ఆధునిక మహిళ రేపటి చరిత్ర రచిస్తుంది అని గురజాడ ప్యారిస్ కమ్యూన్కు బోల్షివిక్ విప్లవానికి మధ్యకాలంలో, బోల్షివిక్ విప్లవానికి సన్నిహిత కాలంలో చెప్పాడు. రష్యా, చైనా విప్లవాల కన్నా భారతదేశంలో విప్లవ విజయం ప్రపంచ పీడిత వర్గాల విముక్తికి దోహదం చేస్తుందనే ప్రామిస్ – వాగ్దానం నక్సల్బరీ చేసింది. మార్క్స్ ఆశించిన పెట్టుబడి పరాయికరణ నుంచి మానవసారం పొందే విముక్తి, లెనిన్ ఆశించిన సాంస్కృతిక విప్లవం, చైనాలో మావో తనపై తాను చేసే పోరాటంగా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ సారం నుంచి చారుమజుందార్ రచించిన స్వప్నం. చారుమజుందార్ చైనా శ్రామిక వర్గ మహత్తర సాంస్కృతిక విప్లవాన్ని బోల్షివిక్ విప్లవం, జన చైనా విప్లవం తర్వాత మూడో విప్లవం అన్నాడు.
చారుమజుందార్ స్వప్నాన్ని రేపటి చరిత్రగా రచించడం ప్రారంభించింది మాత్రం నక్సల్బరీలో అమరులైన ఆదివాసి మహిళలు, పిల్లలు.
అరుంధతీరాయ్ నక్షత్ర స్థగిత ఆకాశం కింద కామ్రేడ్స్ తో నడుస్తున్న కాలానికి దండకారణ్య క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘంటన్ సభ్యత్వం దేశంలోని ఏ గుర్తింపు పొందిన మహిళా సంఘానికి కూడా లేనంతగా లక్ష సంఖ్యతో ఉన్నది.
చైనా విప్లవం నాటికే విప్లవ కేంద్రం తూర్పుకు మారింది. అది వియత్నామ్ జాతీయ విముక్తి పోరాటంతో వియత్నాం మహిళా గెరిల్లాల వలన ప్రజలు ఆకాంక్షించే విప్లవంలో పర్యవసించింది.
అది పరిపూర్ణమై ప్రపంచ విప్లవంగా ఫలించే దిక్సూచిగా దండకారణ్య పర్స్పెక్టివ్గా ప్రపంచ విప్లవాలన్నీ మన తూర్పు మధ్యభారతాల వైపు చూస్తున్నాయి. క్రాంతికారీ మహిళా సంఘటన్ నిర్మాణంలోనే కాదు, అన్ని ప్రజా నిర్మాణాల్లోనూ, జనతన సర్కార్ లోను ఇవాళ అడవిలో మహిళలు సగభాగం పొంది గర్వంగా ఆకాశం వైపు తల ఎత్తి చూస్తున్నారు. ఆ కార్పొరేట్ దళారీ వాయు విమాన దాడులు ఎదుర్కొంటున్నారు. రాజ్యం చేస్తున్న కగార్ అంతిమ యుద్ధంలో మొన్న అక్టోబర్ 4న ఊర్మిళ పొందిన అమరత్వం ఆధునిక మహిళ ఆదివాసి మహిళగా రచించే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
ఆమె తల్లిదండ్రులు ఆమెకి ఎంత అసంకల్పితంగా కానీ ఎంత భావ గర్బితంగా ఊర్మిళ పేరు పెట్టారు. ఊర్మిళ వాల్మీకి రామాయణంలో రాముని తమ్ముడు లక్ష్మణుని భార్య. రాముడు బ్రాహ్మణీయ పితృస్వామ్యానికి ప్రతీక. కనుక రాముణ్ని అడవికి పంపాలని దశరథున్ని కైకేయి కోరుతున్నప్పుడు రాముడు తన వెంట సీత రావడం ధర్మం అనుకున్నాడు. యజమాని, సేవకురాలు గురించి భావించినట్లుగా, తాను రాజ్య చ్యుతుడైనపుడు కూడా భావించాడు. అక్కడితో ఆగలేదు – తనతో సమానంగా కౌమారంలోనే అడవుల్లో మునుల ఆశ్రమాల కోసం, విశ్వామిత్రుని కోరికపై వెళ్లి తమదైన అడవిలో నివసిస్తున్న రాక్షసులను చంపి వచ్చిన తమ్ముడు లక్ష్మణున్ని కూడా తన సేవకుడే అనుకున్నాడు. కనుక తనకు సేవ చేయడానికి, అడవిలో కూడా తన ఆజ్ఞలు పాటించడానికి లక్ష్మణున్ని కూడా అడవికి రమ్మన్నాడు. ఆ సేవకునికి మాత్రం తన ధర్మపత్ని అయిన ఊర్మిళ సేవ చేయడానికి కూడా అతని వెంట రావడానికి అర్హురాలు కాదు. మరి 14 ఏళ్ల వనవాస కాలంలో లక్ష్మణుడు దూరంగా ఉన్న కాలమంతా అయోధ్య అంతఃపురంలో ఊర్మిళ ఏం చేయాలి?
