చరిత్ర పుటల నిండా.. వర్గపోరాట గాయాలే!
తిరుగుబాటు పిడికిలి బిగించనిదే.. ఏదీ సిద్ధించదు.
కష్టాల కడలిలో కన్నీటి పయనం మానవ జీవనం,
క్షణికమైన సుఖాల వెనుక.. శాశ్వతమైనది ఏదీ లేదు.
అడవి మూగబోయింది.. చెట్లు మౌనం దాల్చాయి,
కానీ.. జ్ఞాపకాల కొలిమిలో సెగలు ఇంకా రగులుతున్నాయి!
జీవితం పరిమితమే కావచ్చు.. కానీ ఆశయం అనంతం.
యుద్ధం అంటే ముగింపు కాదు.. అది కేవలం విరామం మాత్రమే!
వసంతానికి మరణం లేదు.. అది మళ్ళీ పురుడు పోసుకుంటుంది,
నక్సల్బరీ గుండె చప్పుడుకు.. అసలు అంతమే లేదు!




