ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా సరిహద్దులలో, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గరియాబంద్‌ జిల్లా కలాఘర్‌ టైగర్‌ రిజర్వ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఉభయ రాష్టాల భద్రత దళాల సంయుక్త గాలింపు చర్యల్లో భాగంగా జరిగింది. జనవరి 20 తేది ఉదయం ప్రారంభమై 23 వరకు కొనసాగుతూనే ఉన్నది. ఇందులో గరియాబంద్‌ జిల్లా పోలీస్‌, సిఆర్‌పిఎఫ్‌, కోబ్రా (కమాండో బెటాలియన్‌ ఫర్‌ రెసల్యూట్‌ యాక్షన్‌) అనే ఛత్తీస్‌గఢ్‌ లోని భద్రతా బలగాలతో పాటు ఒడిషా స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ ఎస్‌.ఒ.జి. పాల్గొన్నాయి. ఎస్‌.ఒ.జి. ఒడిషా లో ప్రత్యేకంగా నక్సల్స్‌ ఆపరేషన్స్‌లో శిక్షణ పొందిన గ్రూప్‌. ఈసారి ఒడిషాలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడి అక్కడ కూడా ఆదివాసీ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసి రెండు రా(ష్టాల్లోనూ ఆదివాసీల కంట్లో ఆదివాసీల వేలు అనే అంతర్యుద్ధ రాజనీతిని అనుసరించడం వల్ల సాధ్యమైంది. ఇదంతా హిమాచల్‌ప్రదేశ్‌లో సూరజ్‌కుండ్‌ వ్యూహంలో దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి గ్రీన్‌ హంట్‌ ఆపరేషన్‌ లో అంతిమ యుద్ధం కగార్‌ అని ఒక టార్గెట్‌ లక్ష్యం పెట్టుకోవడం వల్ల సాధ్యమవుతున్నది. ప్రజాశక్తి ముందు ప్రజా యుద్ధం కేవలం రాజ్యాధికారం కోసం మాత్రమే కాకుండా విధ్వంసకరమైన సామ్రాజ్యవాద కార్పొరేటు అభివృద్ధి విధానానికి అండగా ఉన్న సైనికీకరణను ఎదుర్కొనే జనతన రాజ్యం వ్యూహం ముందు ఈ టార్గెట్‌ సాధ్యమవుతుందా అంటే స్పష్టంగా కాదనేదే సమాధానం. అయితే కార్పొరేట్ల స్వప్రయోజనం, సామ్రాజ్యవాద, భూస్వామ్య శక్తుల మనుగడ వాటికి దళారీగా పనిచేస్తున్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్ట్‌ రాజ్యం వికసిత్‌ భారత్‌ లక్ష్యం (2047) లకు సవాల్‌ కనుక చివరిదాకా శత్రువు ఇటువంటి ఆక్రమణ దాడిని కొనసాగిస్తూనే ఉంటాడు.