అంతఃపురంలో పురుషుడే కాదు మనిషి పొడ కూడా పడకుండా నిద్రపోవాలి. 14 ఏళ్ల సుదీర్ఘ నిద్ర. ఎప్పుడు సంచలనాత్మకంగా ఉండే రఘు మహారాజు, సూర్యవంశ పాలనా కాలంలో దశరథుని మరణం, భరతుని ఆగమనం, రాముని పాదుకా పట్టాభిషేకం – రాముని రాజ్యం, భరతుని పట్నం కాలమంతా లక్ష్మణుడు సీతారాములతో పాటు 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చేదాకా ఊర్మిళ నిద్ర పోయింది. వివాహిత ఊర్మిళకు, యువతికి, మన ఊర్మిళ పార్టీ కమాండర్ ను అడిగినట్లు శరీరం లేదా? ఆమెకు కోర్కెలు ఉండవా? ఆమె పెళ్లి ఆమె నిర్ణయం కాకపోయినా ఆమె నిద్ర కూడా ఆమె నిర్ణయం కాదు కదా. ఆ శరీరం మైథునం మాత్రమే ఆహారనిద్రా మైథునాలతో మొదటిదైన ఆహారం కూడా కోరుతుంది గదా. ఇంత నిర్హేతుకమైన నిద్ర గురించి అందుకే రామాయణ గాథ, సీత కష్టాలతో పాటు ఊర్మిళ నిద్ర కూడా జనపదాల్లో ప్రజల హృదయాలు వేదనతో గ్రహించిన పాటలుగా ప్రచారం అయింది. మైథిలి శరణ్ గుప్త అనే సుప్రసిద్ధ హిందీ కవి ఊర్మిళ మీదనే కావ్యం రాశాడు.
చైనా సమాజంలో విప్లవానికి పూర్వం ఆడపిల్లలు పుడితే ఉగ్గుపాలలో మత్తుమందు కలిపి, పాదాలు కట్టేసి నిద్ర పుచ్చేవారట. ప్రకృతి ధర్మంగా ఆ పాప పెరిగి పెద్దదయినా మనస్సు ఎదుగుదల లేని శిక్ష అది. ఊర్మిళ స్థితి అది కాదు. మన ఊర్మిళ వలెనే తన గురించి తానే నిర్ణయం తీసుకునే స్థితిలో, ఆమెకు వివాహం కూడా అయ్యాక దాంపత్యం నిషేధమైంది. నిద్ర స్వచ్ఛంద శిక్ష అయ్యింది. అంతఃపుర శయ్యాగారమైంది.
రామాయణంలో ఊర్మిళకు పెళ్లి 14 ఏళ్ల నిద్ర శిక్షగా విధించింది. రామాయణం స్త్రీకి విధించిన నీతి సీతకు – స్వయంవరంలో ఎంచుకున్న పురుషుని నుంచి దక్కింది అరణ్యవాసం, లంకలో అశోక వనవాసం – అనుమానంపై గర్భవతిగా మళ్లీ వనవాసం. అశ్వమేధ యాగ ఫలితంగా కొడుకులకు పట్టాభిషేకం అయితే తల్లికి మళ్లీ తన తల్లి గర్భంలోకి ప్రవేశం – ఆమె ధిక్కార స్త్రీ గనుక ఆమెకది సాధ్యమైంది.
ఆదివాసీ తల్లిదండ్రులకు పుట్టిన ఊర్మిళను తాయమ్మ కరుణ 1998లో మొదటిసారి చూసింది. ఆమెకు అప్పుడు 19 లేదా 20 ఏళ్ల వయసు ఉండవచ్చునని రాసింది. అప్పుడు ఆమె కొండగాఁవ్ దళంలో పనిచేస్తున్నది. ఇప్పుడామె 40 ఏళ్ల వయస్సు దాటేనాటికి తూర్పు బస్తర్ డివిజన్ డి.వి.సి.ఎం., నీతి. ఆమె తలపై 25 లక్షల వెల నిర్ణయించింది ఛత్తీస్గడ్ ప్రభుత్వం. నిద్రకు ప్రతీక అయిన ఊర్మిళ నీతికి ప్రతీక అయింది. రామాయణంలో ఊర్మిళ నిద్రపోవడానికి పెళ్లి చేసుకున్నట్లయింది. దండకారణ్యంలో ఊర్మిళ ఆదివాసి ఊర్మిళ పెళ్లి అనే వ్యవస్థ నుంచి బయటపడడానికి అక్కల, అన్నల అన్వేషణలో బయలుదేరింది. పుట్టిన దగ్గర్నించే ఆటపాటల్లో గడిపింది. తల్లికి పనిలో సహాయం చేయడానికి గడిపింది. తోటి పిల్లలతో సంఘాలు కట్టడంలో గడిపింది. పెళ్లి అనే ప్రస్తావన వస్తేనే ఆగ్రహోదగ్రురాలయింది. గూగీ I షఱశ్రీశ్రీ ఎaతీతీవ షష్ట్రవఅ I షaఅ్ లో – నేను నా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని తెగ పెద్దకు, కంపెనీ దొరకు ఆదివాసి అమ్మాయి తెగించి చెప్పినట్టు తల్లిదండ్రుల దగ్గర పెళ్లి చేసుకోనని చెప్పి పార్టీలో చేరింది. మొత్తంగా మహిళలు, ప్రత్యేకించి ఆదివాసి మహిళలు పార్టీలో చేరడమే కాకుండా, పార్టీ ప్రజా సంఘాల నిర్మాణంలో భాగమై విప్లవోద్యమాన్ని ఎంత ఉన్నతీకరించారు. ఒక్క ఊర్మిళ చరిత్ర చదివితే అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా తాయమ్మ కరుణ ద్వారా గానీ, నర్ల రవి ద్వారా గాని మనకు కొంచెం వివరంగా తెలిసిన 20 ఏళ్ల కింది చరిత్ర ప్రతి ఎన్కౌంటర్లోనూ, అందరికందరు ఆదివాసీలు ఉండడం, అందులో సగం మంది దాకా మహిళలే ఉండడం చూస్తున్నాం. ఇందులో కూడా 35 మందిలో 13 మంది మహిళలు ఉన్నారు. 35 మంది కూడా ఆదివాసులే. ఆ ఆదివాసుల నుంచే జిల్లా స్థాయి డివిజన్ స్థాయి నాయకులైన స్త్రీ, పురుషులున్నారు.
