పోలీసుల వెంటాడి వేధింపులు;అక్రమ నిర్బంధాలు, తప్పుడు వర్ణనలు
వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇద్దరు వ్యక్తులు కార్మికుల నిరసనను 'మాస్టర్‌మైండ్' చేశారన్న యూపీ పోలీసులు, ప్రధాన స్రవంతి మీడియా కథనం 'నిరాధారం' అని ఆదివారం, ఏప్రిల్ 19నాడు జరిగిన విలేకరుల సమావేశంలో కార్యకర్తలు తెలిపారు. అదుపులోకి తీసుకున్న కొందరు కార్యకర్తల ఆచూకీని వెల్లడించడానికి పోలీసులు, పరిపాలనా యంత్రాంగం నిరాకరించాయని కూడా వారు చెప్పారు. ఇటీవల జరిగిన నోయిడా కార్మికుల నిరసనలో పాల్గొన్న కార్మికులను, కార్యకర్తలను ఉత్తరప్రదేశ్ పోలీసులు, యంత్రాంగమూ "వేధింపులకు", "అణచివేతకు" గురిచేశారని, అలాగే నోయిడా హింసాకాండలో వారు కూడా భాగస్వాములని ఏప్రిల్ 19 నాడు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యకర్తలు, న్యాయవాదులు,





