అవును!                    
వాళ్లు మమ్మల్ని చంపగలరు
అవున‌వును !

వాళ్లు బొగ్గు గనుల కార్మికులను చంపగలరు!
తాపీ మేస్త్రిలని, రైతులని కూలి వాళ్ళని,
కోతలు కోసే రైతు కూలీలను
పండ్లమ్మే వాళ్ళను చంపేయగలరు !

అవును వాళ్లు అట్లానే చంపగలరు!
లేకపోతే 14 లేదా 41, 20 లేదా 22 నంబర్లుగా మారిపోయిన లక్షల మందిని
వాళ్ళ స్వంత పేర్లు ఉన్న వాళ్ళని చంపేయగలరు!
లేదా గుర్తింపు పొందని లెక్కలేనన్ని శవాలను ,
30 సెకండ్ల కోసం ఫ్లాష్ లైట్ లో పడి వెలిగిపోయే పేర్లను,
ఆగ్రహోదగ్ధ నిరసనల ప్రదర్శనల మధ్య క్షణాల్లో మాయమయ్యే వాళ్ళని
వాళ్ళు చంపెయ్య గలరు!
వాళ్ళందర్నీ శాశ్వత విషాదంలోకి నెట్టగలరు!
వాళ్ళని ప్రేమించిన వాళ్ళని దూరం చేయగలరు

అవును వాళ్ళు నాగాలాండ్లో మనుషుల్ని చంపగలరు!
కునాన్ పాస్పోరా, సీతల్ కుంచి, మణిపూర్ సరిహద్దుల్లో లెక్కలేనంత మందిని,
ఊరి పేర్లు లేని స్థలాల్లో కూడా మనుషుల్ని
వాళ్ళు అత్యంత సునాయాసంగా చంపగలరు.

శిక్ష పడుతుంది అన్న కనీస వెరపే లేకుండా మమ్మల్నందరిని చంపేయగలరు!
చాలా సులభమైన పద్ధతిలో తప్పుడు గుర్తింపు పొందిన,
లేదా వాళ్లు అసహ్యించుకునే, ద్వేషించే గుర్తింపు ఉన్న మనుషులుగా
మమ్మల్ని వాళ్ళు ఇట్టే క్షణాల్లో చంపేయగలరు

(ఈ కవిత నాగాలాండ్ లో సైనిక మిలిటరీ సైనికులు స్థానిక ప్రజలను క్రూరంగా చేసిన హత్యలకు నిరసనగా రాసింది. అయితే దుర్మార్గం ఏమిటంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ హత్యలను గుర్తింపు పొందని లేదా తప్పుడు గుర్తింపు ఉన్న మనుషులుగా తీసి పడేస్తూ మాట్లాడాడు. తప్పుడు గుర్తింపు ఉంటే అలా హత్యలు చేసేయొచ్చా?)

Leave a Reply