“ప్రజలదే విజయం”పుస్తక రచయిత భూమిక(విజయ లక్ష్మి) ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నది.తన అజ్ఞాతజీవితంలోని తన అనుభవాలను మనముందుంచింది.వీటిని చదివితే మన గుండె దుఃఖంతో కూరుకుపోతుంది.ఉద్రేకం ఉప్పొంగుతుంది…..అలాగే మన నెత్తురు కసితో వుడికిపోతుంది….ఆమె 1987 లో జన్మించింది., M.A, B.Ed, LLB వంటి ఉన్నత చదువులు చదివి, సమాజం లోని అసమానతలు, అణచివేతను అర్థం చేసుకున్నది.వాటిని ఎదిరిస్తూ, సామాజిక మార్పు కోసం, విప్లవోద్యమంలో భాగమైంది.ప్రజల్లో,ప్రజా సంఘాల్లో చైతన్యాన్ని రగిలిస్తూ యుద్ధంలో పోరాడుతూనే అమరత్వం పొందింది.తన విప్లవానుభవాలను ఇలా కథల రూపంలో అందించింది.ఆమె ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో కూడా యాక్టివ్ గా పనిచేసి ఎన్నో సార్లు జైలుకి వెళ్లి వొచ్చింది…..
“కొత్త బంగారం లోకం” అనే కథలో
సాయంత్రం 6 గంటల సమయం లో విజయలక్ష్మి తనని తీసుకెళ్లడానికి వచ్చిన అన్నయ్య మరో ముగ్గురు కలసి, ఒక ఆదివాసీ గూడనికి వెళ్లారు. అజ్ఞాత జీవితంలో తొలి అనుభవాలు.విజయలక్ష్మి చుట్టుపక్కల మనుషులను చూస్తూ, ఆశ్చర్యకరమైన ఆలోచనల్లోకి మునిగిపోయింది. ఆదివాసీలంటే సినిమాల్లో చూపించినట్లు, తలపై నెమలి పింఛం,చేతిలో కత్తి, సంకలో బుట్ట పెట్టుకొని,సోది చెప్పేవాళ్లు లాగ కాకుండా చాలా చిత్రంగా శరీరానికి సరైన బట్ట లేక, రక్తహీనతతో, పౌష్టికాహార లోపంతో, రోగాలతో బాధపడుతూ, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ ప్రజల బాధలను ప్రత్యక్షంగా చూసి చాలా దుఃఖిస్తుంది లోలోపన.ఇంత సాంకేతిక పరిజ్ఞానమున్న ఈ రోజుల్లో కూడా కనీసం సరైన ఆహారం,నీళ్లు ,కనీస వైద్య సదుపాయం కూడా దొరకని ఈ దరిద్ర పరిస్థితి ఎందుకుంది, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని అర్థం చేసుకుంది. దీనిపై బాబాయ్‌తో మాట్లాడుతుంది. దళారి,బూర్జువా పాలకవర్గాలు ఆదివాసీలపై చూపించే ప్రేమను వివరించి చెప్తాడు.ఆమె ఇలా వర్గ పోరాటంలోకి రావడం
నిజమా!? కలనా!! అని ఆలోచిస్తున్న తరుణంలో సమీప అడవి నుండి కామ్రేడ్లు వచ్చి, లాల్‌సలామ్ చెప్పిన వారితో మాట్లాడి పరిచయం చేసుకుంటుంది, అలాగే ఆలోచనల్లో పడుతుంది, ఇంత టెక్నాలజీ పెరిగిన కాలంలోనూ, నిష్పాక్షంగా జనం కోసం, ప్రాణాలను సైతం లెక్కచేయక పనిచేస్తున్నవారితో నిజంగానే ఆమె కలిసిందా!? అనేంత కొత్త అనుభూతి, కొత్త లోకంలోకి వెళ్ళింది. పీడిత ప్రజల పక్షాన తన వంతు పోరాటo సలపడానికే వచ్చానని సంతోషపడింది.
విజయలక్ష్మి మావోయిస్టుల గూర్చి సినిమాల్లో చూసేవి కల్పితం అని, ఇక్కడ మొత్తందానికి భిన్నంగా ఉందని అర్థం చేసుకుంటుంది.
ఈమె చిన్నప్పటి నుండి పార్టీ విషయాలు అంటే ఆసక్తితో వినేది. పార్టీ అమరుల పుస్తకాలు, త్యాగాలు గూర్చి తెల్సుకునేది. ఆ చైతన్యం ద్వారా స్పిరిట్ తో,చివరకు దీర్ఘకాలిక ప్రజయుద్దంలో ప్రాణత్యాగానికి సిద్ధపడి, ప్రజావ్యతిరేక రాజ్యం పై కసితో పోరాడాలని ఇలా ప్రజారాజకీయాలకు దగ్గరైంది. ఈ విధంగా దళపోరాటంలో కలిసిపోయింది.