సుకుమా జిల్లా కలెక్టర్ ను కిడ్నాప్ చేసినప్పుడు విజయ్ మడ్కం పార్టీ అభివక్తగా నిర్వహించిన పాత్ర గురించి ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్న హరగోపాల్ తన జ్ఞాపకాల్లో రాసింది మనం చదివాం. ఆదివాసి మహిళ రాష్ట్ర నాయకత్వానికి అందులోనూ కీలకమైన మాడ్ కేంద్రంగా తూర్పు బస్తర్లోని కొండగాఁవ్ దళం నుంచి వచ్చి ఎదిగిన మొట్టమొదటి ఆదివాసి మహిళని రవి నర్ల రాసాడు. ఈ 35 మంది ఆదివాసీలైనా అందులో 13 గురు మహిళలైనా ఊర్మిళ నాయకత్వంలో 20 ఏళ్ల మావోయిస్టు సభలు జరుపుకుంటున్న ప్రజలను ప్రజల మధ్య ఉన్న నాయకత్వాన్ని కాపాడడానికి ప్రాణాలర్పించారు. మావోయిస్టు పార్టీ 20 ఏళ్ల ఆవిర్భావ సభ జరుపుకోవడం అంటే 20 ఏళ్ల కార్పొరేట్ల దోపిడి ప్రవేశాన్ని ప్రతిఘటిస్తున్న పోరాటాల్ని కాపాడుకోవడం. ఊర్మిళ పార్టీలోకి వచ్చి దాదాపు 25 ఏళ్లు అవుతున్నది. అమరత్వం నాటికి 45 ఏళ్లు. అయితే ఆమె, ఆమె వంటి ఆదివాసి మహిళలందరూ ఇంచుమించు గత 40 ఏళ్లుగా బస్తర్లో పీపుల్స్వార్ దళాల ప్రవేశంతో, అంటే విప్లవ చైతన్యం ప్రవేశంతో పుట్టి పెరిగినవారు. అట్లా పుట్టి పెరిగిన వారి ఆటల్లో, పాటల్లో, మాటల్లో ఎటువంటి మార్పులు వచ్చాయో విప్లవంలో కుటుంబాలుగా, గ్రామాలుగా, భాగమైన ఉదంతాలు మనం ఎన్నో విన్నాం. వియ్యుక్క కథల నిండా ఆ చరిత్ర చదువుకున్నాం. ఊర్మిళ ఉదాహరణ తీసుకుంటే సోనీ పేరుతో ఆమె రాసిందని తాయమ్మ కరుణ భావిస్తున్న ఉదాహరణలు తీసుకుంటే ఆమె మాటలు నడక నేర్చిన నాటి నుంచి ఊళ్లోకి దళం వస్తే తాను వాళ్ళ పాటలు వినడానికి ఉత్సాహపడి పరుగెత్తేది. వాళ్లు ఊళ్లో ఉన్నంతసేపు అట్లా వాళ్ళ మాటలు, పాటలు అర్థమయినా కాకున్నా అందులో ఏదో వేగం చలనం ఆమె బాల్యాన్ని స్పృశించేది. బాల్యానికి అటువంటి వాతావరణం కావాలి. పార్టీ, ఊళ్లోకి వచ్చే దళం పాటలు మాటలే కాదు వాళ్ళ నిత్య దైనందిన విప్లవం విప్లవ ఆచరణ ఆదివాసి సమాజాన్ని ఒక సూదంటురాయిగా ఆకర్షించింది. తమ జీవితాల్లో ఒక ఫారెస్ట్ గార్డు, ఒక రెవెన్యూ అధికారి, ఒక పోలీసు కల్పించగల భయ భీతావాహ వాతావరణం నుంచి ఎవరినైనా ప్రతిఘటించే వారు తమలోనే ఉన్నారనే గ్రహింపును, విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇచ్చే శక్తి అది. ఆశ్చర్యమేమంటే ఊర్మిళ తండ్రికి పార్టీతో, గ్రామానికి వచ్చేదళంతో సంబంధాలు ఉన్నాయి. తల్లికి ఉన్నాయి. ఒకరికొకరు ఏమి చెప్పుకోకుండానే అర్థమయ్యే నిర్మాణాల క్రమశిక్షణగా చైతన్యం అది. అదే సమయంలో వాళ్లు తమ జీవన సరళిలో