కానీ, తాజాగా ఎదురుకాల్పుల్లో చనిపోయినవారి ఫొటోలు వివరాలను గురువారం జనవరి 23న పోలీసులు ప్రకటించారు. ఇందులో మావోయిస్టు పార్టీ మాడ్‌, ఎస్‌జడ్‌సి సభ్యుడు, అగ్రనేత పాండు (చంద్రహాస్‌, జననాట్యమండలి) పేరులేదు. పాండుగా భావిస్తున్న వ్యక్తి సత్యం గావ్‌డే అని, అతడు తమ్‌దరీ`గరియాబంద్‌ నౌపాడ డివిజనల్‌ కమిటీ కార్యదర్శి, ఒడిషా రాష్ట్ర కమిటీ సభ్యుడని, అతని స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా ఉప్పర్‌ పారా గ్రామంగా పోలీసులు పేర్కొన్నారు. ఇంక ఇందులో పోలీసులు మీడియా ఎన్‌కౌంటర్‌లో మృతులుగా పేర్కొన్న వారిలో లేదా అనుమానాలకు ఊహాగానాలకు తావిస్తూ ఫైల్‌ ఫొటోలు విడుదల చేసిన వారిలో 19వ తేదీ నుంచే ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్‌ చలపతి మాత్రమే కాకుండా, ఒడిషా కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ… మనోజ్‌, 21వ తేదీ సాయంత్రం ప్రచారంలోకి వచ్చిన నలగొండ జిల్లాకు చెందిన పాకల హనుమంతు (ఊకె గణేష్‌) అనే మరో కేంద్ర కమిటీ సభ్యుడు కూడ ఉన్నాడు. అయితే వీళ్లిద్దరివీ 21వ తేదీ దాకా ఫైల్‌ ఫొటోలు చలపతితో పాటు మీడియా ప్రచారం చేస్తూనే ఉంది. ఈ ఇద్దరి విషయంలో పోలీసులు బాలకృష్ణ కోసం హనుమకొండ, మడికొండలలో ఆయన తెలిసి ఉంటాడనుకునే వారిని ప్రశ్నించడం మడికొండలో ఆయన ఇల్లు ఉందా అని తెలుసుకునే హడావిడి చేసారు. గతంలో ఆ ఇద్దరి కేసులు హైదరాబాద్‌లో వాదించిన న్యాయవాదులను వాళ్ల కుటుంబ సభ్యులు కూడ ఆందోళనతో సంప్రదించారు కూడ. తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ విషయంలో పోలీసులు పార్టీ ప్రకటనను కూడ సృష్టించారు కనుక, మృతదేహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు నిస్సందేహంగా పోల్చుకుంటే తప్ప గుర్తించడానికి రమ్మని ఛత్తీస్‌గఢ్‌ పోలీసు అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు అధికారికంగా పిలుపు వస్తే తప్ప ఆందోళన చెందవద్దని అర్థమైంది.

పాండు విషయంలో పోలికల వల్ల భావించిన ప్రత్యక్ష పరిచయమున్న కామ్రేడ్స్‌ తమ జ్ఞాపకాలు కూడా రాసారు, కనుక జనవరి 2025లో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ప్రధానంగా మూడిరటిలో దస్రు, (మోహన్‌రావు) సుధాకర్‌, చలపతికి (ప్రతాప్‌రెడ్డి, రామచంద్రారెడ్డి) సుధీర్ఘమైన విప్లవోద్యమ జీవితం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒడిషా, ఎఓబిలలో అగ్రశ్రేణి నాయకత్వానికెదిగిన కామ్రేడ్స్‌ వీరిద్దరూ కాకుండా ఛత్తీస్‌గఢ్‌ కాంకేర్‌ జిల్లాలో జన్మించి ఒడిషా రాష్ట్రంలో విప్లవోద్యమం రాష్ట్ర కమిటీకి ఎదిగిన వాడు సత్యం గావ్‌డే. ఈ జనవరి నెలలో ఎన్‌కౌంటర్‌లలో 48 మంది అమరులైతే ఈ ముగ్గురు రాష్ట్రస్థాయి, కేంద్ర కమిటీ స్థాయి మావోయిస్టు పార్టీ సభ్యులు పోగా మిగతా వారిలో ఎక్కువ మంది ఆదివాసులే. మరికొంత మంది పార్టీ సభ్యులు, మిలిషియా సభ్యులు కూడ ఉండవచ్చు. వీరిలో దస్రు చికిత్సకోసం ఒడిషా నుండి ఛత్తీస్‌గఢ్‌కు వచ్చి బెడ్‌ మీద లేవలేని స్థితిలోనే అజ్ఞాతంలోనే చికిత్స చేయించుకుంటుంటే చికిత్స చేస్తున్న మహిళా కామ్రేడ్‌తో సహా పట్టుకొని కాల్చివేసారు.