వెళ్లిన మొదట రోజు కాస్త ఆహారానికి ఇబ్బంది పడ్డ గాని తర్వాతకుదురుకుంది., భాష కూడా రాకపోయేసరికి చాలా ఇబ్బంది ఎదుర్కొన్న గాని, చక్కగా తెలుగు మాట్లాడే కామ్రేడ్స్ పరిచయంతో హమ్మయ్య అనుకునింది. చదువుకున్న ఆ రోజుల్లో చీకటి అంటే భయపడే ఆమె ఆ రోజు నుండి కేవలం నక్షత్రాల వెలుగులలో ఆ చిమ్మ చీ కటిలో తన జీవితాన్ని కొనసాగించాలి తన చైత్యనం,తన ప్రజాపోరాట స్వప్నం ఆమెను ఎలా ధైర్యవంతం చేసాయి.. ఎలాగైనా ప్రజల కోసం పనిచేయాలని ఆమె ధృడసంకల్పం ఈ విధంగా ఆమెను మార్చింది..
నిద్రసమయంలో ఏవేవో ఆలోచనలు…. అయినా నేను ఇంట్లో చెప్పకుండా తప్పుచేసానని గాని, నిర్ణయం మాత్రం సరైనదే తీసుకోని, ప్రజా సేవ, సమాజ మార్పు కోసం తన వంతు పాత్రగా, పోరాటం లోకి రావడం సమర్ధనదే అని మనస్సును సర్ది చెప్పుకొని, ఏడ్చుకుంటూ అమ్మా, నాన్న, అక్కలు, చెల్లెల్ని గుర్తుచేసుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది.
ఒక తెల్లవారుగట్లే లేచి సహా చార కామ్రేడ్స్ చెప్పినట్లు రోజూ వారీ పార్టీ పనులు గుర్చితెలుసుకొని తనూ ఆ దినచర్యలో పాల్గొంటుంది. ఇక మధ్యాహ్నం అవ్వగానే విజిల్ కూతల భాగంగా అందరూ సమావేశం అవుతారు.. సమావేశం అంటే భూమికకు ఎంతో ఆసక్తి తను కలవాలనుకున్న కామ్రేడ్ ను చూస్తానని సంతోషం తో వొచ్చింది కానీ, తీరా చూస్తే ఇంతకు ముందు జరిగిన ఎన్కౌంటర్లో ఆమె అసువులు బాసిన సంఘటన తెల్సి…చాలా దుఃఖిస్తుంది, బాధపడుతుంది. వచ్చిన వెంటనే ఇంత విషాద గాథ.
అయినా ఏ మాత్రం వెనుకాడకుండా దేశంలోని పీడిత ప్రజల కోసం,వారి విముక్తి కోసం పోరాటం చేసి కూడు ,గూడు, గుడ్డ అందించే సమసమాజపు స్వప్నాన్ని,వారి ఆశయాలు, వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తుచేసుకుంటూ, సమసమాజం కోసం తన పోరాట ప్రస్థానాన్ని మొదలుపెట్టింది భూమిక అనేపేరుతో విజయలక్ష్మి ఆ కామ్రేడ్ స్థానంలోనే……..
ఈ విధంగాపార్టీ లో కృషి చేస్తూ ముందుకు సాగుతుంది.
ఒకరోజు 5, 6 గంటల సమయంలో దళం apt పనిమీద గ్రామంలోకి వొస్తారు.ఆదివాసీలు మనసునిండా ప్రేమతో లాల్‌సలామ్ చేస్తూ ఆహ్వానిస్తున్నారు; అయితే ఈ సమాచారాన్ని ఇన్ఫార్మర్ల ద్వారా పోలీసులు తెలుసుకొన్న విషయాన్ని పార్టీ సానుభూతి దారుడు వొచ్చి చెప్తే అలర్ట్ అవుతుంది దళం.
కానీ వీరు
ఇక కలవాలనుకున్న దళంపై శత్రు నిఘా పెరిగి, వారిని శత్రు మూక వెంబడిస్తుంటుంటుoది.సాయంత్రం..
