పాలకుల విధ్వంస నిర్మాణాల మీది
ఆగ్రహాన్నంతా

హిమాలయ పర్వతాలు
హిమానీ నదులు బీభత్సంగా
పాలితుల మీద కూడ చూపిన మాట నిజమే

కానీ
ప్రకృతి కదా ఎక్కడో
పసిపిల్లల పట్ల పాలకులకున్నంత
నిర్లక్ష్యం కనిపించలేదు

ఒక టీచర్‌ను హెచ్చరించడంలోనే కాదు
ఆక్రమణ యుద్ధాల లక్ష్యమే పసిపిల్లలైనా
ద్వేషం కనిపించలేదు
అవును కదా మనం దివిసీమ
ఉప్పెనపుడు చెప్పుకున్నట్లుగా
ప్రకృతి ‘అక్రమంలోనూ
ఒక క్రమముంటుంది’

‘అక్రమంలో కూడ క్రమముంటుంది .’-కెవిఆర్.
(యు.పి.ఉన్నీకి, కెవిఆర్ కు కృతజ్ఞతలతో

Leave a Reply