ఇంక చలపతినైతే సంచలనాత్మకమైన చర్యలన్నింట్లోనూ ప్రధాన పాత్ర ఉన్నట్లుగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అలిపిరిలో జరిగిన హత్యా ప్రయత్నం మొదలు, వినీల్‌ కృష్ణను బందీగా తీసుకోవడం దాకా రాయలసీమ ఆ చివర తిరుపతి నుంచి, ఒడిషా ఈ చివరన మల్కన్‌గిరిదాకా ఆయన మిలిటరీ చర్యల గురించి కథనాలు చెప్తూ ఆయన పిఎల్‌జిఎ లో హిడ్మాకే గురువని పార్టీలో ఆర్‌.కె.కు సన్నిహితుడని అన్ని రంగాలలో ఎంతో శక్తి సామర్థ్యాన్ని ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటిదాకా జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ఒకే ఒక్క కేంద్ర కమిటీ సభ్యుడని ఆయన తల మీద కోటి రూపాయలు ఉన్నాయని కూడ ప్రకటించారు. అయితే ప్రత్యక్షంగా పదిహేను వందల మంది సి.ఆర్‌.పి.ఎఫ్‌. లతో సహా రెండు రాష్ట్రాల సైనికుల దాడిలో అమరుడైనపుడు మాత్రం అతడు రెండు కర్రలపై నడుస్తున్న 62 సంవత్సరాల వృద్దుడుగా మనం ఆయన మృతదేహంపై పక్కన ఉన్న కర్రలను పట్టి పోల్చుకోవచ్చు.

చలపతిగా ఎఓబి ఎన్‌కౌంటరప్పటి నుంచి తెలుగు సమాజానికి సంచలనంగా పరిచమjైున ప్రతాప్‌ చాలకాలం శ్రీకాకుళం జిల్లాలో, సుధాకర్‌గా పనిచేసాడనేది ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ ఎన్‌కౌంటర్‌కు, ఇందులో చలపతి అమరత్వానికి అశేషమైన స్పందన వచ్చింది.

అందువల్ల శత్రువు, ముఖ్యంగా మీడియా కూడ అరుణతో దిగిన సెల్పీయే ఆయనను పట్టి ఇచ్చిందా దగ్గర్నుంచి రాయలసీమలో రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్‌ కాంగ్రెస్‌ సహకారంతో ఆయన అలిపిరిలో చంద్రబాబు పై దాడికి వ్యూహం రచించి తప్పించుకోగలిగాడు దాకా ప్రచారం చేస్తున్నారు. వీళ్లంతా ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నది మాత్రం ఎఓబి రామ్‌గిరి ఎన్‌కౌంటర్‌ అందులో మొదటి ఆపరేషన్‌ ఆర్‌.కె. అన్నారు. ఆ తర్వాత ఆపరేషన్‌ ఉదయ్‌ (గాజర్ల రవి, చర్చల్లో గణేష్‌) అన్నారు. ఈ ఇద్దరితో పాటు చలపతి, అరుణల ఫొటోలు, వెంకటరమణ ఫొటోలు కూడ చూపారు. అమరుల బంధు మిత్రుల సంఘంతో పాటు వెళ్లిన కుటుంబ సభ్యుల్లో గాజర్ల రవి కుటుంబం ఆయన మృత దేహాన్ని తెచ్చుకోవడానికి బస్సుకూడ తెచ్చారు. అట్లాగే తన కూతురు, అల్లుడు ఉన్నాడని లక్ష్మణరావు గారు కూడ బావించి వచ్చారు. ఆ వివరాలన్నీ అపుడే చరిత్రలో రికార్డ్‌ అయ్యాయి కానీ సెల్ఫీయే పట్టి ఇచ్చిందా వంటి ప్రచారాల డొల్లతనాన్ని చూపడానికి ఇది ప్రస్తావించాను. మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అంతకు ముందరి ఎన్‌కౌంటర్‌ లో అమరుడయ్యాడని మృతదేహం మాత్రం చూపకుండా కాల్వపల్లి గ్రామాన్ని అక్కడే మహిళా కామ్రేడ్స్‌ అమరులకోసం కట్టిన స్థూపాన్ని చూపి, గ్రామంలోని ఆయన తల్లిని, ఇరుగు పొరుగులను మీడియా చేసిన ఇంటర్య్వూలు నిష్ఠూరంగా చెప్పాలంటే రాజ్యంలో భాగమైపోయిన మీడియా ఎంత విష ప్రచారానికి పూనుకుంటున్నదో అంతకు మించిన ఉదాహరణ ఉండదు.

