బెల్లాల పద్మ, దేవేందర్ అరెస్టులను ఖండించండి
జూన్ 18 సాయంకాలం గుంటూరు దగ్గర ఓ గ్రామంలో బెల్లాల పద్మను, అదే రోజు హైదరాబాదులో దుబాసి దేవేందర్‌ను ఎన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పద్మ అనేక అక్రమ కేసుల్లో సుదీర్ఘకాలంపాటు జైలులో ఉండి విడుదలై వచ్చింది. పద్మ అనే పేరు మీద నమోదై ఉన్న అక్రమ కేసులన్నిటినీ అమె మీద మోపి జైలు నుంచి బైటికి రాకుండా చేశారు. ఆ నిర్బంధాన్ని దాటి బైటికి వచ్చే సరికి ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది. తిరిగి మామూలు పరిస్థితికి రాలేదనంతగా శరీరం శిథిలమైపోయింది. అయినా ఓపికగా న్యాయశాస్త్రం చదివింది. ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూనే ఓపిక ఉన్నప్పుడు సభలకు హాజయ్యేది.










