భూమికి చెట్లంటే కోపం
అవి భూమిలో
జాగాను కోరుతాయి ..
అక్కడికి ఏమి రావు
పర్వతవాసులు
పర్వతాలలోని నీళ్లే తాగుతారు అక్కడికి
సర్కారు నీళ్లు రావు
చదువు నివ్వడానికి
సర్కారు బడులు రావు
మందులు ఇవ్వడానికి
సర్కారు దవఖానాలు రావు
ఇంటర్నెట్ రాదు
కరెంటు రాదు
అక్కడికి ఏమీ రానిచోట
ధర్మం పేరు మీద
ఆవు పేరు మీద
జాతీయత పేరు మీద
మనిషిని చంపడానికి
విషం ఎట్లా నడిచి వస్తది..