ఒకవైపు విషం పెట్టి పది మందిని చెర్ల సరిహద్దుల్లో చంపిన ఎన్‌కౌంటర్‌ గురించి తెలంగాణ సిఎల్‌సి నిజనిర్ధారణ కూడ చేసింది. బడే చొక్కారావు (దామోదర్‌ బతికే ఉన్నాడని సిపిఐ మావోయిస్టు పార్టీ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో 22వ జనవరి ప్రకటన చూస్తే ` జర్మనీలో రిచ్‌స్టాగ్‌ (పార్లమెంటును)ను తగులబెట్టిన నాజీలు కమ్యూనిస్టు పార్టీ మీద నింద వేసినట్లుగా

ఉన్నది.

స్థలాభావం వల్ల ఆ ప్రకటన పూర్తి పాఠం నేనిక్కడ ఇవ్వబోవడం లేదు గానీ, 2025 జనవరి 16, 17 తేదీలలో 8000 మంది పోలీసులను సమీకరించి బీజాపూర్‌ జిల్లాలోని సింగవరం, తుండెపల్లి, మల్లంపెంట, పూజారీ కాంకేర్‌, తేమల్బట్టి గ్రామాల ప్రజలపై పిరికి దాడులు చేసింది రాజ్యం. అందులో నలుగురు గ్రామస్తులు, చనిపోయారని రాసింది. ఈ ప్రకటన అమరులయిన వారి పేర్లు, ఊర్లు కూడ రాసింది.

జనవరి 16,17 పూజారి కాంకేర్‌ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి కూడ చనిపోయాడని పోలీసులు మీడియా సంచలనం సృష్టించిన దానిలో నిజాలు కగార్‌ ఆక్రమణ దాడిలో కేంద్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వ, పోలీసు హ్యాండవుట్లకు వంతపాడుతున్న తెలంగాణ, ఆంధ్ర మీడియా ఎంత కుమ్మక్కయి ఉన్నాయో బయటపడుతున్న జనవరి నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో అమరులైన దస్రు, సుధాకర్‌ల అంత్యక్రియలకు వచ్చిన స్పందన, తెలంగాణ కార్యదర్శి దామోదర్‌ ఎన్‌కౌంటర్‌ అయ్యాడనేది అబద్దమని పార్టీ విడుదల చేసిన ఈ ప్రకటన ప్రజలపై నైతిక స్థైర్యానికి తాజా నిదర్శనాలు.

ఈ స్పందన దీనికి నిదర్శనం.

బొడ్డపాడు ఇవ్వాళ చెమర్చిన ఈ దేశం కనులకు

ఓదార్పయింది

బొడ్డపాడు ఇవ్వాళ గాయపడిన లక్షల గుండెలకు

పేగుబంధమైంది

బొడ్డపాడు అపుడెప్పుడో గర్జించిన వసంతమేఘానికి

మావిముంతయ్యింది

బొడ్డపాడు ఇవ్వాళ్ల సూర్యుల్ని

పొత్తిళ్లలో దాచుకుంది

దాచుకొని చాటింది

తాను గతం కాదు వర్తమానం అని

దాచుకొని చాటింది తాను

రేపటాకాశంలో అరుణారుణమని`

                                           -ఖలీల్‌

రాయలసీమలో చిత్తూరు జిల్లాలో పుట్టిన ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి, తెలుగు నేల మరో మూలన ఉన్న అవిభక్త శ్రీకాకుళ జల్లాలో పనిచేస్తూ ఆ ఉద్యమంలో శ్రీకాకుళ పోరాట కాలంలో విప్లవంలో పోతన సరస్వతి కూతురు అరుణ సాహచర్యాన్ని ఎన్నుకొని సుధాకర్‌ (గిరాయిపల్లి అమరుల్లో ఒకరు) పేరుతో మలి శ్రీకాకుళ పోరాటం నిర్మించాడు. ఇప్పుడు కగార్‌ ఆక్రమణ యుద్ధ దాడిలో అమరుడైన చలపతి ఆ గ్రామానికి అమరుడై తిరిగి వచ్చాడు.