రేడియోలో వార్తలు వింటున్న దళానికి “విశాఖ జిల్లా, రంపచోడవరం, గోబరిపడ గ్రామంలో 7 గంటలకు జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు చనిపోయారు అని కూంబింగ్ జరుగుతుంది” సమాచారం విని, ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతిగా ఉండిపోతారు. ఈ లోగా దళం ఎదురుచూస్తున్న కామ్రేడ్స్ వచ్చారు … విషయం అంతా అడిగి తెలుసుకున్నాడు మరో కామ్రేడ్. ఆ వొచ్చిన వారి వెనుకే , వారి అడుగుల గుర్తులను చూస్తూ, వారి వెనకాలే వచ్చిన శత్రువులు దళం మొత్తాన్ని చుట్టుముట్టారు. ఈ విధంగా హెవీ ఫైరింగ్ స్టార్ట్ అయింది. చీకటి అలుముకుంది, విపరీతంగా వర్షం కురిసింది, అయినా ఈ శత్రు కాల్పుల్లో నుండి తప్పించుకొని బయటపడ్డారు దళం. 2 రోజుల తర్వాత అందరూ కలుసుకున్నారు. ఈ విధంగా ఎన్‌కౌంటర్‌కు కారణమైన భూస్వామి పెద్దల కాశీ, మరియు CPM లీడర్ రమణ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్లిందని తెలుసుకున్న దళం వారిని ఖతం చేశారు. ప్రజలకు సహాయం చేసి, ప్రభుత్వం చేయలేని పని పార్టీ చేసి, మా బ్రతుకులను తిరగరాసిందని ప్రజల సానుభూతిని చూరగొన్నది దళం. అందుకే దళం ఎప్పుడూ ఊళ్లల్లో వచ్చినా, ఆప్యాయంగా ఆహ్వానించేవారు. ఎందుకంటే ముఖంగా ఆ భూస్వామి ఆగడాలను,ఆటలను సాగనియకుండా,సర్కారు చేయాల్సిన పని పార్టీ చేసిందనే ప్రేమ
ఎన్కౌంటర్ అనే పేరుతో మరో అనుభవాన్ని కథగా మలిచింది విజయలక్ష్మి.
సాయంత్రం టైమ్‌లో 7 గంటలకల్లా విజిల్ కూతతో భూమిక వారి దినచర్యలో భాగంగానే కిచెన్ డ్యూటీ వైపు వెళ్లారు. ఇగ టీ తాగి బహిర్భూమికి వెళ్లాలనుకొని, ఒంటరిగాని వెళ్లి వస్తున్న సమయంలో బుల్లెట్ శబ్దం విని అది మిస్‌ఫైర్ ఏమో అయ్యుంటుందని భావించింది.కానీ కాదు.అది ఆటో ఫైర్ , ఇక ఏ మాత్రం ఆలోచించకుండా, తన పిస్టల్‌తో రిట్రీట్ అవుతుంది. ఆ దరిదాపుల్లో ఫైరింగ్, కూంబింగ్ విపరీతంగా జరుగుతుంది. విమానాలు పై నుంచి పెట్రోలింగ్ చేస్తున్నాయి. అందరూ కామ్రేడ్లు ఎవరికి తోచినా విధంగా వారు రిట్రీట్ అయ్యి రెండు రోజుల తర్వాత అందరూ కలుసుకున్నారు. చాలా తీవ్రమైన ఫైరింగ్ లోనూ తనూ సురక్షితంగా బయట పడడింది.ఒంటరిగా వుంటూనే….పక్కన ప్రజలు చూస్తూనే వున్న గాని భయపడి కాపాడడానికి రాలేదని అసహనం కలిగినా సరే సర్ది చెప్పుకొని ఒంటరిగానే ధైర్యంగా తనను తనే కాపాడుకున్నది.చివరికి ఒక గ్రామానికి వెళ్లి, ఒక ఇంట్లో ఆశ్రయం తీసుకున్నది.మనస్సంతా యాతనతో , దుఃఖంతో, బాధతో గడ్డకట్టుకుపోయియిన సమయం అది.. తిండి తిప్పులు మాని,ఆ ఫైరింగ్ దృశ్యాల్ని గుర్తుచేసుకుంటూ ఏడుస్తూ
