గోండీ భాషను నిలుపుకుందాం
గోండీ-కోయ, గోండ్-కోయ ఆదివాసీ ప్రజలు మాట్లాడే భాష. తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్, అసిఫాభాద్ జిల్లాలలో, ఛత్తీస్ గఢ్ రాష్ట్రం అవిభాజిత బస్తర్ జిల్లాలలో, మహారాష్ట్ర గఢ్ చిరోలి జిల్లాలో ప్రధానంగా మాట్లాడే ఈ భాష భారతదేశంలో ఉన్న వందల ఆదివాసీ భాషలలో ఒకటి. ఏ భాషకు అయినా ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్యకర్తగా ఒక ఆదివాసీ భాషతో ఏర్పడిన పరిచయంతో దాని గురించి రాయాలని అనిపించింది. గోండీ భాషను కోయ భాష అని కూడా అంటారు. గోండ్ జాతి, కోయ జాతి అనేవి ఒకే జాతికి వివిధ ప్రాంతాలలో ఉన్న పేర్లు. నా మాతృభాష తెలుగు. కాబట్టి తెలుగుతో