ఆనాడు ఉద్ధానంలో బొడ్డపాడు తామాడ గణపతి, సుబ్బారావు పాణిగ్రాహి మొదలు ఎందరో శ్రీకాకుళ అమరుల కన్నతల్లి. తామాడ గణపతి తొలి పోరాట యోధుడై పాణిగ్రాహి పూజారి విప్లవకారుడై అప్పటికే పదముగ్గురు అమరులైన గ్రామం అది. మొట్ట మొదటి ఎన్‌కౌంటర్‌ (27, మే’1969) లో అప్పటి సిపిఐ ఎంఎల్‌ శ్రీకాకుళోద్యమ నాయకుడు పంచాది కృష్ణమూర్తి ఆయన వెంట ప్రయాణం చేస్తున్న ఒడిషా ఎంఎల్‌ పార్టీ నాయకుడు రమేశ్‌చంద్రసాహు వలెనే ఇపుడు చలపతి. ఒడిషా సత్యంగావడే అమరుడయ్యాడు. ఇవ్వాళ బొడ్డపాడు సెట్‌బ్యాక్‌ కు గురయిన శ్రీకాకుళ ఉద్యమ నాయకులు పంచాది, తామాడ గణపతి మొదలు కగార్‌ ఆక్రమణ యుద్ధంలో అమరుడైన సుధాకర్‌ (చలపతి) ల దాకా అమరుల స్మారక స్థావరమైంది.

ఎఓబి స్పెషల్‌ జోనల్‌ కమిటీని పర్యవేక్షించే ఆర్‌.కె. తన స్థావరాన్ని దండకారణ్యానికి మార్చి గైడ్‌ చేసినట్లుగానే ఇవ్వాళ ప్రజాయుద్ధంలో పిఎల్‌జిఏ మిలిటరీ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడుగా కూడ ఎఓబి కార్యదర్శిగా ఉండిన సుధాకర్‌, చలపతిగా ఆ యుద్ధ రంగాన్ని గైడ్‌ చేస్తూనే అమరుడయ్యాడు.

2

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్‌తో పాటు హేమచంద్ర పాండే దండకారణ్యంలోకి పోతూ నాగపూర్‌లోనే తెలంగాణ పోలీసులకు చిక్కి అదిలాబాద్‌ జిల్లా అడవుల్లో ఎన్‌కౌంటర్‌ అయినపుడు, కేంద్ర ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చర్చలు నిర్వహించాలని ప్రతిపాదించిన అగ్నివేష్‌ (కరోనా కాలంలో ఉత్తరప్రదేశ్‌లో సంఫీుయులు` ‘మనకు ఇవ్వాళ కావాల్సినవి రామజన్మభూములు కావుÑ ప్రజలకు శుభ్రమైన శౌచాలయాలు అన్నందుకు రాళ్లతో కొడితే ఆ దెబ్బలతోనే కొన్నాళ్లకు చనిపోయిన ధృడకాయుడు) సుప్రీం కోర్టులో ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, పట్టుకొచ్చి కాల్చారని, ఆయన తాను మావోయిస్టు పార్టీ ` కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేయాలని ప్రతిపాదిస్తూ రాసిన లేఖను తీసుకొని సి.సి.తో కేంద్ర కమిటీతో చర్చించడానికి పోతుంటే పట్టుకొని కాల్చారని ` కనుక దీని మీద విచారించి బాధ్యులని శిక్షించాలని పిటిషన్‌ వేసాడు. మన రిపబ్లిక్‌ మన పిల్లలను తానే చంపుకుంటుందా అని పద్నాలుగు సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