ఈ ఎన్కౌంటర్లో తనూ ఎలా బయటపడింది అనే విషయాన్ని తన బాబాయ్ గంగాధర్‌కు యథార్థంగా చెప్పాలనుకుంటున్న సమయంలో తన బాబాయ్ కూడా అమరుడయ్యాడనే విషయాల్ని విని ఎంతగానో విలపించింది.పాటలు నేర్పిన రాజకీయ గురువును కోల్పోయిన అనే దుఃఖంలో కూడా బాధ్యతలను గుర్తు చేసుకుంటూ ఏ మాత్రం పట్టు వొదలకుండా “అమరుల ఆశయాలను మన మనభుజాన ఎత్తుకొని నడవాలని” బాబాయ్ చెప్పిన రాజకీయ పాఠాలు గుర్తొచ్చి, దుఃఖాన్ని దిగమింగుతుంది. ఈ పరిణామం తర్వాత మిగిలిన కామ్రేడ్స్ అందరూ ఆ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఎంతో కఠినంగా చేతికి శత్రువు చేతికి దొరికిన వాళ్ళని హింసించి చంపేశారని అర్థమౌతుంది. మొత్తం 21 మంది అమరులు అవుతారు ఈ ఘటనలో. మిగిలిన కామ్రేడ్స్ అందరూ ఆ దుఃఖంలోనూ, వారి ఆశయాలను , వారు కలలు కన్న సమసమాజ నిర్మాణం, పీడిత ప్రజల విముక్తికి, దోపిడీ పాలకవర్గాన్ని మట్టిబెట్టి, పీడితవర్గ అధికారం కోసం శత్రు బలగంపైకి కసితో ముందుకుకదులాలని నిర్ణయించుకుంటారు. ఈ ఘటనలో చాల మంది మిలీషియా, కామ్రేడ్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే దళానికి మాత్రం, వారి తల్లిదండ్రులు ప్రజలు ఈ ఘటనని,మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఆందోళన పట్టుకుంది, అయినా గాని ప్రజలు అలా అపార్థమేమి చేసుకోలేదు, వాళ్ళు మానవాళికోసం,పేద ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు. పిల్లల మాత్రమే కాదు, పార్టీ వాళ్లు కూడా చనిపోయినందుకు బాధగా ఉందని ప్రజలు తమ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా ఆమె రాసిన కథల్లో చదువుతుంటే మన కళ్లల్లో నీళ్లు ఆగవు .మనస్సు దుఃఖంతో మునిగిపోతుంది. అసలు ఎవరో కూడా తెలియని ప్రజల కోసం, తమ కుటుంబాలను వదిలి, తమ జీవితం మొత్తాన్ని వర్గపోరాటంలో త్యాగం చేసిన నిస్వార్థులు ఈ కామ్రేడ్లు. వీరందరి ఆశయాన్ని, జ్ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనమీద ఉందని భూమిక కథలు గుర్తు చేస్తాయి.
సమాజమంతా 2 వర్గాలుగా ఉంది. ఒకటి దోపిడీ పాలక వర్గం,మరొకటి పీడిత వర్గం.బాధ్యతగల మనుషులుగా మనమంతా పీడిత వర్గం వైపు నిలబడి ఈ అసమానతలు లేని సమాజ నిర్మాణంలో మనవంతు పాత్రను సరిగా పోషించేలా ఈ కథలు మనల్ని ప్రేరేపిస్తాయి.ఇవి కేవలం కథలు మాత్రమే కాదు, యుద్ధ రంగ అనుభవాలు.యావత్ పీడిత ప్రజల విముక్తి కోసం, అడవి బాట పట్టిన అమర వీరుల పోరాటగాథలు .దోపిడీ, దౌర్జన్యాలపై ఎదురుతిరిగిన విప్లవకారుల కథలు, శత్రువుల చేతుల్లో నుండి తృటిలో తప్పించుకుని , పిడుగులా మీద పడ్డ విషాధాలను ఎదుర్కొంటూ,వారి ఆశయాల సాధనకై మరింత కసితో ముందెకే వెళ్ళే కమ్యూనిస్టు గుండెధైర్యం చాలా గొప్పది. బూటకపు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతామని తెలిసినా సరే, పోరాటమే విముక్తిని తెస్తుందని నమ్మిన వారి స్పూర్తిని తీసుకొని, ఇలా విప్లవాన్ని చెప్పే కథలు కావాలి.
ప్రస్తుతం విప్లవం తిరోగమనంలో ఉండొచ్చు.సముద్ర కెరటాలు కిందపడ్డాయింటే
రెట్టింపు వేగంతో ఉవ్వెత్తున ఎగిసి పడడానికే… అంతకు మించిన తీవ్రతతో మళ్ళీ
ముందుకు సాగడానికే…. ఇప్పుడు కేవలం సాయుధ రూపం లేకపోవచ్చు గాని, ఆలోచ
-నలు పదిలంగా ఉంటాయి.అవి చావవు.
అవినీతి, అసమానతలు, దౌర్జన్యాలు, అన్యాయం, దోపిడీలు ఉన్నంతకాలం విప్లవం అంతం కాదు.తిరిగి విప్లవ పునరుజ్జీవనం జరుగుతుంది.ప్రజలే చివరికి విజయం సాధించేది.ప్రజలు అజేయులు
ఇది చరిత్ర చెప్పే సత్యం




