వ్యాసాలు

ఎల్ నినో ముప్పు తప్పించగలమా?

ఈసారి రికార్డు స్థాయిలో వేసవి ఎండలు జనాన్ని ఫ్రై చేసి పడేశాయి. వాన చినుకు కోసం రైతులే కాదు, చిత్తడిని విసుక్కునే నగరవాసులూ ఎదురుచూశారు. జూన్ వచ్చింది, పోయింది కానీ ఆశించిన వర్షం కురవలేదు. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమవుతాయని, సగటు వర్షపాతం తగ్గే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization- WMO), భారత వాతావరణ శాఖ (India Meteorological Organization- IMO) చెప్పినట్లుగానే జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడ్డాయి, దీని ప్రభావంతో రుతుపవనాలకు అంతరాయం ఏర్పడి, వర్షపాతం తగ్గుతుందని వాతావరణ నిపుణులు ప్రకటించాక ‘ఎన్ నినో’ అనే పదం
కవిత్వం

కంచె

ఇనుప కచ్చడాల్లో కునుకుతూ,పువ్వును పువ్వు అని,నవ్వును నవ్వు అని ఎలా అంటావ్?కనులు మూసుకుని కౕంచెలు దాటే కవీ!ఇది నీకు కాలం కాదయ్యా.జతలకు, పూలతలకు,కవితలకు, ప్రేమ సుధలకుఇది కాలం కాదయ్యా!హృదయాలను ఒరుచుకు పారే నదులకు,కురిచే మేఘాలను ఒడిచి పట్టే సంద్ర ఝరులకు,అంతర్ బహిర్ మథనాలను ముడేసే వారధులకు,నా మాటగా కూడా చెప్పు.ఇది కాలం కాదని...జేగురు విడిచిన పొద్దులా పడి ఉన్నాను.ఐదు తరాలుగా విముక్తి లేనిబూడిద కుప్పల్లోని పితరుల్లా వేచి ఉన్నాను.ఒడ్డూపొడవూ ఆకర్షణలు దాటి,అలవాటైన బాటలు విడిచి,సాదాసీదా సవ్వడులతో,నా స్నేహం కోసం వస్తే..రమ్మను నదులను...వలల వేటను, సొర కోరలను,తప్పుకోగలిగితేనే,గర్జించమను సముద్రాలను..నొప్పి మాత్రలను,కత్తుల మీద నడిచే నేర్పును,బట్వాడా చేయలేకపోతేకూలిపొమ్మను వారధులను..కంజీర మీటుతూ కంచెలు