కొనసాగుతూనే, గ్రామంలో ఉంటూనే పార్టీకి అది ఇచ్చిన పని చేసి సహాయం చేస్తున్నారు. తమ పిల్లలు అక్కడితో ఆగరని వాళ్లకు తెలుసు. అందుకే తల్లి ఇంటి దగ్గరే బోళ్లు తోమి ఇల్లు ఊడ్చి నీళ్లు తెచ్చే పని చెప్పి ఊర్మిళను ఆపాలని చూస్తుంది. తాను మాత్రం ఊళ్లోకి పనిమీద పోతున్నానని చెప్పి దళం దగ్గరికి పోతుంది. ఈ పనులన్నీ చేసి అక్కడికి ఊర్మిళ పరుగెత్తేవరకు అక్కడ దళంతో మాట్లాడుతూ తల్లి కనిపిస్తుంది. తల్లి దృష్టిలో పడకుండా ఉండడానికి తాను చెట్టు ఎక్కి వాళ్ళ మాటలు, పాటలు వింటుంది. అందరూ పోయాక కూడా తల్లి వాళ్లతో విడిగా మాట్లాడడానికి ఉంటుంది. తనలో ఉత్సుకత ఇంకా పెరుగుతూ ఉంటుంది. తల్లి ఊళ్ళోకి దళం అడవిలోకి మళ్లగానే తాను పరిగెత్తి దళాన్ని అందుకొని వాళ్లు బలవంతంగా వెనక్కి పంపే వరకు నడుస్తుంది.
ఇటువంటి అనుభవమే తండ్రి తోనూ అవుతుంది. పార్టీ తనను గుర్తించి తనను లోనికి తీసుకునే దాకా ఈ ప్రయత్నం వదలదు. ఈ ఆకాంక్ష ఆమెలో ఇంకా బలపడడం ప్రతిసారి దళం వచ్చి పాడి మాట్లాడి తను విప్లవ ప్రయాణంలో వేస్తున్న ప్రభావమేనని ఇదంతా ఒళ్లంతా కళ్ళు పెట్టుకొని, చెవులు చేసుకొని వింటున్న బాలిక గురించి వాళ్లు గ్రహించినాక ఆమెకు 14, 15 ఏళ్లు వయస్సు వచ్చే వరకు ఆమెకు మహిళా సంఘంలో పనిచేయమని చెప్తారు. ఆమె ఊళ్లో ఉండి మహిళా సంఘంలో పనిచేసినా తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెడతారు.
ఆమెకు తన జ్ఞానం, చైతన్యం తనకో శరీరం ఉందని దానికి వ్యాయామం, పని ఇవ్వాలని, దానికో మనసుందని దానికి తన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని గ్రహింపునిస్తుంది. నేను ఊర్మిళ కథ మాత్రమే చెప్పడం లేదు. బలవంతపు పెళ్లి వద్దని పార్టీలోకి పోయిన రాగోల సమస్య పార్టీలో చేరగానే పరిష్కారం అవుతుందా అనే 30 ఏళ్ల కింది ప్రశ్నకు రాగోల నుంచి మొదలై ఊర్మిళ దాకా వివాహం అనే వ్యవస్థ నుంచి కుటుంబం అనే వ్యవస్థ నుంచి దాని విస్తృత నిర్మాణ రూపం ఆయిన, దాని సమగ్ర నిర్మాణ రూపం అయిన రాజ్యం దాకా చిక్కుముడులు విప్పుతూ పోయి ఒక ప్రజా యుద్ధంలో పరిష్కారం వెతుక్కోవడంగా – దానినే ఇవాళ రామాయణంలో స్త్రీకి వివాహం వనవాసమో, నిద్రయో విద్యుక్త ధర్మంగా ప్రసాదిస్తే ఊర్మిళ నాటికి విప్లవం ఒక విముక్తి నీతిలోకి ఎదిగింది. ఇప్పుడిరకా కమాండర్ను పార్టీలోకి వచ్చినాక కూడా ఆ ప్రశ్న తప్పదా అన్న ఊర్మిళ తర్వాత ఎవరినైనా సహచరుణ్ని ఎంచుకున్నదా లేదా అనేది చాలా అప్రస్తుతమైన ప్రశ్న అవుతుంది.