నిజానికి గత జనవరి 1 నుంచి ఇప్పటి దాకా జరుగుతున్నవి ఇవి ఎన్‌కౌంటర్‌లు కావు. ఆక్రమణ యుద్ధం. ఇరాక్‌ మీద 2003లో అమెరికా చేసిన ఆక్రమణ యుద్ధం వంటిది కూడ కాదు. ఎంత బూటకపుదయినా సద్దాం హుసేన్‌ను విచారించి ఉరి తీయడం వంటిది కాదు. ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ రసాయన అణు కేంద్రాలు సద్దాం ఇరాక్‌లో నిక్షిప్తం చేసాడని సాకు చెప్పిన ఆక్రమణ యుద్ధం వంటిది కూడ కాదు.

అంత గతమెందుకు ` హమాస్‌ దాడి నెపంతో గాజాపై ఇజ్రాయిల్‌ ఇపుడు తాత్కాలిక విరమణ చేసి ఏబైవేల మందిని బాంబుల్లో గత 15 నెలలుగా చేసిన ఆక్రమణ యుద్ధం వంటిది కాదు. అమెరికా ఆక్రమణ యుద్ధమైనా ఇజ్రాయిల్‌ ఆక్రమణ యుద్దమైనా ఇరాక్‌, పాలస్తీనాల సహజ సంపదను దోచుకునే సామ్రాజ్యవాద యుద్ధంలో భాగమే. అంతిమ సారాంశంలో అవి సామ్రాజ్యవాద అమెరికా, జియోనిస్టు ఇజ్రాయిల్‌లు కార్పొరేట్ల మార్కెట్‌ దోపిడీ రాజకీయార్థిక ప్రయోజనాల కోసం, విస్తరణ కోసం చంపిన యుద్ధాలే.

