‘ఒక తల్లి’ వేదమ్మ
వీరమాత వేదమ్మ ఆచరణలో అన్నపూర్ణమ్మ. ఆమె తెలిసిన ఆమె గురించి విన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ పుట్టిన ఇంట తల్లిదండ్రులు పెట్టిన పేరు అన్నపూర్ణమ్మనే . తల్లిదండ్రులది 700 ఎకరాల భూస్వామ్య కుటుంబమటగాని అది వ్యవసాయ యోగ్యమైన భూమి కాకపోవడం వల్ల కావచ్చు తనది ఉన్నత మధ్య తరగతి కుటుంబమని చెప్పుకునేది. విద్యావంతుడై వ్యవసాయం కూడా చేయక నాలుగేళ్లు ఉద్యోగం కొరకు అన్వేషించిన బి. రామిరెడ్డి గారిని చేసుకోవడం వల్ల ఆమె అట్లా చెప్పి ఉండవచ్చు. ఐదుగురు అక్క చెల్లెళ్ళు, ఐదుగురు అన్నదమ్ములు ఉన్న కుటుంబంలో ఆఖరి కన్నబిడ్డ. తండ్రి మొదట తన 17వ ఏట వ్యవసాయ