ముఖ్యంగా గత పది నెలలుగా 2024 జనవరి నుంచి ఒకటి చేపల కోసం చెరువును తోడేసి, తోడేసిన చెరువు ప్రాంతాన్ని ఆక్రమించి, అక్కడ కంపెనీలకు అడవిని అప్పగించాలన్న సామ్రాజ్యవాద దళారీ నీతిని ఎదుర్కోవడానికి, సమాజంలో అందరికన్నా ఆ భూమి తమకే ఎక్కువగా చెందుతుందని చైతన్యంతోని ఎదిగిన స్త్రీలను భవిష్యత్ తరాలైన వాళ్ళ పిల్లలని కగార్ యుద్ధం టార్గెట్ చేస్తున్నది. ఆ ఎరుకతో ఆ 35 మంది ఆదివాసులు, వాళ్లలో మహిళలు వారిలో నాయకులు, ఆ అందరి రాష్ట్ర నాయకత్వంగా ఊర్మిళ ప్రజాయుద్ధమే విముక్తి నీతిగా అమరులయ్యారు. ఈ 35 మంది చరిత్రలు, వారిలో 13 మంది మహిళల చరిత్రలు, ఊర్మిళ ఊసు తెలిసినంతగానైనా చరిత్రలో నమోదు చేయడమైనా మనం చేయగలమా!
ఎన్కౌంటర్ గురించి మావోయిస్టు పార్టీ ప్రకటన ప్రకారం:
1. కామ్రేడ్ నీతి (ఊర్మిళ) పొట్టావి డి.కె. ఎస్.జె.సి. సభ్యురాలు, మాజీ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, బీజాపూర్ జిల్లా, భైరామ్ఘర్ బ్లాక్లోని ఇరమ్గుండ గ్రామ నివాసి
2. కామ్రేడ్ నందు మాండవి: సి.వై.పి.సి. సభ్యులు, 6-కంపెనీ కమాండర్, పశ్చిమ బస్తర్ డివిజన్, బీజాపూర్ జిల్లా. గరంఘర్ బ్లాక్లోని కొట్రపాల్ గ్రామ నివాసి.
3. కామ్రేడ్ మురళీ మట్లమి, మాజీ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడు, డిపార్ట్మెంట్ ఇంచార్జి, మందనార్ గ్రామ నివాసి, అంతఘర్ బ్లాక్, అల్నార్ పంచాయతీ, కంకేర్ జిల్లా.
4. కామ్రేడ్ సురేష్ (జంకు సలాం): మాజీ బార్తార్ డివిజనల్ కమిటీ సభ్యుడు, అగ్డై ఏరియా ఇంచార్జి నారాయణపూర్ జిల్లా, నారాయణపూర్ బ్లాక్, చినారి పంచాయతీ, ఛోటే పరస్గావ్ నివాసి.
5. కామ్రేడ్ మీనా, అజిత (శ్యాంబటి మడకం): బస్తర్ డివిజనల్ కమిటీ మాజీ సభ్యురాలు. నారాయణపూర్ జిల్లా, ఓర్చా బ్లాక్లోని మోహండి గ్రామ నివాసి.
6. కామ్రేడ్ మహేష్ మాండవి: మాజీ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడు, వాయనార్ ఏరియా ఇంచార్జి, బీజాపూర్ జిల్లా, భైరామ్ఘర్ బ్లాక్లోని గోటియా గ్రామ నివాసి.
7. కామ్రేడ్ జుగ్ని కౌడో 6 కంపెనీ పి.పి.సి. సభ్యుడు, 2 ప్లాటూన్ కమాండర్, పి.ఎల్. కార్యదర్శి. జిల్లా కంకేర్ అంత్ఘర్ బ్లాక్లోని అలనార్ పంచాయతీ కిలేనార్ గ్రామ నివాసి.
8. కామ్రేడ్ విజయ్ (సుక్లు కొర్రం) వాయనార్ ఏరియా కమిటీ సభ్యుడు, నారాయణపూర్ జిల్లా-బ్లాక్ కొంగెర గ్రామ నివాసి.
9. కామ్రేడ్ బసంతి వడ్డాడ: పి.పి.సి. సభ్యుడు, సరఫరా విభాగం బాధ్యత కంకేర్ జిల్లా కోయలిబేడ బ్లాక్ ఆల్దండ్ గ్రామ నివాసి.
10. కామ్రేడ్ అర్జున్ లేకమ్ 6-కంపెనీ వన్ ప్లాటూన్ సెక్రటరీ, కమాండర్ బీజాపూర్ జిల్లా భైరామ్ఘర్ బ్లాక్ చిన్న ఫాలి గ్రామ నివాసి.
11. కామ్రేడ్ జగ్ని వడ్డే 6 కంపెనీ పి.పి.సి. సభ్యుడు, సెక్షన్ కమాండర్ నరనైపూర్ జిల్లా-బ్లాక్, అద్దెంపాడ్ గ్రామ నివాసి 12. కామ్రేడ్ సోను కొర్రం: వాయనార్ ఏరియా కమిటీ సభ్యుడు, నరనయ్పూర్ జిల్లా బ్లాక్ సులెంగా గ్రామం నివాసి.
13. కామ్రేడ్ సీమ (జుగయ్ కొర్రం): వాయనార్ ఏరియా కమిటీ సభ్యుడు, నరనైపూర్ జిల్లా బ్లాక్ సులేంగా గ్రామంలో నివాసి.
14. కామ్రేడ్ జమ్లీ మాండవి: ఆమడై ఏరియా కమిటీ సభ్యుడు, జిల్లా నారాయణపూర్-బ్లాక్లోని తొయ్యమెట్ట గ్రామ నివాసి.
15. కామ్రేడ్ కొంత దుగ్గ: 6-కంపెనీ పి.పి.సి. సభ్యుడు. కాంకేర్ జిల్లా కోయిలిబెడ బ్లాక్లోని రేఖాబత్ గ్రామ నివాసి.