కాని ప్రపంచంలో మన దేశంలో మాత్రమే మన రిపబ్లిక్‌ తన పిల్లల్నే చంపడానికి అభియాన్‌లు చేపట్టింది, అంతర్యుద్ధం కోసం సాల్వాజుడుం ‘శాంతి సైన్యాన్ని’ తయారు చేసింది. ఇపుడు డిఆర్‌జి, బస్తర్‌ ఫైటర్స్‌ను కేంద్ర అర్ధ సైనిక శిక్షణా కేంద్రం కోసం వేల ఎకరాల హెక్టార్‌ల భూమిని కెటాయించింది. ఇదంతా ఇక్కడి తొలి గణ రాజ్యాల వంటి మూలవాసీ, ఆదివాసీ రాజ్యాలను, గుండాదర్‌, రాంజీగోండు వంటి యోధులు వలసవాద వ్యతిరేక పోరాటంలో నిలబెట్టి పోరాడి అమరులైన చోట జనతన రాజ్య ప్రయోగం చేస్తున్న ఆదివాసులపై మన రిపబ్లిక్‌ చేస్తున్న ఆక్రమణ యుద్ధం. పులి మాత్రమే తన సంతానాన్ని తానే తింటుందంటారు కాని మన రిపబ్లిక్‌ అశోక చక్రం స్థంభాన్ని మూడు (నాలుగు?) సింహాలు మోస్తున్నాయి. సింహం ఆకలయితే తప్ప ఏ జీవినీ చంపదు. మనిషి రక్తం రుచి మరిగిన పులి, హైనాలు మాత్రమే హీనమైన దాడులను గ్రామాలపై చేస్తాయి. మన రిపబ్లిక్‌ జాతీయ జంతువు పులి. ఇవ్వాళ బ్రాహ్మణీయ హిందూ జాతియోన్మాదం కూడ సామ్రాజ్యవాద కార్పొరేట్ల దళారిగా మారి మానవ మాంసం రుచి మరిగిన పులివలె ఏడాదికి పైగా అంతిమ యుద్ధం పేరుతో ఆక్రమణ యుద్ధం చేస్తున్నది. ఇది ఎంత వ్యూహాత్మకంగా జరుగుతున్నదంటే రిపబ్లిక్‌ అధ్యక్షురాలు ఒడిషాకు చెందిన ఆదివాసీ (ఒడిషాలో బిజెపి ఎంఎల్‌ఎ గా, సంకీర్ణ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడ ఆమె చేసిన అక్రమాలు. హత్యాచారాలు ఒడిషా ఆదివాసులకు తెలుసు) కాని ఆమె ఈ ఏడాది రక్తపాత యుద్ధకాలమంతా మందు పాతరతో ఇటీవల బీజాపూర్‌ జిల్లాలో బస్తర్‌ ఫైటర్స్‌ డి.ఆర్‌.జి పోలీసు, సివిలియన్‌) చనిపోయిన సందర్భంలో మాత్రమే ఖండిరచి ఆమె తానెటువంటి ఆదివాసుల కొరకు స్పందిస్తుందో చెప్పకనే చెప్పింది. ఇంక ఈ ఎన్‌కౌంటర్‌ పై అటు ఒడిషా ఆదివాసి ముఖ్యమంత్రి ఇటు ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీ ముఖ్యమంత్రి మోషాలు 2026 మార్చ్‌ ‘మావోయిస్టు రహిత భారత్‌’ స్వప్నాన్ని ఈ మార్చ్‌ నెలకే నెరవేరుస్తామని ప్రతిజ్ఞలు చేసారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు మూడు రెట్లయిన బస్తర్‌లోని ప్రకృతి సంపదను అదానీ, అంబానీలు, మిట్టల్‌, వేదాంత, జిందాల్‌ వంటి ఇంకా ఎన్నో సామ్రాజ్యవాద కార్పొరేట్లకు కట్టబెట్టడానికే, ఇది సాధ్యమా? ఎన్నో సందర్భాల్లో చెప్పినట్లుగా ఇది అమెరికా, యూరపు, ఆస్ట్రేలియా ఖండాల్లో యూరోపియన్‌ పాలక వర్గాలు, ఆఫ్రికన్‌ నల్ల జాతులను సేవకులను చేసుకొని మూలవాసులను తుదముట్టించిన ఆక్రమణ యుద్ధంవలె సాధ్యమయ్యేది కాదు. ఇది నక్సల్బరీలో మార్క్సిస్టు లెనినిస్టు మావోయిస్టు సిద్ధాంతాల వెలుగులో దండకారణ్య పర్‌స్పెక్టివ్‌తో ప్రవేశించిన విప్లవకారులు ప్రజా యుద్ధంలో జనతన రాజ్యం అండగా ఆదివాసులకు తోడుగా చేస్తున్న యుద్ధం. యావత్‌ భారత ప్రజానీకం కోసం చేస్తున్న యుద్ధం. అయితే రాజ్యాంగవాదులు, రాజ్యాంగ నీతి గురించి మాట్లాడే వాళ్లు, అస్తిత్వ వాదులు, ఉద్యమాలు, ఉదార ప్రజాస్వామ్య వాదులు రిపబ్లిక్‌ వజ్రోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ` రాజ్యాంగం అంతా అమలైపోయింది, సాధించాం, ఇంక రాజ్యాంగ నీతి అమలు చేయడమే ఇపుడు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వికసిత్‌ భారత్‌ లక్ష్యమంటున్న (రామ్‌ మాధవ్‌. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 26 జనవరి) గోబెల్స్‌ ప్రచారం పట్ల, ఆదివాసుల హననం పట్ల ` ఇంత ఉదాసీనత, ఇంత మౌనం, ఇంత నిర్లిప్తత ` బ్రాహ్మణీయ ఫాసిజానికి బలాన్నిస్తున్నది. ఇది క్షమించరాని నేరం. మౌనం కూడ యుద్ధ నేరమే.

26 జనవరి, 2025            

Leave a Reply