ఆకాశమూ మూగపోలేదు
సముద్రమూ ఘోషించడం ఆపలేదు
నదుల ప్రవాహమూ ఆగలేదు
జలపాతాల హోరు ఆగిపోలేదు
అడవి చిగురించడం మానలేదు

మనుషులు మాటాడుతున్నారు
తమలో తాముగా
పక్కవారితో గుస గుసగా

ఎందుకంటె
ఆకలి వేయడము మాసిపోలేదు
దుఃఖం రావడమూ మానలేదు
కోపమూ వస్తూనే వుంది

అయినా రైతు విత్తులు
నాటుతూనే వున్నాడు
ముసలివాడు కొండను
తవ్వుతూనే వున్నాడు
నలిగిన గడ్డి పరకలన్నీ
లేచి నిలబడుతున్నాయి

మరలా వాళ్ళ రాక కోసం

Leave a Reply