భారతి సాహిత్య ధమ్మం
సాహిత్యంలో సామాజికత సామాజిక వాస్తవికత వంటి భావనలు యివ్వాళ కొంతమందికి యెబెట్టుగా కనిపిస్తున్నాయి. సాహిత్యకారులు సమాజంలోకి చూడటం, సాహిత్యంలో సమాజాన్ని పరిశీలించడం, సాహిత్యం ద్వారా సామాజిక చలనాన్ని వ్యాఖ్యానించటం అవసరం లేదని వాళ్ళ ఉద్దేశం. మరీ అంత చేతి దురద వుంటే ఆ పని యే వ్యాసాల్లోనో చేసుకోండి, కథ నవల వంటి ప్రక్రియల్లో చేయాల్సిన అవసరం లేదని కూడా గొంతు చించుకుని వక్కాణిస్తారు. పతంజలి ‘పిలకతిరుగుడు పువ్వు’ కథలో సెషన్స్ కోర్టు జడ్జి తన కింది కోర్టు న్యాయమూర్తి(యస్ కోట మున్సీఫ్ మెజిస్ట్రేట్ గంగాధరం)ని సమాజంలోకి తొంగి చూసి వ్యాఖ్యానించినందుకు తప్పుపట్టి హెచ్చరించినట్టే శుద్ధ సాహిత్యవాదులు కూడా










