నాస్తికోద్యమ నేత జయగోపాల్‌కు నివాళి
ప్రముఖ నాస్తికోద్యమ నేత డాక్టర్ జయగోపాల్ ఫిబ్రవరి 7న విశాఖపట్నంలో మరణించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా నాస్తికోద్యమ నిర్మాణానికి ఆయన జీవితమంతా కృషి చేశారు. 1972లో ఆయన భారత నాస్తిక సమాజాన్ని స్థాపించి దాన్ని నిర్మాణాన్ని దేశమంతా విస్తరింపజేశారు. భానాసను ఒక ఉద్యమ సంస్థగా, ప్రజా చైతన్య వేదికగా మలచడానికి జయగోపాల్ భావజాల, సాంస్కృతిక రంగాల్లో తీవ్రమైన కృషి చేశారు. నాస్తికవాదాన్ని ఒక సామాజికవాదంగా, హక్కుల వాదంగా కూడా ఆయన తీర్చిదిద్దారు. ఆస్తికత్వాన్ని భారతీయ సామాజిక, సాంస్కృతికరంగాల్లో ఆధిపత్యశక్తిగా గుర్తించిన ఉద్యమకారుడు ఆయన. భారత నాగరికతలో కులం, మతం, మూఢాచారాలు ప్రజల చైతన్యాన్ని ఆడ్డుకొని