16. కామ్రేడ్ సుక్కు (గుడ్డు సలాం) వాయనార్ ఏరియా కమిటీ సభ్యుడు నారాయణపూర్ జిల్లా-బ్లాక్ ఓర్చ కంగావ్ నివాసి.
17. కామ్రేడ్ రోహన్ పెద్ద: డివిజన్ కమ్యూనికేషన్ బాధ్యత, కుముద్గుంద గ్రామం, నారాయణపూర్ జిల్లా, ఓర్చా బ్లాక్ నివాసి.
18. కామ్రేడ్ మనోజ్ (సంపత్ మాండవి): ఆమడై ఏరియా కమిటీ సభ్యుడు, జిల్లా నారాయణపూర్ బ్లాక్ ఓర్చ. తాడ్నార్ గ్రామ నివాసి.
19. కామ్రేడ్ సుశీల్ (ధన్ని కొవాచి) పి.పి.సి. సభ్యుడు జిల్లా కొండగావ్ బ్లాక్ మర్దపాల్ కక్డిపదర్ గ్రామ నివాసి.
20. కామ్రేడ్ బుధ్రామ్ మడ్కం: 6-కంపెనీ పి.పి.సి. సభ్యుడు జిల్లా బీజాపూర్ బ్లాక్ భైరామ్గఢ్ డోరుమ్ గ్రామ నివాసి.
21. కామ్రేడ్ ఫూలో (సుందరి ఓయం) అమ్డై ఏరియా కమిటీ సభ్యుడు. జిల్లా బీజాపూర్ బ్లాక్ భైరామ్గర్ గాంగ్ గ్రామ నివాసి.
22. కామ్రేడ్ జనీలా (బుధారి కొవాచి): 6-కంపెనీ పార్టీ సభ్యుడు, మర్దప్ కొట్మెట్ట గ్రామం, జిల్లా కొండగావ్ బ్లాక్ నివాసి.
23. కామ్రేడ్ మంగళి (మంగల్దై కోవాచి) పార్టీ సభ్యుడు. ఎస్.జడ్.సి. ఎం. గార్డ్. జిల్లా కొండగావ్ బ్లాక్ గర్దపాల్ అల్వాడ్ గ్రామ నివాసి.
కసిరి గ్రామ నివాసి.
14. కామ్రేడ్ జమ్లీ మాండవి: అమ్డై ఏరియా కమిటీ సభ్యుడు. నారాయణపూర్-బ్లాక్ జిల్లా తొయ్యమెట్ట గ్రామ నివాసి.
15. కామ్రేడ్ సోమ్ దుగ్గ: 6-కంపెనీ పి.పి.సి. సభ్యుడు, రేఖాబత్ గ్రామం, కోయిలిబెడ బ్లాక్, కంకేర్ జిల్లా నివాసి.
16. కామ్రేడ్ సుక్కు (గుడ్డు సలాం): వాయనార్ ఏరియా కమిటీ సభ్యుడు, నారాయణపూర్ జిల్లా-బ్లాక్ ఓర్చా కాన్గావ్ నివాసి.
17. కామ్రేడ్ రోహన్ పెద్ద: డివిజన్ కమ్యూనికేషన్ బాధ్యత, కుముద్గుండ గ్రామం, నారాయణపూర్ జిల్లా, ఓర్చా బ్లాక్ నివాసి.
18. కామ్రేడ్ మనోజ (సంపత్ మాండవి): అమ్డై ఏరియా కమిటీ సభ్యుడు, జిల్లా నారాయణపూర్ బ్లాక్, ఓర్చా తాడ్నార్ గ్రామ నివాసి.
19. కామ్రేడ్ సుశీల్ (ధన్ని కొవాచి) పి.పి.సి. సభ్యుడు జిల్లా కొండగావ్ బ్లాక్ మర్దపాల్ కాకర్పదర్ గ్రామ నివాసి.
20. కామ్రేడ్ బుధ్రాన్ మడ్కం: 6-కంపెనీ పి.పి.సి. సభ్యుడు జిల్లా బీజాపూర్ బ్లాక్ భైరామ్గఢ్ డోరం గ్రామ నివాసి.
21. కామ్రేడ్ ఫూలో (సుందరి ఓయం): అమ్డై ఏరియా కమిటీ సభ్యుడు, జిల్లా బీజాపూర్ బ్లాక్, భైరామ్గర్ గోగ్లా గ్రామం.
22. కామ్రేడ్ జనీల (బుధారి కొవాచి) 6-కంపెనీ పార్టీ సభ్యుడు, జిల్లా కొండగావ్ బ్లాక్ మర్దపాల్ కోటమెట్ట గ్రామ నివాసి.
23. కామ్రేడ్ మంగళి (మంగల్దై కోవాచి) పార్టీ సభ్యుడు. ఎస్.జడ్.సి. ఎం. గార్డ్, జిల్లా కొండగావ్ బ్లాక్ మర్దపాల్ అల్వాడ్ గ్రామ నివాసి.
