మరణానంతర వాస్తవం
మరణానంతర జీవితం అనగానే కొంతమందికి అది ఒక ఆధ్యాత్మిక విశేషంగా స్ఫురించవచ్చు. కానీ వ్యక్తుల జననానికి ముందూ, మరణం తర్వాతా కొనసాగే సామాజిక జీవితం గురించి, అమానవీయ దోపిడీ పీడక మానవ సంబంధాల గురించి నందిగం కృష్ణారావు గారి ఈ నవల అద్భుతంగా దృశ్యీకరిస్తుంది. ఈ నవల ప్రోలోగ్ (ప్రారంభం)లో ప్రస్తావించినట్టుగా శవం కుళ్లకుండా ఉండటమేమిటి? కుళ్లకుండా చెట్టుకు వేలాడుతున్న శవం తానే ఒక ప్రశ్నయి చరిత్రను వేధించడం ఏమిటి? అట్టి చరిత్ర ‘ఆ శవం ఎందుకు కుళ్ళి పోలేదు?’ అన్న ప్రశ్నను కాలాన్ని అడగడం అంటే అర్థం ఏమిటి? ఆ కాలం జీవమై శవం లోకి ప్రవేశించి










