ఎకనమిక్స్
వారం కింద. ఒకరోజు. ఉదయం ఇంటర్వెల్ అయిపోయింది. అంతా ఎవరి క్లాసులకు వాళ్ళం పోతున్నాం. నేను టెన్త్ క్లాస్ గదిలోకి వెళ్ళాను. సెంటు వాసన గుప్పు మంటోంది. బోర్డువైపు చూశాను. ఇంగ్లీష్ టీచర్ ఆరోజు థాట్ ఫర్ ది డే ఇలా రాశారు. If you light a lamp for someone elseIt will also brighten your own path బోర్డు తుడుస్తూ ఆలోచిస్తున్నాను. ఎకనామిక్స్‌లో కొంచెం కవర్ చేద్దామనుకున్నాను. బోర్డువైపు తిరిగి టాపిక్ రాసేంతలో కిరణ్ కంప్లయింట్ ‘‘మేడం, మేడం శ్రావణ్ సెంటు తెచ్చాడు’’ కంప్లయిట్స్ పర్వం మొదలైౖంది. రఘు కూడా తెచ్చాడు,