24. కామ్రేడ్ రాందర్ కొర్రం: వాయనార్ ఏరియా సీనియర్ పార్టీ సభ్యుడు జిల్లా కొండగావ్ బ్లాక్ మర్దపాల్ ఉసరి గ్రామ నివాసి.
25. కామ్రేడ్ సుందర్ (కమలు కల్ము): 6-కంపెనీ పార్టీ సభ్యుడు, కమ్యూనికేషన్ బాధ్యత, జిల్లా బీజాపూర్ మడుం గ్రామ నివాసి.
26. కామ్రేడ్ అనిల్ దొడ్డి: 6-కంపెనీ పార్టీ సభ్యుడు ఉసూర్ గోటోడ్, జిల్లా బీజాపూర్ బ్లాక్ నివాసి.
27. కామ్రేడ్ జాన్బట్టి కశ్యప్: పార్టీ సభ్యుడు, ఎస్.జడ్.సి. ఎం. గార్డ్, జిల్లా బీజాపూర్ బ్లాక్ భైరంగఢ్ ఇర్ఫానార్ గ్రామ నివాసి.
28. కామ్రేడ్ సోమారు కడటి: పార్టీ సభ్యుడు, దంతెవాడ బ్లాక్లోని గీడం కువ్యే గ్రామ నివాసి.
29. కామ్రేడ్ నరేష్ (సోంబారు మాండవి): పి.ఎల్.జి.ఏ. సభ్యుడు, జిల్లా-బ్లాక్ నారాయణపూర్ తోయమెట్ట గ్రామం.
30. కామ్రేడ్ సుగ్దయ్ కశ్యప్: 6-కంపెనీ, పి.ఎల్.జి.ఏ. సభ్యుడు. జిల్లా దంతేవాడ బ్లాక్లోని గీడం కచ్చనార్ గ్రామ నివాసి.
31. కామ్రేడ్ ఫుల్సింగ్ కోవాచి జన్ మిలీషియా సభ్యుడు జిల్లా దంతేవాడ బ్లాక్ గీడం బట్వెడ్డ గ్రామం 2/3 నివాసి.
32. కామ్రేడ్ లోకేష్ (సబ్బు): జన్ మిలీషియా సభ్యుడు, జిల్లా దంతేవాడ బ్లాక్ గీడం బట్వెడ్డ గ్రామం నివాసి.
33. కామ్రేడ్ దాస్నాటి పోయం: 6వ కంపెనీ పి.ఎల్.జి.ఏ. సభ్యుడు జిల్లా నారాయణపూర్ బ్లాక్ ఓర్చా రోటర్ గ్రామ నివాసి.
34. కామ్రేడ్ సుమన్ (శాంతో మడకం) పార్టీ సభ్యుడు, జిల్లా నారాయణపూర్ బ్లాక్ ఓర్చా గ్రామం నివాసి.
35. కామ్రేడ్ మోహన్ మాండవి: 6-కంపెనీ పార్టీ సభ్యుడు, గీడం బోడ్లి గ్రామం, జిల్లా దంతేవాడ బ్లాక్ నివాసి.
ఈ ఎన్కౌంటర్ సంఖ్య రీత్యా ఛత్తీస్గడ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరగనంత పెద్ద సంఖ్యలో మారణకాండ అనే స్థాయిలో జరిగింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన 29 మంది అమరులైన వారి కన్నా పెద్ద సంఖ్య. అందులోనూ దండకారణ్య ఉద్యమానికి గుండెకాయ వంటి మాడ్ లక్ష్యంగా జరిగింది. మాడ్ కేంద్రంగా జరిగింది. అందులో బస్తర్ తూర్పు డివిజన్ ఇన్చార్జి అయిన రాష్ట్ర నాయకురాలు ఊర్మిళ నీతి అమరురాలు అయింది. ఇది జోగాల్ అమరత్వం కన్నా విప్లవోద్యమానికి పూడ్చుకోలేని నష్టమనిపించడం సహజమే గానీ, జోగాల్ అమరత్వంతో మనకు మైదాన ప్రాంతం నుంచి డికె కి వచ్చి 43 సంవత్సరాలు ఆదివాసుల్లో ఆదివాసిjైు, ఆదివాసులను విప్లవీకరించే క్రమంలో ఆదివాసుల నుంచి విజయ్మాడ్కం వంటి మావోయిస్టు అభివక్తలే కాదు, ఊర్మిళ నీతి వంటి యుద్ధ వీరులైన రాష్ట్ర నాయకత్వం మహిళల నుంచి రూపొందుతున్నదని అందులో పై 35 మందిలో 13 మంది ఆదివాసి మహిళల చరిత్ర మనం చదవగలిగితే మనకు భరోసా కలుగుతుంది.
