దాడులు నిర్వహించింది.  ముస్లిం యువకులకు లీగల్ అవేర్ నెస్, కరాటేలో శిక్షణ ఇచ్చిందనే నెపంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై తెలంగాణ పోలీసులు జులై 2022 లో దేశద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో అప్పడే తెలంగాణ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్న సమయంలో  దీనిని ఎన్ఐఏ కు బదిలీ చేశారు.  దాడులుకు గురి అయింది ముస్లింలు,  చేసింది బిజెపి నేతృత్వంలోని ఎన్ఐఏ అనే విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ దాడుల‌కు వున్న రాజ‌కీయ ప్రాధాన్య‌త
సంపాదకీయం

కా. గొంజాలోకు జోహార్లు

పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్‌ పాత్‌ నిర్మాత, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్‌ అమెరికా పోరాట ఆచ‌ర‌ణ‌లో ఎత్తిప‌ట్టిన  గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు  కామ్రేడ్‌  గొంజాలోకు విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు  మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది. పెరూలోని నావికా స్థావరంలోని ఆస్పత్రిలో 2021 సెప్టెంబరు 11వ తేదీన గొంజాలో 86 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా పార్కిన్సన్‌, చర్మ కేన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు. ఈ స్థితిలో కూడా ఆయనకు వైద్య సాయాన్ని ప్రభుత్వం నిరాకరించింది. చివరకు తన భార్యతో ఇంటర్వ్యూను సైతం రద్దుచేసింది.