ఒక కఠోర వాస్తవం రాయాలి
చెయ్యందించరూ
గొప్ప కవిత రాయలి
అక్షరాలు అరువివ్వరూ
ఎక్కడో పొంగిన
రోహింగ్యాల రోదనలు కాదు
అక్కడెక్కడో తాలిబన్ల ఉన్మాదం కాదు
భారతీయ తాలిబన్లు చేసే
అత్యాచారానంతర పాశవిక హత్యలు,
రక్షక భటుల రక్షణలో
అర్ధరాత్రి శవదహనాలు,
రైతుల మీదుగా నడిపే
రథాల విన్యాసాలు,
అదేమని అడిగే గొంతుల్లోకి
ఉపాలు, కోరెగాం కోరలు,
అబ్బసొమ్మేదో
అమ్ముకున్నట్లు
ప్రజల ఆస్తుల, హక్కుల
అమ్మకాలు,
అన్నిటినీ నిలేసి అడగాలని వుంది
ఆవేదనకు పదాలు చాలకున్నాయి..
అక్షరాల సేద్యం చేసేవరకూ ఎవరన్నా
కొన్ని తాలక్షరాలో, పొల్లక్షరాలో ఇచ్చి ఆదుకోరూ
అక్షరాలు చిందాలి
Thank you
👍✊
Maa Satyam
” శ్రీశ్రీకి పల్లకి మోత”
పాణి రాసిన వ్యాసంలో తార్కిక తాత్విక పరమైన విశ్లేషణతో
“ప్రభువెక్కిన పల్లకి కాదోయ్
అది మోసిన బోయీలెవ్వరని
ప్రశ్నించి, ‘మానవ చరిత్ర వికాసాన్ని’ తిప్పి చూపిన శ్రీశ్రీని, ఆయన మహాప్రస్థానాన్ని ఈ రోజు (నవంబర్ 30న) తిరుపతిలో కొందరు పల్లకిలో ఊరేగించారు.
ఈ కాలపు వికృత, జుగుప్సాకర సన్నివేశమిది. ఆదర్శాలు, విలువలు, విశ్వాసాలు తలకిందులుగా ఊరేగిన దృశ్యమిది. ” అక్షరాల నిజమే పాణి గారు
గతి తార్కిక దృష్టితో పల్లకి సేవ లోని విష సంస్కృతిని తెలుగు సాహిత్య లోకం ముందు ప్రవేశపెట్టారు.
మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
మహాప్రస్థానాన్ని
(నవంబర్ 30న) తిరుపతిలో కొందరు కవులు, మేధావులు, విమర్శకులు, రాజకీయ నాయకులు ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొని జేజేలు పలకడం సింబాలిక్గా రాజ్యము బహుముఖ రూపాలలో చేస్తున్నా దాడులకు ప్రతిరూపమే ఈ పల్లకి సేవ.
ఈ పల్లకి ఊరేగింపు లో పాల్గొన్న వారికి నిజంగానే శ్రీ శ్రీ మహాప్రస్థానం వారి జీవితాల్లో చైతన్య స్ఫూర్తిని కలిగించి ఉంటే, స్ఫూర్తి పొంది ఉంటే, ఇలాంటి ఈ పల్లకి సేవ నిర్వహించకుండా, మరొక ఉద్యమ రూపంలో రాజ్యము పై నిరసన తెలిపేవారు.
రాజ్య నిర్బంధాన్ని ప్రశ్నించేవారు, ప్రతిఘటించే వారు, ఇలా పల్లకి సేవలతో కాలయాపన చేసే వారు కాదు. ఈనాడు మనం ఎవరి పక్షాన నిలబడదాం? రాజ్యము అవలంబిస్తున్న నిర్బంధం వైపా? లేక నవ సమాజ నిర్మాణానికి తమ అమూల్యమైన జీవితాలను అంకితం చేస్తూ నిర్బంధ జీవితాలు అనుభవిస్తున్న విప్లవ ఉద్యమకారుల వైపా?
ఈ నాడు దేశ ప్రజల ముందున్న ప్రశ్న?