కొన్నాళ్లుగా పోలీసులు, మీడియా దండకారణ్య పిఎల్జిఏ లో, సమర్థ వ్యూహంలో హిడ్మా అనే ఆదివాసి విప్లవ నాయకుని పేరు, ఊరు, ఊళ్లోని ఆయన ఇల్లే పార్టీ కేంద్రం అయితే ఆ ఇంటిని పోలీసులు ఆక్రమించుకున్న విషయాలు రాస్తున్నాయి. ప్రతి పిఎల్జిఏ చర్య వెనుక హిడ్మా ఉన్నట్లు గతంలో తెలంగాణలో ఆశన్న గురించి రాసినట్లుగా, చేస్తున్నట్లుగా చెప్తున్నాయి. పిడుగు శబ్దం వింటుంటే కళ్ళల్లో విద్యుత్ తేజం క్షణం పాటు కనిపించినట్లుగా ఊర్మిళ నీతి పేరు, ఆమె ఫొటో ఆమె ఈ యుద్ధంలో ఒరిగిన వీరనారి అనే విషయం, అక్కడ నుంచి వెనక్కి వెళ్లి ఆమె చరిత్రను కనీసం 1998 దాకా చదువుకున్నప్పుడు ఆ తర్వాత 25 ఏళ్లలో దండకారణ్య విప్లవ పురోగతి ఎంత గుణాత్మకంగా ఎదగకపోతే ఆ స్థాయిలో మహిళలు పాల్గొనే కగార్ వ్యతిరేక యుద్ధం సాధ్యమవుతుంది.
ఎన్కౌంటర్ మృతల వివరాలను ఏడు నుంచి మొదలుపెట్టి 40 దాకా పెంచి తీరా చివరకు 31 శవాలు చూపుతూ ఇంకా అందులో చాలామందిని గుర్తించాల్సి ఉన్నదని అంటూ కృష్ణా జిల్లా రామకృష్ణ ఉన్నాడని చెప్తూ తెలంగాణ నుంచి నలుగురు నాయకులు ఉన్నారని చెప్పడం వల్ల సిఎల్సి ఇద్దరి నాయకుల గురించి ఆందోళన ప్రకటించింది. సరిగ్గా ఇటువంటి ఆందోళన చెందే ఎత్తుగడలు ఎఓబి ఎన్కౌంటర్ను పోలినవే. అయితే నాయకత్వ స్థాయిలో ఎఓబి నష్టం పెద్దది.
అందరికందరూ ఆదివాసులే. అమరులైన 40 మంది ఎన్కౌంటర్ మూడు రోజుల పాటు మూడు మార్గాలలోకి వెళ్లి చేసిన గడ్చిరోలీ ఎన్కౌంటర్. ఆందులో 20 మంది ఆదివాసులు. ముగ్గురు విద్యాసాగర్ (ఎరుకల) వంటి డివిజన్ నాయకులు. 20 మంది పార్టీ సభ్యులు. 20 మంది ఆయా గ్రామస్తులైన ఆదివాసులు. ఆ ఎన్కౌంటర్ చేసి వచ్చి సి.ఆర్.పి.ఎఫ్, సి`60 కమెండోలు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో తాగుతూ మాంసం తింటూ డాన్సులు చేస్తూ వీడియోలు పెట్టడం చాలా వైరల్ అయి అది చాలా ప్రచారం అయింది.
కో ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్(సిడిఆర్ఓ) నాయకత్వంలో (అందులో మహారాష్ట్ర నుంచి వెళ్లిన సురేంద్ర గాడ్లింగ్, సోమసేన్, మహేశ్, సిపిడిఆర్ కూడా ఉంది గనుక ఆనంద్ తేల్తుంబ్డే లను బీమా కోరేగాం కేసులో ముద్దాయిలను చేశారు) 40 మంది నిజనిర్ధారణకు వెళ్లి వాస్తవాలు బయటికి తెచ్చారు. బీజాపూర్ ఎన్కౌంటర్లో 29 మంది అమరులైతే మొదలు బేలా భాటియీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సిఎల్సి కూడా వాస్తవాలు బయటికి తెచ్చాయి.
ఏకపక్ష కాల్పులు జరిగి వారిలో నలుగురైదుగురు పార్టీ క్యాడర్లు తప్ప మిగతా అందరూ ఆదివాసులే ఉన్న ఈ ఎన్కౌంటర్ అందుకే మొట్ట మొదట ఇంద్రవెల్లి, జలియన్వాలాబాగ్ మారణకాండలను తలపింపజేసింది. ఇవేవీ కూడ ప్రజా యుద్ధక్షేత్రంలో ఉన్న ఆదివాసులలో గానీ, పార్టీలో గానీ ధృతిని స్థైర్నాన్ని దెబ్బతీయలేవనేది ఇంద్రవెల్లి మారణకాండ నుంచి కూడ రుజువవుతూ వస్తున్న గతితార్కిక చారిత్రక సత్యం. అయితే ప్రశ్న అదికాదు ఇంతా రమణారెడ్డి, రామకృష్ణ, శంకరరెడ్డి ఉరిశిక్షలు రద్దుచేస్తూ వాళ్లు బూర్జువా కోర్టుల మీద విశ్వాసంలేక అపీలు చేసుకోకపోవచ్చుగానీ ఇది రాజ్యాంగంలో విశ్వాసం ఉన్న మన ఆత్మలకు సవాల్ అన్నాడు జస్టిస్ చిన్నపరెడ్డి, వాళ్లు మన సానుభూతి కొరకు పోరాడడం లేదు. సారాంశంలో మన స్వేచ్ఛ కొరకు పోరాడుతున్నారు. మనం మాట్లాడే స్వేచ్ఛ కూడ హరింపబడకముందే మనం మాట్లాడాలి.
16-10-2024